





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
హుదైఫహ్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) వారి నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా పలికినారు: “నిశ్చయంగా (నా తరువాత) పాలకులు వస్తారు. వారు అసత్యాలు పలుకుతారు మరియు దౌర్జన్యానికి పాల్బడతారు. ఎవరైతే వారి అసత్యాలను విశ్వసిస్తాడో, వారి దౌర్జన్యాలకు సహాయపడతాడో, అతడు నావాడు కాడు; నేను అతని వాడను కాను, మరియు అతడు తీర్పుదినమున ‘అల్-హౌధ్’ తటాకము (జలాశయం) దగ్గర నా వద్దకు రాలేడు. మరియు ఎవరైతే వారి అసత్యాలను విశ్వసించడో, మరియు వారి దౌర్జన్యాలలో వారికి సహాయపడడో అతడు నావాడు, నేను అతని వాడను, మరియు అతడు ‘అల్-హౌధ్’ తటాకము దగ్గర నా వద్దకు వస్తాడు.”
ఆహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీథు లో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలియజేస్తున్నారు: తన మరణం తరువాత, పాలకులు ప్రజలను పరిపాలిస్తారు; వారు అసత్యాలు పలుకుతారు, వారు ఆచరించని పనులు ఆచరించినట్లు చెబుతారు మరియు వారు పరిపాలనలో అన్యాయానికి పాల్బడతారు. ఎవరైతే వారితో చేరుతాడో, వారి అసత్యాలను విశ్వసిస్తాడో, లేదా తప్పుగా ప్రవర్తించడం ద్వారా, లేక వారిని సంతోషపెట్టే మాటలు మాట్లాడడం ద్వారా, అంటే ఉదాహరణకు వారు ఇష్టపడేలా ఫత్వాలు ఇవ్వడం, లేదా వారిచ్చే వాటికి (బహుమానాలు, హోదాలు, మొ.) ఆశపడి వారికి సహాయపడడం చేసిన వాడి నుండి నన్ను నేను దూరం చేసుకుంటున్నాను. అతను నాకు చెందినవాడు కాదు, నేను అతనికి చెందినవాడిని కాదు. మరియు తీర్పు దినమున అతడు “హౌదె-కౌథర్” (అల్ కౌథర్ తటాకము) వద్దకు రాడు. అయితే, వారితో చేరని వాడు, వారి అసత్యాలను విశ్వసించనివాడు, మరియు వారి అకృత్యాలలో, దౌర్జన్యాలు, అణచివేతలో వారికి సహాయం చేయని వ్యక్తి నావాడు, మరియు నేను అతనివాడిని, మరియు అతను తీర్పు దినమున “హౌదె -కౌథర్” (అల్ కౌథర్ తటాకము) వద్దకు వస్తాడు.”
సుహైబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "మీకు పూర్వం గతించిన ప్రజలలో ఒక రాజు ఉండేవాడు, అతని వద్ద ఒక ఆస్థాన మాంత్రికుడు ఉండేవాడు, ఆ మాంత్రికుడు వృద్ధాప్యానికి చేరుకోవడంతో, అతడు తన రాజుతో ఇలా అన్నాడు: “నిశ్చయంగా నేను వృద్ధుడను అయ్యాను. నా వద్దకు ఒక యువకుడిని పంపించండి, నేను అతనికి నా మంత్రజాల విద్య నేర్పిస్తాను.” అపుడు రాజు ఆ మంత్రజాల విద్యను నేర్పేందుకు ఒక యువకుడిని మాంత్రికుని వద్దకు పంపాడు. ఆ యువకుడు మాంత్రికుడి వద్దకు వెళుతున్న దారిలో ఒక రాహిబ్ (ఏకదైవాధన చేసే ఒక అల్లాహ్ దాసుడు) ఉండేవాడు. ఆ యువకుడు ఆ రాహిబ్ దగ్గర కూర్చుని అతని మాటలు విన్నాడు. అతనికి ఆ రాహిబ్ మాటలు బాగా నచ్చాయి. తరువాత రోజులలో ఎప్పుడు అతడు ఆ మాంత్రికుని దగ్గరకు వెళ్ళుతున్నా, దారిలో ఆ రాహిబ్ వద్ద కొద్దిసేపు కూర్చుని, అతడి మాటలు వినేవాడు. ఆ కారణంగా మాంత్రికుని దగ్గరకు ఆలస్యంగా వెళ్ళేవాడు. ఆలస్యంగా వచ్చినందుకు ఆ మాంత్రికుడు అతడిని దండించేవాడు. దానితో, ఆ యువకుడు దీని గురించి రాహిబ్ కు తెలుపగా, ఆ రాహిబ్ అతనితో ఇలా అన్నాడు: నీవు మాంత్రికుడికి భయపడినప్పుడల్లా, మీ కుటుంబం నిన్ను ఆపిందని చెప్పు. మరియు నీవు నీ కుటుంబానికి భయపడినప్పుడల్లా, మాంత్రికుడు నిన్ను ఆపినాడని వారికి చెప్పు. ఆ యువకుడు (కొంతకాలం) అలాగే కొనసాగాడు. అప్పుడు ఒకసారి దారిలో ఒక పెద్ద, భయంకరమైన మృగం అతడికి కనిపించింది మరియు ప్రజలు భయంతో దానిని దాటుకుని వెళ్ళలేకపోవడం అతడు చూసాడు. అపుడు ఆ యువకుడు: “ఈ రోజు నాకు తెలిసిపోతుంది – ఆ మాంత్రికుడు గొప్పవాడో, లేక ఆ రాహిబ్ గొప్పవాడో” అని అనుకుని అతడు ఒక రాయిని చేతిలోనికి తీసుకుని ఇలా అన్నాడు: “ఓ అల్లాహ్! ఆ రాహిబ్ వ్యవహారం నీకు మాంత్రికుడి వ్యవహారం కంటే ప్రియమైనదైతే, ప్రజలు స్వేచ్ఛగా తిరగగలిగేలా ఈ జంతువును చంపు.” తరువాత అతను ఆ రాయిని దాని వైపు విసిరాడు. దానితో ఆ జంతువు చనిపోయింది. ప్రజలు (దారిలో స్వేచ్ఛగా) తిరగడం ప్రారంభించారు. అతను ఆ రాహిబ్ వద్దకు వచ్చి అతనికి జరిగిన విషయం చెప్పాడు. అపుడు రాహిబ్ ఇలా అన్నాడు: “కుమారా! ఈ రోజు నువ్వు నా కంటే ఉన్నతుడివి అయ్యావు. నీ వ్యవహారం త్వరలోనే నిన్ను విచారణకు గురిచేసే దశకు చేరుకుంది, ఒకవేళ నీవు విచారణను ఎదుర్కొంటే నా గురించి వారికి చెప్పకు.” తరువాత ఆ యువకుడు పుట్టుగుడ్డి వారికి, కుష్టు వ్యాధి వారికి మరియు ఇతర వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు చికిత్స చేసేవాడు. రాజు దగ్గర పనిచేసే ఒకతను చూపు పోయి అంధుడిగా మారిపోయాడు. అతడు ఆ బాలుడి గురించి విన్నాడు. అతను ఆ బాలుని వద్దకు వచ్చి, అతని కొరకు చాలా బహుమతులు తెచ్చి ఇలా అన్నాడు: "నీవు నన్ను నయం చేస్తే ఈ బహుమతులన్నీ నీవే". దానికి ఆ బాలుడు ఇలా జవాబిచ్చాడు: "నేను ఎవరికీ నయం చేయను; అల్లాహ్ మాత్రమే ప్రజలను నయం చేస్తాడు. కాబట్టి, మీరు అల్లాహ్ ను విశ్వసించినట్లైతే, నేను మీ కొరకు ఆయనను వేడుకుంటాను (దుఆ చేస్తాను) మరియు ఆయన మిమ్మల్ని నయం చేస్తాడు". దానితో, అతను అల్లాహ్ ను విశ్వసించాడు, మరియు అల్లాహ్ అతన్ని నయం చేశాడు. తరువాత, అతడు రాజు వద్దకు వచ్చి తాను ముందు కూర్చున్న స్థానంలో కూర్చున్నాడు. రాజు అతనితో ఇలా అన్నాడు: "నీకు చూపును ఎవరు తిరిగి ఇచ్చారు?". అతడు ఇలా జవాబిచ్చాడు: "నా ప్రభువు!". అప్పుడు రాజు ఇలా అన్నాడు: "నేను కాకుండా నీకు మరొక ప్రభువు ఉన్నాడా?" ఆ సహచరుడు ఇలా అన్నాడు: "నీ ప్రభువు మరియు నా ప్రభువు అల్లాహ్’యే". రాజు అతడిని తీసుకెళ్లి విపరీతంగా హింసించాడు. దానితో అతడు ఆ యువకుడి గురించి చెప్పాడు. అపుడు ఆ యువకుడిని రాజు వద్దకు తీసుకువచ్చారు, రాజు అతనితో ఇలా అన్నాడు: "ఓ యువకుడా! నీ మంత్రవిద్య పుట్టుకతో వచ్చే అంధత్వం, కుష్టు వ్యాధి మరియు ఇతర వ్యాధులను నయం చేసేంత వరకు చేరుకుంది". దానికి ఆ యువకుడు ఇలా అన్నాడు: "నిజంగా, నేను ఎవరినీ నయం చేయను. అల్లాహ్ మాత్రమే నయం చేయగలడు." ఆ మాటలకు రాజు అతడిని విపరీతంగా హింసించాడు. దానితో అతడు రాహిబ్ గురించి చెప్పేసాడు. తరువాత రాహిబ్ ను రాజు వద్దకు తీసుకువచ్చారు, రాజు అతనితో ఇలా అన్నాడు: "నీ ధర్మాన్ని వదులుకో”. దానికి రాహిబ్ నిరాకరించాడు. రాజు ఒక రంపాన్ని తీసుకురమ్మని ఆఙ్ఞాపించాడు. అది తీసుకు వచ్చిన తరువాత దానిని రాహిబ్ తల మధ్యలో ఉంచి ఒక భాగం నేలపై పడిపోయే వరకు అతడి శరీరాన్ని నిలువుగా రెండు ముక్కలుగా చీల్చాడు. తరువాత రాజు ఆ సహచరుడిని తీసుకువచ్చి అతనితో ఇలా అన్నాడు: "నీ ధర్మం నుండి మరలిపో". అతను అలా చేయడానికి నిరాకరించాడు. రాజు ఆ రంపాన్ని అతని తల మధ్యలో ఉంచి, ఒక భాగం పడిపోయే వరకు నిలువుగా రెండు ముక్కలుగా చీల్చాడు. అప్పుడు ఆ బాలుడిని తీసుకువచ్చి అతనితో ఇలా అన్నాడు: "నీ ధర్మం నుండి మరలిపో". అతను అలా చేయడానికి నిరాకరించాడు. రాజు అతన్ని తన అనుచరులలో కొద్ది మందికి అప్పగించి, వారితో ఇలా అన్నాడు: అతన్ని ఫలానా పర్వతానికి తీసుకెళ్లండి; అతన్ని ఆ పర్వతం పైకి ఎక్కించండి మరియు మీరు దాని శిఖరానికి చేరుకున్నప్పుడు (అతని విశ్వాసాన్ని త్యజించమని అడగండి) కానీ అతను అలా చేయడానికి నిరాకరిస్తే, అతన్ని (పర్వతం నుండి క్రిందకు) విసిరేయండి. వారు అతన్ని తీసుకొని ఆ పర్వతం పైకి తీసుకు వెళ్ళారు, అపుడు ఆ యువకుడు ఇలా అన్నాడు: "ఓ అల్లాహ్! నీవు ఏ విధంగా ఇష్టపడితే ఆ విధంగా వారి నుండి నన్ను రక్షించు". దానితో పర్వతం కంపించడం ప్రారంభించింది మరియు వారందరూ పడిపోయారు. ఆ యువకుడు రాజు వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. రాజు అతనితో ఇలా అన్నాడు: “నీ వెంట వచ్చిన వారికి ఏమైంది?” అతను ఇలా అన్నాడు: “అల్లాహ్ నన్ను వారి నుండి రక్షించాడు.” రాజు మళ్ళీ అతనిని కొంతమంది సిబ్బందికి అప్పగించి ఇలా అన్నాడు: “అతన్ని ఒక చిన్న పడవలో తీసుకుని వెళ్ళండి, మీరు సముద్రం మధ్యలోకి చేరుకున్నప్పుడు (అతని ధర్మాన్ని త్యజించమని అడగండి), కానీ అతను తన ధర్మాన్ని త్యజించకపోతే అతన్ని నీటిలోకి విసిరేయండి”. వారు అతనిని పడవలో తీసుకుని వెళ్లారు. ఆ యువకుడు ఇలా అన్నాడు: “ఓ అల్లాహ్! వారి నుండి మరియు వారు ఏమి చేయాలనుకుంటున్నారో దాని నుండి నన్ను రక్షించు.” త్వరలోనే పడవ తిరగబడింది మరియు వారు మునిగిపోయారు. ఆ యువకుడు రాజు వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. రాజు అతనితో ఇలా అన్నాడు: “నీ వెంట వెళ్ళిన వారికి ఏమయ్యింది?” అతను ఇలా అన్నాడు: “అల్లాహ్ నన్ను వారి నుండి రక్షించాడు." మరియు అతను రాజుతో ఇలా అన్నాడు: “నేను చెప్పినట్లు చేస్తే తప్ప నువ్వు నన్ను చంపలేవు.” రాజు అడిగాడు: "అది ఏమిటి?" ఆ యువకుడు ఇలా అన్నాడు: "ప్రజలను ఒక ఎత్తైన ప్రదేశంలో సమావేశ పరచి, నన్ను ఒక చెట్టుకు కట్టివేయండి; తరువాత నా అంబుల పొది నుండి ఒక బాణం తీసుకొని ఇలా అనండి: “ఈ బాలుడి ప్రభువు అయిన అల్లాహ్ నామముతో (ఈ బాణాన్ని వదులుతున్నాను).” ఇలా చేస్తేనే, నీవు నన్ను చంపగలవు”. అపుడు రాజు ఆ యువకుడు చెప్పిన ప్రకారం చేసాడు. బాణాన్ని విల్లులో ఉంచి “ఈ బాలుని ప్రభు నామముతో (బాణాన్ని వదులుతున్నాను)” అంటూ బాణాన్ని వదిలాడు. ఆ బాణం యువకుడి కణతను తాకింది, ఆ యువకుడు తన చేతిని బాణం గాయంపై ఉంచి చనిపోయాడు. అది చూసి ప్రజలు (ఒక్కసారిగా) ఇలా ప్రకటించారు: “మేము ఆ యువకుడి ప్రభువును విశ్వసిస్తున్నాము! మేము యువకుడి ప్రభువును విశ్వసిస్తున్నాము! మేము యువకుడి ప్రభువును విశ్వసిస్తున్నాము!” అప్పుడు రాజుతో ఇలా అనబడింది: "ఏమి జరిగిందో మీరు చూశారా? మీరు భయపడినదే జరిగింది. అల్లాహ్ సాక్షిగా ప్రజలందరూ (ఆ యువకుడి ప్రభువును) విశ్వసించినారు. దానితో ఆ రాజు రహదారుల ప్రవేశ ద్వారాల వద్ద పెద్దపెద్ద గోతులు తవ్వమని ఆదేశించగా, అలా గోతులు తవ్వడం జరిగింది. వాటిలో మంటలు రాజేయబడ్డాయి. అప్పుడు రాజు ఇలా ఆదేశించాడు “ఎవరైతే నా ధర్మాన్ని విడిచి పెట్టారో వారిని ఈ మంటలలో త్రోసివేయండి, లేదా అలాంటి వాళ్ళని ఈ మంటల్లో దూకమని ఆదేశించండి.” వారు అలాగే చేసారు. అప్పుడు, ఒక స్త్రీ మరియు ఆమె పసిబిడ్డ వచ్చారు, ఆ స్త్రీ అగ్నిలో దూకటానికి కొంత సంకోచిస్తుండగా, ఆమె పసిబిడ్డ ఆమెతో ఇలా చెప్పింది: “అమ్మా! సహనం వహించు (అగ్నిలో దూకు), ఎందుకంటే నిజంగా, నీవు సత్యాన్నే అనుసరిస్తున్నావు”.
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: మన కంటే ముందుతరాలలో ఒక రాజు ఉండేవాడు మరియు అతని వద్ద ఒక ఆస్థాన మాంత్రికుడు ఉండేవాడు. ఆ మాంత్రికుడు ముసలివాడు అయినపుడు అతడు రాజుతో ఇలా అన్నాడు: “నేను ముసలి వాడిని అయిపోయాను. ఎవరైనా ఒక యువకుడిని నా వద్దకు పంపించండి, అతనికి ఈ మంత్రజాల విద్య నేర్పిస్తాను.” దానిపై రాజు ఒక యువకుడిని మంత్రజాల విద్య నేర్పించడానికి ఆ మాంత్రికుని వద్దకు పంపించినాడు. ఆ యువకుడు మాంత్రికుని వద్దకు ఎప్పుడు వెళ్ళుతున్నా దారిలో ఒక రాహిబ్ కూర్చుని ఉండటం చూసేవాడు. ఒకసారి ఆ యువకుడు రాహిబ్ వద్ద కొంచెంసేపు ఆగి, అతని ప్రక్కన కూర్చుని అతను చెప్పినదంతా విన్నాడు. అతనికి ఆ రాహిబ్ మాటలు బాగా నచ్చాయి. ఆ తరువాత అతడు ఎప్పుడు మాంత్రికుని దగ్గరకు వెళ్ళుతున్నా దారిలో ఆ రాహిబ్ వద్ద కూర్చొనేవాడు. ఆలస్యంగా వచ్చినందుకు ఆ మాంత్రికుడు అతడిని దండించేవాడు. ఆ యువకుడు రాహిబ్ కు ఈ విషయం గురించి చెప్పాడు. దానికి రాహిబ్ ఇలా అన్నాడు: “నీవు మాంత్రికుడిని గురించి భయపడుతున్నట్లైతే, మీ ఇంటివాళ్ళు ఆపినారు అని చెప్పు, మరి మీ ఇంటివాళ్ళను గురించి భయపడుతున్నట్లైతే ఆ మాంత్రికుడు ఆపినాడు అని చెప్పు.” ఇలా రోజులు గడుస్తుండగా, ఒకరోజు దారిలో ఒక పెద్ద, భయంకరమైన జంతువు కనిపించింది. అది ప్రజలను ఆ దారిపై నడవకుండా భయభ్రాంతులను చేస్తున్నది. అపుడు ఆ యువకుడు తనలో తాను ఇలా అనుకున్నాడు: “ఈ రోజు నేను తెలుసుకుంటాను ఆ మాంత్రికుడు గొప్పవాడో లేదా ఆ రాహిబ్ గొప్పవాడో." అతడు ఒక రాయిని చేతిలోనికి తీసుకుని: “ఓ అల్లాహ్! ఒకవేళ ఆ రాహిబ్ విషయం నీకు ఆ మాంత్రికుని విషయం కంటే అత్యంత ప్రియమైనది అయితే, ఈ జంతువును చంపి ప్రజలు ఈ దారిపై నడిచేలా చేయి” అంటూ ఆ రాయిని ఆ జంతువు పైకి విసిరాడు. దానితో అది చనిపోయింది. ప్రజలు ఆ దారిపై స్వేచ్ఛగా నడవసాగారు. తరువాత అతడు ఆ రాహిబ్ వద్దకు వచ్చి జరిగిన విషయం అతని తెలియజేసాడు. అపుడు ఆ సన్యాసి ఆ యువకునితో ఇలా అన్నాడు: ఉన్న “కుమారా! ఈ రోజు నీవు నాకంటే గొప్పవాడవు అయ్యావు. నేను ఏదైతే చూసినానో నీవు దానిని సాధించినావు. అనతి కాలములోనే నీవు పరీక్షకు గురిచేయబడతావు. ఒకవేళ నీవు పరీక్షకు గురిచేయబడితే నా పేరు బయట పెట్టకు.” తరువాత ఆ యువకుడు అల్లాహ్ అనుమతితో పుట్టుగ్రుడ్డివారిని, కుష్ఠు వ్యాధి రోగులను, ఇతర వాధిగ్రస్తులను నయం చేయసాగినాడు. రాజుగారి ఆస్థానములోని సహచరుడు ఒకడు కంటి చూపు కోల్పోయి గ్రుడ్డివాడైపోయాడు. అతడు ఆ యువకుని గురించి విన్నాడు. అతడు చాలా కానుకలతో ఆ యువకుని వద్దకు వచ్చి అతనితో ఇలా అన్నాడు: “నీవు ఒకవేళ నాకు నయం చేసినట్లైతే ఈ కానుకలన్నీ నీవే”. దానికి ఆ యువకుడు ఇలా అన్నాడు: “నేను ఎవరికీ నయం చేయను, అల్లాహ్’ మాత్రమే నయం చేయువాడు. ఒకవేళ నీవు అల్లాహ్’ను విశ్వసించినట్లైతే, నీకు నయం చేయమని నేను ఆయనను వేడుకుంటాను మరియు ఆయన నయం చేస్తాడు.” అతడు అల్లాహ్ ను విశ్వసించినాడు మరియు అల్లాహ్ అతనికి నయం చేసినాడు. తరువాత అతడు రాజు గారి వద్దకు వెళ్ళి ఆయన సభలో, అతడు సాధారణంగా ఎక్కడైతే కూర్చుంటాడో, అక్కడ కూర్చున్నాడు. అతడిని చూసి రాజు అతనితో ఇలా అన్నాడు: “నీ కంటి చూపు తిరిగి వచ్చేలా చేసింది ఎవరు?” అతడు ఇలా అన్నాడు: “నా ప్రభువు”. దానికి రాజు: “నేను కాక నీకు మరొక ప్రభువు కూడా ఉన్నాడా?” అతడు ఇలా అన్నాడు: “నా ప్రభువు మరియు నీ ప్రభువు కూడా అల్లాహ్’యే”. రాజు అతడిని తీసుకు వెళ్ళి తీవ్రంగా హింసించినాడు. చివరికి అతడు ఆ యువకుడి గురించి వెల్లడించినాడు. ఆ యువకుడు రాజు వద్దకు తీసుకు రాబడినాడు. రాజు అతనితో ఇలా అన్నాడు: “కుమారా! నీవు నేర్చుకున్న మంత్రజాలం పుట్టుగ్రుడ్డి, కుష్ఠు రోగములను నయం చేయడమేకాక ఇంకా నీవు అలా అలా చేసేవరకూ చేరుకుంది.” దానికి ఆ యువకుడు ఇలా అన్నాడు: “నేను ఎవరికీ స్వస్థత చేకూర్చను. స్వస్థత చేకూర్చేవాడు కేవలం అల్లాహ్’యే”. రాజు అతడిని కూడా తీసుకు వెళ్ళి తీవ్రంగా హింసించినాడు. చివరికి అతడు ఆ రాహిబ్ గురించి వెల్లడించినాడు. అపుడు ఆ రాహిబ్ తీసుకురాబడినాడు; అతడికి “నీ ధర్మాన్ని వదిలి వేయి” అని ఆదేశించబడింది. అతడు నిరాకరించినాడు. రాజు ఒక రంపాన్ని తెప్పించి అతడి తల మధ్యలో ఉంచి, అతడి శరీరాన్ని నిలువుగా రెండు ముక్కలుగా చీల్చినాడు. తరువాత రాజు యొక్క అనుచరుడు తీసుకు రాబడినాడు, అతనికి “నీ ధర్మాన్ని వదిలివేయి” అని ఆదేశించడం జరిగింది. దానికి అతడు నిరాకరించినాడు. అతని తల మీద కూడా రంపాన్ని ఉంచి అతడిని కూడా నిలువుగా రెండు ముక్కలుగా చీల్చడం జరిగింది. తరువాత ఆ యువకుడు తీసుకు రాబడినాడు. అతడిని కూడా అతని ధర్మాన్ని వదిలి వేయమని ఆదేశించడం జరిగింది. దానికి అతడు కూడా నిరాకరించినాడు. రాజు తన సహచరులలో ముగ్గురు నుండి పది మంది వరకు భటులను ఎన్నుకుని, వారికి అతడిని అప్పగించినాడు. వారితో రాజు ఇలా అన్నాడు: “ఇతడిని ఫలానా పర్వతం వద్దకు తీసుకు వెళ్ళండి, అతనితో పాటు పర్వతం మీదకు ఎక్కండి, ఒకవేళ తడు తన ధర్మాన్ని వదిలి వేయనట్లైతే అతడిని పర్వతం పై నుండి క్రిందకు విసిరివేయండి”. వారు అతడిని తీసుకుని వెళ్ళి అతనితో పాటు పర్వతం పై భాగానికి చేరుకున్నారు. ఆ యువకుడు ఇలా దుఆ చేసాడు: “అల్లాహుమ్మ అక్’ఫినీహిం బిమా షి’త” (ఓ అల్లాహ్, నువ్వు ఎలా కోరుకుంటే అలా (నీకు ఇష్టమైన విధంగా) నన్ను వీరి నుండి రక్షించు). దానితో పర్వతం కంపించి తీవ్రంగా కంపించింది; రాజు యొక్క అనుచరులు పర్వతం పైనుండి క్రిందకు పడిపోయారు. ఆ యువకుడు నడుచుకుంటూ రాజువద్దకు వెళ్ళాడు. రాజు అతడిని చూసి ఇలా అడిగాడు: “నీ వెంట వెళ్ళిన సహచరులకు ఏమైంది?” అతడు ఇలా అన్నాడు: “అల్లాహ్ వారి నుండి నన్ను రక్షించినాడు.” దానితో రాజు తన సహచరుల మరొక సమూహానికి అతడిని అప్పగించి వారితో ఇలా అన్నాడు: “ఇతడిని ఒక పడవలో సముద్రం మధ్యకు తీసుకు వెళ్ళండి. ఇతడు తన ధర్మాన్ని వదిలివేసినాడా సరే, లేకపోతే ఇతడిని సముద్రం లోనికి విసిరి వేయండి.” వారు అతడిని తీసుకెళ్లారు, అక్కడ అతను ఇలా దుఆ చేసాడు: “అల్లాహుమ్మ అక్’ఫినీహిం బిమా షి’త” (ఓ అల్లాహ్, నువ్వు ఎలా కోరుకుంటే అలా, (నీకు ఇష్టమైన విధంగా) వీరి నుండి నన్ను రక్షించు). అప్పుడు ఓడ తిరగబడింది మరియు వారు మునిగిపోయారు, మరియు అతను రాజు వద్దకు నడుచుకుంటూ వచ్చాడు. రాజు అతడిని ఇలా అడిగాడు: “నీ వెంట వెళ్ళిన సహచరులకు ఏమైంది?” ఆ యువకుడు రాజుతో ఇలా అన్నాడు: “అల్లాహ్ వారి నుండి నన్ను రక్షించినాడు.” ఆ యువకుడు రాజుతో ఇంకా ఇలా అన్నాడు: “చూడు, నేను ఆదేశించిన విధంగా చేస్తే తప్ప నీవు నన్ను చంపలేవు”. రాజు అడిగాడు “అది ఏమిటి?” ఆ యువకుడు ఇలా అన్నాడు: “ప్రజలను ఒక ప్రధానమైన కూడలిలో సమావేశపరిచి, నన్ను ఒక చెట్టు కాండానికి సిలువ వేయి. తరువాత నా అంబులపొది నుండి ఒక బాణాన్ని తీసుకొని, ఆ బాణాన్ని వింటిలోనికి ఎక్కించి, “ఈ యువకుని ప్రభువు అయిన అల్లాహ్ నామమున (ఈ బాణం వదులు తున్నాను)” అని పలికి బాణాన్ని వదులు. అలా చేస్తేనే నీవు నన్ను చంపగలుగుతావు”. యువకుడు చెప్పిన విధంగానే రాజు ఒక ప్రధాన ప్రదేశములో ప్రజలందరినీ సమావేశపరిచినాడు. యువకుడిని ఒక చెట్టు కాండానికి శిలువ వేసినాడు. ఆ బాలుని అంబుల పొది నుండి ఒక బాణాన్ని తీసి విల్లు ఎక్కుపెట్టి ఇలా పలికినాడు: “ఈ యువకుని ప్రభువు అయిన అల్లాహ్ నామమున (ఈ బాణాన్ని వదులుతున్నాను)” అంటూ బాణాన్ని వదిలినాడు. ఆ బాణం సూటిగా వెళ్ళి ఆ యువకుని కన్ను మరియు చెవికి మధ్య కణతను తాకింది. ఎక్కడైతే బాణం తాకిందో అక్కడ కణతపై చేయి ఉంచి అతడు చనిపోయాడు. అంతే, అక్కడ గుమిగూడిన ప్రజలందరూ ఒక్కసారిగా “మేము ఆ యువకుడి ప్రభువును విశ్వసించినాము, మేము ఆ యువకుడి ప్రభువును విశ్వసించినాము, మేము ఆ యువకుడి ప్రభువును విశ్వసించినాము” అని ఎలుగెత్తి అన్నారు. అప్పుడు ఆ రాజుతో ఇలా అనబడింది: “చూసారా, మీరు దేని గురించి అయితే భయపడినారో, అదే జరిగింది." "అల్లాహ్ సాక్షిగా! నీవు భయపడిన విషయం నీ పట్ల నిశ్చయంగా జరిగిపోయింది. ప్రజలు ఆ యువకుడిని అనుసరిస్తారు; వారందరూ అతని ప్రభువును విశ్వసిస్తారు." అపుడు రాజు రహదార్ల ప్రవేశ ద్వారాల వద్ద మైదానంలో గొప్ప దీర్ఘచతురస్రాకార గుంటలను త్రవ్వమని ఆదేశించినాడు. ఆ తర్వాత ఆ గోతులలో అగ్నిమంటలు రాజేసి, 'ఎవరు తమ ధర్మాన్ని విడిచి పెట్టరో వారిని అందులో పడవేయండి' అని ఆదేశించాడు. వారు రాజు ఆజ్ఞాపించినట్లుగానే చేశారు. చివరగా ఒక స్త్రీ తన పసిబిడ్డతో వచ్చింది, ఆమె అక్కడే ఆగిపోయి, అగ్నిలో దూకడానికి వెనకాడింది. అప్పుడు ఆమె పసిబిడ్డ (అల్లాహ్ మహిమ వలన శిశువు అయినా మాట్లాడాడు) ఆమెతో ఇలా అన్నాడు: “ఓ అమ్మా! సహనం వహించు, నిశ్చయంగా నీవు సత్యమార్గముపైనే ఉన్నావు”.
ఉబయ్ ఇబ్న్ కా’బ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ఒక వ్యక్తి ఉన్నాడు; నాకు తెలిసినంతవరకు, మస్జిదు నుండి అతని ఇల్లు ఉన్నంత దూరంగా ఇల్లు కలిగిన వారెవరూ నాకు తెలియదు. అతను ఎప్పుడూ జమా’అత్ తో నమాజును ఆచరించుటను కోల్పోలేదు. అతనితో ఇలా అనబడింది, లేదా నేనే అతనితో బహుశా ఇలా అని ఉంటాను: “మీరు ఒక గాడిదను కొనుక్కుంటే బాగుండేది, చీకటి రాత్రులలో, మండే ఇసుకలో దానిపై ఎక్కి రావడం తేలికగా ఉంటుంది.” దానికి అతడు ఇలా అన్నాడు “నా ఇల్లు మస్జిదు ప్రక్కన ఉండడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నేను మస్జిదుకు వచ్చినపుడు మరియు (మస్జిదు నుండి) తిరిగి ఇంటికి నా కుటుంబం వద్దకు వెళ్ళినపుడు నేను వేసే అడుగులు లెక్కించబడి నమోదు చేయబడాలని నేను కోరుకుంటున్నాను.” అది విని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ వాటినన్నింటినీ నీ కొరకు సేకరించినాడు.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ఉబయ్ ఇబ్న్ కాబ్ రదియల్లాహు అన్హు ఇలా తెలిపినారు: అన్సారులకు చెందిన ఒక వ్యక్తి మస్జిదు అన్నబవీ నుండి చాలా దూరంలో నివసించేవాడు, అయినప్పటికీ అతను ఒక్క నమాజును కూడా కోల్పోలేదు; అతను ప్రతి నమాజును ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఆచరించేవాడు. అతనితో ఇలా అనబడింది: “రాత్రి చీకటిలో మరియు పగటిపూట ఎండలో స్వారీ చేయడానికి మీరు ఒక గాడిదను కొనుక్కోగలిగితే బాగుండేది కదా”. దానికి అతను ఇలా జవాబిచ్చాడు: “నా ఇల్లు మసీదు పక్కన ఉండటం నాకు ఇష్టం లేదు. నేను మస్జిదుకు నడుచుకుంటూ రావడం, మరియు తిరిగి ఇంటికి నా కుటుంబం వద్దకు వెళ్ళడం అల్లాహ్ నా కొరకు నమోదు చేయాలని కోరుకుంటున్నాను.” అతని మాటలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చేరగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వాటన్నింటినీ అల్లాహ్ నీ కొరకు సమీకరించినాడు.”
విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉండగా ‘అల్ హౌలాఅ బింత్ తువైత్ ఇబ్న్ హబీబ్ ఇబ్న్ అబ్దిల్ ఊజ్జా’ నా వద్దకు వచ్చి వెళ్ళినది. నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో “ఆమె హౌలాఅ బింత్ తువైత్, ఆమె రాత్రుళ్లు (ఇబాదత్’లో) అసలు నిద్రపోదు అని ఆమెను గురించి చెప్పుకుంటారు” అన్నాను. అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “: “ఓహ్, ఆమె (ఇబాదత్’లో) రాత్రిపూట నిద్రపోదా! మీరు అనునిత్యం చేయగలిగే ఒక ఆచరణను ఎంచుకొండి; అల్లాహ్ సాక్షిగా, మీరు (మంచి పనులు చేయడంలో) అలసిపోనంత వరకు అల్లాహ్ కూడా (ప్రతిఫలం ప్రసాదించడంలో) అలసిపోడు."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఉమ్ముల్ ము’మినీన్ (విశ్వసుల మాతృమూర్తి అయిన) ఆయిషా రదియల్లాహు అన్హా, అల్ హౌలాఅ బింత్ తువైత్ రదియల్లాహు అన్హాతో ఉన్నపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాగానే ఆమె అక్కడి నుండి లేచి వెళ్ళిపోయినది. ఆయిషా రదియల్లాహు అన్హా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నారు: “ఈ స్త్రీ రాత్రి నిద్రపోదు, రాత్రంతా ఇబాదత్’లో గడిపేస్తుంది”. అపుడు ఆమె తనపై తాను చాలా కఠినంగా ఉండటాన్ని ఖండిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఆమె రాత్రిపూట నిద్రపోదా! మీరు క్రమం తప్పకుండా చేయగలిగినంత వరకు మాత్రమే సత్కార్యాలలో (ఇబాదాత్’లలో) పాల్గొనండి. అల్లాహ్ సాక్షిగా! అల్లాహ్ తన సద్గుణవంతులైన, విధేయులైన దాసులకు వారి విధేయత, మంచి పనులు మరియు సద్గుణ చర్యలకు ప్రతిఫలం ఇవ్వడంలో అలసిపోడు, వారు అలసిపోయి వాటిని చేయడం మానేసే వరకు.
అబీ బక్రత రదియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా తాను విన్నారని ఉల్లేఖించారు: [తమ వ్యవహారాల భాద్యతను ఒక స్త్రీకు అప్పచెప్పిన జాతి ఎన్నటికీ సాఫల్యం పొందజాలదు}
అల్ బుఖారీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్టపరిచినారు, ప్రజలు తమ వ్యవహారాలను – అది న్యాయాధిపత్యం, సార్వత్రిక అధికారం లేదా మంత్రిత్వ శాఖ అయినా సరే – ఒక స్త్రీకి అప్పగించినట్లయితే, వారు తాము కోరుకున్న దానిలో ఎన్నటికీ విజయం సాధించలేరు.
అబూ సయీద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “మీలో ఏమనిషి కూడా అతడు సత్యమేమిటో చూసి ఉండీ, లేదా సత్యమేమిటో తెలిసి ఉండీ, అతడు సత్యాన్ని మాట్లాడకుండా ప్రజల భయం అతడిని నిరోధించరాదు.”
అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) తన సహచరులకు ఒక ఉపన్యాసం ఇచ్చారు అందులో ఆయన(స) సిఫార్సు చేసిన విషయాలలో ప్రజల భయం, భీతి మరియు వారి శక్తి ఒక ముస్లిం సత్యాన్ని చూసి ఉన్నా లేదా సత్యమేమితో అతనికి తెలిసినా సత్యాన్ని మాట్లాడకుండా లేదా ఆజ్ఞాపించకుండా, అవి అతనికి నిరోధము కారాదని అన్నారు.
ఉథ్మాన్ అష్షహ్హామ్ ఇలా పలికినారు: "నేను మరియు ఫర్కద్ అస్సబఖీ కలిసి, ముస్లిమ్ ఇబ్న్ అబూ బక్రా వద్దకు వెళ్లాం. ఆయన తన పొలంలో ఉన్నారు. మేము ఆయన వద్దకు వెళ్లి ఇలా అడిగినాము: 'మీరు మీ తండ్రి (అబూ బక్రా) నుండి ఫిత్నా (కలహాలు, గందరగోళం) గురించి ఏదైనా హదీథు విన్నారా?' దానికి ఆయన ఇలా చెప్పినారు: 'అవును, నేను నా తండ్రి అబూ బక్రా (రదియల్లాహు అన్హు) ఇలా చెప్పడాన్ని విన్నాను అని పలికి, ఇలా అన్నారు: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "నిశ్చయంగా కలహాలు (ఫిత్నా) సంభవిస్తాయి. తెలుసుకోండి! ఆ తర్వాత ఒక ఫిత్నా వస్తుంది. దానిలో కూర్చుని ఉండటం, నడుస్తున్నవాడి కంటే మేలు. నడుస్తున్నవాడు, దానివైపు పరిగెత్తేవాడి కంటే మేలు. ఆ కలహం సంభవించినప్పుడు, ఎవరికి ఒంటెలు ఉంటే వారు తమ ఒంటెల వద్దకు చేరుకోండి. ఎవరికి గొర్రెలు ఉంటే వారు తమ గొర్రెల వద్దకు చేరుకోండి. ఎవరికి భూమి ఉంటే వారు తమ భూమి వద్దకు చేరుకోండి." ఒక వ్యక్తి అడిగాడు: "ఓ అల్లాహ్ ప్రవక్తా! ఎవరికీ ఒంటెలు లేకుండా, గొర్రెలు లేకుండా, భూమి లేకుండా ఉంటే?" దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: "అతను తన కత్తిని తీసుకుని, దాని అంచుతో ఒక రాతిపై కొట్టాలి (కత్తిని నిరుపయోగం చేసుకోవాలి). తర్వాత సాధ్యమైతే ఏ విధంగానైనా తప్పించుకుని పారిపోవాలి. ఓ అల్లాహ్! నేను (ఈ సందేశాన్ని) చేరవేశానా? ఓ అల్లాహ్! నేను చేరవేశానా? ఓ అల్లాహ్! నేను చేరవేశానా?" మరొక వ్యక్తి ఇలా అడిగాడు: "ఓ అల్లాహ్ ప్రవక్తా! నన్ను బలవంతంగా రెండు పక్షాలలో ఒకదానిలో చేర్చి, అక్కడ ఎవరైనా నన్ను కత్తితో కొట్టి చంపితే, లేదా బాణం వచ్చి నన్ను చంపితే?" ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: "అతను (నిన్ను బలవంతం చేసినవాడు) నీ పాపాన్ని మరియు తన పాపాన్ని మోసుకుంటాడు. అతను నరక వాసులలో ఒకడు అవుతాడు."
ముస్లిం నమోదు చేసినారు:ఉథ్మాన్ అష్షహామ్ మరియు ఫర్ఖద్ అస్-సబ్ఖీలు గొప్ప సహాబా అబూ బక్రా రదియల్లాహు అన్హు కుమారుడైన ముస్లింను ఇలా అడిగారు, “ముస్లింల మధ్య జరిగే ఫిత్నాల అంటే కష్టాలు మరియు పోరాటాల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి మీ తండ్రి ఏదైనా హదీథు విన్నారా?” అతను ఇలా అన్నాడు, “అవును, ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తన మరణం తర్వాత ఫిత్నాలు అంటే కష్టాలు ఉంటాయని మరియు ఈ ఫిత్నాలను విస్మరించి కూర్చోవడం అనేది వాటిని ఊహించకుండా లేదా వాటి కోసం వెతకకుండా వాటి గుండా నడవడం కంటే మంచిదని మాకు తెలియజేశారు, మరియు వాటి గుండా నడవడం అనేది వాటి వైపు పరుగెత్తడం, వాటిని వెతకడం మరియు వాటిలో పాల్గొనడం కంటే మంచిది అన్నారు.” అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తన కాలంలో ఎవరికైనా ఏదైనా ఫిత్రాను అంటే కష్టాలు లేదా బాధలు ఎదురై ఆశ్రయం పొంద వలసి వస్తే, అక్కడ ఆశ్రయం పొందమని సలహా ఇచ్చారు - ఒంటెలు మేస్తున్న వారు తమ ఒంటెలను చేరాలి, గొర్రెలు మేస్తున్న వారు తమ గొర్రెలను చేరాలి, భూమి మరియు పొలం ఉన్న వారు తమ భూమిని చేరాలి. ఒక వ్యక్తి ఇలా అడిగినాడు: ఓ రసూలుల్లాహ్! ఆశ్రయం కోసం ఒంటెలు, గొర్రెలు లేదా భూమి లేని వ్యక్తి గురించి మీరు ఏమంటారు? దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అతడు తన ఆయుధాన్ని తీసుకొని, బండరాయిపై కొట్టి, నాశనం చేయాలి, ఆపై పారిపోయి తనను మరియు తన పిల్లలను రక్షించుకోగలిగేలా అక్కడి నుండి తప్పించుకోవాలి. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మూడుసార్లు సాక్ష్యం కొరకు ఇలా పలికినారు: ఓ అల్లాహ్! నేను సందేశాన్ని అందించానా? ఓ అల్లాహ్! నేను సందేశాన్ని అందించానా? అల్లాహ్! నేను సందేశాన్ని అందించానా? అపుడు ఒక వ్యక్తి ఇలా అన్నాడు: ఓ రసూలుల్లాహ్! నేను రెండు వరుసలలో నుండి ఒకదానితో లేదా రెండు సమూహాలలో నుండి ఒకదానితో పాల్గొనవలసి వచ్చినపుడు, ఒక వ్యక్తి తన కత్తితో నన్ను నరికితే, లేదా ఒక బాణం వచ్చి నన్ను చంపితే, దాని గురించి మీరు ఏమంటారు? ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: అతడు తన పాపాన్ని మరియు తాను చంపిన వ్యక్తి పాపాన్ని మోస్తాడు మరియు పునరుత్థాన దినాన అతడు నరకవాసులలో ఉంటాడు.
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నైతిక విలువలు మరియు నైతికతకు సంబంధించినంత వరకూ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జనులందరిలోనూ అత్యుత్తమములు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారునైతిక విలువలు మరియు సత్శీలతకు సంబంధించింత వరకూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మానవులందరిలోనూ అత్యుత్తమములు, అత్యంత పరిపూర్ణత గలవారు. వ్యక్తిత్వము మరియు మూర్తిత్వము పరంగా – ఉదాహరణకు కరుణపూరితమైన సంభాషణకు, మంచి పనులు చేయుటకు, దీప్తివంతమైన ముఖ వర్ఛస్సుకు మరియు ఎవరికైనా కీడు లేదా హాని తలపెట్టుటకు దూరంగా ఉండుట మరియు ఎవరైనా తనకు కీడు గానీ, హాని గానీ తలపెట్టితే దానిపై సహనం వహించుట మొదలైన గుణగణాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రథములు.
సాద్ ఇబ్న్ హిషాం ఇబ్న్ ఆమిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ఆయిషా రజియల్లాహు అన్హా వద్దకు వెళ్ళి ఇలా ప్రశ్నించాను: “ఓ విశ్వాసుల మాతృమూర్తీ! రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్థిరప్రకృతి, శీలసంపద, వ్యక్తిత్వము గురించి వివరించండి”. దానికి ఆమె “ఏం, నీవు ఖుర్’ఆన్ చదవలేదా?” అని ప్రశ్నించారు. నేను “చదివాను” అన్నాను. ఆమె “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వము, శీలసంపద పూర్తిగా ఖుర్’ఆనే” అన్నారు
ముస్లిం నమోదు చేసిన ఒక పెద్ద హదీథులోని భాగము:విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయిషా రజియల్లాహు అన్హా ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్థిరప్రకృతి, శీలసంపద, వ్యక్తిత్వమును గురించి చెప్పమని అడగడం జరిగింది. జవాబుగా ఆమె ఒక సమగ్రమైన పదాన్ని సూచించినారు. ప్రశ్నించిన వ్యక్తిని ఆమె, గుణగణాలన్నింటి సంపూర్ణత్వాన్ని కలిగిన పవిత్ర ఖుర్’ఆన్ వైపునకు మరలించినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నడవడి, నైతికత, శీలసంపద, వ్యక్తిత్వములను గురించి, ఆయిషా రజియల్లాహు అన్హా – వారు ఖుర్’ఆన్ యొక్క స్థిరప్రకృతి పై ఉన్నారని అన్నారు. ఖుర్’ఆన్ లో ఏమి ఆదేశించ బడినదో వారు దానిపై స్థిరంగా ఉండేవారు, అందులో ఏమి నిషేధించబడినదో వారు దానినుండి దూరంగా ఉండేవారు. వారి స్థిరప్రకృతి ఖుర్’ఆన్ ప్రకారం ఆచరించడమే అయి ఉండేది. ఖుర్’ఆన్ విధించిన హద్దులలో ఉండుట, సభ్యత, మర్యాదలలోఖుర్’ఆన్ ప్రకారం నడుచుకొనుట చేసేవారు. ఖుర్’ఆన్ లో తెలుపబడిన ఉదాహరణలు, ఉపమానాలు మరియు గాధలను అనుసరించడం పట్ల శ్రధ్ధ వహించేవారు.