





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త ముహమ్మద్ ﷺ తన సజ్దాలో ఇలా ప్రార్థించేవారు: "అల్లాహ్మ్మగ్ఫిర్లీ దంబీ కుల్లహు;దిఖ్ఖహు వజిల్లహు; వ అవ్వలుహు, వ ఆఖిరహు; వ అలానియ్యతహు, వ సిర్రహు. (ఓ అల్లాహ్! నా మొత్తం పాపాలను క్షమించు — అవి చిన్నవైనా, పెద్దవైనా, మొదటివైనా, చివరివైనా, ప్రత్యక్షంగా చేసినవైనా, రహస్యంగా చేసినవైనా."
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సజ్దాలో దుఆ చేస్తూ ఇలా పలికేవారు: "(అల్లాహహుమ్మగ్ఫిర్లీ దంబీ) అంటే ఓ అల్లాహ్! నా పాపాలను క్షమించు" అని అర్థం: నా పాపాలను దాచిపెట్టు (ఈ ప్రపంచంలోనూ మరియు పరలోకంలోనూ), వాటి ప్రభావం నుండి నన్ను రక్షించు, వాటిని పూర్తిగా మాఫీ చేయి, నన్ను క్షమించు, నాపై దయ జూపు; (కుల్లహు) "అన్నీ" అంటే: చిన్నవి, తక్కువ సంఖ్యలో ఉన్నవి (దిక్కహ్ = చిన్నవి, తక్కువవి); పెద్దవి, ఎక్కువ సంఖ్యలో ఉన్నవి (వజిల్లహు = పెద్దవి, ఎక్కువవి); (أوله وآخره) మొదటి పాపం నుండి చివరి పాపం వరకు, మధ్యలో ఉన్నవన్నీ; (علانيته وسره) బహిరంగంగా జరిగినవి అయినా, రహస్యంగా జరిగినవి అయినా (ఎవరూ చూడని చోట) అవి నీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియవు; నీవు పరమ పవిత్రుడవు.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా తాను విన్నానని, అబూ దర్దాఅ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినారు: నిశ్చయంగా, శాపాలు పెట్టేవారు ప్రళయదినాన సాక్షులుగా గానీ, మధ్యవర్తులుగా గానీ ఉండరు.
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: 'ఎవరైతే అమాయకులపై తరుచుగా శాపాలు పెడతారో, వారు రెండు శిక్షలకు పాత్రులవుతారు. మొదటి శిక్ష: ప్రళయ దినాన అతడు ప్రవక్తలు, సందేశహరులు తమ తమ జాతులకు దైవసందేశాలను అందజేసారని సాక్ష్యం ఇచ్చే అర్హత కోల్పోతాడు. అంతేగాక, అతడి దుష్టత్వం వలన ఇహలోకంలోనూ అతడి సాక్ష్యం అంగీకరించబడదు. అలాగే అతడికి 'షహాదత్' (అల్లాహ్ మార్గంలో ధర్మయుద్ధం చేస్తూ మరణించే భాగ్యం) లభించదు. రెండవ శిక్ష: ప్రళయ దినాన విశ్వాసులు (ముస్లింలు) నరకానికి అర్హులైన తమ సోదరుల కొరకు మధ్యవర్తన చేసే సమయంలో, ఈ శపించే వ్యక్తి (లాఅిన్) ఎవరికీ మధ్యవర్తన చేయడానికి అనుమతించబడడు.
సల్మాన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: నిశ్చయంగా మీ ప్రభువు బిడియపరుడు, ఉదారుడు. తన దాసుడు తన వైపు చేతులెత్తి అర్థించినప్పుడు, ఆయన వాటిని ఖాళీగా వాపసు చేయడానికి బిడియ పడతాడు.
అబూ దావూద్, అత్తిర్మిదీ మరియు ఇబ్నెమాజహ్ నమోదు చేసినారు:ప్రవక్త ముహమ్మద్ ﷺ మనం దుఆ (ప్రార్థన) చేసేటప్పుడు చేతులు పైకి ఎత్తాలని ప్రోత్సహించారు. పరమ పవిత్రుడైన అల్లాహ్ చాలా సిగ్గు గలవాడు అంటే బిడియపడేవాడు (హయీ), ఆయన తన దాసులకు ప్రసాదించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు, దాసుడికి ఆనందం కలిగించే దానిని అతడికి ప్రసాదిస్తాడు, అతడి కొరకు హానికరమైన దానిని అతడికి దూరంగా ఉంచుతాడు. అల్లాహ్ చాలా దయగలవాడు (కరీమ్), ఆయన అడగకపోయినా ఇస్తాడు, అయితే అడిగినప్పుడు మరింత అధికంగా ఇస్తాడు! అల్లాహ్ తనను విశ్వసించే దాసుడు దుఆ కోసం చేతులు పైకి ఎత్తినప్పుడు, ఆ చేతులను ఖాళీగా, నిరాశతో వాపసు చేయడాన్ని సిగ్గుగా భావిస్తాడు.
ఉమ్ముల్ ముమినీన్ జువైరియహ్ రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె ఇంటి నుండి తెల్లవారుఝామున (ఫజర్ నమాజ్ తర్వాత) బయటికి వెళ్లారు. ఆమె తన నమాజు స్థలంలోనే కూర్చుండి పోయారు (అల్లాహ్ యొక్క ధ్యానం చేసుకుంటూ ఉండి పోయారు). తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుహా నమాజు సమయంలో తిరిగి వచ్చారు. ఆమె ఇంకా అక్కడే కూర్చుని ఉన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు: "నేను నిన్ను వదిలి వెళ్లినప్పటి నుంచీ నువ్వు ఇంకా ఇదే స్థితిలో ఉన్నావా?" ఆమె చెప్పింది: "అవును." అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: "నేను నిన్ను వదిలి వెళ్లిన తర్వాత నేను నాలుగు పదాలను మూడుసార్లు స్మరించినాను. నువ్వు ఈ రోజు చేసిన దిక్ర్తో పోలిస్తే, అవి తూకంలో బరువుగా ఉంటాయి: అవి 'సుబహానల్లాహి వ బిహమ్'దిహి, అదద ఖల్కిహి, వ రిదా నఫ్సిహి, వ జీనత అర్షిహి, వ మిదాద కలిమాతిహి' (అర్థం: అల్లాహ్ పరమ పవిత్రుడు మరియు సకల స్తోత్రములు, కృతజ్ఞతలు ఆయనకే శోభిస్తాయి - ఆయన సృష్టిరాశుల సంఖ్య మేరకు, ఆయన సంతృప్తి మేరకు, ఆయన అర్ష్ సింహాసనం యొక్క బరువు మేరకు, లెక్కించనలవికాని ఆయన వచనాల మేరకు)."
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన భార్య, ఉమ్ముల్ ముమినీన్ జువైరీయా (రదియల్లాహు అన్హా) వద్ద నుండి ఉదయం పూట (ఫజ్ర్ నమాజ్ తర్వాత) బయటికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె నమాజు చేసిన స్థలంలోనే కూర్చుని అల్లాహ్ యొక్క ధ్యానం చేస్తూ ఉన్నారు. బాగా పొద్దెక్కిన తర్వాత, (చాష్త్ సమయంలో) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి వచ్చారు. ఆమె ఇంకా అదే స్థలంలో కూర్చుని ఉండటం చూసి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో ఇలా అన్నారు: "నేను నిన్ను వదిలి వెళ్లినప్పటి నుంచీ నీవు ఇంకా ఇలాగే కూర్చుని ఉన్నావా?" దానికి ఆమె "అవును" అని సమాధానము ఇచ్చినారు. అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో ఇలా పలికినారు: నేను నిన్ను వదిలి వెళ్లిన తర్వాత నాలుగు పదాలను మూడుసార్లు పలికాను. వాటి ప్రతిఫలం ఎంత గొప్పది అంటే, నీవు ఈ సమయం మొత్తం కూర్చుని చేసిన దిక్ర్తో పోలిస్తే, ఈ నాలుగు పదాలు తూకంలో ఎక్కువ బరువుగా ఉంటాయి: (సుబహానల్లాహ్) — అల్లాహ్ను అన్ని లోపాల నుండి పరమ పవిత్రుడిగా ప్రకటించడం; (వ బిహమ్'దిహి) — సకల స్తుతులు, కృతజ్ఞతలు అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి; మనకు ఈ జిక్ర్ చేయాలని మార్గనిర్దేశం చేసినందుకు కూడా ఆయనకు కృతజ్ఞత; (అదద ఖల్కిహి) — అల్లాహ్ సృష్టించిన ప్రతి దాని (దైవదూతలు, జిన్నులు, మానువులు, పశుపక్ష్యాదులు, వృక్షాలు మొదలైనవి) సంఖ్య మేరకు — ఆ సంఖ్య కేవలం అల్లాహ్ మాత్రమే తెలుసు; (వ రిదా నఫ్సిహి) — అల్లాహ్ తన దాసులపై సంతృప్తి చెందేంత వరకూ — అది ఎంత గొప్పదో, ఎంతఅపరిమితమైనదో మనం ఊహించలేం; (వ జీనత అర్షిహి) — అల్లాహ్ సింహాసనం (అర్ష్) బరువు మేరకు — అది అల్లాహ్ సృష్టిలో అత్యంత గొప్పదిగా, అత్యంత భారంగా ఉంటుంది; (వ మిదాద కలిమాతిహి) — అల్లాహ్ యొక్క అనంతమైన వచనాల మేరకు — అల్లాహ్ యొక్క వచనాలు, ఆయన జ్ఞానం, ఆయన ఆజ్ఞలు ఎన్నటికీ ముగియవు, అవి లెక్కించలేనివి. ఈ వివరణలోని మొత్తం మూడు భాగాలను ఈ జిక్ర్ కలిగి ఉంది: మొదట "అదద ఖల్కిహి" ద్వారా లెక్కించగలిగిన పరిమితిని (సంఖ్యను) సూచించబడింది. తర్వాత "రిదా నఫ్సిహి" ద్వారా పరిమితి లేని సంతృప్తిని (గుణాన్ని) సూచించబడింది. ఆపై "జీనత అర్షిహి" ద్వారా అతి గొప్పదైన, భారమైన సృష్టిని (బరువును) సూచించబడింది. చివరగా "మిదాద కలిమాతిహి" ద్వారా అల్లాహ్ వచనాలకు, ఆయన జ్ఞానానికి అంతం లేదని, అవి లెక్కించలేనివని తెలియజేయబడింది.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఎవరైనా ఒక సభలో కూర్చుని, ఆ సభలో అల్లాహ్ను స్మరించకపోతే మరియు తమ ప్రవక్తపై దురూద్ పంపకపోతే, అది వారి మీద బాధగా (పాపంగా, నష్టంగా) అవుతుంది. అల్లాహ్ తన ఇష్ట ప్రకారం వారిని శిక్షించవచ్చు లేదా క్షమించవచ్చు.
అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అన్నసాయీ కుబరాలో నమోదు చేసినారు:అల్లాహ్ స్మరణ (జిక్ర్) ను నిర్లక్ష్యం చేయకూడదని ప్రవక్త ﷺ హెచ్చరించారు. ఎవరైనా ఒక సమూహంగా సభలో కూర్చుని, ఆ సభలో అల్లాహ్ను స్మరించకపోతే మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దురూద్ పంపకపోతే — ఆ సభ (సమావేశం) ప్రళయదినం నాడు వారి కొరకు బాధగా, పశ్చాత్తాపంగా, నష్టంగా, లోటుగా మారుతుంది. అల్లాహ్ కు ఇష్టమైతే, వారి గత పాపాల వల్ల, వారు చేసిన తప్పుల వల్ల వారిని శిక్షించవచ్చు. లేదా ఆయన తన అనుగ్రహం, దయ, కరుణల వలన వారిని క్షమించవచ్చు.
జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: నిశ్చయంగా మీలో నాకు ప్రియమైన వారు,ప్రళయ దినాన నాకు దగ్గరగా కూర్చుంటారు,వారుఎవరంటే ‘ప్రవర్తన రీత్యా ,ఉత్తమ నడవడిక కలవారే’ మీలో నాకు నచ్చని వారు అసహ్యపరులు,పరలోకదినాన నాకు అత్యంత దూరంగా కూర్చుంటారు వారుఎవరంటే ‘ఎక్కువగా నోటి దూల కలిగి ఆలోచన లేకుండా మాట్లాడేవారు మరియు నోటి దురుసు కలిగినవారు,"ముతఫైహిఖూన’అంటే ఏమిటి అని అడిగారు దానికి ప్రవక్త ‘గర్వాన్ని ప్రదర్శించేవారు అని బదులిచ్చారు
అత్తిర్మిదీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీలో మంచి ప్రవర్తన గలవారే ఈ ప్రపంచంలో ఆయనకు అత్యంత ప్రియమైనవారు మరియు తీర్పు దినాన ఆయనకు అత్యంత సన్నిహితులు అని తెలియజేశారు. మీలో చెడు ప్రవర్తన గలవారే ఈ ప్రపంచంలో ఆయన అత్యంత అసహ్యించుకునేవారు మరియు తీర్పు దినాన ఆయనకు అత్యంత దూరంగా ఉండేవారు అని కూడా ఆయన పేర్కొన్నారు; అథ్'థర్'థారూన్ అనే అరబీ పదానికి అర్థం - అతిగా మరియు అనవసరంగా మాట్లాడేవారు, సత్యం నుండి తప్పుకునేవారు; అల్ ముతషద్దిఖూన్ అనే అరబీ పదానికి అర్థం - ఇతరులను ఆకట్టుకోవడానికి లేదా జాగ్రత్తగా, నిశితంగా పరిశీలించకుండా వారి మాటలు మరింత ముఖ్యమైనవిగా అనిపించేలా తమ మాటలను అతిశయోక్తి చేసేవారు. మరియు (ముతఫైహిఖూన్) గురించి; వారు ఇలా అడిగినారు: ఓ రసూలుల్లాహ్! అతిగా మాట్లాడేవారు ఎవరో మరియు ఆడంబరాలు, గొప్పలు చెప్పుకునేవారు ఎవరో మాకు అర్థమైంది, కానీ ముతఫైహిఖూన్ లు అంటే ఎవరు? దానికి ఆయన ఇలా జవాబిచ్చారు: వారు ఇతరులను ఎగతాళి చేస్తూ, వారిని హీనంగా చూస్తూ, అహంకారంతో మాట్లాడేవారు మరియు అహంకారులు.
అబ్దుల్లాహ్ బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరు ఇస్లాంను అంగీకరించారో, తగినంత జీవనాధారం పొందారో, మరియు అల్లాహ్ తనకు ఇచ్చిన దానితో సంతృప్తి చెందారో, నిశ్చయంగా అతను విజయవంతుడయ్యాడు."
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా ఇలా చెప్పినారు: "ఎవరైతే తన ప్రభువు (అల్లాహ్)కు సమర్పించుకుని, ఆయన ద్వారా ఇస్లాం మార్గాన్ని పొందుతాడో, అతని అవసరాలకు సరిపడే హలాల్ జీవనోపాధి పొందుతాడో, (అధికంగానూ కాదు, తక్కువగానూ కాదు — అవసరానికి సరిపడేంత మాత్రమే), అల్లాహ్ అతనికి ప్రసాదించిన దానితో అతను సంతృప్తిగా, ఆనందంగా ఉంటాడో - అతడే నిజమైన విజేత, విజయాన్ని సాధించినవాడు."
ఉబైదుల్లాహ్ బిన్ మిహ్సన్ అల్-అన్సారీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "మీలో ఎవరైతే ఉదయం లేచినప్పుడు ఆరోగ్యంగా, తన ఇంట్లో సురక్షితంగా, ఆ రోజుకి సరిపడా ఆహారం కలిగి ఉంటారో, అతనికి ఈ ప్రపంచమంతా ప్రసాదించబడినట్లే."
అత్తిర్మిదీ మరియు ఇబ్నె మాజహ్ నమోదు చేసినారు:ఓ ముస్లింలారా! మీలో ఎవరైనా, ఉదయం లేచినపుడు, ఆరోగ్యంగా, అనారోగ్యం లేకుండా ఉంటాడో; తనలో, తన కుటుంబంలో, తనపై ఆధారపడినవారిలో, తన మార్గంలో సురక్షితంగా, భయపడకుండా ఉంటాడో; ఆ రోజుకు సరిపడా న్యాయబద్ధమైన ఆహారం కలిగి ఉంటాడో, ప్రపంచం మొత్తం అతని కోసం సమకూర్చబడినట్లుగా ఉంటుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టం చేసినారు.
ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: రసూలుల్లాహ్ ﷺ సంక్షిప్తంగాను, విస్తృత అర్థంతోనూ ఉండే దుఆలు (ప్రార్థనలు) చేయడం ఇష్టపడేవారు.
అబూదావూద్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త ﷺ ఈ లోకంలోను, పరలోకంలోను మంచి కోరే సంక్షిప్తమైన, విస్తృతమైన అర్థంతో అర్థించే దుఆలను ఇష్టపడేవారు. ఈ దుఆలలో అల్లాహ్ యొక్క స్తుతి (ప్రశంస), మరియు మంచి ప్రయోజనాలకు సంబంధించిన అభ్యర్థనలు ఉండేవి. ప్రయోజనం లేని, సుదీర్ఘమైన దుఆలను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వదిలేసేవారు.