Hedayat “A fruitful harvest”
from the gardens of “ Verses and Hadiths ”
Inspiring Dawah cards that highlight the profound meanings of Quranic verses and Prophetic Hadiths. Presented in an accessible and engaging style to help Muslims gain a deeper understanding of their faith with ease.
About Hedayat
Hedayat is a platform that combines simplicity of design and ease of use
displaying the benefits derived from Verses and Hadiths in
attractive cards with unique designs.
Unique Designs
Cards with unique and attractive designs that express the content of the text
Reliable Materials
Scientifically reliable benefits reviewed by a group of scholars
Easy Browsing
You can browse the cards easily and display them effortlessly
Different Languages
Cards are available in more than 40 languages for the benefit of all
Hadith Cards
అబీ ఉసైద్ ఉల్లేఖించిన హదీసును అబీ హుమైద్ ఇలా తెలిపినారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక” (ఓ అల్లాహ్! నా కొరకు నీ కరుణాకటాక్షముల ద్వారములను తెరువుము); అలాగే మస్జిదు నుండి బయటకు వెళ్ళునపుడు అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మ! ఇన్నీ అస్అలుక మిన్ ఫద్’లిక” (ఓ అల్లాహ్! నేను నీ శుభాలలో నుండి నా కొరకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను).”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదులోనికి ప్రవేశించే ముందు పలుకవలసిన దుఆ (అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక) వైపునకు ముస్లిం సమాజాన్ని మార్గదర్శనం చేస్తున్నారు. అతడు మస్జిదులోనికి ఆరాధన (ఇబాదత్) కొరకు ప్రవేశించడానికి ముందు అతడు తన ప్రభువు యొక్క కరుణ కొరకు దువా చేస్తున్నాడు. అలాగే అతడు మస్జిదు నుండి బయటకు వెళ్ళాలని నిర్ణయించుకున్నపుడు పలుకవలసిన దుఆ (అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫజ్’లిక) వైపునకు మార్గదర్శనం చేస్తున్నారు. ఆ దుఆ పలుకడం ద్వారా అతడు తనకు ధర్మబద్ధమైన ఉపాధి కొరకు, అందులో అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని, దయను, కనికరాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాడు.
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నైతిక విలువలు మరియు నైతికతకు సంబంధించినంత వరకూ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జనులందరిలోనూ అత్యుత్తమములు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారునైతిక విలువలు మరియు సత్శీలతకు సంబంధించింత వరకూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవులందరిలోనూ అత్యుత్తమములు, అత్యంత పరిపూర్ణత గలవారు. వ్యక్తిత్వము మరియు మూర్తిత్వము పరంగా – ఉదాహరణకు కరుణపూరితమైన సంభాషణకు, మంచి పనులు చేయుటకు, దీప్తివంతమైన ముఖ వర్ఛస్సుకు మరియు ఎవరికైనా కీడు లేదా హాని తలపెట్టుటకు దూరంగా ఉండుట మరియు ఎవరైనా తనకు కీడు గానీ, హాని గానీ తలపెట్టితే దానిపై సహనం వహించుట మొదలైన గుణగణాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రథములు.
ఉఖ్’బా ఇబ్న్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “మాకు ఒంటెలను మేపుకు వచ్చే పని ఇవ్వబడింది. నా వంతు వచ్చినపుడు నేను వాటిని ఆరుబయట బయళ్లలో మేపుకుని సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాటల నుండి నేను ఇది గ్రహించాను: “ఒక ముస్లిం మంచిగా ఉదూ చేసుకుని, ఆ తరువాత నిలబడి రెండు రకాతుల నమాజును తన హృదయమును మరియు ముఖమును రెండింటినీ ‘ఖిబ్లహ్’ వైపునకు త్రిప్పుకుని ఆచరిస్తే, అతని కొరకు స్వర్గము ‘వాజిబ్’ చేయబడుతుంది (అతని కొరకు స్వర్గము తప్పనిసరి చేయబడుతుంది).” అది విని నేను “ఆహా! ఎంత చక్కని విషయం ఇది” అన్నాను. నా ముందు వరుసలో కూర్చొన్న వ్యక్తి “ఇంతకంటే ముందు చెప్పింది దీని కన్నా మంచిది” అన్నాడు. నేను ఎవరా అని చూస్తే ఆయన ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు). ఆయన “నువ్వు ఇప్పుడే వచ్చినట్లున్నావు. (ఇంతకు ముందు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘మీలో ఎవరైనా ఉదూ ఆచరిస్తే, పరిపూర్ణంగా ఉదు పూర్తి చేసి, “అష్’హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుల్లాహి వ రసూలుహు” అని పలుకుతాడో, అతని కొరకు స్వర్గం యొక్క ఎనిమిది ద్వారాలు తెరవ బడతాయి, వాటిలో అతను కోరుకున్న దాని ద్వారా స్వర్గములోనికి ప్రవేశించవచ్చు’ అన్నారు.
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు రెండు గొప్ప ధార్మిక ఆచరణలను వివరించారు: మొదటిది: ఎవరైతే ఉదూను ఆచరిస్తాడో మరియు దానిని చక్కగా, పూర్తిగా, సంపూర్ణంగా మరియు నిర్దేశించిన పద్ధతిలో పరిపూర్ణం చేసి, ప్రతి అవయవానికి దానికి తగిన మొత్తంలో నీటిని అందజేసి, అప్పుడు ఇలా: “అష్’హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుల్లాహి వ రసూలుహు” అని పలుకుతాడో, అతని కొరకు స్వర్గపు ఎనిమిది ద్వారాలు తెరువ బడుతాయి. ఏ ద్వారము ద్వారా కోరుకుంటే ఆ ద్వారము నుండి అతడు స్వర్గములోనికి ప్రవేశించవచ్చు.” రెండవది: ఎవరైతే ఉదూ చేయునపుడు ఉదూను పూర్తిగా, సంపూర్ణంగా ఆచరించి, తరువాత నిలబడి, రెండు రకాతులను, హృదయపూర్వకంగా మరియు వినయముతో వాటి వైపునకు తిరిగి, అతడి ముఖాన్ని మరియు శరీరంలోని అన్ని అవయవాలను అల్లాహ్ కే (ఆయన ఆరాధనకే) సమర్పించుకుని ఆచరిస్తాడో, స్వర్గం అతని కొరకు విధి (వాజిబ్) చేయబడుతుంది.
ఇబ్నె అజ్'హర్ యొక్క ఒకప్పటి బానిస అయిన అబూ ఉబైద్ ఇలా ఉల్లేఖించినారు: నేను ఈద్ రోజున ఉమర్ ఇబ్నుల్-ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు)తో ఉన్నాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు: "ఇవి రెండు రోజులు — ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రెండు రోజులలో ఉపవాసం పాటించడం నిషేధించారు: ఒకటి ఉపవాసాన్ని ముగించే రోజు (ఈదుల్-ఫిత్ర్), మరొకటి మీ ఖుర్బానీ నుండి తినే రోజు (ఈదుల్-అద్హా)."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈద్ అల్-ఫిత్ర్ (రమదాన్ పండుగ) మరియు ఈదుల్-అద్హా (బక్రీదు పండుగ) దినాలలో ఉపవాసం చేయడం నిషేధించారు. ఈదుల్-ఫిత్ర్ అనేది రమదాన్ నెల తర్వాత ఉపవాసాన్ని ముగించే రోజు; ఈదుల్-అద్హా అనేది ఖుర్బానీ చేసి, దాని నుండి తినే రోజు. ఈ రెండు రోజులలో ఉపవాసం పాటించడం ఇస్లాంలో అనుమతించబడలేదు, ఎందుకంటే ఇవి ఆనందం, పండుగ, మరియు విందుభోజనం కోసం ప్రత్యేకించబడిన పవిత్ర దినాలు.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఓ ప్రజలారా! నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్ధుడు మరియు పరిశుద్ధమైన వాటిని తప్ప మరి దేనినీ అంగీకరించడు. ప్రవక్తలకు ఆదేశించిన దానినే అల్లాహ్ విశ్వాసులకూ ఆదేశించినాడు. దివ్య ఖుర్’ఆన్ లోని అల్లాహ్ ప్రకటన: “ఓ సందేశహరులారా! పరిశుద్ధమైన వాటినే తినండి మరియు సత్కార్యాలు చేయండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా నాకు బాగా తెలుసు” [సూరహ్ అల్ ము’మినూన్ 23:51]; మరియు అల్లాహ్ మరో ప్రకటన: “ఓ విశ్వాసులారా! మీరు నిజంగా కేవలం ఆయన (అల్లాహ్)నే ఆరాధించేవారు అయితే; మేము మీకు జీవనోపాధిగా ప్రసాదించిన పరిశుద్ధ (ధర్మసమ్మత)మైన వాటినే తినండి...” [సూరహ్ అల్ బఖరహ్ 2:172]. తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సుదూర ప్రయాణీకుడి గురించి ప్రస్తావించినారు, అతడి తలవెంట్రుకలు చిందరవందరగా ఉన్నాయి, అతడి శరీరమంతా మట్టికొట్టుకుని ఉంది, అతడు తన రెండు చేతులు ఆకాశం వైపునకు చాచి “ఓ నా ప్రభూ! ఓ నా ప్రభూ!” అంటూ వేడుకుంటున్నాడు. మరి చూడబోతే అతని ఆహారం హరాం (ధర్మసమ్మతమైనది కాదు); అతని పానీయం హరాం, అతని దుస్తులు హరాం, మరియు అతని పోషణ పూర్తిగా హరాం. మరి అది (అతని దుఆ, వేడుకోలు) ఎలా స్వీకరించబడుతుంది?”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్ధుడు, మరియు పరమ పవిత్రుడు, కొరతలు, లోపాలు మరియు దోషాలు లేనివాడు మరియు పరిపూర్ణతలతో కూడిన సంపూర్ణ గుణగణాలు, లక్షణాలు కలిగిన వాడు. ఆయన మంచిని మరియు పరిశుద్ధమైన వాటిని, మరియు కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ఆచరించిన వాటిని మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గదర్శకానికి అనుగుణంగా ఉన్న వాటిని తప్ప మరి దేనినీ అంగీకరించడు – అవి ఆచరణలైనా, పలుకులైనా లేదా నమ్మకాలైనా. వీటి ద్వారా తప్ప ఎవరూ అల్లాహ్ సామీప్యానికి చేరుకోవాలని కోరుకోరాదు. విశ్వాసి తన ఆచరణలను ఉత్తమమైనవిగా మార్చుకోవడానికి ఉన్న మార్గాలలో ఉత్తమమైనది ఏమిటంటే అతడు తినే ఆహారం పరిశుద్ధమైనదై ఉండడం, అంటే హలాల్ సంపాదన ద్వారా సంపాదించినది మాత్రమే తినడం. అది అతడి ఆచరణలను పరిశుద్ధ పరుస్తుంది. ఆ విధంగా అతడి ఆచరణలు పరిశుద్ధమవుతాయి. కనుక, అల్లాహ్ తాను ప్రవక్తలకు, సందేశహరులకు ఏదైతే ఆదేశించినాడో, దానినే విశ్వాసుల కొరకు కూడా ఆదేశించినాడు: ధర్మసమ్మతమైన దానిని (హలాల్) మాత్రమే తినండి మరియు మంచి పనులు చేయండి’ అని. అల్లాహ్ ప్రకటన, { يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا ۖ إِنِّي بِمَا تَعْمَلُونَ عَلِيمٌ } [ఓ సందేశహరులారా! పరిశుద్ధమైన వాటినే తినండి మరియు సత్కార్యాలు చేయండి. 17 నిశ్చయంగా, మీరు చేసేదంతా నాకు బాగా తెలుసు. సూరహ్ అల్ ము’మినూన్ 23:51]; మరియు అల్లాహ్ ప్రకటన: { يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ} [ఓ విశ్వాసులారా! మీరు నిజంగానే కేవలం ఆయన (అల్లాహ్)నే ఆరాధించేవారు అయితే; మేము మీకు జీవనోపాధిగా ఇచ్చిన పరిశుద్ధ (ధర్మసమ్మత)మైన వాటినే తినండి, సూరహ్ అల్ బఖరహ్ 2:172] ఇంకా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హరాం (ధర్మ విరుద్ధమైనది) తినరాదని హెచ్చరించినారు. అది ఆచరణలను నాశనం చేస్తుంది. అది ఆచరణలు (అల్లాహ్ వద్ద) స్వీకరించబడడాన్ని నిరోధిస్తుంది; ఆ బాటసారి ఆమోదయోగ్యమైన స్పష్టమైన మార్గాలను ఉపయోగించినప్పటికీ అతని ఆచరణలు ఆమోదయోగ్యం కావు: ఉదాహరణకు: మొదటిది: (అల్లాహ్’కు) విధేయతను చూపే వాటిని ఆచరించుటకు అతడు ఎంత దూరం ప్రయాణించినా, అంటే హజ్ చేయడం, జిహాద్ లో పాల్గొనడం, అలాగే బంధుత్వాలను గౌరవించడం, వాటిని నిభాయించడం మొదలైనవి చేసినా, చేస్తూ ఉన్నా. రెండవది: తల వెంట్రుకలను దువ్వుకోకపోవడం వల్ల చిందరవందరగా ఉన్న వెంట్రుకలు, దుమ్ము కారణంగా రంగు మారిన చర్మం మరియు అతని ఒంటిపై బట్టలు కూడా రంగు మారి, అతను నిస్సహాయంగా దీనస్థితిలో ఉన్నాడు. మూడవది: అతడు తన రెండు చేతులను ఆకాశం వైపునకు ఎత్తి దుఆ చేయడం. నాల్గవది: అల్లాహ్’ను ఆయన పేర్ల ద్వారా పట్టుదలతో వేడుకొనడం: “ఓ నా ప్రభూ! ఓ నా ప్రభూ!” అంటూ. ఈ విధంగా ప్రార్థనలకు జవాబు లభించటానికి ఆవశ్యకమైన అన్ని మార్గాలు ఉన్నప్పటికీ, అతడికి ఏ సమాధానమూ లభించ లేదు; ఎందుకంటే అతని ఆహారం, పానీయం మరియు బట్టలు హరాం (అక్రమమైనవి), మరియు అతడు హరాం (ధర్మ విరుద్ధమైన, అక్రమమైన వాటి) ద్వారా పోషించబడ్డాడు. ఈ హదీథులో వర్ణించబడినటువంటి వ్యక్తి విన్నపానికి, అతని వేడుకోలుకు సమాధానం లభించడం దాదాపుగా అసంభవం; దానికి ఎలా సమాధానం లభిస్తుంది?
అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే ఇద్దరు ఆడపిల్లలను యుక్తవయస్సుకు చేరే వరకు వారి పోషణ, బాగోగులు చూస్తూ పెంచి, పోషిస్తాడో అతడు మరియు నేను తీర్పుదినమునాడు ఈ విధంగా ఉంటాము” అంటూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు వ్రేళ్ళను ఒక్కటిగా కలిపి చూపినారు.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు – ఎవరైతే ఇద్దరు కూతుళ్లు లేదా ఇద్దరు అక్కచెళ్ళెల్లు కలిగి ఉండి వారి మంచిచెడులు, బాగోగులు చూస్తూ, మంచిపనులు చేయుటకు వారికి మార్గనిరర్దేశం చేస్తూ, చెడుపనుల నుంచి వారిని హెచ్చరిస్తూ వారు పెద్దవాళ్లు అయ్యే వరకు వారిని పెంచిపోషిస్తాడో, అటువంటి వ్యక్తి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇద్దరూ ప్రళయదినమున ఈ రెండింటి మాదిరిగా (అంటే అంత దగ్గరగా) వస్తారు అంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చూపుడు వ్రేలు మరియు మధ్య వ్రేలును కలిపి చూపినారు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అల్లాహ్’ను మరియు అంతిమ దినమును విశ్వసించే వారు ఎవరైనా సరే, (పలికితే) మంచి మాటలే పలకాలి లేదా మౌనంగా ఉండాలి. అలాగే అల్లాహ్’ను మరియు అంతిమ దినమును విశ్వసించే వారు ఎవరైనా సరే, తన పొరుగు వాని పట్ల ఔదార్యము, ఉదార వైఖరి కలిగి ఉండాలి. అలాగే అల్లాహ్’ను మరియు అంతిమ దినమును విశ్వసించే వారు ఎవరైనా సరే, తన అతిథికి (వీలైనంతలో) ఆదరపూర్వకం గా అతిథి సత్కారాలు చేయాలి”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వివరిస్తున్నారు: అల్లాహ్ ను మరియు అంతిమ దినమును విశ్వసించుట – దాసుడు చివరికి మరలవలసినది ఈ రెండు విషయాల వైపునకే. అక్కడ అతని విశ్వాసము మరియు ఆచరణల ఆధారంగా అతనికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. కనుక ఎవరైతే అల్లాహ్ ను మరియు అంతిమ దినమును విశ్వసిస్తారో, వారు ఈ లక్షణాలు కలిగి ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్బోధిస్తున్నారు. మొదటిది: మంచి మాటలు పలుకుట/మాట్లాడుట: ఇందులో అల్లాహ్ నామమును స్మరించుట, ఉదాహరణకు ‘తహ్లీల్’ (లా ఇలాహ ఇల్లాల్లాహ్), ‘తక్బీర్’ (అల్లాహు అక్బర్), ‘తమ్’హీద్’ (అల్-హందులిల్లాహ్) మొదలైనవి, మంచి చేయమని ఉద్బోధించుట, ఆదేశించుట, చెడు నుండి ఆపుట, నిరోధించుట, అలాగే, వ్యక్తుల మధ్య సయోధ్య కుదుర్చుట, వారికి సన్మార్గము వైపునకు మార్గదర్శనం చేయుట మొదలైనవన్నీ ఉన్నాయి. ఒకవేళ అతడు ఇది చేయలేకపోతే, అపుడు అతడు కనీసం మౌనంగానైనా ఉండాలి, ఎవరికీ హాని, నష్టము కలిగించే రీతిలో మాట్లాడకుండా తన నాలుక పట్ల జాగ్రత్త వహించాలి. రెండవది: పొరుగు వానిని గౌరవించుట: అతనికి నష్టము కలిగించరాదు. అతని పట్ల గౌరవము, ఔదార్యము కలిగి ఉండాలి. మూడవది: మిమ్మల్ని చూడడానికి మీ ఇంటికి వచ్చిన అతిధిని గౌరవించాలి: అతిథుల పట్ల ఆదరణ, గౌరవము కలిగి ఉండాలి, వారికి వీలైనంతలో తగిన విధంగా అతిథి సత్కారాలు చేయాలి.
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “కొంతమంది ప్రజలు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ‘భవిష్యత్తు గురించి చెప్పేవారికి’ (జ్యోతిష్యులకు) సంబంధించి ప్రశ్నించినారు. వారితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “వారిని గురించి (చెప్పడానికి) ఏమీ లేదు”. దానికి వారు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరి వారు చెప్పే విషయాలు ఒక్కోసారి నిజమవుతాయి కదా!” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అది ఏదో ఒక నిజానికి సంబంధించిన మాట అయి ఉంటుంది. దానిని ఆ జిన్ను దొంగతనంగా (దైవదూతల నుండి) పొంది, తన మిత్రుడైన ఆ జ్యోతిష్యుని చెవిలో వేస్తాడు. అతడు దానికి (ఆ నిజమైన ఒక్క మాటకు) మరో వంద అబద్ధాలు కల్పించి చెపుతాడు.” (సహీ బుఖారీలో ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించిన మరొక హదీసులో తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా విన్నాను అని తెలిపారు “స్వర్గములో అల్లాహ్ నిర్ణయించిన విషయాలను గురించి ప్రస్తావించుకుంటూ దైవదూతలు క్రింది ఆకాశాలలోనికి వస్తారు. వారి మాటలను జిన్ను దొంగతనంగా, చాటుమాటుగా విని తమ మిత్రులైన జ్యోతిష్యులకు చేరవేస్తాడు. అలా ఆ జ్యోతిష్యులు దానికి వంద అబద్దాలు జోడించి చెబుతూ ఉంటారు.”)
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుభవిష్యత్తులో జరుగబోయే విషయాలు చెప్పే వారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించడం జరిగింది. దానికి వారు: వారిని గురించి ఎక్కువ ఆలోచించకండి, వారి మాటలను తీసుకోకండి (నమ్మకండి), మరియు వారు చేసే పనులపట్ల ఆసక్తి చూపకండి” అన్నారు. దానికి వారు (ప్రజలు) ఇలా అన్నారు: “కొన్ని సందర్భాలలో వారు చెప్పేది వాస్తవానికి అనుగుణంగానే ఉంటుంది. ఉదాహరణకు భవిష్యత్తులో జరుగబోయే ఏదైనా (మనకు తెలియని, అగోచర) విషయాన్ని గురించి ‘ఫలానా నెలలో, ఫలానా దినమున ఇలా జరుగుతుంది’ అని చెప్పినట్లయితే – వారు చెప్పినట్లుగానే జరుగుతుంది.” అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “జిన్నాతులు ఆకాశాలలో దొంగతనంగా విన్న విషయాన్ని తీసుకుని వారు జ్యోతిష్యులలో తమ మిత్రులైన జ్యోతిష్యుల దగ్గర దిగి తాము విన్నదానిని వారికి తెలుపుతారు. జ్యోతిష్యులు తాము విన్న ఆకాశపు విషయానికి వంద అబద్దాలు జతచేస్తారు.”
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక విశ్వాసి అపవాది కాజాలడు (ఇతరులపై అపవాదులు మోపు వాడు), ఇతరులను శపించడు మరియు అనైతిక చర్యలకు పాల్బడడు లేదా సిగ్గుమాలిన పనులు చేయడు.”
అత్తిర్మిదీ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన ఒక విశ్వాసి యొక్క ప్రవృత్తి ఇలా ఉండదు – ఇతరులను వారి వంశం ఆధారంగా (కులం, మతం, ధర్మం ఆధారంగా) విమర్శించడం, లేదా శపించడం, లేదా తిట్లు తిట్టడం, మాటలలోగానీ లేక చేతలలో గానీ సిగ్గుమాలిన తనానికి పాల్బడడం. ఒక నిజమైన విశ్వాసి ఇవన్ని చేయడు.
ము’ఆవియా అల్ ఖుషైరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగాను: “ఓ రసూలుల్లాహ్! మాలో ఎవరి భార్యకైనా అతనిపై (ఆమె భర్తపై) ఉన్న హక్కు ఏమిటీ?” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నువ్వు తిన్నపుడు ఆమెకు కూడా తినిపించు; ఆమెకు కూడా దుస్తులు ధరింపజేయి - నీవు దుస్తులు ధరించినపుడు, లేదా నీవు డబ్బు సంపాదించినపుడు; ఆమె ముఖం పై ఎపుడూ కొట్టకు; ఆమెను ఎన్నడూ అవమానించకు; ఆమెను ఇంటిలో తప్ప ఇంకెక్కడా ఆమెను నీ నుండి వేరు చేయకు.”
అబూదావూద్, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా ప్రశ్నించడం జరిగింది: ఒక భార్యకు తన భర్తపై ఉండే హక్కులు ఏమిటి అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా విషయాలు తెలిపినారు; వాటిలో ఇవి కొన్ని: మొదటిది: ఆహారం విషయంలో మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోకండి. మీరు తిన్నపుడల్లా, లేక మీకు ఎవరైనా తినిపించినపుడల్లా ఆమెకు కూడా తినిపించండి. రెండవది: దుస్తుల విషయంలో మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోకండి. మీరు దుస్తులు ధరించినపుడు (అంటే మీ కొరకు మీరు దుస్తులు కొన్నపుడు) ఆమెకు కూడా దుస్తులు ధరింపజేయండి (ఆమె కొరకు కూడా దుస్తులు కొనండి), లేదా మీరు డబ్బు సంపాదించినపుడు, మీరు స్థోమత కలిగి ఉన్నపుడు మీతో పాటు ఆమెకూ దుస్తులు తీసుకోండి. మూడవది: కారణం ఏమీ లేకుండా మరియు దండించవలసిన అవసరం ఏమీ లేకుండా ఆమెను ఎపుడూ దండించవద్దు. ఆమెను క్రమశిక్షణలో ఉంచడం కోసం, లేదా తప్పనిసరి విధులను నిర్లక్ష్యం చేసినందుకు ఆమెను దండించవలసి వస్తే, ఆమెను ఎపుడూ తీవ్రంగా దండించరాదు; మరియు ఆమె ముఖం పై ఎన్నడూ కొట్టరాదు. ఎందుకంటే శరీరంలో ముఖము అత్యంత ప్రముఖమైన భాగము, మరియు సౌందర్యవంతమైన రూపము కలిగి ఉండి, అత్యంత సున్నితమైన భాగములు కలిగినదై ఉంటుంది. నాలుగవది: ఆమెను తిట్టవద్దు (శపించవద్దు), ఉదాహరణకు “అల్లాహ్ నీ ముఖాన్ని అందవికారంగా చేయుగాక” అనేలాంటి మాటలు అనవద్దు. ఆమెకు లేక ఆమె శరీరంలోని ఏ భాగానికీ అందవికారాన్ని ఆపాదించవద్దు, అందవికారము అంటే సౌందర్యానికి వ్యతిరేకము; ఎందుకంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మానవుని ముఖాన్ని మరియు శరీరాన్ని సృష్టించాడు మరియు ఆయన సృష్టించిన ప్రతిదానినీ పరిపూర్ణంగా చేశాడు; సృష్టిని నిందించడం అంటే సృష్టికర్తను నిందించినట్లే, అలాహ్ క్షమించుగాక. ఐదవది: (దండించవలసి వస్తే) పడకలో తప్ప ఒకరినొకరు వదిలివేయకండి; మరియు ఆమె నుండి దూరంగా వెళ్లకండి; (శిక్షలో భారంగా) ఆమెను వేరే ఇంటికి మార్చకండి; భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినపుడు సాధారణంగా ఇలాగే జరుగుతుంది.