





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఒక వస్తువును అమ్మేందుకు అల్లాహ్ పై ప్రమాణం చేయడం అనేది తాత్కాలిక ఫలితాన్ని ఇస్తుంది, కానీ అది అసలు లాభాన్ని నాశనం చేస్తుంది.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త ముహమ్మద్ ﷺ వ్యాపార లావాదేవీలలో ప్రమాణాలు చేయడాన్ని మరియు వాటిని మరీ తరచుగా చేయడాన్ని గురించి హెచ్చరించారు — ఎలాంటి ఒత్తిడి లేకుండా, నిజాయితీపరంగా ఆ వ్యాపార లావాదేవీ జరుగుతున్నా సరే. ఎందుకంటే అవి వస్తువు అమ్మకానికి సహాయపడవచ్చు, కానీ ఆ లాభంలోని శుభాలను హరించి వేస్తుంది, సంపద నశించడం మొదలవుతుంది. ప్రవక్త ﷺ హెచ్చరిక: దాని వలన మహోన్నతుడైన అల్లాహ్ మానవుడి ధనాన్ని ఇలాంటి కొన్ని మార్గాల్లో నశింపజేస్తాడు — ఉదాహరణకు: దొంగతనం, అగ్నిప్రమాదం, నీళ్ళలో మునిగి పోవడం, బలవంతంగా లాక్కోబడటం, దోపిడి, లేదా ఇతర అనూహ్యమైన ఆపత్తులు (అపాయాలు, దుర్ఘటనలు). ఇవన్నీ అల్లాహ్ యొక్క అనుగ్రహాలు కోల్పోయినప్పుడు కలిగే ఫలితాలు.
ఉబయ్యి బిన్ కఅబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "గాలిని దూషించకండి (తిట్టకండి). మీకు ఇష్టము లేని గాలి (ఉదాహరణకు — బలమైన తుఫాను, గాలి దుమారము వంటిది) చూస్తే, ఇలా వేడుకోండి: ‘ఓ అల్లాహ్! ఈ గాలిలో ఉన్న మంచి కోసం, అది తీసుకొచ్చే మంచి కోసం, మరియు ఈ గాలి ద్వారా ఆజ్ఞాపించబడిన మంచి కోసం మేము నిన్ను వేడు కుంటున్నాము. ఈ గాలిలో ఉన్న దుష్టత (చెడుల) నుండి, అది తీసుకొచ్చే చెడు నుండి, మరియు ఈ గాలి ద్వారా ఆజ్ఞాపించబడిన చెడు నుండి మేము నీ శరణు వేడు కుంటున్నాము.
అత్తిర్మిదీ నమోదు చేసినారు:ప్రవక్త ﷺ గాలిని తిట్టకూడదనీ, శపించకూడదనీ వారించారు. ఎందుకంటే గాలి అనేది దానిని సృష్టించిన అల్లాహ్ తఆలా ఆజ్ఞకు లోబడిన ఒక సృష్టి. అది ప్రేమతో కూడిన (రహ్మత్) వర్షాన్ని తీసుకు రాగలదు, లేదంటే శిక్ష (అజాబ్) ను కూడా తీసుకు రాగలదు. గాలిని తిట్టడం అంటే – దాన్ని సృష్టించిన అల్లాహ్ ను తిట్టడమే, మరియు విధిపై (అల్లాహ్ నిర్ణయంపై) అసంతృప్తి చూపడమే అవుతుంది. దీనికి బదులుగా ప్రవక్త ﷺ మనలను ఇలా నేర్పించారు: గాలిలో ఉన్న మంచి కోసం, అది తీసుకు రాబోయే మంచి కోసం, మరియు దానికి అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞ వలన కలిగే మేలు కోసం — అల్లాహ్ ను వేడుకోవాలి, దుఆ చేయాలి. ఉదాహరణకు, వర్షాలు కురిసేలా చేయడం, పూల మధ్య పరాగసంపర్కం కలిగించడం, పొలాలకు జీవం తీసుకురావడం. అలాగే, ఆ గాలి ద్వారా కలిగే చెడు నుండి, ముప్పు నుండి, నష్టాల నుండి అల్లాహ్ వద్ద రక్షణ కోరాలి. ఉదాహరణకు, చెట్లు, పంటలు నాశనం కావడం, పశువులు మృత్యువాత పడటం, ఇల్లు, భవనాలు కూలిపోవడం మొదలైనవి. ఇలాంటి దుఆ దానిని మారుస్తుంది, మన మనసులోని అసంతృప్తిని అల్లాహ్ పై తౌహీద్ జ్ఞానం దూరం చేస్తుంది.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "మీలో ఎవ్వరూ ఇలా పలకవద్దు: ‘ఓ అల్లాహ్! నీ ఇష్టం ఉంటే నన్ను క్షమించు, నీకు ఇష్టం ఉంటే నా మీద కరుణ చూపు, నీకు ఇష్టం ఉంటే నాకు అన్నపానీయాలు (రిజ్క్) ఇవ్వు’ అని. బదులుగా, తన కోరికను కోరడంలో దృఢంగా అడగాలి. నిజంగా, అల్లాహ్ తాను కోరినదాన్ని చేస్తాడు, ఆయనను ఎవరూ బలవంతం చేయలేరు (ఆయన తన పని గురించి ఎవరితోనూ ఇబ్బంది పడడు)." ఇమామ్ ముస్లిం రహిమహుల్లాహ్ నమోదు చేసిన హదీథులో ఇలా ఉన్నది: "కానీ, (దుఆ చేసే వ్యక్తి) ధృఢంగా అడగాలి (దృఢ సంకల్పంతో అడగాలి), మరియు అల్లాహ్ నుండి ఆశించే తాపత్రయాన్ని (తీవ్రమైన కోరికను) గట్టిగా భావించాలి, ఎందుకంటే అల్లాహ్ కోసం ఏదీ పెద్దది కాదు – ఆయన ఏదైనా ఇవ్వడం అనేది ఆయనకు కష్టంగా అనిపించదు."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు"తన దువాను ఏదైనా విషయానికి షరతుగా పెట్టి (అంటే: 'అల్లాహ్! నీవు ఇష్టపడితే నన్ను క్షమించు' అంటూ) అడగడం నుండి వారించారు— 'అల్లాహ్ యొక్క ఇష్టం ఉంటే' అనే పదాలతో సహా. ఎందుకంటే నిజానికి, నిశ్చయంగా అల్లాహ్ తన ఇష్టానికి అనుగుణంగా మాత్రమే క్షమిస్తాడు. కానీ ఇక్కడ “నీకు ఇష్టమైతే” అనే పదాన్ని వాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ విధమైన షరతులు (అంటే కండిషన్లు, ఒకవేళ అని అనే పదాలు) ఎవరికైనా ఏదైనా చేయడం తన చేతిలో ఉన్నా, వారు బలవంతంగా లేదా అక్కడికక్కడ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తులకు మాత్రమే వర్తిస్తాయి. అల్లాహ్ అయితే అలాంటి వాటి నునండి ఎంతో పవిత్రుడు — ఆయనపై ఎవరూ ఎలాంటి ఒత్తిడీ లేదా బలవంతమూ చేయలేరు. ఇది హదీథు చివరలో స్పష్టం చేయబడింది. అలాగే: అల్లాహ్ ఏదైనా ఇవ్వదలిస్తే, అది ఆయనకు పెద్ద విషయం ఏమీ కాదు — ఆయన బలహీనుడు కాదు, అలసిపోయే వాడు కాదు, ఎందుకంటే ఆయనకు ఏదీ కష్టం కాదు. అందువల్ల “నీవు ఇష్టపడితే ఇవ్వు” అని చెప్పడం, ఒక విధంగా నీ అనుగ్రహం నాకు అవసరం లేదు అని చెప్పడమే అవుతుంది. ఉదాహరణకి, ఎప్పుడు మనం ఎవరితోనైనా “మీకు ఇష్టమైతే ఇది ఇవ్వండి” అని చెబుతాము? అతనికి అది అవసరం లేనప్పుడు, లేదా అతను ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు (బలహీనుడైతే) కదా. కానీ అల్లాహ్ అన్ని విషయాల్లో శక్తిశాలి – మనం ఆయనకు అత్యంత అవసరమైనవారు. కావున, దుఆను అనిగ్రహంగా, అవసరంతో, నిరుపాయం చేత్తో అడగాలి — గర్వాన్ని విడిచి పెట్టి, దృఢమైన నమ్మకంతో: “ఓ అల్లాహ్! నన్ను క్షమించు, ఓ అల్లాహ్! నాపై దయచూపు” అని పేదవాడిలా, అవసరమున్నవాడిలా అడగాలి. అల్లాహ్ అన్నిటి కన్నా స్వయం సంపూర్ణుడు. ఆయన అన్ని విషయాలలో శక్తివంతుడు!"
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: నా ప్రస్తావన అతడి ముందుకు వచ్చినప్పుడు, నాపై దరుద్ పంపని వ్యక్తి ముక్కు మట్టి కొట్టుకు పోవుగాక! అతడు రమదాన్ నెలలో ప్రవేశించిన తరువాత, తను క్షమించబడకుండానే అది గడిచి పోయిన వ్యక్తి ముక్కుమీద మట్టి కొట్టుకు పోవుగాక! అతడి తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరుకున్నా, వారు అతడిని స్వర్గంలో ప్రవేశింపజేయకపోతే (వారికి సేవలు చేయడం ద్వారా పుణ్యాలు సంపాదించి స్వర్గంలో ప్రవేశం పొందలేకపోయిన), ఆ వ్యక్తి ముక్కు మట్టి కొట్టుకు పోవుగాక!
అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:పరాభవం, అవమానం, నష్టానికి గురయ్యే మూడు రకాల వ్యక్తులకు వ్యతిరేకంగా వారి ముక్కు మట్టి కొట్టుకు పోవాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ చేసినారు (అంటే అవమానించబడుగాక). మొదటి రకం వ్యక్తి: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పేరు తన సమక్షంలో ప్రస్తావించబడినప్పుడు, అతడు ఆయనపై దరూద్ పంపని వాడు అంటే కనీసం సల్లల్లాహు అలైహి వసల్లం అని అయినా పలకని వాడు. రెండవ రకం వ్యక్తి: రమదాన్ నెలను పొంది, ఆపై అల్లాహ్ ఆజ్ఞల ప్రకారం రమదాన్ మాసంలోని ప్రత్యేక ఆరాధనలలో పాల్గొనడం ద్వారా అల్లాహ్ యొక్క క్షమాపణ పొందే అవకాశం ఉన్నా, దాని సద్వినియోగం చేసుకోకుండానే ఆ నెలను పోగొట్టుకున్న వ్యక్తి. మూడవ రకం వ్యక్తి: తన తల్లిదండ్రులు వృద్ధాప్యాన్ని చేరుకున్నప్పటికీ, అతను వారి హక్కులను సరిగ్గా పూర్తి చేయకుండా, వారికి అవిధేయత చూపినందున మరియు వారిని ఉపేక్షించినందున, వారు స్వర్గంలో ప్రవేశింపజేయలేకపోయిన వ్యక్తి.
అల్ బరఅ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఇద్దరు ముస్లింలు కలుసుకుని పరస్పరం కరచాలనం చేసిన తరువాత, వారు విడిపోయి (తమ తమ దారిలో) వెళ్ళే లోగా వారి పాపాలు క్షమించబడతాయి.
అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించినారు, ఇద్దరు ముస్లింలు రోడ్డు మీద లేదా వేరే ఇతర చోట కలుస్తే, వారిలో ఒకడు మరొకరిని సలాం తెలుపుతూ చేతులు కలిపితే, వారు విడిపోయేలోగా (తమ తమ మార్గాల్లో వెళ్ళేందుకు విడి పోయే లోగా లేదా తమ తమ చేతులు వెనక్కు తీసుకునే లోగా), ఉభయుల పాపాలు క్షమించబడతాయి.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలకడం విన్నాను అని అబ్దుల్లాహ్ బిన్ అమర్ బిన్ అల్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించినారు. నిశ్ఛయంగా ఆదము సంతానం (మానవుల) హృదయాలన్నీ ఆ దయామయుడి (అల్లాహ్) రెండు వేళ్ల మధ్యలో ఒకే ఒక్క హృదయంలా ఉంటాయి. ఆయన తన ఇష్టం ప్రకారం వాటిని తిప్పుతాడు." తర్వాత అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రార్థించారు: "అల్లాహుమ్మ ముసర్రిఫ్ అల్-ఖులూబ్ సర్రిఫ్ ఖులూబనా అలా తా’అతిక్ (ఓ అల్లాహ్! హృదయాలను తిప్పేవాడా, మా హృదయాలను నీ విధేయత వైపు మళ్లించు).
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఇలా తెలిపినారు: ఆదము సంతతి (మానవుల) హృదయాలన్నీ దయామయుడైన అర్రహ్మాన్ (అల్లాహ్) యొక్క రెండు వేళ్ల మధ్యలో ఒక్క హృదయంలా ఉంటాయి. ఆయన తన ఇష్టం ప్రకారం వాటిని తిప్పుతాడు. ఆయన తలుచుకుంటే దానిని సత్యమార్గంపై నిలుపుతాడు; లేదా తప్పుదారిలో విడిచి పెట్టేస్తాడు. హృదయాలన్నింటినీ నడిపించడం ఆయనకు ఒక్క హృదయాన్ని నడిపించడమంత సులభం. ఏ ఒక్క పని కూడా మరో పనికి ఆయన వద్ద అడ్డు తగలదు." తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రార్థించారు: "అల్లాహుమ్మ ముసర్రిఫల్-ఖులూబ్! (హృదయాలను తిప్పేవాడా!) కొన్నిసార్లు ఆజ్ఞాపాలన చేసేలా, కొన్నిసార్లు అవిధేయతకు పాల్బడేలా, కొన్నిసార్లు జ్ఞాపకం ఉంచుకునేలా, మరికొన్నిసార్లు మరచిపోయేలా హృదయాలను తిప్పే నీవు, మా హృదయాలను నీ ఆజ్ఞపాలన వైపు మాత్రమే తిప్పు."
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలకగా తాను విన్నానని అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినారు: అల్లాహ్ ఆ వ్యక్తి ముఖాన్ని ప్రకాశవంతం చేయుగాక, ఎవరైతే మా నుండి ఏదైనా విని, అది అలాగే (ఏ మార్పు లేకుండా) ఇతరులకు చేరవేస్తాడో! ఎందుకంటే బహుశా అది ఎవరికి తెలియజేయబడిందో అతను వినిపించినవారి కంటే ఎక్కువ బుద్ధిమంతుడు కావచ్చు.
అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా దుఆ చేశారు: 'ఎవరైతే నా మాటలు విని, వాటిని గట్టిగా గుర్తుంచుకుని ఇతరులకు చేరవేస్తాడో, అల్లాహ్ అతనికి ఇహలోకంలో తేజస్సు, ఆనందం మరియు అందాన్ని ప్రసాదించుగాక! మరియు పరలోకంలో స్వర్గం యొక్క తేజస్సు, సుఖాలు మరియు ప్రకాశాన్ని అనుగ్రహించుగాక!' ఎందుకంటే, సందేశాన్ని అందుకున్న వ్యక్తి (శిష్యుడు), దాన్ని తెలియజేసిన వ్యక్తి (గురువు) కంటే ఎక్కువ గ్రహించే శక్తి, వివేకం మరియు అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉండవచ్చు. ఇదే విధంగా, మొదటి వ్యక్తి (గురువు) సరిగ్గా గుర్తుంచుకుని అందించడంలో నిష్ణాతుడైతే, రెండవ వ్యక్తి (శిష్యుడు) ఆలోచించి తార్కికంగా అర్థం చేసుకోవడంలో నిష్ణాతుడు కావచ్చు."
అబూ మూసా రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: «నిశ్చయంగా స్వర్గంలో విశ్వాసి కొరకు ఒకే ఒక ముత్యంతో చేసిన, అరవై మైళ్ల పొడవు ఉన్న ఓ గుడారం ఉంటుంది. అందులో ఆ విశ్వాసి కుటుంబ సభ్యులు ఉంటారు. విశ్వాసి వారి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, కానీ (గుడారం విశాలం వలన) ఒకరినొకరు చూడలేరు.»
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గపు సుఖభోగాల గురించి తెలియజేశారు. స్వర్గంలో విశ్వాసికి ఒక్క పెద్ద, విశాలమైన గుడారం ఉంటుంది. ఇది ఒకే ఒక పెద్ద ముత్యంతో తయారు చేయబడి, లోపల ఖాళీగా ఉంటుంది. దీని వెడల్పు, పొడవు ఆకాశంలో అరవై మైళ్లు ఉంటుంది. దీని నాలుగు మూలల్లోని ప్రతి భాగంలో భార్యలు ఉంటారు. వారు (గుడారం విశాలం వలన) ఒకరినొకరు చూడలేరు. విశ్వాసి వారి మధ్య తిరుగుతూ ఉంటాడు.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "పరమ పరిశుద్ధుడు మరియు మహిమాన్వితుడైన అల్లాహ్ ప్రకటన: 'నేను నా నీతిమంతులైన దాసుల కొరకు అంతకు ముందెన్నడూ ఎవరి కళ్లూ చూడని, ఎవరి చెవులూ వినని, ఎవరి హృదయాలూ ఊహించని వాటిని సిద్ధం చేసి ఉంచాను.' అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) అన్నారు: 'మీరు కోరితే ఈ ఆయతును పఠించండి: {ఏ ప్రాణికీ తన కొరకు దాచిపెట్టబడిన కంటి చల్లదనం (సుఖసంతోషాలు) ఏమిటో తెలియదు.} (సూరత్ అస్సజ్దా: 17)'"
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుమహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: "నీతిమంతులైన నా బానిసల కోసం నేను స్వర్గంలో ఎటువంటి గొప్ప గౌరవాన్ని, సన్మానాన్ని సిద్ధం చేశానంటే, దాని స్వరూపాన్ని ఎవరి కళ్ళూ చూడలేదు, ఎవరి చెవులూ వినలేదు, ఎవరి హృదయాలూ ఊహించలేదు." అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఇలా పలికినారు: "మీరు కోరితే ఈ ఆయత్ని పఠించండి": {فَلَا تَعْلَمُ نَفْسٌ مَّآ أُخْفِىَ لَهُم مِّن قُرَّةِ أَعْيُنٍۢ} "ఏ ప్రాణికీ తన కోసం దాచిపెట్టబడిన కంటి చల్లదనం (సుఖసంతోషాలు) ఏమిటో తెలియదు." [అస్సజదహ్:17]