Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way






























Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను అల్లాహ్ వద్ద పశ్చాత్తాపపడాలని మరియు తరుచుగా ఆయన క్షమాపణను కోరుకోవాలని ఆజ్ఞాపించారు. తన గత మరియు భవిష్యత్ పొరపాట్లు క్షమించబడినప్పటికీ, తాను ప్రతిరోజు వందకు పైగా అల్లాహ్ వద్ద పశ్చాత్తాపపడుతున్నానని మరియు ఆయన క్షమాపణను కోరుతున్నానని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తనకు తానుగా తెలియజేస్తున్నారు. ఇది అల్లాహ్ కు పరిపూర్ణ విధేయత మరియు దాస్యాన్ని సూచిస్తుంది.
ప్రవక్త ముహమ్మద్ ﷺ ఒక ముస్లిం పురుషుడు తాను ధరించే ఇజార్ (అంటే, నడుము క్రింది భాగాన్ని కప్పే వస్త్రం) కు సంబంధించిన మూడు స్థితులను స్పష్టంగా వివరించారు: మొదటిది: ఇజార్ను కాలిపిక్కల మధ్య వరకు ధరించడం ఉత్తమం; అయితే అది కాలిమడమల కంటే దిగువకు జారకూడదు. రెండవది: అనుమతించదగినది (అయితే అహంకారంతో కాకూడదు) - అది కాలిమడమ ఎముక వరకు ఉండే పొడువైన ఇజార్. మూడవది: నిషేధించబడిన స్థాయి - అంటే ఇజార్ వస్త్రం కాలిమడమ (చీలమండలం) కంటే దిగువన జారి, నేలను తాకుతూ ఉండటం. ఇటువంటి వ్యక్తి నరక అగ్నికి భయపడాలి. మరియు ఎవరైతే గర్వంతో, దురహంకారంతో ఇలా చేస్తారో, అల్లాహ్ ప్రళయ దినాన అతని వైపు చూడడు.
కలహాలు, గందరగోళం, పరస్పర హత్యలు ఎక్కువగా ఉన్న కాలంలో కూడా ఎవరు ఆరాధనలను పట్టుదలగా నిరంతరం కొనసాగిస్తూ ఉంటారో, వారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద మక్కా విజయానికి ముందు హిజ్రత్ చేసినవారి స్థానం లభిస్తుంది. అశాంతి, ఫిత్నా (కలహాలు), హత్యలు, మరియు ప్రజల వ్యవహారాలు గందరగోళంగా ఉన్న కాలంలో ఆరాధనలో నిబద్ధంగా ఉండాలని, దాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం సూచించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద అలాంటి సమయంలో కూడా ఆరాధన కొనసాగించినందుకు లభించే పుణ్యం, హిజ్రత్ (వలస) చేసిన వారి పుణ్యంతో సమానం. ఎందుకంటే, అటువంటి కష్టకాలంలో ప్రజలు ఆరాధనను మర్చిపోయి, ఇతర విషయాలలో మునిగి పోతారు, అతి కొద్దిమంది మాత్రమే ఆరాధనకు సమయం కేటాయిస్తారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: ముస్లిం వ్యక్తి అల్లాహ్ను పాపానికి సంబంధించినది (ఉదా: ఏదైనా పాపపు పనిని సులభం చేయమని కోరడం, దుర్మార్గపు పనిలో సహాయం చేయమని అడగడం) లేదా బంధుత్వాన్ని తెంచే విధంగా (ఉదా: తన పిల్లలపై లేదా బంధువులపై శపించడం) కాకుండా ఏదైనా (మంచి విషయం కొరకు) దుఆ చేస్తే, అల్లాహ్ ఆ దుఆకు బదులుగా ఈ మూడింటిలో ఒకదాన్ని ప్రసాదిస్తాడు: అల్లాహ్ అతని దుఆను వెంటనే నెరవేర్చవచ్చు మరియు అతను కోరినదాన్ని వెంటనే అతనికి ప్రసాదించవచ్చు. లేదా, అల్లాహ్ ఆ దుఆలో వేడుకున్న దానిని ప్రసాదించడంలో ఆలస్యంగా చేస్తాడు - దాని ప్రతిఫలాన్ని పరలోకంలో అతనికి ఇస్తాడు, ఇది అతని స్థాయిని (స్థాయిని) పెంచేందుకు లేదా అతనిపై దయగా లేదా అతని పాపాల పరిహారంగా మారుతుంది. లేదా, ఆ దుఆ పరిమాణానికి అనుగుణంగా, అల్లాహ్ ఈ ప్రపంచంలో అతనిపై వచ్చే కష్టాన్ని తొలగించవచ్చు. అప్పుడు సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగారు: "అయితే, మేము ఎక్కువగా దుఆ చేస్తాము, ఎందుకంటే ఈ మూడు గొప్ప లాభాల్లో ఏదో ఒకటి మాకు లభిస్తుంది కదా?" దానికి ఆయన సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా పలికినారు: "అల్లాహ్ వద్ద ఉన్నది మీరు అడిగే దాని కంటే ఎంతో ఎక్కువ, ఎంతో గొప్పది. ఆయన దానం ఎన్నటికీ తరుగదు, ఎన్నటికీ సమాప్తి కాదు."
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రమైన బాధ, కష్ట సమయాలలో ఇలా పలికేవారు: "అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు." అంటే, నిజానికి, ఒక్క అల్లాహ్ మాత్రమే ఆరాధనలకు అర్హుడు; "ఆయన మహోన్నతుడు" అంటే, ఆయన స్థితిలో, లక్షణాలలో, కార్యాలలో గొప్పతనాన్ని కలిగి ఉన్నవాడు; "అత్యంత సహనశీలుడు" అంటే, పాపి చేసిన తప్పులకు వెంటనే శిక్షించడు; ఆయన ఎంతో శక్తి కలిగి ఉన్నా, అతడిని క్షమించవచ్చు లేదా ఆలస్యంగా శిక్షించవచ్చు. ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు. "అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయన మహా సింహాసనానికి అధిపతి" అంటే, ఆయన మహా సింహాసనాన్ని సృష్టించినాడు; "అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు, ఆయనే ఆకాశాలకు ప్రభువు మరియు భూమికి ప్రభువు" అంటే, ఆయన వాటిని సృష్టించినాడు, వాటిలో ఉన్న ప్రతిదానికీ అధిపతి, నిర్వహణదారుడు, పాలకుడు ఆయనే తనకు తోచిన విధంగా వాటిని నియంత్రిస్తాడు; "ఘనమైన సింహాసన అధిపతి" అంటే, ఆయన మహా సింహాసనాన్ని సృష్టించినాడు.
ప్రవక్త ﷺ ఇలా ఉపదేశించారు: ఎవరైనా అలసట లేదా కడుపు నిండా భుజించుట వంటి కారణాల వలన ఆవలిస్తే, తన చేతిని నోటిపై అడ్డంగా పెట్టి, దాన్ని మూసుకోవాలి. ఎందుకంటే, నోటిని తెరిచి ఉంచితే షైతాన్ అందులో ప్రవేశిస్తాడు. కాబట్టి, చేతిని నోటిపై పెట్టడం ద్వారా షైతాన్ నోటి లోపలికి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలు తమ కంటే స్థితి, సంపద, గౌరవం వంటి విషయాల్లో తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూడాలని, తమ కంటే పై స్థాయిలో ఉన్నవారిని లేదా ప్రపంచ విషయాల్లో మెరుగ్గా ఉన్నవారిని చూడకూడదని ఆదేశించారు. ఇలా చేయడం వలన, మనం అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలను తక్కువగా భావించకుండా ఉంటాము. అసంతృప్తి, అసూయ లాంటి భావనలు దూరమవుతాయి, మనలో కృతజ్ఞత, తృప్తి పెరుగుతుంది. (దీని ద్వారా ముస్లింలు అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహాన్ని గుర్తించి, దాన్ని చిన్నగా చూడకుండా, కృతజ్ఞతతో జీవించగలుగుతారు.)
ప్రవక్త ﷺ ఇలా హెచ్చరించారు: క్రింది వస్త్రాన్ని లేదా ఇజార్ను (దుస్తులు) కాళ్ల మడమలకు (కీళ్ళకు) దిగువగా, అహంకారం మరియు గర్వంతో (అభిమానంతో) జార విడవడం నుండి జాగ్రత్త పడాలి. ఎవరైతే అలా చేస్తారో, అలాంటి వారు తీర్పుదినం నాడు అల్లాహ్ యొక్క దయా దృష్టిని పొందే అర్హతను కోల్పోతారు. అంటే, అల్లాహ్ వారిని క్షమించడు, వారిపై దయ చూపడు.
అల్లాహ్ మనిషికి ఇచ్చిన రెండు గొప్ప అనుగ్రహాల గురించి ప్రవక్త ﷺ ఇలా తెలిపినారు - అవి: ఆరోగ్యం మరియు తీరిక సమయం. చాలామంది ఈ రెండింటి విషయంలో నష్టపోతారు, ఎందుకంటే అవి ఉన్నప్పుడు వాటిని సరిగ్గా ఉపయోగించరు, వృథా చేస్తారు. ఒక మనిషికి ఆరోగ్యం కూడా ఉంది, ఖాళీ సమయం కూడా ఉంది, కానీ అతడు అల్లాహ్ ఆజ్ఞలకు విధేయత చూపకుండా, ఆలస్యంగా, అలసత్వంతో సమయాన్ని వృథా చేస్తే — అతడు నష్టపోయినవాడు అవుతాడు. చాలా మంది పరిస్థితి ఇలానే ఉంటుంది. కానీ, ఎవరు తమ ఆరోగ్యాన్ని, ఖాళీ సమయాన్ని అల్లాహ్ ఆజ్ఞలకు లోబడి, ఆయన విధేయతలో, మంచిపనుల్లో వినియోగిస్తారో — వారే నిజంగా లాభం పొందేవారు. ఈ ప్రపంచం పరలోక పంటను సాగు చేయడానికి ఉపయోగపడే ఒక పంటభూమి. ఇక్కడ చేసే మంచిపనుల లాభం పరలోకంలో కనిపిస్తుంది. ఖాళీ సమయం తర్వాత పనిలో నిమగ్నమైపోతారు అంటే బిజీ అయిపోతారు, ఆరోగ్యం తర్వాత అనారోగ్యం వస్తుంది, చివరికి వృద్ధాప్యం అయినా సరే, ఆరోగ్యం కోల్పోతారు.