





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబూ రుఖయ్యహ్ ఇబ్నె ఔస్ అద్దారీయ్యి రదియల్లాహు అన్హు ఉ్లలేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహ వసల్లం ఇలా పలికినారు: “ధర్మము ఒక నిష్కల్మషమైన బోధన, ఉపదేశం”. మేము ఇలా అడిగాము: “ఎవరి కొరకు?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ కొరకు, ఆయన గ్రంథం (ఖుర్’ఆన్) కొరకు, ఆయన సందేశహరుని కొరకు, ముస్లిముల విద్వాంసుల కొరకు మరియు సాధారణ ముస్లిములందరి కొరకు” అన్నారు.
ముస్లిం నమోదు చేసినారు:"నిశ్చయంగా, ఇస్లాం ధర్మం నిజాయితీ (ఇఖ్లాస్) మరియు సత్యం (సిద్ఖ్) పై ఆధారపడి ఉందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. దీని వలన అల్లాహ్ ఆజ్ఞాపించినట్లుగా, ఎలాంటి కొరత లేదా మోసం లేకుండా, సంపూర్ణంగా దాన్ని పాటించాలి." ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగారు: "సలహా (నసీహత్) ఎవరి కొరకు?" అప్పుడు ఆయన ఇలా జవాబు ఇచ్చారు: మొదటిది: పరమ పవిత్రుడైన అల్లాహ్ గురించి మీ కొరకు సలహా (నసీహత్): ఆయన కోసం చేసే కర్మలలో చిత్తశుద్ధి (ఇఖ్లాస్) కలిగి ఉండడం, ఆయనతో ఎవరినీ భాగస్వాములను చేయకుండా ఉండడం, ఆయన యొక్క రుబూబియ్యత్ (సార్వభౌమత్వం) పట్ల, ఉలూహియ్యత్ (ఏకైక ఆరాధకుడనే అర్హత) పట్ల, ఆయన పేర్లు మరియు గుణాల పట్ల విశ్వసించడం, ఆయన ఆజ్ఞలను ఎంతో ఉన్నతంగా గౌరవించడం, మరియు ఆయన పట్ల విశ్వాసం వైపు ఆహ్వానించడం. రెండవది: అల్లాహ్ గ్రంథం ఖుర్ఆన్ గురించి మీ కొరకు సలహా (నసీహత్): దానిని అల్లాహ్ వాక్యంగా నమ్మాలి, అది ఆఖరి దైవగ్రంథం, దానికి ముందున్న షరియతులన్నింటినీ (దైవచట్టాలన్నింటినీ) రద్దు చేస్తున్నది. దానిని గౌరవించాలి, సరియైన పద్ధతిలో దాని పారాయణం చేయాలి, దానిలోని స్పష్టమైన ఆజ్ఞలను పాటించాలి, దానిలోని స్పష్టంగా లేని విషయాలను విశ్వసించాలి, దాని అర్థాన్ని వక్రీకరించేవారి నుండి దాన్ని కాపాడాలి, దానిలోని బోధనల నుండి పాఠాలు నేర్చుకోవాలి, దాని జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలి, దాని వైపు (ప్రజలను) ఆహ్వానించాలి. మూడవది: ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మీ కొరకు సలహా (నసీహత్): ఆయన ప్రవక్తల పరంపరలో చిట్టచివరి ప్రవక్త అని మనము విశ్వసిస్తున్నాము, ఆయన తీసుకు వచ్చిన దానిని (ఖుర్ఆన్ ను) మనము విశ్వసిస్తాము, ఆయన ఆజ్ఞలను పాటిస్తాము, ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉంటాము, ఆయన బోధించిన దాని ప్రకారం మాత్రమే అల్లాహ్ ను ఆరాధిస్తాము, ఆయన హక్కుకు గొప్ప స్థానము ఇస్తాము , ఆయనను గౌరవిస్తాము, ఆయన పిలుపును వ్యాప్తి చేస్తాము, ఆయన చట్టాన్ని వ్యాప్తి చేస్తాము మరియు ఆయనపై వచ్చే ఆరోపణలను ఖండిస్తాము. నాల్గవది: ముస్లిం నాయకుల గురించి మీ కొరకు సలహా (నసీహత్): సత్యంలో వారికి సహాయం చేయ వలెను, వారితో వివాదం చేయకూడదు, అల్లాహ్ కు విధేయత చూపడంలో భాగంగా వారి సత్యమైన మాట వినాలి మరియు వారికి విధేయత చూపాలి. ఐదవది: తోటి ముస్లింల గురించి మీ కొరకు సలహా: వారి పట్ల దయతో వ్యవహరించాలి, వారిని మంచి వైపు ఆహ్వానించాలి, వారికి హాని కలిగించకూడదు, వారితో ప్రేమగా మెలగాలి, ఇంకా వారు (ఇస్లాం) ధర్మాన్ని అనుసరించడంలో మరియు (అల్లాహ్ పట్ల) దైవభక్తి పెంపొందించుకోవడంలో వారికి సహకరించాలి.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు. "మనిషిలోని ప్రతి కీలుపై ఒక దానం (సదఖా) ఉంది. సూర్యుడు ఉదయించే ప్రతి రోజు, ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయం చేయడం ఒక దానం. ఒక వ్యక్తి తన వాహనంపై ఎక్కడానికి సహాయం చేయడం, లేదా అతని సామాను దానిపై ఎక్కించడంలో సహాయం చేయడం ఒక దానం. మంచి మాట ఒక దానం. నమాజ్ కోసం నీవు వేసే ప్రతి అడుగు ఒక దానం. మరియు దారిలో ఉన్న హాని కలిగించే వస్తువును తొలగించడం కూడా ఒక దానం."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, యుక్తవయస్సుకు చేరుకున్న ప్రతి ముస్లిం తన శ్రేయస్సు కొరకు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు స్వచ్ఛందంగా కృతజ్ఞతలు తెలుపుతూ తన ఎముకలలోని కీళ్ల సంఖ్యకు బదులు ప్రతిరోజూ ఒక్కో కీలుకు ఒక దానం ఇవ్వాలని వివరించారు; ఎందుకంటే ఆయన తన ఎముకలను ముడుచుకునేలా మరియు విస్తరించగలిగేలా కీళ్ళుగా చేసాడు గనుక. మరియు ఈ దానము మంచి పనులు చేయడం వల్ల పూర్తి అవుతుంది; ఇది ధనాన్ని దానంగా ఇవ్వడంపై ఆధారపడి ఉండదు; మంచిపనులు అంటే ఉదాహరణకు: ఇద్దరు వ్యక్తుల మధ్య, లేక రెండు వర్గాల మధ్య న్యాయం చేయడం, వారి మధ్య సయోధ్య కుదర్చడం – అది దానం అవుతుంది. తన వాహనం పైకి ఎక్కలేని వ్యక్తిని, అతడి వాహనం పైకి చేర్చుట, లేక అతని ప్రయాణ సామాగ్రిని ఎత్తి వాహనంపై పెట్టుట వంటివి కూడా దానంగా పరిగణించబడతాయి. ఒక మంచి మాట, అల్లాహ్ యొక్క స్మరణలో ఒక స్మరణ వాక్యమును పలుకుట, దుఆ చేయుట, మరియు సలాం చేయుట – మొదలైనవన్నీ దానములే. అలాగే సలాహ్ (నమాజు) ఆచరించుట కొరకు నీవు వేసే ప్రతి అడుగు కూడా ఒక దానమే అవుతుంది. ఇంకా మార్గము నుండి ప్రమాదకరమైన మరియు హానికరమైన వస్తువులను తొలగించడం కూడా దానమే.
ఉబాదహ్ బిన్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ఇలా విధేయతా ప్రతిజ్ఞ చేసినాము – కష్టకాలంలోనూ, సుఖసమయంలోనూ, శక్తివంతులుగా ఉన్న సమయంలోనూ, బలహీనులుగా ఉన్న సమయంలోనూ, మాపై మరొకరికి ప్రాధాన్యత ఇవ్వబడిన సందర్భంలోనూ మేము వారి మాట వింటామని మరియు వారికి విధేయులుగా ఉంటామని (వారి ఆదేశపాలన చేస్తామని) మరియు (పాలకులు బాహాటంగా, విస్పష్టంగా అవిశ్వాసానికి పాల్బడితే తప్ప) అధికారంలో ఉన్న వారికి వ్యతిరేకంగా పోరాడము అని, మేము ఎక్కడ ఉన్నా, నిందలు మోపే వారి అపనిందలకు భయపడకుండా, ఎల్లవేళలా అల్లాహ్ కొరకు కేవలం సత్యాన్నే పలుకుతామని - మేము విధేయతా ప్రతిజ్ఞ చేసినాము.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాల నుండి ఇలా ప్రతిజ్ఞ తీసుకున్నారు – తాము అధికారములో ఉన్నవారికి, పాలకులకు విధేయులుగా ఉంటామని, – కష్టకాలములోనూ, సుఖసమయములోనూ, పేదరికములోనూ, సంపన్నతలోనూ, వారి ఆదేశాలు తమ మనసుకు నచ్చినా, నచ్చక పోయినా, వారు ప్రజాధనాన్ని, పదవులను, హోదాలను లేక అలాంటి ఇతర విషయాలను తమ నియంత్రణలో ఉంచుకున్నా, వారి మాట వినుట మరియు వారికి విధేయులుగా ఉంటామని. ఇది ప్రతిఙ్ఞ చేసిన వారిపై విధి; వారికి (అధికారంలో ఉన్నవారికి, పాలకులకు) వ్యతిరేకంగా తిరుగుబాటు చేయరాదు. ఎందుకంటే వారికి వ్యతిరేకంగా చేసే తిరుగుబాటులో ఉన్న రాజద్రోహం మరియు చెడు, వారు చేస్తున్న అన్యాయము మరియు చెడు కంటే మహా ఘోరమైనవి. అలాగే వారు ఎక్కడ ఉన్నా నిందలు మోపే వారి అపనిందలకు భయపడకుండా, కేవలం అల్లాహ్ కొరకు, ఎప్పుడూ సత్యమునే పలకాలని కూడా ప్రతిజ్ఞ తీసుకోబడినది.
ఉమ్ముల్ ము’మినీన్ ఉమ్మె సలమహ్ రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: సమీప భవిశ్యత్తులో మీపై అమీరులు (పాలకులు) వస్తారు. మీరు వారిని (వారి మంచి పనుల కారణంగా) ఇష్టపడనూ వచ్చు, లేదా (వారి దురాచరణల కారణంగా) వారిని ఇష్టపడకపోనూ వచ్చు. ఎవరైతే పాలకుని దురాచరణలను, దుర్మార్గాలను (అవి పునరావృతం కాకుండా ఉండాలని) అతని దృష్టికి తీసుకు వెళతాడో, (తీర్పు దినమున) అతడు తనను తాను రక్షించుకున్నవాడు అవుతాడు. మరియు ఎవరైతే (పాలకుని దృష్టికి తీసుకు వెళ్ళేటంత శక్తి, ధైర్యము లేక) అతని దుర్మార్గాలను మనసులో అసహ్యించుకుంటాడో (తీర్పు దినమున) అతడు శాంతిని పొందుతాడు. అయితే ఎవరైతే పాలకుని దుర్మార్గాలను ఆమోదిస్తాడో, మరియు వాటిని తాను కూడా ఆచరిస్తాడో – తీర్పు దినము నాడు నాశనమై పోతాడు.” ఇది విని అక్కడ ఉన్న వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అడిగారు “ఓ ప్రవక్తా! అటువంటి పాలకునికి వ్యతిరేకంగా మేము పోరాడకూడదా?” దానికి ఆయన “అతడు నమాజులను స్థాపిస్తూ ఉన్నంత వరకు అతనికి వ్యతిరేకంగా పోరాడ రాదు” అన్నారు.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపున్నారు: మనపై పాలకులు నియమించబడతారు. వారి కొన్ని ఆచరణలు షరియత్ కు అనుగుణంగా ఉన్నాయి కనుక మనము ఆమోదిస్తాము, అలాగే కొన్ని ఆచరణలు షరియత్ కు వ్యతిరేకంగా ఉంటే వాటిని మనము వ్యతిరేకిస్తాము. ఎవరైతే పాలకుని షరియత్ వ్యతిరేక ఆచరణలను, వ్యతిరేకించే శక్తి, ధైర్యము లేక వాటిని తన మనసులో అసహ్యించు కుంటాడో అతడు తనను తాను పాపములో పడుట నుండి మరియు కపటత్వమునుండి కాపాడుకున్న వాడు అవుతాడు. ఎవరైతే షరియత్ వ్యతిరేక ఆచరణలను బహిరంగంగా ఖండిస్తాడో, వాటిని తన నాలుక ద్వారా (ప్రసంగాల ద్వారా) లేక తన చేతి ద్వారా ఆపడానికి ప్రయత్నిస్తాడో, అతడు తనను తాను పాపములో పడుట నుండి మరియు ఆ ఆచరణలలో పాల్గొనుట నుండి రక్షించుకున్న వాడు అవుతాడు. కానీ ఎవరైతే షరియత్ వ్యతిరేక కార్యాలను ఆమోదిస్తాడో, వాటి పట్ల ఇష్టంగా ఉంటాడో అతడు (పాలకుడు) నాశనం అయినట్లుగానే ఇతడూ నాశనం అవుతాడు. అపుడు అక్కడ ఉన్న వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అడిగారు – ఈ లక్షణాలున్న పాలకునికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయకూడదా? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా చేయడం నుండి వారించి, ఇలా అన్నారు: ఎందుకంటే వారు మీలో సలాహ్ ను (నమాజులను) స్థాపిస్తారు కనుక.
అబీ మూసా అల్ అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “అల్లాహ్ యొక్క దాసుడు ఒకవేళ వ్యాధిగ్రస్తుడై ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా, అతడు స్థానికంగా ఉన్నపుడు లేదా ఆరోగ్యంగా ఉన్నపుడు చేసే మంచిపనులకు సమానంగా అతని కొరకు ప్రతిఫలం వ్రాయబడుతుంది”.
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ఎంతగా అనుగ్రహించే వాడో, ఎంతటి కరుణా ప్రధాతనో తెలిపినారు. ఒక ముస్లిం, ఒకవేళ అతడు (చిన్నవైనా సరే) సత్కార్యాలు చేసే అలవాటు కలిగి ఉండి, ఒకవేళ జబ్బు పడి తాను అలవాటుగా చేసే మంచిపనులు చేయలేని స్థితికి గురైతే లేదా తాను ప్రయాణంలో ఉండి లేదా పనులలో పడి తీరిక లేకుండా పోతే లేదా మరింకే కారణంగానైనా తాను అలవాటుగా చేసే మంచి పనులు చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటునట్లయితే, (అల్లాహ్ తరఫు నుండి) అతడి కొరకు, అతడు ఆరోగ్యంగా ఉన్నపుడు మరియు ప్రయాణంలో కాకుండా స్థానికంగా (ఇంటి వద్దనే) ఉన్నపుడు అతడు చేసే మంచిపనులకు లభించే ప్రతిఫలానికి సమానంగా అతడి ఖాతాలో పూర్తి ప్రతిఫలం వ్రాయబడుతుంది.
తమీమ్ అద్'దారీ రజియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారని ఉల్లేఖిస్తున్నారు: “ధర్మము ఒక నిష్కల్మషమైన బోధన, ఉపదేశం”. మేము ఇలా అడిగాము: “ఎవరి కొరకు?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ కొరకు, ఆయన గ్రంథం (ఖుర్’ఆన్) కొరకు, ఆయన సందేశహరుని కొరకు, ముస్లిముల విద్వాంసుల కొరకు మరియు సాధారణ ముస్లిములందరి కొరకు” అన్నారు.
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేసారు – ధర్మము నిష్కల్మషత్వము మరియు నిజాయితీలపై ఆధారపడి ఉంటుంది; అల్లాహ్ ఆదేశించిన విధంగా, సంపూర్ణంగా అచరించబడుటకు గాను, అందులో ఎటువంటి తగ్గింపు, నిర్లక్ష్యము, మోసము, వంచనలకు పాల్బడకుండా ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను వారు ఇలా అడిగారు “ఈ ఉపదేశం ఎవరి కొరకు ఇవ్వబడింది?” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు: మొదటిది: ఈ ఉపదేశం పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ కొరకు ఇవ్వబడింది. ఆయన కొరకు ఆచరించే ఆచరణలలో నిజాయితీ, నిష్కల్మషత్వము ఉండాలి; ఎవరినీ, దేనినీ ఆయనకు సాటి కల్పించకుండా ఉండాలి, ఆయన ప్రభుతను (రుబూబియ్యత్ – కేవలం ఆయనే సర్వసృష్టికి ప్రభువు అనే విషయాన్ని) విశ్వసించాలి, కేవలం ఆయన మాత్రమే ఏకైక ఆరాధ్యుడు అనే విషయాన్ని(ఉలూహియ్యత్) విశ్వసించాలి, మరియు ఆయన యొక్క శుభ నామములను, ఆయన యొక్క గుణగణాలలో కేవలం ఆయన మాత్రమే ఏకైకుడు (అస్మా వస్సిఫాత్) అనే విషయాన్ని విశ్వసించాలి, ఆయన ఆదేశాలను శిరసావహించాలి మరియు ఆయనను విశ్వసించుట వైపునకు ప్రజలను ఆహ్వానించాలి. రెండవది: ఆయన గ్రంథము కొరకు, అదే అల్ ఖుర్’ఆనుల్ కరీం. అది అల్లాహ్ యొక్క వాక్కు అని విశ్వసించాలి, ఖుర్’ఆన్ ఆయన అవతరింపజేసిన చిట్టచివరి దైవ గ్రంథము అని విశ్వసించాలి, తన కంటే ముందు ఉన్న షరియత్’లను అన్నింటినీ రద్దు చేయు గ్రంథమని విశ్వసించాలి, దాని ఔన్నత్యాన్ని గుర్తించాలి, గౌరవించాలి, మనం దానిని పారాయణం చేయవలసిన విధంగా పారాయణం చేయాలి. ఇంకా, ఖుర్’ఆన్ యొక్క ఆదేశాల ప్రకారం మనం ఆచరించాలి, అందులోని మన అవగాహనకు అందని, అస్పష్ట వాక్యాలను (విషయాలను) కూడా విశ్వసించాలి, దాని వ్యతిరేకులు చేసే కలుషిత వివరణలను అడ్డుకోవాలి, ఆ గ్రంథాన్ని వ్యాప్తి చేయుటను, అందునుండి ఉత్పన్నమయ్యే శాస్త్రాలను వ్యాపింపజేయుటను, మరియు ఖుర్’ఆన్ యొక్క సందేశం వైపునను ప్రజలను ఆహ్వానించుటను (బాధ్యతగా) స్వీకరించాలి. మూడవది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల నిష్కల్మషముగా, నిజాయితీగా ఉండుట, అంటే, ప్రవక్తల పరంపరలో ఆయన చిట్టచివరి ప్రవక్త అని మనం విశ్వసించాలి. ఆయన తీసుకు వచ్చిన సందేశాన్ని విశ్వసించాలి, ఆయన ఆదేశాలను శిరసావహించాలి, ఆయన నిషేధించిన వాటినుండి దూరంగా ఉండాలి, కేవలం ఆయన తీసుకు వచ్చిన సందేశం ఆధారంగానే అల్లాహ్ ను ఆరాధించాలి, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన హక్కులను గౌరవించాలి, ఆయన పిలుపును విస్తరింపజేయాలి, ఆయన షరియత్’ను వ్యాపింపజేయాలి, ఆయన వ్యతిరేకులు ఆయనపై వ్యాపింపజేసే అపనిందలను ఖండించాలి, అడ్డుకోవాలి. నాలుగవది: ముస్లిముల యొక్క ఇమాముల పట్ల నిజాయితీ (ఇమాం అంటే ఙ్ఞానవంతుడు అని, నాయకుడు అని అర్థాలున్నాయి): అంటే, సత్యముపై వారికి అన్ని విధాలా సహకరించాలి, సహాయము చేయాలి – వారు సత్యాన్ని అనుసరించేందుకు, దాని పరిరక్షణ కొరకు. అల్లాహ్’ను, ఆయన ఆదేశాలను అనుసరించే విషయాలలో వారి మాటలు వినాలి మరియు వారితో గొడవ పడరాదు. ఐదవది: ముస్లిముల పట్ల నిష్కల్మషంగా, నిజాయితీగా ఉండాలి: అంటే మనం వారికి మంచి చేసే విషయంలో మరియు వారిని మంచి వైపునకు ఆహ్వానించే విషయంలో. అలాగే వారికి చెడు, కీడు, నష్టము తలపెట్టే విషయాలకు దూరంగా ఉండాలి. వారికి ఇష్టమైన దానిని మనం కూడా ఇష్టపడాలి, ధర్మనిష్ట, ధార్మికత, మరియు భక్తి, విశ్వాసము, మొదలైన విషయాలలో వారికి సహకరించాలి.
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ఇంటిలో ఉన్నపుడు, ఒకరోజు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఓ అల్లాహ్! నా ఉమ్మత్ కు (సమాజానికి) సంబంధించిన ఏ విషయములోనైనా ఎవరికైనా అధికారాన్ని ఇచ్చినట్లయితే, అతడు దాని ద్వారా ప్రజలను కష్టాలకు, కఠిన పరిస్థితులకు గురిచేస్తే, నీవు కూడా అతడిని కాఠిన్యానికి గురి చేయి. మరియు నా ఉమ్మత్ కు సంబంధించిన ఏ విషయములోనైనా ఎవరికైనా అధికారాన్ని ఇచ్చినట్లయితే, అతడు (ప్రజలను కష్టాలపాలు చేయకుండా) ప్రజలతో దయతో, కరుణతో స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే, నీవు కూడా అతనిపై కృపతో, దయతో, అనుగ్రహముతో ఉండు”.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దుఆ అందరికీ వర్తిస్తుంది. ఎవరైతే ముస్లిముల యొక్క వ్యవహారాలలో దేనినైనా నిర్వహించడానికి అధికారము పొందుతారో, అటువంటి వారందరికీ వర్తిస్తుంది. ఆ వ్యవహారము చిన్నదైనా లేక పెద్దదైనా, అది ప్రజలందరికీ సంబంధించిన వ్యవహారమైనా లేక ప్రజలలో కొద్ది మందికి (ఒక సమూహానికి, ఒక తెగకు మొ.) సంబంధించిన వ్యవహారమైనా – అందులో అతడు ప్రజలను కష్టాలకు గురిచేసినట్లయితే లేక వారిని కఠిన పరిస్థితుల పాల్జేసినట్లయితే, వారి పట్ల కనికరం, దయ లేకుండా వ్యవహరించినట్లయితే, (అధికార స్థానం’లో ఉండి) అతడు ప్రజలతో ఏవిధంగానైతే వ్యవహరించాడో అల్లాహ్ అతడికి అదే విధంగా ప్రతిఫలాన్నిస్తాడు. అలాగే ఇందులో, ఎవరైతే అధికారాన్ని పొందిన తరువాత, తద్వారా ప్రజలకు తగిన విధంగా సేవ చేస్తాడో, వారి వ్యవహారాలను న్యాయబధ్ధంగా పరిష్కరిస్తాడో, చక్కదిద్దుతాడో అల్లాహ్ కూడా అతడి వ్యవహారాలను కూడా అదే విధంగా పరిష్కరిస్తాడు.
మాఖిల్ ఇబ్న్ యసార్ అల్ ముజనియ్యి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను – “అల్లాహ్ అధికార పదవిలో నియమించిన ఎవరైనా సరే, తాను చనిపోయే దినమున, తన అధికారము క్రింద ఉన్న వారిని మోసం చేస్తున్న స్థితిలో చనిపోతే, అటువంటి వానికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించినాడు”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ఎవరికైతే ప్రజలపై అధికారం చేయు ఏదైనా పదవినిస్తాడో మరియు దానికి బాధ్యులను చేస్తాడో, అటువంటి వారందరి గురించి వివరిస్తున్నారు. ఆ అధికారి ఒక రాజ్యానికి రాజు కావచ్చు, అలాగే ఒక పురుషుడు తన ఇంటికి మరియు ఒక స్త్రీ తన ఇంటికి బాధ్యులు కావచ్చు. తమ అధికార పరిధి క్రింద ఉన్న వారి హక్కులను వారికి ఇచ్చుటలో, వాటిని పరిరక్షించుటలో, వారు ఏమైనా కొరతకు పాల్బడినా లేక మోసానికి పాల్బడినా లేక వారికి సరియైన మార్గదర్శకత్వం చేయక పోయినా, ఆ ప్రజల ధార్మిక మరియు ప్రాపంచిక హక్కుల విషయంలో విఫలమైన వారిగా పరిగణించబడతారు. అటువంటి వారు నిశ్చయంగా అత్యంత కఠిన శిక్షకు పాత్రులవుతారు.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే విధేయత నుండి తొలగిపోయి, జమాఅత్ నుండి వేరై వెళ్ళిపోయినట్లయితే, తరువాత అతడు అదే స్థితిలో చనిపోతే, అతని చావు ‘జాహిలియ్యహ్’ కాలము (ఇస్లాంకు పూర్వపు అఙ్ఞాన కాలము) నాటి చావుతో సమానము. ఎవరైతే అంధవిశ్వాసపు పతాకం క్రింద, మార్గదర్శనం లేని కారణం కొరకు, తన జాతి లేక తెగ అనే ఉన్మాదముతో, లేదా తన జాతి గర్వానికి / అహంకారానికి సమర్ధనగా, లేదా తన జాతి జనుల అహంకారానికి సమర్ధనగా, లేదా తన స్వీయప్రయోజనాల కొరకు కోపగ్రస్థుడై జగడానికి / యుద్ధానికి దిగేవాడు, లేదా యుద్ధానికి దిగమని పిలిచేవాడు – ఆ జగడములో లేదా యుద్ధములో చనిపోతే, అతని చావు ‘జాహిలియ్యహ్’ కాలము నాటి చావుతో సమానము; ఎవరైతే నా ఉమ్మత్’తో చేసిన ఆఙ్ఞానువర్తన ఒడంబడికను తిరస్కరించి, వారిలోని విశ్వాసులైనవారి మాటను కూడా వినకుండా, వారిలో మంచివారు (ధర్మవర్తనులు), చెడ్డవారు అనే తేడా లేకుండా చంపుతాడో, వారిలో ఎవరితోనైనా చేసుకుని ఉన్న ఒడంబడికను నెరవేర్చడో, ఉల్లంఘిస్తాడో – అటువంటివాడు నాకు చెందిన వాడు కాడు, నేను వాడికి చెందిన వాడిని కాను.”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఎవరైతే తమ పాలకుని విధేయత నుండి తొలగిపోతాడో, మరియు నాయకునికి (ఇమామునకు) విధేయతా ప్రమాణము చేయుటకు ఏకాభిప్రాయముతో అంగీకరించిన ఇస్లామీయ జమాఅత్ (సమూహము నుండి) వేరైపోతాడో, మరియు అదే అవిధేయతా స్థితిలో మరియు జమాఅత్ నుండి వేరైపోయిన స్థితిలో చనిపోతాడో, అతడి చావు ఇస్లాంకు పూర్వపు అఙ్ఞాన కాలములో చనిపోయిన వాని చావుతో సమానము. వారు (జాహిలియ్యహ్ కాలము వారు) తమ నాయకునికి అవిధేయత చూపుతూ, తమ జమాఅత్’తో కలిసి ఉండకుండా వేర్వేరు సమూహాలుగా, గ్రూపులుగా విడిపోయి ఒకరితోనొకరు యుద్ధాలు చేసేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే సత్యాన్ని, అసత్యాన్ని స్పష్టంగా వేరుచేసి చూడలేని ఒక పతాకం క్రింద యుద్ధానికి దిగుతాడో, కేవలం తన జాతి కోసం, లేక తన తెగ కోసం క్రోధాపూరితుడు అవుతాడో, ధర్మమును నిలబెట్టుట కోసమో, సత్యమును నిలబెట్టుట కోసమో కాకుండా, కారణరహిత ఛాందసత్వముతో ఙ్ఞానము, అంతర్దృష్ఠి, విచక్షణ లేకుండా కొట్లాటకు, జగడానికి, యుద్ధానికి దిగుతాడో – మరియు అతడు అలాంటి స్థితిలో చనిపోతాడో అటువంటివాడు జాహిలియ్యహ్ (అఙ్ఞాన కాలపు) చావు చచ్చినవానితో సమానము. మరియు ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్ నుండి తిరుగుబాటుదారుడై బయటకు వెళ్ళిపోయి, ఉమ్మత్ పై దాడి చేసి, అందులోని సజ్జనులను, దుర్జనులను హింసకు గురిచేస్తాడో, తాను ఏమి చేస్తున్నాడో దాని గురించి ఏమాత్రమూ చింత లేకుండా, ఉమ్మత్ యొక్క విశ్వాసులను చంపుతున్నందుకు విధించబోయే శిక్షను గురించిన భయము కూడా లేకుండా వ్యవహరిస్తాడో, పాలకులతో లేక అవిశ్వాసులతో చేసుకున్న ఏ ఒడంబడికనూ నెరవేర్చడో, పైగా వారితో చేసుకున్న ఒడంబడికలను (ఒప్పందాలను) ఉల్లంఘిస్తాడో – అది ఘొరమైన పాపాలలో ఒకటి అవుతుంది. అటువంటి ఘోరమైన పాపానికి పాల్బడిన వానికి ఇందులో అత్యంత కఠినమైన హెచ్చరిక ఉన్నది.