





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “గ్రంథ ప్రజలు తౌరాత్ గ్రంథాన్ని హిబ్రూ భాషలో చదివేవారు, దానిని అరబీ భాషలో ముస్లిములకు వివరించేవారు. దానిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు “గ్రంథ ప్రజలను (వారు చెబుతున్నదానిని) విశ్వసించకండి, అలాగని వారిని (వారు చెబుతున్న దానిని) తోసిపుచ్చకండి. మీరు ఇలా పలకండి (“మేము అల్లాహ్ ను మరియు ఆయన మా కొరకు అవతరింపజేసిన దానిని విశ్వసిస్తాము”) (సూరహ్ అల్ బఖరహ్: 2:136)
దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గ్రంథ జలు తమ గ్రంథాలనుండి ఉల్లేఖిస్తున్న దానిపట్ల మోసపోరాదని తన ఉమ్మత్’ను హెచ్చరిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో యూదులు తౌరాత్ గ్రంథాన్ని హిబ్రూ భాషలో చదివే వారు. అది యూదుల భాష. దానిని అరబీ భాషలో వివరించేవారు. దానిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “గ్రంథప్రజలను విశ్వసించకండి. అలా అని వారిని తోసిపుచ్చకండి. ఎందుకంటే మన వైపునకు అవతరించబడిన దానిని (ఖుర్ఆన్ ను), మరియు గ్రంథము (లౌహ్ అల్ మహ్’ఫూజ్) నుండి వారి వైపునకు అవతరించబడిన దానిని విశ్వసించమని అల్లాహ్ మనల్ని ఆదేశిస్తున్నాడు. అయితే మన షరియత్’లో, ఆ గ్రంథాలలో నుండి వారు చెబుతున్నది సరియైనదేనా లేక అందులో లోపాలు ఏమైనా ఉన్నాయా అనేది స్పష్టపరిచే ఆధారాలు ఏవీ లేనందున మనకు మరో మార్గం లేదు. అందుకని మనం ఆగిపోతాము – వారు చెబుతున్న దానిని విశ్వసించకుండా; అలా చేయకపోతే వారు వక్రీకరించిన దానిలో వారితో పాటు మనం కూడా భాగస్వాములము అవుతాము. అలా అని వారు చెబుతున్నది అబద్ధం అని వారిని తోసిపుచ్చము. ఎందుకంటే వారు చెబుతున్న దానిలో నిజం కూడా ఉండవచ్చు; వారిని తోసిపుచ్చినట్లయితే (గ్రంథము నుండి) వారి వైపునకు అవతరించబడిన దానిని విశ్వసించమనే అల్లాహ్ ఆదేశాలను నిరాకరించిన వారము అవుతాము. అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకమని మనల్ని ఆదేశిస్తున్నారు: “మేము అల్లాహ్ ను మరియు ఆయన మా కొరకు అవతరింపజేసిన సందేశాలను మరియు ఇబ్రాహీమ్, ఇస్మా’యీల్, ఇస్’హాఖ్, య’అఖూబ్ మరియు అతని సంతతి వారికి ఇవ్వబడిన వాటినీ మరియు మూసా, ’ఈసా మరియు ఇతర ప్రవక్త లందరికీ వారి ప్రభువు తరఫు నుండి ఇవ్వబడిన వాటినీ (సందేశాలను) విశ్వసిస్తాము. వారిలో ఏ ఒక్కరి పట్లా మేము భేదభావం చూపము. మేము ఆయనకు విధేయులం (ముస్లిములము) అయ్యాము”. (సూరహ్ అల్ బఖరహ్: 2:136)
అబుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : ‘బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం’ (అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడూ అయిన అల్లాహ్ పేరుతో) అనే ఆయతు అవతరించనంత వరకు సూరాలు (దివ్య ఖుర్’ఆన్ లోని అధ్యాయాలు) ఎక్కడ అంతమవుతాయనే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎరుగరు.
దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారుఈ హదీసులో ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఇలా వివరిస్తున్నారు: దివ్య ఖుర్’ఆన్ లోని సూరాలు (అధ్యాయాలు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించబడినాయి. అయితే అవతరణ జరుగుతున్నపుడు అవి ఎక్కడ వేరవుతాయి, వాటి చివరలు ఏమిటీ అనే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియదు. ‘బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం’ అవతరిస్తే అపుడు వారికి తెలిసేది అంతకు ముందు సూరా ముగిసినది అని, కొత్త సూరహ్ ప్రారంభమైనది అని.
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం – రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు : “(పాపంచిక జీవితములో) తన మనసును ఖుర్’ఆన్ పఠనములో లగ్నము చేసుకున్న వానితో (తీర్పు దినమున) ఇలా అనడం జరుగుతుంది “ఏవిధంగానైతే నీవు ప్రాపంచిక జీవితములో ఖుర్’ఆన్ ను హృద్యంగా పఠించే వానివో అలా పఠిస్తూ (స్వర్గములో ఉన్నత స్థానములను) అధిరోహిస్తూ ఉండు. ఎక్కడైతే నీవు ఆఖరి ఆయతును పఠిస్తావో అదే నీ గమ్యస్థానము అవుతుంది.
దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ప్రాపంచిక జీవితములో ఎవరైతే ఖుర్’ఆన్ ను పఠిస్తూ ఉంటాడో, అందులో ఉన్న దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటాడో, మరియు తాను పఠిస్తున్న దానికి, తాను కంఠస్థం చేసిన దానికి కట్టుబడి ఉంటాడో, అతడు స్వర్గములో ప్రవేశించిన తరువాత అతనితో ఇలా అనడం జరుగుతుంది “ఖుర్’ఆన్ ను పఠిస్తూ ఉండు మరియు స్వర్గములో ఉన్నత స్థానములను అధిరోహిస్తూ ఉండు. ప్రపంచములో ఏ విధంగానైతే నీవు హృద్యంగా పఠించేవాడివో, (పఠిస్తున్న దానిలో) ఏ విధంగానైతే పూర్తి భరోసా మరియు నమ్మకముతో పఠించే వానివో అలా పఠించు. నీవు పఠించే చివరి ఆయతే నీ నివాస స్థానము అవుతుంది.
అబీ అబ్దుర్రహ్మాన్ అస్’సులమీ రహిమహుల్లాహ్ ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలలో, ఎవరైతే మాకు ఖుర్’ఆన్ పారాయణము చేసినారో (ఎవరి వద్దనైతే మేము ఖుర్’ఆన్ నేర్చుకున్నామో) – వారు మాతో ఇలా పలికినారు – తాము ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి పది ఆయతులను వినే వారమని, వాటిలోని ఙ్ఞానమును పూర్తిగా నేర్చుకోనంత వరకు, మరియు (నేర్చుకున్న ఙ్ఞానాన్ని) నిజ జీవితములో అన్వయించుకోనంత వరకు మరొక పది ఆయతులకు వెళ్ళేవారము కాదు. వారు ఇంకా ఇలా అన్నారు – “ఆ విధంగా మేము ఙ్ఞానాన్ని, మరియు దాని అన్వయాన్ని కూడా నేర్చుకున్నాము”.
దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారుఈ హదీసు ద్వారా ఈ విషయాలు తెలుస్తున్నాయి : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలు వారి నుండి ఖుర్’ఆన్ లోని పది ఆయతులను గ్రహించేవారు. ఆ పది ఆయతులలో ఉన్న ఙ్ఞానాన్ని సంపూర్ణంగా గ్రహించేటంత వరకు, దానిని ఆచరణలోనికి తెచ్చేటంత వరకు మరో పది ఆయతుల వైపుకు వెళ్ళేవారు కాదు. ఆ విధంగా వారు ఙ్ఞానాన్ని మరియు ఆచరణను కూడా సాధించినారు.
ఉబయ్ ఇబ్న్ కా’బ్ రజియల్లాహు అన్హు ఉల్లెఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రశ్నించినారు: “ఓ అబుల్ ముందిర్! నీ దగ్గర ఉన్న అల్లాహ్ యొక్క దివ్య గ్రంథములో ఏ ఆయతు అన్నింటి కంటే అత్యంత గొప్పది మరియు ఘనమైనదో నీకు తెలుసా?” దానికి నేను “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునకు బాగా తెలియును” అన్నాను. అందుకు ఆయన తిరిగి “ఓ అబుల్ ముంజిర్! నీ దగ్గర ఉన్న అల్లాహ్ యొక్క దివ్య గ్రంథములో ఏ ఆయతు అన్నింటి కంటే అత్యంత గొప్పది మరియు ఘనమైనదో నీకు తెలుసా?” అని ప్రశ్నించినారు. అపుడు నేను “అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం” (సూరహ్ అల్ బఖరహ్ 2:255) (అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు) అని జవాబిచ్చాను. దానికి ఆయన నా గుండెలపై తట్టి “అల్లాహ్ ఙ్ఞానాన్ని నీ కొరకు ఆహ్లాదకరమైనదిగా చేయుగాక ఓ అబుల్ ముందిర్!” అన్నారు”.
దాన్ని ముస్లిం ఉల్లేఖించారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉబయ్ ఇబ్న్ కాబ్ రజియల్లాహు అన్హు ను, దివ్య ఖుర్’ఆన్ లో ఏ ఆయతు అన్నింటి కన్నా అత్యుత్తమమైనది మరియు ఘనమైనది? అని ప్రశ్నించినారు. దానికి ఆయన సమాధానం చెప్పడానికి మొదట తటపటాయించినా, చివరికి “అది ఆయతుల్ కుర్సీ - అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం” (సూరహ్ అల్ బఖరహ్ 2:255) (అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు) అని జవాబిచ్చారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఉబయ్ ఇబ్న్ కా’బ్ రజియల్లాహు అన్హు ఙ్ఞానవంతుడు అన్నట్లు, ఆయన చెప్పిన సమాధానాన్ని బలపరుస్తున్నట్లు ఆయన గుండెలపై తట్టినారు. తరువాత ఆయన ఙ్ఞానము చూసి తాను సంతోషపడినట్లు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉబయ్ ఇబ్న్ కా’బ్ రజియల్లాహు అన్హు కొరకు అల్లాహ్’తో దువా చేసినారు.
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ప్రతి రాత్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రకు ఉపక్రమించినపుడు తన రెండు అరచేతులను దగ్గరకు చేర్చి, వాటిలో ఊది, అల్ ఇఖ్లాస్, అల్ ఫలఖ్, అన్’నాస్ సూరాలను (ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలఖ్, మరియు ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్ సూరాలను) పఠించి, ఆ రెండు అరచేతులతో వీలైనంత మేర శరీర భాగాలను తుడుచుకునే వారు. తన తల, ముఖము, మరియు శరీరపు ముందు భాగము నుండి ప్రారంభించేవారు. అలా మూడు సార్లు చేసేవారు”.
దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారుఇది (ఉమ్మత్) కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కానుక. ఆయన రాత్రి నిద్రకు ఉపక్రమించినపుడు తన రెండు అర చేతులను, దువా చేయునపుడు దగ్గరికి చేర్చిన విధంగా దగ్గరకు చేర్చి, వాటిని కొద్దిగా పైకి ఎత్తి, వాటిలో తన నోటి నుండి కొద్దిగా తుంపరలు పడునట్లుగా నెమ్మదిగా ఊదేవారు. తరువాత మూడు సూరాలు (ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలఖ్, మరియు ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్ సూరాలను) పఠించి, తరువాత ఆ రెండు అరచేతులతో తన శరీరాన్ని అందినంత మేర తుడిచేవారు. తన తల, ముఖము మరియు శరీరపు ముందు భాగమునుండి మొదలు పెట్టే వారు. అలా మూడు సార్లు చేసేవారు.
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు {ఆయన (అల్లాహ్)యే నీపై (ఓ ము'హ మ్మద్!) ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ను) అవతరింప జేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ము'హ్కమాత్) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్) ఉన్నాయి కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను ఆపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటపడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ పరిపక్వ జ్ఞానం గలవారు: ''మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!'' అని అంటారు. జ్ఞానవంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు.} (సూరహ్ అల్ ఇమ్రాన్ 3:7). ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: “(ఆ ఆయతును పఠించిన) తరువాత ఆయన ఇలా అన్నారు: “ కనుక అస్పష్టమైన (ముతషాబిహాత్) ఆయతులను అనుసరించే వారిని గనుక నీవు చూసినట్లయితే, అటువంటి వారికి అల్లాహ్ ఒక పేరునిచ్చినాడు (హృదయాలలో వక్రత ఉన్నవారు అని). వారి పట్ల జాగ్రత్తగా ఉండు”.
ముత్తఫిఖ్ అలైహిరసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు:{ఆయన (అల్లాహ్)యే నీపై (ఓ ము'హ మ్మద్!) ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ను) అవతరింప జేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ము'హ్కమాత్) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్) ఉన్నాయి కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు, సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను అపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటపడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ పరిపక్వ జ్ఞానం గలవారు:''మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!'' అని అంటారు. జ్ఞాన వంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు.} (సూరహ్ అల్ ఇమ్రాన్ 3:7). ఇందులో అల్లాహ్ సుబ్’హానహూ వ త’ఆలా తానే తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దివ్య ఖుర్’ఆన్ ను అవతరింపజేసినాను అని అంటున్నాడు; అందులో విస్పష్టమైన ఆయతులు ఉన్నాయని, వాటిలోని ఆదేశాలు, మరియు నిబంధనలలో ఎటువంటి అస్పష్టత లేనివి అని అంటున్నాడు. అవి దివ్య గ్రంథానికి పునాది వంటివి, మరియు నిర్దేశకాల (reference) వంటివి (దిశా నిర్దేశము చేయునటువంటివి). ఆయతుల మధ్య అనంగీకార సందర్భాలలో ఇవి (సరియైన అర్థం వైపునకు) దిశా నిర్దేశము చేస్తాయి. అదే విధంగా దివ్య ఖుర్’ఆన్ లోని కొన్ని ఆయతులు ఒకటి కంటే ఎక్కువ అర్థాలనిచ్చే సంభావ్యత కలిగినవి ఉన్నాయి. కనుక అవి కొంతమంది ప్రజలను (వెంటనే అర్థం కాక) అస్పష్టతకు గురి చేయవచ్చు, లేక ఈ ఆయతుల మధ్య మరియు ఇతర ఆయతుల మధ్య సమన్వయం లేదు అనిపించవచ్చు. అటువంటి ఆయతుల పట్ల ప్రజలు ఏవిధంగా వ్యవహరిస్తారో అల్లాహ్ తెలియజేస్తున్నాడు. అటువంటి ఆయతుల సరియైన అర్థాన్ని తెలుసుకునే క్రమంలో కొందరు, పునాదుల వంటి ఆయతులను (సంప్రదించకుండా) వదిలి వేస్తారు. తమ అవగాహనకు దగ్గరగా ఉన్న అర్థాన్ని తీసుకుంటారు. ఆ విధంగా ప్రజలలో సందేహాలను రేకెత్తిస్తారు, వారిని అపమార్గం పట్టిస్తారు. అలాగే ఎవరైతే తమ ఙ్ఞానములో స్థిరంగా ఉంటారో, వారు ఈ (ఒకటి కంటే ఎక్కువ అర్థాలను ఇచ్చే) ఆయతులను గురించి ఎరుగుదురు. వారు పునాదుల వంటి ఆయతుల దిశా నిర్దేశములో వాటి అర్థాన్ని గ్రహిస్తారు, మరియు వాటిలో అస్పష్టతగానీ, సమన్వయలోపం గానే ఏమీ లేదని, అవి సర్వ శక్తిమంతుడూ, సర్వోత్కృష్టుడూ అయిన అల్లాహ్ తరఫునుండి అని విశ్వసిస్తారు. అయితే స్వాస్థ్యమేధస్సు గలవారు మాత్రమే దాని నుండి గ్రహిస్తారు మరియు నేర్చుకుంటారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసుల మాత (ఉమ్ముల్ మోమినీన్) ఆయిషా రజియల్లాహు అన్హా తో ఒకవేళ తను ఆ విధంగా దివ్య ఖుర్’ఆన్ లోని అస్పష్టమైన ఆయతుల వెంట పడేవారిని గనుక చూసినట్లైతే, వారిని గురించి అల్లాహ్ ఒక పేరునిచ్చినాడు (హృదయాలలో వక్రత ఉన్నవారు) అని, వారితో జాగ్రత్తగా ఉండమని అన్నారు, వారు చెప్పేది విన వద్దు అని అన్నారు.
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ఒక మనిషి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదురుగా కూర్చుని ఇలా అన్నాడు: “ఓ రసూలుల్లాహ్ ! సల్లల్లాహు అలైహి వసల్లం నా దగ్గ ఇద్దరు బానిసలు ఉన్నారు. వారు నాతో అబద్ధాలు ఆడతారు, నన్ను మోసం చేస్తారు, మరియు నా పట్ల అవిధేయతతో ప్రవర్తిస్తారు. అందుకని నేను వారిని తిట్టే వాడిని, కొట్టే వాడిని. మరి వారికి సంబంధించి (తీర్పు దినమున) నా విషయము ఏమిటి (ఏమి కానున్నది)? దానికి ఆయన ఇలా అన్నారు: “ నీవు వారిని శిక్షించుట, మరియు వారు నీతో అబధ్ధాలాడుట, నిన్ను మోసగించుట, నీకు అవిధేయులగుట – ఇవన్నీ తూచబడతాయి. నీ శిక్ష మరియు వారి పాపాలు సమానంగా ఉంటే, ఇద్దరూ సమానంగా పరిగణించబడతారు. అందులో నీ కొరకు ఏమీ లేదు వారికి వ్యతిరేకంగా కూడా ఏమీ ఉండదు. అలాగే నీ శిక్ష వారి పాపాల కంటే ఎక్కువ మోతాదులో ఉంటే, నీ పుణ్యాలలో నుండి కొన్నింటిని నీ నుండి తీసుకుని వారికి ఇవ్వబడతాయి. ఆ మనిషి అక్కడి నుండి లేచి (బయటకు) వెళ్ళిపోయాడు. అక్కడ గట్టిగా ఏడవసాగాడు, దు:ఖించసాగాడు. అది చూసి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనితో “అల్లాహ్ తన దివ్య గ్రంథములో (ఖుర్’ఆన్ లో) ఏమని అంటున్నాడో నీవు చదవాలి {మరియు పునరుత్థానదినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటు చేస్తాము, కావున ఏ వ్యక్తికి కూడా ఏ మాత్రం అన్యాయం జరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మ ఉన్నా మేము దానిని ముందుకు తెస్తాము. మరియు లెక్కచూడటానికి మేమే చాలు!} (సూరాహ్ అల్ అంబియా 21:47). అప్పుడు ఆ మనిషి ఇలా అన్నాడు: “అల్లాహ్ సాక్షిగా, ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! వారి నుంచి విడిపోవడమే వారిద్దరికీ మరియు నాకూ మంచి చేకూర్చే విషయం. మీరు సాక్ష్యంగా ఉండండి ఆ ఇద్దరు బానిసలను విముక్తి చేస్తున్నాను. ఇక నుండి వారిద్దరూ స్వతంత్రులు”.
దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారుఈ హదీసు ద్వారా మనకు ఈ విషయాలు తెలుస్తున్నాయి: ఒక మనిషి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి తన వద్ద నున్న ఇద్దరు బానిసలను గురించి ఫిర్యాదు చేస్తూ – వారు విషయాలకు సంబంధించి తనతో అబధ్ధాలాడుతారని, వారిని నమ్మితే నమ్మక ద్రోహం చేస్తారని, వ్యవహారాలలో మోసం చేస్తారని, మరియు తనపట్ల అవిధేయతతో ప్రవర్తిస్తారని, అందుకని వారిని సరిచేయడానికి తాను వారిని తిట్టే వాడినని, కొట్టే వాడినని చెప్పి; తీర్పు దినమున వారికి సంబంధించి తన పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వారి నమ్మక ద్రోహము, వారి అవిధేయత మరియు వారు నీతో అబధ్ధాలాడుట అన్నీ లెక్కలోనికి తీసుకోబడతాయి, అలాగే నీవు వారిని శిక్షించుట కూడా లెక్కలోనికి తీసుకోబడుతుంది. ఒకవేళ నీవు వారిని శిక్షించుట మరియు వారి పాపాలు సమానంగా ఉంటే, నీవు వారికి ఏమీ బాకీ ఉండవు. ఒకవేళ నీవు వారికి విధించిన శిక్ష వారి పాపాల కంటే తక్కువ ఉంటే, అది నీకొరకు ఒక వరం వంటిది. నీ పుణ్యాలలో (ప్రతిఫలములో) వృధ్ధి కలుగుతుంది. ఒకవేళ నీవు వారికి విధించిన శిక్ష వారి పాపాల కంటే ఎక్కువ ఉంటే, ఎంత ఎక్కువ ఉంటే దానికి సమానంగా నీ (పుణ్యాలలో) నుండి తీసుకోబడుతుంది మరియు వారికి ఇవ్వబడుతుంది”. అది విని ఆ మనిషి పక్కకు వెళ్ళి బిగ్గరగా ఏడవసాగాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో “అల్లాహ్ యొక్క దివ్య గ్రంథాన్ని (ఖుర్’ఆన్ ను) నీవు చదవలేదా? {మరియు పునరుత్థానదినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటుచేస్తాము, కావున ఏ వ్యక్తికి కూడా ఏ మాత్రం అన్యాయం జరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మ ఉన్నా మేము దానిని ముందుకు తెస్తాము. మరియు లెక్కచూడటానికి మేమే చాలు!} (సూరాహ్ అల్ అంబియా 21:47). పునరుథ్థాన దినమున ఏ ఒక్కరికీ ఎటువంటీ అన్యాయము జరుగదు. ప్రజల మధ్య ఏర్పరచబడిన త్రాసులు న్యాయంగా ఉంటాయి.” అన్నారు. అపుడు ఆ మనిషి “అల్లాహ్ సాక్షిగా ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ! వారి నుంచి విడిపోయి వారిని విడిచి పెట్టడమే వారిద్దరికీ మరియు నాకూ మంచి చేకూర్చే విషయం. మీరు సాక్ష్యంగా ఉండండి, అల్లాహ్ కొరకు మరియు తీర్పు దినము నాడు లెక్క తీసుకోబడుట మరియు శిక్షకు భయపడి ఆ ఇద్దరు బానిసలకు విముక్తిని కలిగిస్తున్నాను. వారిద్దరూ స్వతంత్రులు” అన్నాడు.
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ఆనాటి బహుదైవారాధకులలో ఎన్నో హత్యలు, మరెన్నో మానభంగాలకు పాల్బడిన, ఒక సమూహం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఇలా పలికినారు: “నిశ్చయంగా నీవు ఏమి చెబుతున్నావో అదీ, మరియు దేని వైపునకు ఆహ్వానిస్తున్నావో ఆ విషయమూ ఉత్తమమైనవి. మరి నిశ్చయంగా మేము చేసిన దానికి పరిహారము ఏమైనా ఉన్నదని నీవు మాకు తెలుప గలవా?” అపుడు (ఈ ఆయతు) అవతరించినది: “మరియు ఎవరైతే, అల్లాహ్తోపాటు ఇతర దైవాలను ఆరాధించరో, మరియు అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడా న్యాయానికి తప్ప చంపరో, మరియు వ్యభిచారానికి పాల్పడరో. మరియు ఈ విధంగా చేసేవాడు దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు. (సూరహ్ అల్ ఫుర్ఖాన్ 25:68). మరియు ఈ ఆయతు అవతరించినది: "ఇలా ప్రకటించు: "స్వయంగా మీకు (మీ ఆత్మలకు) మీరే అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయన, కేవలం ఆయనే క్షమాశీలుడు, అపార కరుణాప్రధాత." (సూరహ్ అజ్-జుమర్ 39:53)
ముత్తఫిఖ్ అలైహికొంతమంది బహుదైవారాధకులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చారు. వారు (అప్పటికే) అనేక హత్యలకు, మరెన్నో మానభంగాలకు పాల్బడి ఉన్నారు. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నారు: “ఇస్లాంకు సంబంధించి మరియు దాని బోధనలకు సంబంధించి నీవు చెబుతున్నదీ, ఆహ్వానిస్తున్నదీ నిశ్చయంగా మంచి విషయం. అయితే బహుదైవారాధనలో మరియు ఘోరమైన పాపములలో (కబాఇర్ లలో) పడి ఉన్న మా పరిస్థితి ఏమిటి? దానికేమైనా పరిహారం ఉన్నదా?” అపుడు పైరెండు ఆయతులు అవతరించబడినాయి. వాటి ద్వారా అల్లాహ్ ఆ జనుల పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు, వారు అత్యంత ఘోరమైన పాపములలో మునిగి ఉన్నప్పటికీ. ఒకవేళ అలా జరిగి ఉండకపోయినట్లయితే (ఆ రెండు ఆయతులు అవరించకపోయి ఉన్నట్లయితే) వారు తమ అవిశ్వాసములో మరియు ధర్మవిరుధ్ధ కార్యములలో, ఘోరమైన పాపములకు పాల్బడుటలో ఇంకా ముందుకు సాగిపోయేవారు.