





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అర్ఫజహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను: “మీరు మీ విషయాల కొరకు ఒక వ్యక్తిని (మీ నాయకునిగా/పాలకునిగా) అంగీకరించినపుడు, (మీ నాయకునికి ప్రకటించిన) మీ సంఘీభావాన్ని ముక్కలు చేయాలనే, లేక మీ జమాఅత్ ను విడదీయాలనే తలంపుతో ఎవరైనా మీ వద్దకు వచ్చినట్లయితే – అతడిని చంపివేయండి.”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఒకవేళ ముస్లిములందరూ (తమ విషయాల కొరకు) ఒక పాలకుని / నాయకుని వద్ద జమ అయితే (నాయకునిగా ఎంచుకుంటే), మరియు అందరూ ఒక జమాఅత్ గా ఉంటే, ఎవరైనా వచ్చి (ఎంచుకున్న) నాయకుని అధికారాన్ని బలవంతంగా తీసుకొన దలిచితే (లాక్కొన దలిచితే), లేక ముస్లిముల జమాఅత్ ను ముక్కలుగా చేయజూస్తే – ముస్లిములపై విధి ఏమిటంటే - ముస్లిములందరూ అతడిని వారించాలి, (అవసరమైతే) అతడితో యుద్ధము చేయాలి. ఇది అటువంటి తిరుగుబాటుదారుని కీడును దూరం చేయుట కొరకు మరియు ముస్లిముల రక్తమును సంరక్షించుట కొరకు.
అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా జిహాద్’లలో ఉత్తమమైన జిహాద్ ఏమిటంటే కృూరుడు, అణచివేతదారుడు, దౌర్జన్యపరుడు అయిన పాలకుని ఎదుట న్యాయమైన మాట మాట్లాడటం.”
అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: అల్లాహ్ మార్గములో చేయు వివిధ రకాల జిహాదులలో, అత్యంత ఉత్తమమైనది, మరియు ప్రయోజనకరమైనది – అన్యాయానికి పాల్బడుతూ ఉండే, కృూరుడు, అణచివేతదారుడు, దౌర్జన్యపరుడు అయిన పాలకుని ఎదుట న్యాయమైన మాట మాట్లాడటం – ఎందుకంటే పాలకుని ఎదుట ఆ విధంగా మాట్లాడే వ్యక్తి ‘మంచి చేయమని ఆదేశించండి, చెడును నిషేధించండి’ అనే షరియత్ యొక్క ఆదేశంపై అనుసరించినాడు గనుక; అది అటువంటి పాలకుని ఎదుట నిలబడి మాట్లాడడం అయినా, లేక అతనికి లేఖ ద్వారా తెలియజేయడం అయినా, చర్య ద్వారా అతని అవగతమయ్యేలా చేయడం అయినా – ప్రజలకు లాభాన్ని చేకూర్చే, హానిని నివారించేది ఏదైనా కావచ్చు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నా తరువాత అత్యంత స్వార్థపరత్వము, మరియు మీరు ఇష్టపడని ఎన్నో విషయాలను చూస్తారు.” అపుడు అక్కడ ఉన్నవారు “మరి (అటువంటి పరిస్థుతులలో) మా కొరకు మీ ఆదేశము ఏమిటి ఓ ప్రవక్తా ?” అని అడిగారు. దానికి ఆయన “మీ విధులను నిర్వర్తించండి, మీ హక్కుల కొరకు అల్లాహ్ ను ప్రార్థించండి” అన్నారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ముస్లిములపై పాలకులుగా వచ్చే వారిని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు – వారిలో కొందరు ముస్లిముల ధనాన్ని, మిగతా వ్యవహారాలను తమ గుత్తాధిపత్యములో ఉంచుకుంటారు, తమ ఇష్టం వచ్చినట్లు (విలాసాలకు) ఖర్చు చేస్తారు, ఆ ధనముపై, సంపదపై ముస్లిములకు ఉన్న హక్కును నిరాకరిస్తారు. మరియు వారిలో కొందరు ధర్మములో అభ్యంతరకరమైన పనులకు పాల్బడే వారు కూడా ఉంటారు. సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా ప్రశ్నించారు “అటువంటి పరిస్థితులలో మమ్మల్ని ఏమి చేయమంటారు, మా కొరకు మీ ఆదేశాము ఏమిటి ఓ ప్రవక్తా?” అని. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా అన్నారు “వారు (ఆ పాలకులు) ధనముపై, సంపదపై గుత్తాధిపత్యము కలిగి ఉండుట, పాలకుల మాట వినుట, వారికి విధేయత చూపుట మొదలైన మీ విధులను మీరు నిర్వర్తించకుండా అడ్డుకొన రాదు. మీరు సహనం వహించాలి. వారి మాట వినాలి, వారితో విభేధించవద్దు. వారికి విధేయత చూపండి. మరియు మీ హక్కుల కొరకు అల్లాహ్’ను ప్రార్థించండి – తద్వారా వారి లోపాలను సరి చేయమని, వారిలోని దుష్టత్వాన్ని, దుర్మార్గాన్ని, అధర్మాన్ని, అన్యాయాన్ని దూరం చేయమని,
అన్’ను’మాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: అల్లాహ్ నిర్దేశించిన హద్దులలో నిలిచి ఉండేవారి, మరియు వాటి లోపలే ఉండిపోయేవారి ఉపమానం ఓడపై (ఎక్కే ముందు పై అంతస్థులో ఎవరు ఉండాలి అని) లాటరీ వేయువాని వంటిది. అలా కొందరు ఓడ పై అంతస్థులో ఉంటారు, కొందరు ఓడ క్రింది అంతస్థులో ఉంటారు. త్రాగు నీటి కొరకు క్రింది అంతస్థులోని వారు పై అంతస్థుకు వెళ్ళినపుడు అక్కడ ఉన్నవారిని దాటుకుంటూ వెళ్ళవలసి వచ్చేది. దానితో వారు (క్రింది అంతస్తు వారు) ఇలా అన్నారు “ఓడలో మనం ఉంటున్న భాగములోనే ఒక రంధ్రము చేస్తే (త్రాగు నీటి కొరకు) మన పై ఉంటున్నవారికి ఇబ్బంది కలిగించము కదా”. ఒకవేళ వారిని (క్రింది అంతస్తు వారిని) వారు కోరిన విధంగా చేయడానికి వదిలేస్తే, అందరూ మునిగిపోతారు. ఒకవేళ దానిని (విషయాన్ని ఆపితే) తమ చేతులలోనికి తీసుకుంటే వారితో పాటు అందరూ రక్షింపబడతారు.
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – అల్లాహ్ విధించిన హద్దులలో నిలిచి ఉండే వారిని గురించి, అల్లాహ్ యొక్క ఆదేశాలపై స్థిరంగా ఉండే వారిని గురించి, మంచిని చేయమని ఆదేశించే వారి గురించి మరియు చెడును నిషేధించే వారి గురించి ఒక (అద్భుతమైన) ఉపమానం ద్వారా వివరిస్తున్నారు. అల్లాహ్ విధించిన హద్దులలో స్థిరంగా నిలిచి ఉండేవారి; మరియు సత్కార్యాలు చేయుటను వదిలి వేసి, దుష్కార్యాలకు, దుర్మార్గానికి పాల్బడేవారి – మరియు వారి కారణంగా సమాజపు ముక్తి మరియు రక్షణలపై పడే ప్రభావముల యొక్క ఉపమానము ఎటువంటిదంటే – ఓడ లోనికి ఎక్కే ముందు ఎవరు ఓడ పై అంతస్థులో కూర్చోవాలి, మరియు ఎవరు ఓడ క్రింది అంతస్థులో కూర్చోవాలి అని లాటరీ వేసుకున్న ప్రజలవంటిది. వారిలో కొందరు ఓడ పై భాగాన కూర్చోవడాన్ని గెలుచుకున్నారు, మరి కొందరు ఓడ క్రింది భాగములో కూర్చోవడాన్ని గెలుచుకున్నారు. క్రింది భాగాన కూర్చొన్న వారు త్రాగు నీటి కొరకు పై భాగానికి వెళ్ళినపుడు, అక్కడ ఉన్న వారిని దాటుకుంటూ వెళ్ళవలసి వచ్చేది. అందుకని క్రింది భాగములో కూర్చొన్నవారు ఇలా అనుకున్నారు: “ఒకవేళ మనం ఉంటున్న క్రింది భాగములోనే ఒక రంధ్రము చేసుకుంటే, మన పైన ఉన్న వారికి కష్టం కలిగించకుండా అందులో నుంచే మనం నీటిని తీసుకోవచ్చు; ”. ఒకవేళ పైన ఉన్నవారు, క్రింద ఉన్న వారిని అలా చేయడానికి వదిలివేస్తే, వారందరితో పాటు ఓడ పూర్తిగా మునిగి పోతుంది. ఒకవేళ వారు (పైన ఉన్నవారు) లేచి నిలబడి వారిని అలా చేయకుండా వారించి, వారిని అడ్డుకుంటే, అక్కడున్న రెండు సమూహాలు కూడా రక్షించబడతాయి.
అబూబక్ర్ అస్’సిద్దీఖ్ రజియల్లాహు అన్హు ఇలా పలికినారు: “ఓ ప్రజలారా! నిశ్చయంగా మీరు ఈ ఆయతును పఠిస్తారు: {يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا عَلَيْكُمْ أَنْفُسَكُمْ لاَ يَضُرُّكُمْ مَنْ ضَلَّ إِذَا اهْتَدَيْتُمْ}، [ఓ విశ్వాసులారా! మీరు మీ గురించి జాగ్రత్త పడండి. మీరు గనుక సన్మార్గంలో నడుస్తున్నట్లయితే, దారి తప్పిన వారు మీకు ఎలాంటి నష్టం కలిగించలేరు.....] (సూరహ్ అల్ మాఇదహ్ 5:105) మరియు నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా విన్నాను: “ప్రజలు ఒక దౌర్జన్యపరుడిని (లేక అణచివేతదారుని) చూసి కూడా, అతడిని అడ్డుకోకపోతే, అల్లాహ్ తన తరఫునుండి వారందరికీ శిక్ష విధిస్తాడు.”
అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ కుబరా, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:అబూబక్ర్ అస్’సిద్దీఖ్ రజియల్లాహు అన్హు ఇలా తెలియజేస్తున్నారు: ప్రజలు ఖుర్’ఆన్ యొక్క ఈ ఆయతును పఠిస్తారు: {يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا عَلَيْكُمْ أَنْفُسَكُمْ لاَ يَضُرُّكُمْ مَنْ ضَلَّ إِذَا اهْتَدَيْتُمْ} [المائدة: 105]. [ఓ విశ్వాసులారా! మీరు మీ గురించి జాగ్రత్త పడండి. మీరు గనుక సన్మార్గంలో నడుస్తున్నట్లయితే, దారి తప్పిన వారు మీకు ఎలాంటి నష్టం కలిగించలేరు.....] (సూరహ్ అల్ మాఇదహ్ 5:105) ఆ ఆయతును పఠించడం ద్వారా వారు – తమ గురించి తాము జాగ్రత్తపడితే చాలునని (అంటే తాము సంస్కారవంతంగా ఉంటే చాలునని); తాము సరియైన మార్గములో నడిస్తే చాలునని, ఆ తర్వాత మార్గభ్రష్ఠుడైన వాని మార్గభ్రష్ఠత్వము వల్ల తమకు నష్టం గానీ, కీడుగానీ జరుగదని; మంచి చేయమని ఆఙ్ఞాపించవలసిన అవసరం, చెడును నిషేధించవలసిన అవసరం తమకు లేదని అర్థం చేసుకుంటారు. కనుక అబూబక్ర్ అస్’సిద్దీఖ్ రజియల్లాహు అన్హు దాని అర్థము అది కాదు అని, తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా విన్నాను అని వారికి తెలియజేస్తున్నారు: ప్రజలు అణచివేతదారుడిని చూసి కూడా అతడిని అణచివేతకు, దౌర్జన్యానికి పాల్బడుట నుండి నిరోధించే శక్తి, సామర్థ్యము ఉండి కూడా అతడిని నిరోధించకపోతే, అల్లాహ్ తన తరఫు నుండి ప్రతి ఒక్కరినీ శిక్షించే అవకాశం ఉంది, తప్పు చేసిన వానిని మరియు దాని గురించి మౌనంగా ఉన్న వానిని కూడా.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు. “మానవుల శరీరంలో ప్రతి కీలు కొరకు, సూర్యుడు ఉదయించే దినాలలోని ప్రతి దినమూ, ఒక దానము (చేయవలసి) ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయం చేయడం ఒక దానం అవుతుంది; ఒక వ్యక్తికి అతని వాహనం విషయములో – అతడు దాని పైకి ఎక్కుటలో గానీ, లేక అతని ప్రయాణ సామాగ్రిని వాహనం పైకి చేరవేయుటలోగానీ సహాయపడుట ఒక దానం అవుతుంది; ఒక మంచి మాట దానం అవుతుంది; జమా’అత్ తో సలాహ్ (నమాజు) ఆచరించుటకు వేసే ప్రతి అడుగూ దానం అవుతుంది; మరియు మార్గం నుండి హానికరమైన వస్తువులను తొలగించడం అనేది ఒక దానం అవుతుంది.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, యుక్తవయస్సుకు చేరుకున్న ప్రతి ముస్లిం తన శ్రేయస్సు కొరకు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు స్వచ్ఛందంగా కృతజ్ఞతలు తెలుపుతూ తన ఎముకలలోని కీళ్ల సంఖ్యకు బదులు ప్రతిరోజూ ఒక్కో కీలుకు ఒక దానం ఇవ్వాలని వివరించారు; ఎందుకంటే ఆయన తన ఎముకలను ముడుచుకునేలా మరియు విస్తరించగలిగేలా కీళ్ళుగా చేసాడు గనుక. మరియు ఈ దానము మంచి పనులు చేయడం వల్ల పూర్తి అవుతుంది; ఇది ధనాన్ని దానంగా ఇవ్వడంపై ఆధారపడి ఉండదు; మంచిపనులు అంటే ఉదాహరణకు: ఇద్దరు వ్యక్తుల మధ్య, లేక రెండు వర్గాల మధ్య న్యాయం చేయడం, వారి మధ్య సయోధ్య కుదర్చడం – అది దానం అవుతుంది. తన వాహనం పైకి ఎక్కలేని వ్యక్తిని, అతడి వాహనం పైకి చేర్చుట, లేక అతని ప్రయాణ సామాగ్రిని ఎత్తి వాహనంపై పెట్టుట వంటివి కూడా దానంగా పరిగణించబడతాయి. ఒక మంచి మాట, అల్లాహ్ యొక్క స్మరణలో ఒక స్మరణ వాక్యమును పలుకుట, దుఆ చేయుట, మరియు సలాం చేయుట – మొదలైనవన్నీ దానములే. అలాగే సలాహ్ (నమాజు) ఆచరించుట కొరకు నీవు వేసే ప్రతి అడుగు కూడా ఒక దానమే అవుతుంది. ఇంకా మార్గము నుండి ప్రమాదకరమైన మరియు హానికరమైన వస్తువులను తొలగించడం కూడా దానమే.
వాఇల్ అల్ హద్రమీ ఉల్లేఖన: “సలమహ్ ఇబ్న్ యజీద్ అల్ జు’ఫీ (రదియల్లాహు అన్హు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగినారు: “ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! పాలకులు మాపై నిలబడి (అంటే బలవంతంగా) తమ హక్కులను మా నుండి కోరుతూ (తీసుకుంటూ); మాకు చెందిన హక్కులను నిరాకరించడాన్ని మీరు చూసినారా? అటువంటి స్థితిలో, మమ్ములను ఏమి చేయమని మీరు ఆదేశిస్తారు? అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడి నుండి తన ముఖాన్ని మరో వైపునకు త్రిప్పుకున్నారు. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మళ్ళీ ప్రశ్నించాడు. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ముఖాన్ని అతడి నుండి మరో వైపునకు త్రిప్పుకున్నారు. అతడు రెండోసారో లేక మూడోసారో మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించాడు. అపుడు అల్-అష్’అత్ ఇబ్న్ ఖైస్ (రదియల్లాహు అన్హు) అతడిని ప్రక్కకు లాగినాడు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “(వారు చెప్పినది) వినండి మరియు అనుసరించండి. ఎందుకంటే, వారికి అప్పగించబడిన బాధ్యత వారిపై ఉంది. మీకు అప్పగించబడిన బాధ్యత మీపై ఉంది.”
ముస్లిం నమోదు చేసినారు:ప్రజలు తమ మాట వినాలని, తు.చ. తప్పకుండా పాటించాలను, అది తమ హక్కు అని, తమ హక్కును ప్రజల నుండి బలవంతంగా లాక్కుంటూ, వారికి న్యాయం చేయడాన్ని, యుద్ధంలో గెలిచిన సంపదను పంచడాన్ని, వారి సమస్యలను పరిష్కరించడాన్ని, వారి కష్టాలను తొలగించడాన్ని నిరాకరించే పాలకుని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించడం జరిగింది “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం!, అటువంటి సందర్భములో మమ్ములను ఏమి చేయమంటారు, మీ ఆదేశము ఏమిటి?” అని. అది తనకు ఇష్టం లేని విషయం, తాను అసహ్యించుకునే విషయం అన్నట్లుగా, ఆ ప్రశ్నించిన వ్యక్తి నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ముఖాన్ని మరో వైపునకు త్రిప్పుకున్నారు. కానీ ఆ ప్రశ్నించిన వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అదే ప్రశ్న రెండోసారి, మూడోసారి కూడా అడిగాడు. అపుడు అల్-’అష్’అత్ బిన్ ఖైస్ (రదియల్లాహు అన్హు) అతడిని మౌనంగా ఉండమని పక్కకు లాగినారు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతని ప్రశ్నకు స్పందిస్తూ ఇలా సమాధానమిచ్చారు: “వారు చెబుతున్న దానిని వినండి, మరియు వారి ఆదేశాలను పాటించండి;
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ’నిశ్చయంగా ధర్మము సులభమైనది’ఎవరైతే దాని పట్ల కఠినంగా వ్యవహరిస్తారో అది వారి పై పైచేయి సాధిస్తుంది (అతన్ని అలసటకు గురిచేస్తుంది) కాబట్టి ఋజుమార్గాన్ని అవలంభించండి,ధర్మానికి దగ్గరగా ఉండండి, ప్రజలకు శుభవార్తలను అందించండి,అలాగే ఉదయం సాయంత్రం మరియు రాత్రుల్లో ఆరాధన ద్వారా సహాయాన్ని పొందండి.
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు - ఇస్లాం ధర్మం తన అన్ని వ్యవహారాలలో సౌలభ్యము మరియు సులభతరం అనే విషయాల మీద నిర్మించబడింది. (ధర్మానుసరణలో) ఏదైనా ఆచరణను పరిపూర్ణంగా ఆచరించగల సమర్థ, సామర్థ్యము లేకపోవడం మరియు స్వంత అవసరాలు అనేవి సౌలభ్యాన్ని తప్పనిసరి చేస్తాయి. ఎందుకంటే ధర్మానికి సంబంధించిన ఆచరణలలో (ఆచరణను కఠినంగా ఆచరించడం, అందులో) లోతుగా మునిగిపోవడం, ఆ ఆచరణలో సౌమ్యతకు దూరం కావడం అనేది – ఆ ఆచరణలో అసమర్థతకు దారి తీస్తుంది. ఆ కారణంగా అతడు ఆ ఆచరణను ఆచరించుట పూర్తిగా ఆపివేయవచ్చు, లేదా అందులో కొంత భాగాన్ని నిలిపివేయవచ్చు. తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ధర్మాన్ని అనుసరించుటలో, ధర్మానికి చెందిన ఆచరణలను ఆచరించుటలో ‘అతి’ చేయరాదని (ధర్మాన్ని అనుసరించుట తనపై కఠినం చేసుకోరాదని), సౌలభ్యపు మార్గాన్ని అనుసరించాలని హితబోధ చేసినారు. అయితే దాసుడు తనపై విధి చేయబడిన ధార్మిక ఆచరణలను ఆచరించుటలో ఎక్కడా తక్కువ చేయరాదని; అలాగే (ఆచరించుటలో) తన శక్తి సామర్థ్యాలకు మించిన భారాన్ని తనపై వేసుకోరాదని; అలాగే ఏదైనా (ధార్మిక) ఆచరణను పరిపూర్ణంగా ఆచరించలేకపోతే, పరిపూర్ణత్వానికి సాధ్యమైనంత దగ్గరగా ఉండేలా కృషి చేయాలని హితబోధ చేసినారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిరంతరం చేసే (ధార్మిక) ఆచరణకు 'అది చిన్నదైనా, దానిని పూర్తిగా ఆచరించగల సామర్థ్యం లేని వారికి' గొప్ప ప్రతిఫలం గురించి శుభవార్త అందించారు. ఎందుకంటే ఆ అసమర్ధతలో అతని ప్రమేయం ఏమీ లేకపోయినట్లైతే, అతనికి లభించే ప్రతిఫలంలో కూడా తక్కువ చేయుట జరుగదు. వాస్తవములో ఈ ప్రపంచము, పరలోకానికి బదిలీ కావడానికి ఒక ప్రయాణము స్థలము వంటిది. కనుక ఈ నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించడానికి మూడు క్లిష్ట సమయాలలో అల్లాహ్ యొక్క సహాయాన్ని అర్థించమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశిస్తున్నారు. మొదటిది: ప్రాతఃకాల సమయమున: దినపు ప్రారంభ సమయములో; ఫజ్ర్ నమాజుకు మరియు సూర్యుడు ఉదయించడానికి మధ్య. రెండవది: అపరాహ్ణ సమయమున అంటే మిట్టమధ్యాహ్నం తరువాత. మూడవది: రాత్రి సమయాన: రాత్రి మొత్తము భాగము కానీ, లేక రాత్రిలో కొద్ది భాగము కానీ. ఎందుకంటే రాత్రి పూట (ఆరాధనకు సంబంధించిన) ఏ ఆచరణ అయినా, పగటితో పోలిస్తే, కష్టంతో కూడినదై ఉంటుంది. అందుకని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ హదీథులో “రాత్రిలో కొద్ది భాగము” అని ఆదేశించినారు.
అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సైనిక దళాన్ని పంపినారు, అన్సార్లలోని ఒక వ్యక్తిని వారిపై నాయకుడిగా నియమించారు. మరియు అతనికి విధేయత చూపమని వారికి ఆదేశించారు. ఒకసారి అతనికి కోపం వచ్చి, ఇలా అన్నాడు: "నాకు విధేయత చూపమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మిమ్మల్ని ఆదేశించలేదా?" వారు, "అవును" అని అన్నారు. అప్పుడు అతను, "నా కోసం కట్టెలు సేకరించండి" అని అన్నాడు. వారు సేకరించారు. ఆపై, "అగ్నిని రాజేయండి" అని అన్నాడు. వారు రాజేశారు. ఆ తర్వాత, "దానిలో ప్రవేశించండి" అని అన్నాడు. వారు అందులో ప్రవేశించడానికి సిద్ధపడగా, ఒకరినొకరు పట్టుకుంటూ, "మేము అగ్ని నుండి తప్పించుకోవడానికే కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చింది" అని అన్నారు. అగ్ని ఆరిపోయి, అతని కోపం చల్లారే వరకు వారు అలాగే ఉండిపోయారు. ఈ విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చేరినప్పుడు, ఆయన ఇలా సెలవిచ్చారు: «ఒకవేళ వారు దానిలో ప్రవేశించి ఉంటే, ప్రళయదినం వరకు దాని నుండి బయటకు వచ్చేవారు కాదు; విధేయత అనేది కేవలం ధర్మబద్ధమైన (మంచి) విషయాలలో మాత్రమే చూప వలసి ఉంటుంది».
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సైన్యాన్ని పంపినారు. వారిపై అన్సార్లలోని ఒక వ్యక్తిని నాయకుడిగా నియమించి, అతనికి విధేయత చూపమని వారిని ఆదేశించారు. ఒక సందర్భంలో ఆ నాయకుడికి వారిపై కోపం వచ్చి, వారితో ఇలా అన్నాడు: "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు విధేయత చూపమని మిమ్మల్ని ఆదేశించలేదా? వారు "అవును" అని పలికారు. అప్పుడు ఆయన, "నేను మిమ్మల్ని కట్టెలు పోగుచేసి, నిప్పు రాజేసి, ఆపై అందులో ప్రవేశించమని ఆజ్ఞాపిస్తున్నాను" అని అన్నారు. వారు కట్టెలు పోగుచేసి నిప్పు రాజేశారు. కానీ, అందులో వారు ప్రవేశించకుండా ఆగి పోయి, ఒకరినొకరు చూసుకోసాగారు. మరియు వారు ఇలా (తమలో తాము) పలికారు: "మేము నరకాగ్ని నుండి తప్పించుకోవటానికే కదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించాము, మరి మేము అందులో ప్రవేశించాలా?" వారు అలా చర్చించుకుంటూ ఉండగా ఆ అగ్ని జ్వాల ఆరిపోయింది, మరియు ఆ నాయకుడి కోపమూ చల్లారి పోయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు దాని గురించి తెలిపినపుడు, ఆయన ఇలా అన్నారు: ఒకవేళ వారు అతడికి విధేయత చూపి, తాము వెలిగించిన ఆ అగ్నిలో ప్రవేశించిన ఉంటే, వారు అందులో శిక్షించబడి ఉండేవారు మరియు దాని నుండి శాశ్వతంగా బయటకు వచ్చేవారు కాదు. సృష్టికర్త (అల్లాహ్)కు అవిధేయత కలిగించే విషయంలో, సృష్టికి (మానవులకు) విధేయత చూపకూడదు. విధేయత అనేది కేవలం ధర్మబద్ధమైన (మంచి) విషయాలలో మాత్రమే తప్పనిసరి, అవిధేయత కలిగించే విషయంలో కాదు.