





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ఉసామహ్ ఇబ్న్ జైద్ రదియల్లాహు అన్హు తో ఇలా అనడం జరిగింది: “నీవు ఉథ్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు వద్దకు వెళ్ళి (దీని గురించి) ఎందుకు మాట్లాడవు?” దానికి ఆయన ఇలా అన్నారు: “ఆయనతో మాట్లాడలేదని అనుకుంటున్నావా? ఆయనతో మాట్లాడకుండానే నేను నీకు వినిపిస్తున్నానా? అల్లాహ్ సాక్షిగా! నేను ఆయనతో మా మధ్య ఉన్న విషయాలను గురించి మాట్లాడినాను. నేను ఏ విషయాలలోనైతే చొరవ తీసుకుని మొదలు పెట్టాలో, మొదలుపెట్టడానికి ముందే వాటిని బయట పెట్టడం నాకు ఇష్టం లేదు. మరియు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా విన్న తరువాత, నాపై పాలకునిగా ఉన్న వ్యక్తితో “ప్రజలలో నీవు అత్యంత ఉత్తముడవు” అని నేను అనను: “ ఒక వ్యక్తి ని ప్రళయదినం రోజున తీసుకురావడం జరుగుతుంది, ఆ పై అతన్ని నరకం లో విసిరివేయడం జరుగుతుంది, అతని పొట్ట నుండి ప్రేగులు బయటికి పడి గాడిద తన తిరగలి చుట్టూ తిరిగినట్లు అతను వాటిచుట్టూ తిరుగుతూ ఉంటాడు. నరకవాసులు అక్కడ ప్రోగు అయి వారు'ఓ ఫలా నీకు ఏమి జరిగినది ?నీవు మాకు మంచి ని భోదించేవాడవు చెడు నుండి ఆపేవాడవు కదా? అని అడుగుతారు దానికి అతను సమాధానం ఇస్తూ ‘అవును నిజమే, నేను మంచిని భోదించేవానిని కానీ దాన్నిఆచరించేవాడిని కాదు అలాగే చెడు ను ఖండించే వాడిని కానీ స్వయంగా దాన్ని నేనే ఆచరించేవాడిని 'అని తెలియపరుస్తాడు".
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఉసామా బిన్ జైద్తో (రదియల్లాహు అన్హుమ్) తో ఇలా అనడం జరిగింది: “నీవు ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) వద్దకు వెళ్లి, ప్రజల మధ్య తలెత్తిన వివాదం గురించి అతనితో ఎందుకు మాట్లాడకూడదు మరియు దానిని పూర్తిగా చల్లార్చడానికి ఎందుకు ప్రయత్నం చేయకూడదు? దానికి ఆయన వారికి ఇలా తెలియజేసినారు: విభేదాలు మరింతగా పెచ్చరిల్లకుండా ఉండాలని, జాతిప్రజల (ఉమ్మత్) యొక్క విశాల ప్రయోజనాన్ని ఆశిస్తూ తాను ఆయనతో రహస్యంగా మాట్లాడినానని, తన ఉద్దేశ్యం పాలకుడిని బహిరంగంగా ఖండించడం, లేదా నిందించడం కాదని, ఎందుకంటే, నేను అలా బహిరంగంగా ఖండించడం ఖలీఫా మీద దాడికి ఒక కారణం కావచ్చు; అది ఉపద్రవాన్ని, కీడును తీసుకుని వచ్చే ఒక చెడు ద్వారము, దానిని తెరవడానికి నేను మొదటి వాడిని కారాదు. తరువాత ఉసామహ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: తాను అమీర్’ను (పాలకుడిని) ఒంటరిగా కలిసి (పరిస్థితులపై) తగిన సలహా ఇచ్చినానని, అతడు అమీర్ అయినా సరే తాను అతడిని పొగడనని, పాలకుల సమ్ముఖాన తప్పుడు ముఖస్తుతి చేయనని, ఇలా ఎందుకు అంటే, తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా తాను విని ఉండడమే అని అన్నారు: “పునరుత్థాన దినమున ఒక వ్యక్తి తీసుకు రాబడతాడు మరియు అగ్నిలో విసిరివేయబడతాడు; వేడి తీవ్రత మరియు నరక శిక్ష యొక్క తీవ్రత కారణంగా అతని ప్రేగులు అతని కడుపు నుండి వెంటనే బయటకు వస్తాయి. ఈ స్థితిలో అతడు తన పేగులతో గానుగ చుట్టూ తిరుగుతూ ఉండే గాడిదలా నరకంలో తిరుగుతూ ఉంటాడు. నరక జనులు అతని చుట్టూ ఒక వృత్తాకారంలో గుమిగూడి, అతనిని చుట్టుముట్టి, “ఓ ఫలానా, నీవు మంచి చేయమని ఆఙ్ఞాపిస్తూ ఉండేవాడివి మరియు చెడును నిషేధిస్తూ ఉండేవాడివి కదా?” అని అడుగుతారు. దానికి అతడు: “అవును నిజమే, నేను మంచి చేయమని ఆదేశిస్తూ ఉండేవాడిని, కానీ నేనేఆచరించేవాడిని కాదు, చెడును నిషేధిస్తూ ఉండేవాడిని, కానీ నేనే ఆ పనులకు పాల్బడుతూ ఉండే వాడిని” అంటాడు.”
అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే ఇద్దరు ఆడపిల్లలను యుక్తవయస్సుకు చేరే వరకు వారి పోషణ, బాగోగులు చూస్తూ పెంచి, పోషిస్తాడో అతడు మరియు నేను తీర్పుదినమునాడు ఈ విధంగా ఉంటాము” అంటూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు వ్రేళ్ళను ఒక్కటిగా కలిపి చూపినారు.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు – ఎవరైతే ఇద్దరు కూతుళ్లు లేదా ఇద్దరు అక్కచెళ్ళెల్లు కలిగి ఉండి వారి మంచిచెడులు, బాగోగులు చూస్తూ, మంచిపనులు చేయుటకు వారికి మార్గనిరర్దేశం చేస్తూ, చెడుపనుల నుంచి వారిని హెచ్చరిస్తూ వారు పెద్దవాళ్లు అయ్యే వరకు వారిని పెంచిపోషిస్తాడో, అటువంటి వ్యక్తి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇద్దరూ ప్రళయదినమున ఈ రెండింటి మాదిరిగా (అంటే అంత దగ్గరగా) వస్తారు అంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చూపుడు వ్రేలు మరియు మధ్య వ్రేలును కలిపి చూపినారు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీరు (ఇస్లాం యొక్క విశ్వాసపు మూలస్థంభాలన్నింటినీ) విశ్వసించనంత వరకు స్వర్గములో ప్రవేశింపలేరు. మరియు మీరు ఒకరినొకరు ప్రేమించనంత వరకు మీరు విశ్వసించలేరు (విశ్వాసులు కాలేరు). మీకొక విషయం చెప్పనా – ఒకవేళ మీరు ఇలా చేస్తే మీరు ఒకరినొకరు ప్రేమిస్తారు అంటే సలాం చేయడాన్ని మీ మధ్య బాగా వ్యాప్తి చేయండి.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక విషయాన్ని స్పష్ట పరిచినారు – అది విశ్వాసులు స్వర్గములోనికి ప్రవేశిస్తారు. అయితే వారు ఒకరినొకరు ప్రేమించనంత వరకు విశ్వాసము సంపూర్ణము కాదు, మరియు ముస్లిం సమాజము యొక్క స్థితి కూడా వృధ్ధి చెందదు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ముస్లిం సమాజములో ప్రేమ ప్రవర్థిల్లు ఆచరణల వైపునకు మనలకు మార్గదర్శకం చేసినారు – అది ఏమిటంటే, అల్లాహ్ తన దాసులు ఒకరినొకరు అభివందనం చేయుట కొరకు సూచించిన “సలాము”, దానిని వ్యాపింపజేయమని తెలిపినారు.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షములో ఉండగా ఒక భయంకరమైన శబ్దం విన్నాము. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అది (ఆ శబ్దము) ఏమిటో మీకు తెలుసా?” అని అడిగారు. మేము “అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మాత్రమే బాగా ఎరుగును” అని అన్నాము. దానికి ఆయన (స) “డెబ్భై సంవత్సరాల క్రితం ఒక పెద్ద బండరాయి నరకము లోనికి విసిరి వేయబడింది. అది అలా (నరకము యొక్క అడుగు భాగం వైపునకు) జారుతూనే ఉంది. ఇప్పుడు అది నరకపు అడుగు భాగాన్ని తాకింది.” అన్నారు.”
ముస్లిం నమోదు చేసినారు:ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత కలవర పరిచేలా, ఏదో వస్తువు పడిపోయినట్లు పెద్ద శబ్దం విన్నారు. వారితో పాటు అక్కడే ఉన్న సహాబాలను (రదియల్లాహు అన్హుమ్) ఆ శబ్దాన్ని గురించి అడిగారు. దానికి వారు ‘అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మాత్రమే బాగా ఎరుగుదురు’ అని సమాధానమిచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారితో ఇలా అన్నారు: మీరు విన్న ఈ శబ్దం డెబ్బై సంవత్సరాల క్రితం నరకం అంచు నుండి విసిరిన రాయి, నరకపు దిగువకు చేరుకునే వరకు పడిపోతూ పడిపోతూ, నరకం అడుగున తాకినపుడు చేసిన ఆ శబ్దాన్ని మీరు విన్నారు.
సలమహ్ ఇబ్న్ అల్ అక్వఇ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒక వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షములో ఎడమ చేతితో తినసాగాడు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “కుడిచేతితో తిను”. దానికి అతడు “నేను అలా చేయలేను” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు అలా చేయకుండానే ఉండిపోవుదువుగాక” అన్నారు. వాస్తవానికి అతడు అహంకారం కొద్దీ నిరాకరించినాడు. (అతణ్ణి గురించి) ఇలా అన్నారు: “ఆ తరువాత అతడు తన కుడి చేతిని ఎప్పుడూ నోటి వరకు ఎత్తలేక పొయినాడు.”
ముస్లిం నమోదు చేసినారు:ఒక వ్యక్తి ఎడమ చేతితో తినడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూసినారు. అందుకని అతడిని కుడి చేతితో తినమని ఆదేశించినారు. ఆ వ్యక్తి అహంకారం కొద్దీ అలా చేయలేనని అబద్ధం చెప్పాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడు కుడి చేతితో తినడం నిషేధమైపోయేలా దుఆ చేసారు. అతడి కుడి చేతికి పక్షవాతం వచ్చేలా చేసి, అల్లాహ్ ఆయన దుఆను స్వీకరించాడు.
అబూ ఉమామహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “హజ్జతుల్ విదా” (వీడ్కోలు హజ్) లో ప్రసంగిస్తూ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “మీ ప్రభువైన అల్లాహ్’కు భయపడండి; మీ ఐదింటిని (నమాజులను) ఆచరించండి; మీ (రమదాన్) నెల ఉపవాసములను ఆచరించండి; మీ సంపదల నుండి జకాతు చెల్లించండి; మీ పాలకులకు విశ్వాసపాత్రులై ఉండండి; (ఇలా చేస్తే) మీ ప్రభువు యొక్క స్వర్గములో మీరు ప్రవేశిస్తారు.”
అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:హిజ్రీ పదవ సంవత్సరములో జరిగిన “హజ్జతుల్ విదా” (వీడ్కోలు హజ్) లో అరఫా దినమున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగించినారు. ఆ సంవత్సరం జరిగిన హజ్ “హజ్జతుల్ విదా” (వీడ్కోలు హజ్) గా పిలువబడింది; కారణం ఆ ప్రసంగములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల నుండి వీడుకోలు తీసుకున్నారు. ఆయన ప్రజలందరినీ ఈ విధంగా ఆదేశించినారు - తమ ప్రభువు (అయిన అల్లాహ్) ఆదేశాలను పాటిస్తూ, ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉంటూ, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలి; రాత్రింబవళ్ళలో విధిగా ఆచరించమని అల్లాహ్ ఆదేశించిన ఐదు నమాజులను ఆచరించాలి; రమజాన్ మాసము ఉపవాసాలు పాటించాలి; తమ సంపదల నుండి, అర్హులైన వారికి జకాతు చెల్లించాలి; అందులో పిసినారితనం వహించకండి; అల్లాహ్ విధేయతకు వ్యతిరేకం కానంతవరకు - అల్లాహ్ తమపై పాలకులుగా నియమించిన వారికి – విధేయులై ఉండాలి. ఎవరైతే పైన పేర్కొనబడిన అంశాలను ఆచరిస్తారో, వారి ప్రతిఫలం స్వర్గములోనికి ప్రవేశము అవుతుంది.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు, “మీలో ఎవరైనా ధార్మిక (ఇస్లాం పరంగా) సోదరుడైన మరొక విశ్వాసిని కలిసినపుడు అతనికి ‘సలాం’ చేయాలి (అభివాదము చేయాలి). ఒకవేళ వారి మధ్య ఒక చెట్టు, లేదా ఒక గోడ లేక ఒక పెద్ద శిల వచ్చినట్లైతే (దానిని దాటిన తరువాత) మరల అతణ్ణి కలిసినపుడు కూడా అతనికి సలాం చేయాలి (సలాం చేసి ఒకటి, రెండు నిమిషాలే అయినప్పటికీ).
అబూదావూద్ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలు తమ తోటి ముస్లిం సోదరులను కలుసుకున్నప్పుడల్లా ఒకరికొకరు అభివాదం చేయాలని (సలాం చేయాలని) ప్రోత్సహించడం చూడవచ్చు. వారు కలిసి నడుస్తున్నప్పుడు, వారి మధ్య చెట్టు, గోడ లేదా పెద్ద రాయి వంటి అడ్డంకి వచ్చి దానికి అటువైపు నుండి ఒకరు, ఇటువైపు నుండి ఒకరు నడుస్తూ, తరువాత వారు మళ్ళీ కలుసుకున్నప్పుడు, వారు మళ్ళీ ఒకరికొకరు సలాం చేయాలి – సలాం చేసి ఒకటి, రెండు నిమిషాలే అవుతున్నప్పటికీ.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నేను ఒక విషయం వైపునకు మార్గదర్శనం చేయనా – దాని ద్వారా అల్లాహ్ (తన దాసుల) పాపాలను తుడిచి వేస్తాడు, మరియు (స్వర్గములో) వారి స్థానాలను ఉన్నతం చేస్తాడు?”. దానికి సహాబాలందరూ “తప్పనిసరిగా ఓ రసూలుల్లాహ్!” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అనుకూలంగా లేని పరిస్థితులలోనూ పరిపూర్ణంగా ఉదూను ఆచరించుట; మస్జిదునకు ఎక్కువ అడుగులతో వెళ్ళుట (ప్రతిరోజూ ఐదు నమాజులను మస్జిదులో ఆచరించుట); ఒక నమాజు తరువాత మరొక నమాజు కొరకు వేచి చూచుట. మరియు అది ‘అర్’రిబాత్’ అనబడుతుంది”.
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలను ఇలా ప్రశ్నించారు – పాపాలు క్షమించబడుటకు, సురక్షితంగా ఉన్న ఆచరణల గ్రంథాల నుండి ఆ పాపాలు తుడిచి వేయబడుటకు, మరియు స్వర్గములో స్థానములు ఉన్నతం అయ్యేందుకు కారణమయ్యే ఆచరణల వైపునకు, తాను వారికి మార్గదర్శకం చేయాలని వారు కోరుకుంటున్నారా? అని. అపుడు సహాబాలు “అవును ఓ ప్రవక్తా! మాకు అది కావాలి” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మొదటిది: ఉదూ చేయడానికి అనుకూలంగా లేని పరిస్థితులు ఉన్నపుడు, లేదా ఉదూ చేయడం కష్టమైన పరిస్థితులు ఉన్నపుడు కూడా సమగ్రంగా, సంపూర్ణంగా ఉదూ చేయడం. ఉదాహరణకు – నీళ్ళు బాగా చల్లగా ఉండి వేడి చేసే సదుపాయం లేనపుడు, నీళ్ళు కొద్ది పరిమాణములోనే ఉన్నపుడు, లేదా శరీరమంతా నొప్పులతో ఉన్నపుడు, లేదా నీళ్ళు మరీ వేడి వేడిగా ఉన్నపుడు - ఇలాంటి పరిస్థితులలో కూడా సంయమనం పాటిస్తూ, ఉన్న ఉపకరణాలనే ఉపయోగిస్తూ సమగ్రంగా, సంపూర్ణంగా ఉదూ చేయడం. రెండవది: ఇంటికి దూరంగా ఉన్న మస్జిదులకు ఎక్కువ అడుగులు వేస్తూ వెళ్ళుట. ‘అడుగు’ అంటే (నడకలో) రెండు పాదాల మధ్య దూరము. ఇంటికి దూరంగా ఉన్న మస్జిదులకు నడిచి వెళ్ళండి, తరచుగా దీనిని పునరావృతం చేయండి. రోజూ ఆచరించవలసిన ఐదు పూటల సలాహ్’లను మస్జిదులో ఆచరించండి. మూడవది: సలాహ్ సమయం కొరకు వేచి ఉండుట; అంటే ఈ గుణం సలాహ్ తో మన హృదయానికి ఉండే అనుబంధాన్ని తెలుపుతుంది; సలాహ్ కొరకు తయారు కావడం, మస్జిదుకు చేరుకుని జామఅత్ కొరకు వేచి చూస్తూ కూర్చోవడం, అలాగే సలాహ్ పూర్తి అయిన తరువాత (వీలైతే) అక్కడే కూర్చుని తరువాతి సలాహ్ కొరకు వేచి చూచుట – ఇవన్నీ దీని క్రిందకే వస్తాయి. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు: ఇవి వాస్తవములో రక్షణ మరియు స్థిరత్వములకు సంబంధించిన ఆచరణలు. ఈ ఆచరణలు మన ఆత్మ వైపునకు షైతాను యొక్క దారికి అడ్డుగోడలా ఉంటాయి, దారిని అడ్డుకుంటాయి, మూసివేస్తాయి. వాంఛలు, కోరికలను అదుపులో ఉంచుతాయి; షైతాను గుసగుసలను అనుమతించ కుండా ఆత్మ అడ్డుకునేలా చేస్తాయి; ఆ విధంగా అల్లాహ్ సైన్యం షైతాను సైన్యాన్ని ఓడిస్తుంది. అదీ నిజానికి గొప్ప జిహాద్; మరో మాటలో ఇది శత్రువు నుండి (అతడు ప్రవేశించకుండా) సరిహద్దును కాపాడడం.
అబూ అద్’దర్దా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ ఆచరణలలో ఉత్తమమైన దాని గురించి నేను మీకు తెలుపనా? అవి మీ ప్రభువు వద్ద పరిశుద్ధమైనది; అది మీ స్థానములను ఉన్నతము చేయునటువంటిది; (అల్లాహ్ మార్గములో) బంగారము మరియు వెండి ఖర్చుచేయుట కంటే ఉత్తమమైనది; మరియు మీరు మీ శత్రువులను ఎదుర్కొన్నపుడు వారి మెడలపై మీరు దాడి చేయడం, మరియు వారు మీ మెడలపై దాడి చేయడం కంటే కూడా ఇది మీకు శ్రేష్ఠమైనది”; దానికి వారు “తప్పకుండా తెలియజేయండి ఓ ప్రవక్తా!” అన్నారు. అపుడు ఆయన “సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క స్మరణ చేయుట (ఆయనను స్మరించుట, జిక్ర్ చేయుట)” అన్నారు.
అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలను ఇలా అడిగారు: “సర్వలోకాల సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ వద్ద - మీ ఆచరణలలో అత్యంత ఉత్తమమైనది, మహా గౌరవనీయమైనది, పుణ్యఫలమును అత్యంత ఎక్కువగా వృద్ధి చెందించునది; పరిశుద్ధమైనది, మరియు కల్మశం లేనిది అయిన ఆచరణ ఏమిటో మీకు తెలుపనా (మీకు బోధించనా)?” (మీకు తెలుపనా) స్వర్గములో మీ స్థానాలను ఉన్నతం చేసే ఆచరణ ఏమిటో? (మీకు తెలుపనా) బంగారము మరియు వెండి దానము చేయుట కంటే ఉత్తమ ఆచరణ ఏమిటో? మరియు (మీకు తెలుపనా) యుద్ధభూమిలో అవిశ్వాసులను ఎదుర్కొన్నపుడు మీరు వారి మెడలు నరకడం లేక వారు మీ మెడలు నరకడం కంటే ఉత్తమ ఆచరణ ఏమిటో? అది విని సహాబాలు “తప్పనిసరిగా చెప్పండి, ఓ ప్రవక్తా!” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అన్ని వేళలలో, అన్ని విధానాలలో, అన్ని పరిస్థితులలో అల్లాహ్ యొక్క ధ్యానం చేయుట, ఆయనను స్మరించుట (అల్లాహ్ యొక్క జిక్ర్ చేయుట)” అన్నారు.