





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబూ అబ్దుల్లాహ్ అల్ జదలియ్యి రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వభావం, గుణగణాల గురించి ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హును ప్రశ్నించగా, ఆమె ఇలా సమాధానము ఇచ్చినారు: "ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసభ్యంగా మాట్లాడేవారు కాదు, అసభ్యంగా ప్రవర్తించేవారు కాదు, సంతల్లో (బజార్లలో) గొడవపడి అరవేవారు కాదు, తనకు చెడు చేసినవారికి చెడుతో ప్రతిస్పందించేవారు కాదు, కానీ ఆయన క్షమించేవారు, మన్నించేవారు."
అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్వభావం గురించి ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా చెప్పినారు, "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వభావంలో అసభ్యత, అశ్లీలత ఉండేది కాదు. ఆయన మాటల్లో, పనుల్లో అసభ్యత, దుర్వినియోగం, ఆడంబరత ఉండేది కాదు. ఆయన ఎన్నడూ అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించేవారు కాదు. అంతే కాదు, సంతల్లో (బజార్లలో) బిగ్గరగా, గొడవగా అరిచేవారు కాదు. తనకు చెడు చేసినవారికి చెడుతో ప్రతిస్పందించేవారు కాదు; కాని మంచితోనే ప్రతిస్పందించేవారు. తన హృదయంలోనూ క్షమించేవారు, బయట కూడా మన్నించేవారు, అలాంటి (చెడు చేసిన) వారిని పట్టించు కోకుండా దూరంగా ఉండేవారు."
అల్లాహ్ పట్ల ఉథ్మాన్ రదియల్లాహు అన్హు భయభక్తుల గురించి హానీ మౌలా ఉథ్మాన్ రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖన: "ఉథ్మాన్ రదియల్లాహు అన్హు ఒక సమాధి దగ్గర నిలబడి, ఎంత ఎక్కువగా ఏడ్చినారంటే, (కన్నీళ్ళకు) ఆయన గడ్డం కూడా తడిసిపోయింది. అది చూసి వారిని ఇలా అడిగినారు: 'మీరు స్వర్గం, నరకం గురించి విన్నప్పుడు అంతగా ఏడవరు, కాని సమాధిని చూసి మాత్రం ఏడుస్తున్నారు?' దానికి ఉథ్మాన్ రదియల్లాహు అన్హు ఇలా చెప్పారు: 'ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికి ఉన్నారు: "నిశ్చయంగా సమాధి పరలోక ప్రయాణంలోని మెట్టు. ఇక్కడ (అల్లాహ్ శిక్ష నుండి) రక్షించబడితే, తర్వాతి దశలు సులభంగా ఉంటాయి. ఇక్కడ రక్షించబడకపోతే, తర్వాతి దశలు చాలా కఠినంగా ఉంటాయి."
అత్తిర్మిదీ మరియు ఇబ్నె మాజహ్ నమోదు చేసినారు:అమీరుల్ ముమినీన్ ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రదియల్లాహు అన్హు ఒకవేళ సమాధి దగ్గర ఆగినట్లయితే, ఆయన ఎంతో ఏడ్చేవారు. కన్నీళ్లు అంత ఎక్కువగా కారడం వలన ఆయన గడ్డ కూడా తడిసిపోయేది. దానికి అక్కడి వారిలో కొందరు ఆయనను ఇలా అడిగారు: "మీరు స్వర్గం గురించి లేదా నరకం గురించి విన్నప్పుడు, (స్వర్గశుభాల సంతోషంతో) ఆనంద భాష్పాలు రాల్చడమో, లేదా నరక భయంతో ఏడవడమో చేయరు! కానీ సమాధిని చూసి మాత్రం ఏడుస్తున్నారు?" అవుడు ఉథ్మాన్ రదియల్లాహు అన్హు సమాధి గురించి ఇలా చెప్పినారు: "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: 'సమాధి పరలోక ప్రయాణంలో మొదటి మెట్టు. ఇక్కడ (అల్లాహ్ శిక్ష నుండి) రక్షించబడితే, తర్వాతి దశలు సులభంగా ఉంటాయి. ఇక్కడ రక్షించబడకపోతే, తర్వాతి దశల్లో వచ్చే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి.'"
బహజ్ బిన్ హకీమ్ తన తండ్రి నుండి, అతను అతని తండ్రి నుండి (అంటే బహజ్ తాత నుండి)ఇలా ఉల్లేఖించినారు: నేను ఇలా అడిగాను: "ఓ రసూలుల్లాహ్! నేను ఎవరి పట్ల విధేయత చూపాలి?" దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చినారు: "నీ తల్లి, మళ్లీ నీ తల్లి, మళ్లీ నీ తల్లి, ఆ తర్వాత నీ తండ్రి, ఆ తర్వాత బంధుత్వంలోని సమీప బంధువులు..."
అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) స్పష్టంగా చెప్పారు: మనం విధేయత, దయ, మంచి ప్రవర్తన, స్నేహపూర్వక సహవాసం, బంధాలను ఉత్తమంగా కొనసాగించడంలో అత్యధిక అర్హత కలిగిన వ్యక్తి తల్లి. ఇతరులపై తల్లికి ఉన్న హక్కును ఆయన మూడు సార్లు పునరుద్ఘాటించడం ద్వారా, ఆమెకు ఉన్న గొప్ప స్థానం, ప్రత్యేకతను హైలైట్ చేశారు - ఇది మిగిలిన వారందరినీ మించిపోతుంది. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తల్లి తర్వాత ఎవరు ముఖ్యమో వివరించారు: "(తల్లి) తర్వాత తండ్రి, ఆ తర్వాత బంధుత్వంలో దగ్గర వారు, తదితరంగా." బంధుత్వంలో ఎవరు ఎంత దగ్గరగా ఉంటే, వారితో బంధాన్ని కొనసాగించడంలో వారికి అంత ఎక్కువ హక్కు ఉంటుందని ఆయన స్పష్టంగా చెప్పారు.
అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరైతే 'నేను అల్లాహ్ను నా ప్రభువుగా, ఇస్లాంను నా ధర్మంగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను నా ప్రవక్తగా స్వీకరించాను' అని పలుకుతారో, వారికి స్వర్గం నిశ్చయం."
అబూదావూద్ నమోదు చేసినారు:ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపినారు: "ఎవరైతే [నేను అల్లాహ్ను - నా ప్రభువుగా, ఆరాధ్యుడిగా, పోషకుడిగా, సర్వాధికారిగా, యజమానిగా, నన్ను సరిదిద్దేవాడిగా మనస్పూర్తిగా (రజా) అంగీకరిస్తున్నాను; ఇస్లాం ధర్మాన్ని — దాని అన్ని ఆజ్ఞలు, నిషేధాలతో సహా — నా ధర్మంగా, నా మార్గంగా, నా విశ్వాసంగా, సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను; అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను నా ప్రవక్తగా, సందేశహరుడిగా, ఆయన తెచ్చిన ప్రతీ విషయాన్ని, ప్రకటించిన ప్రతీ సందేశాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను'] అని హృదయపూర్వకంగా ఒప్పుకుంటారో, అతనికి తప్పకుండా స్వర్గం లభిస్తుంది."
ఉబాదా బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: (ఇతను బద్ర్ యుద్ధంలో పాల్గొన్నారు మరియు అఖ్బా రాత్రి ప్రమాణం చేసిన 12 మందిలో ఒకరు). రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, తన చుట్టూ కూర్చుని ఉన్న సహాబాలతో ఇలా ప్రమాణం తీసుకున్నారు: "మీరు నాతో ఈ విషయాలపై ప్రమాణం చేయండి: అల్లాహ్ కు ఎవరినీ భాగస్వాములుగా చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, మీ పిల్లలను చంపకూడదు, మీరు మీ చేతులతో, కాళ్లతో కలిపి కల్పించే అబద్ధాలను (బురదారోపణలు) చేయకూడదు, మంచి విషయాల్లో (మారూఫ్) నాకు అవిధేయత చేయకూడదు. మీరు ఈ ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటే, మీ ప్రతిఫలం అల్లాహ్ వద్ద ఉంటుంది. మీరు ఈ పాపాల్లో ఏదైనా చేసి, ఈ లోకంలో శిక్ష అనుభవిస్తే, అది మీకు కఫ్ఫారా (పాప పరిహారం) అవుతుంది. మీరు ఏదైనా పాపం చేసినా, అల్లాహ్ దాన్ని దాచిపెడితే, అది అల్లాహ్ ఇష్టం మీదే ఉంటుంది — అతను క్షమించవచ్చు, లేక శిక్షించవచ్చు." మేము ఈ ప్రతిజ్ఞపై ఆయనతో ఒప్పందం చేసుకున్నాం.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఉబాదా బిన్ సామిత్ (రదియల్లాహు అన్హు) — బదర్ యుద్ధంలో పాల్గొన్నవారు, తన జాతిలో పెద్దవారు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కు సహాయ పడేందుకు అఖ్బా రాత్రి మినాలో అంటే మదీనాకు వలస వెళ్ళక ముందు మక్కాలో ఉన్నప్పుడు ఆయనతో బైఅత్ (ప్రతిజ్ఞ) చేసినవారిలో ముందున్నారు — ఇలా పలికినారు: "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరుల మధ్య కూర్చుని, వారిని కొన్ని ముఖ్యమైన విషయాల్లో తనకు ప్రతిజ్ఞ (బైఅత్) చేయమని కోరారు..." మొట్టమొదటిది: వారు అల్లాహ్ను ఆరాధించడంలో ఎంత చిన్న భాగస్వామ్యాన్ని కూడా చేర్చకూడదు. రెండవది: వారు దొంగతనం చేయకూడదు. మూడవది: వారు వ్యభిచారం (అవాంఛిత లైంగిక సంబంధం) చేయకూడదు. నాలుగవది: వారు తమ పిల్లలను చంపకూడదు — ముఖ్యంగా ఆడపిల్లలను అవమాన భయంతో, లేదా అబ్బాయిలను పేదరికం భయంతో చంపకూడదు. ఐదవది: వారు అబద్ధాన్ని కల్పించి, తమ చేతులు, కాళ్లతో (చర్యల ద్వారా) దాన్ని ఆచరించరణలో పెట్టకూడదు. ఎందుకంటే, మనం చేసే చాలా పనులు ప్రధానంగా మన చేతులు, కాళ్ల ద్వారానే జరుగుతాయి, ఇతర అవయవాల ప్రమేయం ఉన్నా కూడా. ఆరవది: వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మంచిపనులలో (మారూఫ్) అవిధేయత చూపకూడదు. అందులో ఎవరు ఈ ఒప్పందాన్ని (ప్రతిజ్ఞను) నిలబెట్టుకుని, దానిని పాటిస్తారో, వారి ప్రతిఫలం అల్లాహ్ వద్ద ఉంటుంది. ఎవరైనా పైన చెప్పిన పాపాల్లో (అల్లాహ్ కు భాగస్వామ్యం కల్పించడం తప్ప) ఏదైనా చేసి, ఈ లోకంలో శిక్ష (హద్ శిక్ష) అనుభవిస్తే, అది అతనికి కఫ్ఫారా (పాప పరిహారం) అవుతుంది, దాంతో అతని పాపం క్షమించబడుతుంది. ఎవరైనా పాపం చేసినా, ఒకవేళ అల్లాహ్ దాన్ని దాచి పెడితే, అతని విషయం అల్లాహ్ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది — అల్లాహ్ క్షమించ వచ్చు, లేక శిక్షించవచ్చు. అపుడు, అక్కడ ఉన్నవారందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఈ ఒప్పందాన్ని చేశారు.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఇస్లాం మొదట్లో పరాయిగా (అన్యంగా, అపరిచితంగా) ప్రారంభమైంది. ఇది మళ్లీ మొదట్లో ఉన్నట్లుగానే పరాయిగా మారిపోతుంది. కాబట్టి, (దానిని గట్టిగా పట్టుకుని ఉండేవారికి) పరాయివారికి శుభం కలుగుగాక!"
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ప్రారంభంలో ఇస్లాం ధర్మాన్ని కొద్దిమంది మాత్రమే అనుసరించేవారు, ఆ తొలికాలంలో ఇస్లాం ధర్మం అనేది పరాయిగా (అపరిచితమైనదిగా) ఉండేది. భవిష్యత్తులో కూడా, దాన్ని నిజంగా పాటించేవారు చాలా తక్కువ అయిపోతారు, అంటే ఇస్లాం మళ్లీ ఆ పరాయితన అపరిచిత స్థితికి చేరుకుంటుంది. అందుకే, అలాంటి పరాయితన స్థితిలో కూడా దానిని అనుసరిస్తూ, ఇస్లాంను గట్టిగా పట్టుకున్నవారికి శుభం, అభినందన, ఆనందం, హర్షం కలుగుగాక!"
సహల్ ఇబ్నె సఅద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "చిన్న చిన్న పాపాలను తక్కువగా భావించకండి. చిన్న చిన్న పాపాల ఉదాహరణ — కొంతమంది ఒక లోయలో దిగారు. వారిలో ఒకతను ఒక చిన్న కట్టె తీసుకొచ్చాడు, ఇంకొకతను మరో చిన్న కట్టె తీసుకొచ్చాడు, ఇలా అందరూ కలిపి కట్టేలను పోగుచేసి తమ రొట్టెలను కాల్చుకున్నారు (అంటే, పెద్ద మంటను వెలిగించారు). అలాగే, చిన్న చిన్న పాపాలు కూడా ఒకచోట పోగవుతుంటే, అవి అతన్ని నాశనం చేస్తాయి."
ఆహ్మద్ నమోదు చేసినారు:చిన్న చిన్న పాపాలు చేయడంలో మెతకదనం చూపవద్దని, వాటిని తరచుగా చేయవద్దని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. ఎందుకంటే అవన్నీ నాశనానికి దారితీస్తాయి. ఒక లోయలో విడిది చేసిన వ్యక్తుల ఉదాహరణను ఆయన ఇచ్చారు. అక్కడి ప్రతి ఒక్కరూ ఒక చిన్న కట్టెను తీసుకు వచ్చారు, అలా వారు ఆ కట్టెలను తమ రొట్టెలు కాల్చేందుకు అవసరమైనంతగా జమ చేసి పెద్ద మంట రాజేసినారు. అలాగే చిన్న చిన్న పాపాలు చేసిన వ్యక్తి వాటిలో చిక్కుకోకుండా, వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాప పడకపోతే, అల్లాహ్ అతడిని క్షమించకపోతే, అవన్నీ అతడిని నాశనం చేస్తాయి.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "నన్ను పంపబడిన ముఖ్య ఉద్దేశ్యం — ఉత్తమ నైతిక విలువలను (మంచి స్వభావాలను) పరిపూర్ణం చేయడమే."
అల్ బుఖారీ 'అదబుల్ ముఫ్రద్'లో, అహ్మద్ మరియు బైహఖీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనను అల్లాహ్ పంపిన ఉద్దేశ్యం — ఉత్తమ నైతిక విలువలు, మంచితనాన్ని పరిపూర్ణం చేయడమేనని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పూర్వప్రవక్తల బోధనలకు కొనసాగిస్తూ, అరబ్బులలో ఉన్న మంచి స్వభావాలను (ఉదారత, ధైర్యం, మంచితనాన్ని) పూర్తిగా తీర్చిదిద్దేందుకు ఆయన పంపబడ్డారు. అరబ్బులు అప్పట్లో మంచి విషయాలను ప్రేమించేవారు, చెడు విషయాలను ద్వేషించేవారు, ఉదారత, గౌరవం, ధైర్యం వంటి లక్షణాలు ఉండేవి. కానీ, వారి నైతికతలో కొన్ని లోపాలు కూడా ఉండేవి — వంశపారంపర్యాన్ని గొప్పగా భావించడం, అహంకారం, పేదలను తక్కువగా చూడటం వంటి వాటిని శుద్ధి చేసి, పరిపూర్ణ నైతికతను స్థాపించేందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పంపబడ్డారు.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "ఆదం కుమారుడు "కాలాన్ని దూషించడం ద్వారా" నన్ను బాధిస్తున్నాడు - అసలు కాలం అంటే నేను (అల్లాహ్నే). సర్వాధికారమూ నా చేతిలోనే ఉంది. నేనే రాత్రిని, పగటిని మారుస్తున్నాను."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త ﷺ ఇలా తెలియజేశారు: మహోన్నతుడైన అల్లాహ్ ఖుద్సీ హదీథ్లో ఇలా అంటున్నాడు — "కష్టాలు, అపాయాలు వచ్చినప్పుడు — మనిషి కాలాన్ని తిడుతూ నన్ను బాధపెడుతున్నాడు, నా సార్వభౌమత్వాన్ని కించపరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ప్రతిదాన్నీ నడిపించే అధికారం కేవలం నా వద్ద మాత్రమే ఉంది. ఏమి జరిగినా, అదంతా నా ఆజ్ఞతోనే జరుగుతున్నది. కాబట్టి కాలాన్ని తిడటమంటే, నిజానికి నన్నే తిడటమే."