





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబూ మూసా అల్ అషారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ఖుర్’ఆన్ పఠిస్తూ ఉండండి. ఎవరి చేతిలోనైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలున్నాయో ఆయన సాక్షిగా (చెబుతున్నాను), తమ (కాళ్ళ) కు కట్టివేసిన తాళ్ళ బంధనాల నుండి తప్పించుకునే ఒంటెల మాదిరిగా, ఖుర్’ఆన్ మీ జ్ఞాపకం (మెమొరీ) లో నుండి జారిపోతుంది”.
ముత్తఫిఖ్ అలైహిఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ను కంఠస్థము చేయమని, అలా చేసి హృదయములో (జ్ఞాపకములో) భద్రపరుచుకున్న ఖుర్ఆన్ ను మరిచిపోకుండా ఉండుటకు గానూ దానిని క్రమం తప్పకుండా పఠిస్తూ ఉండాలని ఆదేశిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రమాణం చేసి మరీ ధృవీకరిస్తున్నారు – ఏవిధంగానైతే ముందరి కాళ్ళను తాడుతో కట్టి వేసి ఉన్న ఒంటె, ఆ బంధం వదులుకాగానే అతి వేగంగా పారిపోతుందో, ఆ విధంగా ఖుర్’ఆన్ కూడా (పఠిస్తూ ఉండకపోతే) హృదయం నుండి జారిపోతుంది. అతడు ఆ తాడును పట్టుకుని ఉంటే అది ఉండిపోతుంది, వదిలివేస్తే అది పారిపోతుంది, అంటే అతడు దానిని కోల్పోతాడు.
ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఉత్తములు ఎవరంటే, ఎవరైతే ఖుర్ఆన్ ను నేర్చుకుంటారో మరియు ఇతరులకు బోధిస్తారో”.
దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: విశ్వాసులలో ఉత్తములు మరియు అల్లాహ్ వద్ద ఉన్నత స్థానములు పొందు వారు ఎవరంటే, ఎవరైతే ఖుర్ఆన్ ను నేర్చుకుంటారో మరియు ఇతరులకు నేర్పిస్తారో (బోధిస్తారో) – అంటే, ఖుర్ఆన్ ను, దానిని పఠించే నియమాలను అనుసరించి పఠించడాన్ని, పఠించిన దానిని కంఠస్థము చేయడాన్ని, ఖుర్ఆన్ ను భావయుక్తంగా, మధురంగా పఠించడాన్ని, మరియు అందులోని ఆదేశాలను అవగాహన చేసుకోవడాన్ని, అలాగే దాని విశ్లేషణను నేర్చుకుంటాడో - అలాగే తాను నేర్చుకున్న ఖుర్ఆన్ శాస్త్రాలలో ఉన్న ఙ్ఞానాన్ని ఇతరులకు బోధిస్తాడో, అలాగే ఆ ఙ్ఞానము ప్రకారము ఆచరిస్తూ ఉంటాడో – అటువంటి వాడు ఉత్తముడు మరియు అల్లాహ్ వద్ద ఉన్నత స్థానమును పొందువాడు అవుతాడు.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ ఇళ్ళను స్మశానాలు గా మార్చకండి. నిశ్చయంగా ఏ ఇంటిలోనైతే సూరతుల్ బఖరహ్ పారాయణం చేయబడుతుందో ఆ ఇంటినుండి షైతాను పారిపోతాడు.”
దాన్ని ముస్లిం ఉల్లేఖించారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఇళ్ళలో నమాజు ఆచరించకుండా ఉండుటను, తద్వారా ఇళ్ళు స్మశానాల మాదిరిగా మారుటను నిషేధించినారు, ఎందుకంటే స్మశానలలో నమాజులు ఆచరించబడవు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఏ ఇంటిలోనైతే సూరతుల్ బఖరహ్ పారాయణం చేయబడుతుందో ఆ ఇంటి నుండి షైతాను పారిపోతాడు అని అన్నారు.
అబూ మస్’ఊద్ అల్ బద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ఎవరైతే రాత్రి వేళ (పడుకోబోయే ముందు) సూరతుల్ బఖరహ్ యొక్క చివరి రెండు ఆయతులు (వచనాలు) పఠిస్తాడో అది అతనికి సరిపోతుంది.”
ముత్తఫిఖ్ అలైహిఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైతే రాత్రి (నిద్రించడాని ముందు) సూరతుల్ బఖరహ్ యొక్క ఆఖరి రెండు ఆయతులు పఠిస్తాడో, అల్లాహ్ అతనికి కీడు నుంచి, మరియు అయిష్టమైన ప్రతి విషయము నుంచి సరిపోయేలా (రక్షణ) చేస్తాడు, అని తెలియజేస్తున్నారు. దీనిపై వ్యాఖ్యానిస్తూ కొంతమంది ఉలమా ఇలా అభిప్రాయపడ్డారు “సరిపోయేలా చేస్తాడు అంటే – ఆ రెండు ఆయతులను అతని రాత్రి నమాజు (తహజ్జుద్) కు సరిపోయేలా చేస్తాడు”; మరి కొంతమంది ఉలమా “(ఆరాత్రి అతడు చేయ దలచిన) ఇతర రకాల ఆరాధనలకు సరిపోయేలా చేస్తాడు అని అర్థము” అన్నారు; మరికొంతమంది ఉలమా “ఆ రెండు ఆయతులు, రాత్రి నమాజు కొరకు (ఖియాముల్లైల్) తక్కువలో తక్కువగా సరిపోయే ఆయతులు” అన్నారు. ఇంకా వేర్వేరు అభిప్రాయాలు, విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయితే, గమనించవలసిన విషయం ఏమిటంటే పైన తెలుపబడిన అభిప్రాయాలు అన్నీ కూడా సరియైనవే, విలువైనవే, ఎందుకంటే ఆ వాక్యము (సరిపోయేలా చేస్తాడు) పరిధిలోనికి ఇవన్నీ కూడా వస్తాయి.
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైనా అల్లాహ్ యొక్క గ్రంథము (ఖుర్’ఆన్) నుండి ఒక్క అక్షరం పఠించినా అతనికి ప్రతిఫలంగా ఒక పుణ్యము లభిస్తుంది. ప్రతి పుణ్యము తనను పోలిన పది పుణ్యాలను తీసుకు వస్తుంది. (కనుక) “అలిఫ్, లామ్, మీమ్” ను నేను ఒక అక్షరం అనడం లేదు. (అందులో) “అలిఫ్” ఒక అక్షరం, “లామ్” ఒక అక్షరం మరియు “మీమ్” ఒక అక్షరం.” (అంటే దివ్య ఖుర్’ఆన్ గ్రంథము నుండి ఎవరైనా “అలిఫ్, లామ్, మీమ్” అని పఠిస్తే వారికి ప్రతి అక్షరానికి పది పుణ్యాలు లభిస్తాయిఅని అర్థము).
దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – అల్లాహ్ గ్రంథము (ఖుర్’ఆన్) నుండి ఒక్క అక్షరమైనా పఠించిన ప్రతి ముస్లిం ఒక (సత్కార్యాన్ని చేసిన) పుణ్యాన్ని పొందుతాడు, అంతేగాక అతనికి లభించిన ఆ ప్రతిఫలం పదింతలుగా ఎక్కువ చేయబడుతుంది – అని తెలియజేస్తున్నారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనిని ఇలా వివరించినారు (“అలిఫ్, లామ్, మీమ్” లను నేను ఒక అక్షరం అనడం లేదు. (అందులో) “అలిఫ్” ఒక అక్షరం, “లామ్” ఒక అక్షరం మరియు “మీమ్” ఒక అక్షరం.”) “అంటే ఇవి మూడు అక్షరాలు, వీటిలో ముప్ఫై పుణ్యాలున్నాయి”.
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నివేళలా అల్లాహ్’ను స్మరించేవారు.”
దాన్ని బుఖారీ ముఅల్లఖన్ బసీగతిల్ జజ్మి ఉల్లేఖించారుఆయిషా రజియల్లాహు అన్హా – విశ్వాసుల మాతృమూర్తి – ఇలా ఉల్లేఖిస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను స్మరించుటలో ఎక్కువ చురుకుగా, ఉత్సాహంగా, ఆసక్తి కలిగి ఉండేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అన్నివేళలా, అన్ని స్థితులలో మరియు ఏ ప్రదేశములో నైనా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండేవారు.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతుండగా విన్నానని అన్నారు :- “సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా ప్రకటించాడు: “నేను సలాహ్ ను (నమాజును) నాకూ మరియు నా దాసునికి మధ్య రెండు సమభాగాలుగా చేసినాను. మరియు నా దాసుని కొరకు అతడు అర్థించినది (తప్పక) ప్రసాదించబడుతుంది.” (తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు:) “(నమాజులో) దాసుడు “అల్-హందులిల్లాహి రబ్బిల్ ఆ’లమీన్” అని పలికినపుడు సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు “నా దాసుడు నన్ను కీర్తించినాడు”; అతడు “అర్రహ్మానిర్రహీం” అని పలికినపుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు “నా దాసుడు నన్ను పొగిడినాడు”; అతడు “మాలికి యౌమిద్దీన్” అని పలికినపుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు: “నా దాసుడు నన్ను మహిమ పరిచినాడు”; ఆయన ఇంకా ఇలా అంటాడు: “నా దాసుడు తన వ్యవహారాలన్నింటినీ నాకు అప్పగించినాడు”; దాసుడు “ఇయ్యాక న’బుదు, వ ఇయ్యాక నస్తఈన్” అని పలికినపుడు, ఆయన “ఇది నాకు, నా దాసునికి మధ్య నున్న విషయం, నా దాసుడు తాను అర్థించిన దానిని పొందుతాడు” అంటాడు, దాసుడు “ఇహ్’దినస్సిరాతల్ ముస్తఖీం, సిరాతల్లజీన అన్అమ్’త అలైహిం, ఘైరిల్ మఘ్’దూబి అలైహిం, వలద్దాల్లీన్” అని పలికినపుడు, అల్లాహ్ ఇలా అంటాడు “ఇది నా దాసుని కొరకు; నాదాసునికి అతడు అర్థించినది ప్రసాదించబడుతుంది.”
దాన్ని ముస్లిం ఉల్లేఖించారుఈ హదీసుల్ ఖుద్సీలో అల్లాహ్ ఇలా ప్రకటించాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినారు: ‘నేను సూరతుల్ ఫాతిహాను నాకు మరియు నా దాసునికి మధ్య రెండు సమభాగాలుగా చేసినాను, అందులో ఒక సగభాగము నా కొరకు, మరియు మరొక సగభాగము అతని కొరకు.” మొదటి సగభాగము: అల్లాహ్ యొక్క ఘనతను కీర్తించుట, ఆయనను మహిమపరుచుట. అందుకొరకు నేను అతనికి ప్రతిఫలములలో శుభప్రదమైన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాను. రెండవ సగభాగము: దుఆ అంటే మొరపెట్టుకొనుట. నేను అతని మొరను ఆలకిస్తాను మరియు అతడు అర్థించిన దానిని ప్రసాదిస్తాను. సలాహ్ ఆచరిస్తున్న వ్యక్తి “అల్’హందులిల్లాహి రబ్బిల్ ఆ’లమీన్” అని పలికినపుడు అల్లాహ్ “నా దాసుడు నన్ను కీర్తించినాడు” అని అంటాడు; ”; అతడు “అర్రహ్మానిర్రహీం” అని పలికినపుడు, అల్లాహ్ ఇలా అంటాడు “నా దాసుడు నన్ను పొగిడినాడు, మరియు సృష్ఠి మొత్తంపై ఉన్న నా అనుగ్రహాన్ని, కరుణను అతడు గుర్తించినాడు” అని అంటాడు; అతడు “మాలికి యౌమిద్దీన్” అని పలికినపుడు, అల్లాహ్ “నా దాసుడు నన్ను కొనియాడినాడు, మరియు అది ఒక గొప్ప గౌరవం” అంటాడు. దాసుడు “ఇయ్యాక న’బుదు, వ ఇయ్యాక నస్తఈన్” అని పలికినపుడు, అల్లాహ్ “ఇది నాకు, నా దాసునికి మధ్యనున్న విషయం” అంటాడు. ఈ ఆయతులో మొదటి సగభాగము (ఇయ్యాక న’బుదు – ‘మేము కేవలం నిన్నే (నిన్ను మాత్రమే) ఆరాధిస్తాము’) అల్లాహ్ కు చెందినది. ఇందులో ‘అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకు నిజమైన అర్హుడు’ అనే దాసుని ఒప్పుకోలు, మరియు దానికి జవాబుగా అతడు అల్లాహ్ ను ఆరాధించుట ఉన్నాయి – దానితో (సూరతుల్ ఫాతిహాలో) అల్లాహ్ కు చెందిన మొదటి సగభాము ముగుస్తుంది. ఈ ఆయతులో రెండవ సగభాగము – అది దాసునికి చెందినది: (ఇయ్యాక నస్తఈన్) ఇందులో అల్లాహ్ నుండి సహాయం కొరకు అర్థింపు ఉన్నది. మరియు అది అతనికి ప్రమాణం చేయబడింది. దాసుడు “ఇహ్’దినస్సిరాతల్ ముస్తఖీం*, సిరాతల్లజీన అన్అమ్’త అలైహిం, ఘైరిల్ మఘ్’దూబి అలైహిం, వలద్దాల్లీన్” అని పలికినపుడు, అల్లాహ్ ఇలా అంటాడు: “ఇది నా దాసుని దుఆ మరియు అతడు నాకు పెట్టుకునే మొర. అతడు అర్థించినది అతనికి ప్రసాదించబడుతుంది, మరియు నిశ్చయంగా అతడు అర్థించిన దానిని నేను ప్రసాదించాను.”
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “సూర్యుడు పడమర నుండి ఉదయించనంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు. సూర్యుడు పడమర నుండి ఉదయించి నపుడు ప్రజలు దానిని చూస్తారు. అపుడు ప్రజలందరూ (అల్లాహ్ ను) విశ్వసిస్తారు. అయితే, అది ఎటువంటి సమయమంటే – ‘పూర్వం విశ్వసించకుండా, ఆరోజున విశ్వసించిన వ్యక్తికీ లేదా విశ్వసించి కూడా ఏ పుణ్యాన్నీ సంపాదించుకోని వ్యక్తికీ, తన విశ్వాసం వల్ల (ఆ రోజు) ఏ ప్రయోజనం చేకూరదు’ (సూరహ్ అల్ అన్’ఆమ్ 6:158). ప్రళయ ఘడియ స్థాపించ బడినపుడు, (అది ఎంత హఠాత్తుగా వచ్చి పడుతుందంటే), (కూర్చోవడానికి) తమ మధ్య ఒక వస్త్రాన్ని పరుచుకుంటున్న ఇద్దరు వ్యక్తులు దానిని పూర్తిగా పరచలేరు, మరియు దానిని మడత పెట్టనూ లేరు; ప్రళయ ఘడియ ఎంత హఠాత్తుగా వచ్చి పడుతుందంటే, త్రాగడానికి చేతిలో ఒంటె పాల గ్లాసును పట్టుకుని ఉన్న వ్యక్తి దానిని త్రాగలేడు, తన పశువులు నీరు త్రాగడానికి గుంటను త్రవ్వుతున్న వ్యక్తి దానిని పూర్తి చేయలేడు; ప్రళయ ఘడియ ఎంత హఠాత్తుగా వచ్చి పడుతుందంటే, మీలో ఒకరి చేతిలో ఉన్న అన్నం ముద్ద నోటి వరకూ కూడా చేరదు (అంత హఠాత్తుగా వచ్చి పడుతుంది అని అర్థం).
ముత్తఫిఖ్ అలైహిఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయ ఘడియ సంభవించే నిదర్శనాలలోని పెద్ద నిదర్శనాలను గురించి తెలియ జేస్తున్నారు – ఆ పెద్ద నిదర్శనాలలో ఒకటి సూర్యుడు తూర్పు నుండి గాక పడమర నుండి ఉదయించడం. సూర్యుడు పడమట నుండి ఉదయించడం చూసినపుడు ప్రజలందరూ (అల్లాహ్’ను) విశ్వసిస్తారు. (ప్రళయ ఘడియ నిదర్శనాలు ప్రస్ఫుటమైన) ఆ సమయాన (అల్లాహ్ ను) విశ్వసించుట, లేదా సత్కార్యములు చేయుట, లేదా తాను చేసిన చెడు పనులకు, పాపకార్యాలకు పశ్చాత్తాప పడుట ఒక అవిశ్వాసికి ఏ విధంగానూ ప్రయోజనం చేకూర్చదు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయ ఘడియ హఠాత్తుగా వచ్చి పడుతుందని తెలియ జేసారు. ఎంత హఠాత్తుగా వచ్చి పడుతుందంటే, ప్రజలు లేచి తమ తమ దైనందిన కార్యాలలో భాగంగా చేస్తున్న పనులను కూడా పూర్తి చేయలేకపోతారు. (తమ చేతిలో ఉన్న పనిని సైతమూ పూర్తి చేయలేరు). ప్రళయ ఘడియ ఎలా సంభవిస్తుందంటే, వస్త్రాలను అమ్మేవాడూ, కొనే వాడూ, తమ మధ్య వస్త్రాలను పరచనూ లేరు, పరిచి ఉన్న వస్త్రాలను మడత పెట్టనూ లేరు. తన ఆడ ఒంటె నుండి అప్పుడే పితికిన పాలను ఆ వ్యక్తి త్రాగను కూడా త్రాగలేడు (అంత హఠాత్తుగా సంభవిస్తుంది ప్రళయ ఘడియ). నీటి తొట్టెను తయారు చేస్తున్న వ్యక్తి, దానిని పూర్తి చేయనూ లేడు. చేతిలో అన్నం ముద్ద పట్టుకుని ఉన్న వ్యక్తి నోటి వరకు ఆ అన్నం ముద్ద చేరను కూడా చేరదు (అంత హఠాత్తుగా సంభవిస్తుంది ప్రళయ ఘడియ).
అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(తీర్పు దినమున) మృత్యువు నల్లని తల, తెల్లని శరీరం కలిగిన ఒక గొర్రెపోతు రూపంలో తీసుకు రాబడుతుంది. అపుడు పిలుపునిచ్చు వాడొకడు ఎలుగెత్తి “ఓ స్వర్గవాసులారా!” అని పిలుపునిస్తాడు. అపుడు వారు తమ మెడలను సారించి అతని వైపునకు జాగ్రత్తగా చూస్తారు. అతడు “ఇదేమిటో మీకు తెలుసా?” అని వారిని అడుగుతాడు. దానికి వారు “తెలుసు, అది మృత్యువు” అంటారు, ఎందుకంటే, నిశ్చయంగా దానిని వారు ముందే చూసి ఉన్నారు కనుక. అపుడు తిరిగి పిలుపు ఇవ్వబడుతుంది “ఓ నరకవాసులారా!”. దానితో వారు తమ మెడలను సారించి అతని వైపునకు జాగ్రత్తగా చూస్తారు. అతడు “ఇదేమిటో మీకు తెలుసా?” అని వారిని అడుగుతాడు. దానికి వారు “తెలుసు, అది మృత్యువు” అంటారు, ఎందుకంటే, నిశ్చయంగా దానిని వారు ముందే చూసి ఉన్నారు కనుక. అపుడు దానిని (గొర్రెపోతు రూపములో ఉన్న మృత్యువును) జిబహ్ చేయుట జరుగుతుంది. అపుడు ఆ పిలిచేవాడు ఇలా అంటాడు “ఓ స్వర్గవాసులారా! మీకు ఇది (స్వర్గము) శాశ్వతము, మరియు (మీకు) మృత్యువు లేదు; ఓ నరకవాసులారా! మీకు ఇది (నరకము) శాశ్వతము, మరియు మీకు మృత్యువు లేదు.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు “ {وَأَنْذِرْهُمْ يَوْمَ الحَسْرَةِ إِذْ قُضِيَ الأَمْرُ وَهُمْ فِي غَفْلَةٍ} (సూరహ్ మర్యం:39) (మరియు వారిని (రాబోయే) ఆ పశ్చాత్తాప పడవలసిన దినాన్ని గురించి హెచ్చరించు. అప్పుడు పరిణామం నిర్ణయించబడి ఉంటుంది. (ఇప్పుడైతే) వారు ఏమరుపాటులో పడి ఉన్నారు....”) అని ఇంతవరకు పఠించి “(అవును) ఈ ప్రాపంచిక జీవితములో పడి కొట్టుకు పోతున్నవారు ఏమరపాటులో పడి ఉన్నారు” అన్నారు. తరువాత ఆ ఆయతు చివరి భాగము (وَهُمْ لاَ يُؤْمِنُونَ) (కావున వారు విశ్వసించడం లేదు) (సూరహ్ మర్యం:39) పఠించి పూర్తి చేసినారు.
ముత్తఫిఖ్ అలైహిఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – తీర్పు దినము నాడు మృత్యువు ఒక గొర్రెపోతు రూపములో ముందుకు తీసుకు రాబడుతుంది అని, అది నలుపు, తెలుపు రంగులలో ఉంటుంది – అని తెలియ జేస్తున్నారు. అపుడు “ఓ స్వర్గవాసులారా!” అను ఎలుగెత్తి పిలువ బడుతుంది. వారు తమ తలలు పైకెత్తి, మెడలను సారించి అటువైపునకు చూస్తారు. (ఆ పిలిచిన వాడు మృత్యువును చూపిస్తూ) “ఇదేమిటో మీకు తెలుసా?” అని ప్రశ్నిస్తాడు. దానికి వారు “అవును, తెలుసు, అది మృత్యువు” అంటారు, ఎందుకంటే వారు అందరూ దానిని (అంతకు ముందు) చూసినవారే, దానిని ఎరిగినవారే. అపుడు ఆ పిలిచేవాడు “ఓ నరకవాసులారా!” అని పిలుస్తాడు. వారు తమ తలలు పైకెత్తి, మెడలను సారించి అటువైపునకు చూస్తారు. అతడు “ఇదేమిటో మీకు తెలుసా?” అని ప్రశ్నిస్తాడు. దానికి వారు “అవును, తెలుసు, అది మృత్యువు” అంటారు, ఎందుకంటే వారు అందరూ దానిని (అంతకు ముందు) చూసినవారే, దానిని ఎరిగినవారే. అపుడు దానిని (మృత్యువును) జిబహ్ చేయడం జరుగుతుంది. ఆ పిలిచేవాడు ఎలుగెత్తి ఇలా అంటాడు “ఓ స్వర్గవాసులారా! ఇది (ఈ స్వర్గ నివాసము) మీకు శాశ్వతం, శాశ్వతం, మీకింక చావు లేదు; “ఓ నరకవాసులారా! ఇది (ఈ నరక నివాసము) మీకు శాశ్వతం, శాశ్వతం, మీకింక చావు లేదు”. ఇది స్వర్గ నివాసుల శుభాలలో (అల్లాహ్ తరఫు నుండి) అపారమైన వృద్ధి, అలాగే నరకవాసుల శిక్షలో అపారమైన కాఠిన్యాన్ని గురించి తెలుపు తున్నది. ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ నుండి ఆయతును పఠించినారు. “మరియు వారిని (రాబోయే) ఆ పశ్చాత్తాప పడవలసిన దినాన్ని గురించి హెచ్చరించు. అప్పుడు పరిణామం నిర్ణయించబడి ఉంటుంది. (ఇప్పుడైతే) వారు ఏమరుపాటులో పడి ఉన్నారు, కావున వారు విశ్వసించడం లేదు”. ఈ హదీసు ద్వారా – తీర్పు దినము నాడు (ప్రజలు వారి వారి కర్మలను అనుసరించి) స్వర్గవాసులు, నరకవాసులుగా విభజించబడతారు. ప్రతి ఒక్కరూ తమకు ప్రాప్తమైన దాని లోనికి శాశ్వతంగా ప్రవేశిస్తారు. (ఆ దినము) పాపకార్యములు చేసిన వాడు (తాను ఆ కార్యములకు పాల్బడకుండ ఉంటే ఎంత బాగుండును) అని పశ్చాత్తాప పడతాడు, సిగ్గు పడతాడు, కానీ అది ఏమీ అతనికి మంచిని కలుగ జేయదు, అతని శిక్షను ఏమీ తగ్గించదు.