





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: «జనులకు కృతజ్ఞత చూపని వాడు అల్లాహ్కు కృతజ్ఞత చూపడు»
అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ప్రజలు చేసిన మేలు మరియు మంచికి బదులుగా వారికి కృతజ్ఞతలు తెలుపని వాడు, సాధారణంగా అల్లాహ్'కు కూడా కృతజ్ఞత తెలుపడు. ఎందుకంటే ఈ రెండు విషయాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఎవరి స్వభావం మరియు అలవాటు ప్రజల అనుగ్రహాల పట్ల కృతఘ్నత చూపడం మరియు వారికి కృతజ్ఞతలు తెలుపకపోవడమై ఉంటుందో, అల్లాహ్ అనుగ్రహం పట్ల కృతఘ్నత చూపడం మరియు ఆయనకు కృతజ్ఞతలు తెలపడంలో లోపం చేయడం కూడా అతని అలవాటుగా ఉంటుంది.
హసన్ ఉల్లేఖనం ఆయన ఇలా పలికినారు: జుందుబ్ ఇబ్నె అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఈ మస్జిదులో దీనిని మాకు తెలియపరచారు. ఆయన మాకు తెలియపరచినప్పటి నుండి మేము దీనిని మరిచిపోలేదు మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం విషయంలో జుందుబ్ అబద్ధం చెబుతాడనే భయం కూడా మాకు లేదు. అతడి పలుకులు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: మీకు పూర్వం జీవించినవారిలో ఒక వ్యక్తి గాయపడినాడు. అతడు సహనం కోల్పోయి, కత్తితో తన చేతిని కోసుకొనగా, ఆ రక్తస్రావంతో మరణించాడు. దానికి మహోన్నతుడైన అల్లాహ్ ఇలా ప్రకటించినాడు: "నా దాసుడు తన మరణం విషయంలో త్వరపడినాడు; అందువలన నేను అతని కొరకు స్వర్గాన్ని నిషేధించాను."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు: పూర్వకాలంలో ఒక వ్యక్తి గాయపడినాడు. అతడు బాధకు తట్టుకోలేక, సహనం కోల్పోయి, కత్తితో తన చేతిని కోసుకున్నాడు. దాని వలన రక్తస్రావం ఆగక, చివరకు అతడు మరణించాడు. దానికి మహోన్నతుడైన అల్లాహ్ ఇలా పలికినాడు: "నా దాసుడు తన మరణాన్ని త్వరగా తెచ్చుకున్నాడు; కాబట్టి నేను అతనికి స్వర్గాన్ని నిషేధించాను."
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం (తరుచుగా) ఇలా పలుకుతూ ఉండేవారని అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించినారు: "ఓ అల్లాహ్! నేను నీకు మాత్రమే సమర్పించుకుంటున్నాను, నిన్ను మాత్రమే విశ్వసిస్తున్నాను, నీపైనే ఆధారపడుతున్నాను, నీ వైపే పశ్చాత్తాపంతో మరలుతున్నాను, నీ సహాయంతోనే వాదిస్తున్నాను. నీ మహిమలోనే నేను ఆశ్రయాన్ని కోరుతున్నాను. నీవు తప్ప మరే ఆరాధ్యడూ లేడు. నీవు నన్ను తప్పుదారి పట్టించకు. నీవు ఎప్పటికీ జీవించే నిత్యుడివి, నీకు మరణం లేదు. కానీ జిన్నులు మరియు మనుషులు మాత్రం మరణిస్తారు."
ముస్లిం పదాలతో మరియు అల్ బుఖారీ సంక్షిప్తంగా నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా దుఆ చేస్తూ ఉండేవారు: "(ఓ అల్లాహ్! నేను నీకు లొంగిపోతున్నాను) — నేను నీకు పూర్తిగా సమర్పించుకుంటున్నాను; (నేను నిన్నే విశ్వసిస్తున్నాను) — నేను నిన్నే అంగీకరిస్తున్నాను, నీవే సత్యమని ఒప్పు కుంటున్నాను; (నేను నీపైనే ఆధారపడుతున్నాను) — నా వ్యవహారాలను నీకు అప్పగిస్తున్నాను మరియు నీవే నాకు ఆధారం; (నేను నీ వైపే పశ్చాత్తాపంతో మరలుతున్నాను) — నేను తిరిగి నీవైపు వస్తున్నాను, నా తప్పులను నీ వద్ద ఒప్పుకుంటున్నాను; (నేను నీ సహాయంతోనే వాదిస్తున్నాను) — నీ శత్రువులతో వాదించడంలో నీ సహాయాన్ని మాత్రమే ఆశ్రయిస్తున్నాను; (ఓ అల్లాహ్! నేను నీ మహిమలోనే ఆశ్రయం కోరుతున్నాను) — నీ శక్తి, అధికారం, పరిపాలనలోనే నేను ఆశ్రయం పొందుతున్నాను; (నీవు మరే ఆరాధ్యుడూ లేడు) — నీవే సకల ఆరాధనలకు యోగ్యుడవు, నీవు తప్ప ఆరాధించబడే అర్హత గలవారు మరెవ్వరూ లేరు; (నీవు నన్ను తప్పుదారి పట్టించకు) — నీవు నన్ను సత్య మార్గం నుండి దూరం చేయకు, నీ అనుగ్రహాన్ని పొందకుండా నన్ను దూరం చేయకు; (నీవు ఎప్పటికీ జీవించే నిత్యుడివి, నీకు మరణం లేదు) — నీవు శాశ్వతంగా జీవించేవాడివి, నీకు మరణం లేదు. (కానీ జిన్నులు మరియు మనుషులు మాత్రం మరణిస్తారు) — జిన్నులు మరియు మనుషులు మాత్రం ఖచ్చితంగా మరణించేవారు."
ఇమ్రాన్ ఇబ్నె హుసైన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి: "అస్సలాము అలైకుం" అని అభివాదం చేసినాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇచ్చినారు, ఆ తరువాత ఆ వ్యక్తి కూర్చున్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "పది" అన్నారు. ఆ పిదప మరొకతను వచ్చి: "అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహ్" అని అభివాదం చేసినాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇవ్వగా, ఆ వ్యక్తి కూర్చున్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "ఇరవై" అన్నారు. ఆ తరువాత మరొకరు వచ్చి: "అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు" అని అభివాదం చేసినాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇవ్వగా, ఆ వ్యక్తి కూడా కూర్చున్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "ముప్పై" అన్నారు.
అబూ దావూద్, అత్తిర్మిదీ, అహ్మద్ మరియు అద్దారమీ నమోదు చేసినారు:ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి "అస్సలాము అలైకుమ్ (మీపై శాంతి కలుగుగాక)" అని అన్నాడు: దానికి ఆయన జవాబు ఇవ్వగా, అతడు కూర్చున్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం "అతడి కోసం పది పుణ్యాలు వ్రాయబడ్డాయి" అని అన్నారు. తరువాత మరొకరు వచ్చి "అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ (మీపై అల్లాహ్ శాంతి, దయ కలుగుగాక)" అని అన్నాడు: దానికి ఆయన జవాబు ఇవ్వగా, అతను కూర్చుకున్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం "అతడి కోసం ఇరవై పుణ్యాలు వ్రాయబడ్డాయి" అని అన్నారు. ఆ తరువాత మరొకరు వచ్చి "అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతహు" (మీపై అల్లాహ్ శాంతి, కరుణ మరియు దీవెనలు కలుగుగాక) అని అన్నాడు. దానికి ఆయన జవాబు ఇవ్వగా, అతడు కూడా కూర్చున్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "అతడి కోసం ముప్ఫై పుణ్యాలు వ్రాయబడ్డాయి" అని అన్నారు. అంటే, సలాము అభివాదంలోని ప్రతి పదానికి పది పుణ్యాలు లెక్కించబడతాయి అన్నమాట.
అబ్దుల్లాహ్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ హుదా వత్తుఖా వల్అఫాఫ వల్ గినా" ("ఓ అల్లాహ్! నేను నిన్ను మార్గదర్శకం (హిదాయత్), భయభక్తి (తఖ్వా), పవిత్రత (శుద్ధత), మరియు సంతృప్తి/సంపద (స్వయం సమృద్ధి) కోసం అడుగుతున్నాను.""
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దుఆలలో ఇవి ఉన్నాయి: “ఓ అల్లాహ్! నేను నిన్ను మార్గదర్శకం కోసం అడుగుతున్నాను,” అంటే సత్యాన్ని తెలుసుకుని దానిని అనుసరించడానికి సరళమైన మార్గం, “భక్తి,” అంటే ఆజ్ఞలను పాటించడం మరియు నిషేధాలను నివారించడం, “పవిత్రత,”అంటే మాటలో లేదా క్రియలో అనుమతించబడని లేదా సముచితమైన వాటికి దూరంగా ఉండటం మరియు “సమృద్ధి”, అంటే ఒక వ్యక్తికి సర్వశక్తిమంతుడు మరియు మహోన్నతుడు అయిన తన ప్రభువు తప్ప మరెవరి అవసరం లేకపోవడం.
ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాను: "సఫీయ్యా గురించి మీకు తెలుసు కదా, ఆమె ఇలా-ఇలా ఉంది..." (ఉల్లేఖకులలో ఒకరు ఇలా పలికినారు: ఆమె 'పొట్టిగా ఉంది’ అని). దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "నీవు చెప్పిన ఆ మాట, ఒకవేళ సముద్రపు నీటిలో కలిపితే, అది నీటినంతా కలుషితం చేసి వేసేది." అది విని ఆమె ఇలా అన్నది: "నేను మీ వద్ద ఒకరిని వెక్కిరించాను, అనుకరించాను (అంటే, ఎవరో ఒకరి నకిలీగా నటించాను) అని అనగా, దానికి ఆయన 'నాకు ఎంతటి గొప్ప బహుమతి ఇచ్చినా కూడా, నేను ఎవరినైనా వెక్కిరించాలని, అనుకరించాలని అనుకోను.'" అని పలికినారు.
అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయిషా (రదియల్లాహు అన్హా), ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నారు: "సఫీయ్యా గురించి మీకు తెలుసు కదా..." (అంటే, ఆమె శరీరంలో ఒక లోపం గురించి అంటే ఆమె పొట్టిగా ఉండడం గురించి ప్రస్తావించారు). దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానము ఇచ్చినారు: "నీవు చెప్పిన ఆ మాట, ఒకవేళ సముద్రపు నీటిలో కలిపితే, అది ఆ నీటిని పూర్తిగా కలుషితం చేసి, దాని స్వభావాన్ని మార్చి, చెడిపోయేలా చేస్తుంది." అపుడు ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా అన్నారు: "నేను ఒకరిని వెక్కిరిస్తూ అనుకరించాను." దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎంతటి గొప్ప సంపద ఇచ్చినా కూడా, నేను ఎవరి గురించి అయినా తప్పుగా మాట్లాడడాన్ని, లేదా అతడి చర్యలను / మాటలను వెక్కిరిస్తూ, ఆటపట్టిస్తూ అనుకరించడాన్ని నేను ఇష్టపడను."
జాబిర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరు ‘సుబహానల్లాహిల్-అజీమ్ వ బిహమ్'దిహి’ పరమ పవిత్రుడైన అల్లాహ్కు మహోన్నత మహిమ గలవాడు మరియు సకలస్తోత్రాలు, కృతజ్ఞతలు ఆయనకే శోభిస్తాయి) అని పలుకుతారో, అతడి కోసం స్వర్గంలో ఒక ఖర్జూర చెట్టు నాటబడుతుంది."
అత్తిర్మిదీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: "సుబహానల్లాహ్" (అల్లాహ్ పరమ పవిత్రుడు), "అల్-అజీమ్" (అతను గొప్పవాడు, ఆయన అందరి కంటే, అన్నింటి కంటే మహోన్నతుడు —తన స్వరూపంలో, లక్షణాల్లో, క్రియల్లో), "వ బిహమ్దిహి" (సకల స్తోత్రాలు, కృతజ్ఞతలు ఆయనకు మాత్రమే శోభిస్తాయి ఎందుకంటే పరిపూర్ణమైన గుణాలు ఆయనకే ఉన్నాయని అంగీకరించడం), ఎవరైతే ఇలా పలుకుతారో, అలా పలికిన ప్రతిసారి, స్వర్గ భూమిలో అతడి కోసం ఒక ఖర్జూర చెట్టు నాటబడుతుంది.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఒకరిపై మరొకరు ఈర్ష్య పడకండి, ఒకరి కోసం మరొకరు కావాలని ధరలను కృత్రిమంగా పెంచకండి, ఒకరినొకరు ద్వేషించకండి, ఒకరికొకరు దూరం కాకండి, వ్యాపారంలో ఒకరి లావాదేవీలను మరొకరు భంగపరచకండి. బదులుగా, అల్లాహ్ యొక్క దాసులుగా సోదర భావంతో ఉండండి. ఒక ముస్లిం మరొక ముస్లింకు సోదరుడు: అతనికి అన్యాయం చేయడు, అతనికి అవసరమైనప్పుడు సహాయం చేయకుండా నిరాకరించడు, అతడిని మోసగించడు, అతడిని అవమానించడు. "నిజమైన తఖ్వా (అల్లాహ్ పట్ల భయభక్తి) ఇక్కడ ఉంది" అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ఛాతీ వైపు మూడుసార్లు సూచించారు. ఒక ముస్లిం తన ముస్లిం సోదరుడిని ధిక్కరించడం, అవమానించడం చాలా చెడ్డ పని. ఒక ముస్లింపై మరొక ముస్లిం కొరకు నిషేధించబడిన విషయాలు - అతని ప్రాణం, ఆస్తి మరియు గౌరవం."
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ముస్లింలు తమ తోటి ముస్లిం సోదరులతో మంచిగా వ్యవహరించాలని సలహా ఇచ్చారు మరియు తోటివారి పట్ల వారు పాటించవలసిన కొన్ని విధులు మరియు మర్యాదలను స్పష్టం చేసినారు. వాటిలో కొన్ని: మొదటి ఉపదేశం: "మీరు ఒకరిపై మరొకరు ఈర్ష్యపడకండి" — అంటే, మీరు మీ తోటి సహోదరులు పొందుతున్న ఆనందాన్ని, సంపదను కోల్పోవాలని కోరుకోకండి. రెండవ ఉపదేశం: "మీరు నజష్ (కృత్రిమ బిడ్డింగ్) చేయకండి" - అంటే, ఒక వస్తువు ధరను కృత్రిమంగా పెంచకండి - వాస్తవంగా దానిని కొనాలనే ఆలోచన అతనికి లేకపోయినా, కేవలం విక్రేతకు ప్రయోజనం కలిగించడానికో లేదా కొనుగోలుదారుకు నష్టం కలిగించడానికో ధరను పెంచడం. మూడవ ఉపదేశం: "మీరు ఒకరినొకరు ద్వేషించకండి" - అంటే, ఇతరులకు హాని కలిగించాలనే ఉద్దేశ్యన్ని కలిగి ఉండకండి. ఇది ప్రేమాభిమానాలకు విరుద్ధమైనది. అయితే, అల్లాహ్ కోసం (అధర్మాన్ని, అనైతికతను, అన్యాయాన్ని) ద్వేషించడం ఆవశ్యకం. నాల్గవది: మీ సోదరుడికి వెన్ను చూపకండి, అతనిని పట్టించుకోకుండా మరియు అతనిని విడిచిపెట్టి, అతనికి మీ వీపు చూపకండి (అతనితో సంబంధాలు త్రెంచుకోకండి). ఐదవ ఉపదేశం: "మీరు ఒకరి అమ్మకంపై మరొకరు అమ్మకం చేయకండి" - అంటే, ఎవరైనా ఒక వస్తువును కొన్న వ్యక్తితో "ఈ వస్తువు నా దగ్గర ఉంది, ఇంకా తక్కువ ధరకు లేదా మెరుగైన నాణ్యతతో ఇస్తాను" అని చెప్పడం. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సమగ్రమైన ఉపదేశం చేశారు: "మీరు సోదరుల వలే ఉండండి - పైన పేర్కొన్న నిషేధించిన పనులను వదిలేసి, ప్రేమ, ఆప్యాయత, కరుణ, మృదుత్వం మరియు మంచి పనులలో సహకారం చూపించండి. హృదయాలను పరిశుభ్రంగా ఉంచుకుని, ప్రతి స్థితిలో ఒకరికొకరు శ్రేయోభిలాషిగా ఉండండి." ఈ సోదరభావానికి అవసరమైన వాటిలో కొన్ని ఇవే: తన తోటి ముస్లిం సహోదరుడికి అన్యాయం చేయకూడదు, అతనిపై దాడి చేయకూడదు. తన తోటి ముస్లిం సహోదరుడు అన్యాయానికి గురై ఉన్నప్పుడు, అతనికి సహాయం చేయగలిగే స్థితిలో ఉండినా సహాయం చేయకుండా వదలకూడదు; అతనిపై జరుగుతున్న అన్యాయాన్ని తొలగించేందుకు ప్రామాణికంగా తోడ్పడాలి. తన తోటి ముస్లిం సహోదరుణ్ని తక్కువగా చూడకూడదు, అతడిని అగౌరవంగా చూసి అవమానించకూడదు. ఇది మనసులో ఉన్న గర్వం వల్ల కలిగే మానసిక వైఖరి. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు స్పష్టంగా ఇలా పలికినారు: "తఖ్వా (అల్లాహ్ పట్ల భయభక్తులు) హృదయంలో ఉంటుంది." అంటే – ఒక మనిషి హృదయంలో తఖ్వా ఉంటే – అతను ఎప్పుడూ తన తోటి ముస్లిం సహోదరుణ్ని తక్కువగా చూడడు. ఒక ముస్లిం తన తోటి సోదరుడిని అవమానించడమే అతని హృదయంలోని అహంకారానికి సాక్షి, ఇది చాలా చెడ్డ గుణాలలో ఒకటి. ఈ గర్వం మనిషిని చెడు నడవడిలోకి నడిపిస్తుంది, ఇది తఖ్వాకు విరుద్ధం. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు చెప్పిన విషయాన్ని మరింత బలంగా నిర్ధారిస్తూ ఇలా పలికినారు: "ఒక ముస్లిం కొరకు, మరో ముస్లింపట్ల మూడు విషయాలు హరామ్ (నిషిద్ధం): అతని రక్తం – అంటే అతనిని చంపడం, తీవ్రంగా గాయపడే విధంగా కొట్టడం, దెబ్బతీయడం వంటి హింసాత్మక చర్యలు చేయడం. ఆతని సంపద – అతనికి చెందని ధనాన్ని అన్యాయంగా తీసుకోవడం, చీటింగ్ చేయడం, దోచుకోవడం. ఆతని గౌరవం – అతని వ్యక్తిగతాన్నీ, వంశాన్నీ, వ్యక్తిత్వాన్నీ నిందించడం, తక్కువగా మాట్లాడడం. ఇవి అన్నీ నిషిద్ధమైన పాపాలు, ఎందుకంటే ముస్లిం సహోదరుల మధ్య స్నేహం, గౌరవం మరియు రక్షణ ఉండాలి.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరైతే ఒక విశ్వాసిని ఈ ప్రాపంచిక కష్టాలలోని ఒక కష్టం నుండి విముక్తి చేస్తారో, ప్రళయ దినాన అల్లాహ్ అతడిని ఒక కష్టం నుండి విముక్తి చేస్తాడు. ఎవరైతే ఒక కష్టంలో ఉన్నవారి కష్టాన్ని సులభతరం చేస్తాడో, అల్లాహ్ ఈ ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అతని కష్టాన్ని సులభతరం చేస్తాడు. ఎవరైతే తోటి ముస్లిం లోపాలను దాచిపెడతారో, అల్లాహ్ ఈ ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అతని లోపాల్ని దాచి పెడతాడు. అల్లాహ్ యొక్క దాసుడు (ముస్లిం) తన తోటి సోదరునికి సహాయం చేస్తున్నంత కాలం, అల్లాహ్ కూడా ఆ దాసుడికి సహాయం చేస్తాడు. ఎవరైతే జ్ఞానం అన్వేషించే మార్గంలో నడుస్తారో, అల్లాహ్ అతనికి స్వర్గానికి చేర్చే మార్గాన్ని సులభతరం చేస్తాడు. అల్లాహ్ యొక్క గృహాలలో (మస్జిదులలో) నుండి ఒక గృహంలో ప్రజల సమూహం ఒక చోట చేరి, అల్లాహ్ గ్రంథాన్ని పఠిస్తూ, దాన్ని తమలో తాము అధ్యయనం చేస్తుంటే, అల్లాహ్ యొక్క ప్రశాంతత ఆ సమూహంపై వర్షిస్తుంది, ఆయన దయ వారిని ఆవరిస్తుంది, దైవదూతలు వారిని చుట్టుముట్టుతారు మరియు అల్లాహ్ తన సన్నిధిలో ఉన్న వారితో, ఆ సమూహం గురించి ప్రస్తావిస్తాడు. మరియు ఎవరి కర్మలు వారిని వెనుకబడేలా చేస్తాయో, వారి వంశం కూడా వారిని ముందుకు తీసుకు రాలేదు."
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా ఇలా తెలిపినారు: ఒక ముస్లిమ్ తన తోటి ముస్లిమ్ సోదరుడి కోసం చేసే పనులకు తగినట్లుగా అల్లాహ్ అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ఈ లోకంలో ఎవరు ఒక విశ్వాసి కష్టాన్ని నివారిస్తారో, లేదా తగ్గిస్తారో, లేదా పూర్తిగా తొలగిస్తారో, తీర్పు దినాన అల్లాహ్ కూడా అతని నుండి ఒక కష్టాన్ని తొలగిస్తాడు. ఎవరైనా కష్టంలో ఉన్నవారి కష్టాన్ని సులభతరం చేస్తే, అల్లాహ్ అతని కష్టాన్ని ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సులభతరం చేస్తాడు. ఎవరైతే ఒక ముస్లిమ్ యొక్క లోపాన్ని దాచిపెడతారో, అంటే ఇతరులకు తెలియకుండా అతడు చేసిన తప్పులను, పొరపాట్లను దాచిపెడతారో, అల్లాహ్ కూడా అతని లోపాలను, తప్పులను, పొరపాట్లను ఈ లోకంలోనూ, పరలోకంలోనూ దాచి పెడతాడు. తన దాసుడు తన తోటి సహోదరుని ధార్మిక, ప్రాపంచిక ప్రయోజనాల్లో సహాయం చేస్తూ ఉన్నంత వరకు, అల్లాహ్ కూడా ఆ దాసుడికి సహాయంగా ఉంటాడు. ఈ సహాయం దుఆ, ఆచరణలు, సంపద ద్వారా కావచ్చు. ఎవరైనా అల్లాహ్ కోసం ధార్మిక జ్ఞానం సంపాదించేందుకు ప్రయాణిస్తారో, అల్లాహ్ అతని కొరకు స్వర్గం దారిని సులభతరం చేస్తాడు. అల్లాహ్ ఆరాధనా గృహాలలో (మస్జిదులలో) ఒక సమూహం అల్లాహ్ యొక్క గ్రంథాన్ని (ఖుర్ఆన్) పఠిస్తూ, పరస్పరం అధ్యయనం చేస్తూ ఉంటే, వారిపై ప్రశాంతత వర్షిస్తుంది; అల్లాహ్ కరుణ వారిని ఆవరిస్తుంది; దైవదూతలు వారిని చుట్టుముట్టుతారు; అల్లాహ్ ఆ సమూహం గురించి తన సమీపంలో ఉన్న వారి వద్ద ప్రశంసిస్తాడు. అల్లాహ్ తన దాసుడిని పరమోన్నతమైన సంఘంలో ప్రస్తావించడం ఎంత గొప్ప గౌరవమో కదా! ఎవరి వద్ద మంచి పనులు తక్కువగా ఉంటాయో, అతను ఎక్కువ మంచి పనులు చేసిన వారి స్థాయికి చేరుకోలేడు. కాబట్టి, స్వయంగా మంచి పనులు చేయకుండా తన వంశము, కులము పేరు మీద ఆధారపడకూడదు.