





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “ఒక పేద స్త్రీ తన ఇద్దరు కూతుళ్ళను ఎత్తుకుని నా వద్దకు వచ్చింది. నేను ఆమెకు మూడు ఖర్జూరాలు ఇచ్చాను. ఆమె రెండు ఖర్జూరాలను తన కూతుళ్లకు చెరొకటి ఇచ్చింది. (మిగిలిన) ఖర్జూరాన్ని తను తినడానికి నోటి దగ్గరకు చెయ్యి ఎత్తింది. ఇంతలో ఆమె కూతుళ్ళు అది తమకు కావాలని అడిగారు. ఆమె ఆ ఒక్క ఖర్జూరాన్ని రెండు భాగాలు చేసి తన కూతుళ్ళకు చెరొక భాగాన్ని పంచి పెట్టింది. ఆమె చర్య నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ సంఘటనను నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు వివరించాను. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా దాని కారణంగా అల్లాహ్ ఆమె కొరకు స్వర్గాన్ని ‘వాజిబ్’ (తప్పనిసరి) చేసాడు” లేదా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “దాని కారణంగా ఆమెకు నరకం నుండి విడుదలను ప్రసాదించినాడు.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఒక సంఘటనను ఇలా ప్రస్తావిస్తున్నారు: ఇద్దరు కూతుళ్ళు ఉన్న ఒక పేద మహిళ ఆమె వద్దకు వచ్చి మూడు ఖర్జూరాలు అడిగింది. ఆమె తన ఇద్దరు కూతుళ్ళకు ఒక్కొక్క ఖర్జూరాన్ని ఇచ్చింది మరియు మిగిలిన ఒక ఖర్జూరం తినేందుకు తన చేతిని తన నోటి దగ్గరికి ఎత్తింది. ఆమె తినాలనుకున్న ఆ ఖర్జూరాన్ని ఆమె ఇద్దరు కూతుళ్ళు తమకు కావాలి అని అడిగారు, అపుడు ఆమె ఆ ఖర్జూరాన్ని రెండు భాగాలు చేసి ఆ ఇద్దరికీ పంచి పెట్టింది. ఆయిషా రదియల్లాహు అన్హా ఆమె పరిస్థితి చూసి ముగ్ధురాలైంది, మరియు ఆ మహిళ చేసిన పనిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పింది, అది విని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ ఆ ఖర్జూరం కారణంగా ఆమెకు స్వర్గాన్ని వాజిబ్ చేసినాడు (తప్పనిసరి చేసినాడు); లేక ఆ ఖర్జూరము కారణంగా ఆమెను నరకాగ్ని నుండి రక్షించినాడు.”
అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “మీలో ఎవరైనా నలుగురు కూర్చుని ఉన్న ఒక సమూహం వద్దకు వచ్చినపుడు అతడు ‘సలాం’ (శాంతి శుభాకాంక్షలు) చెప్పాలి. అలాగే అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోవడానికి లేచి నిలుచున్నపుడు (కూడా) అతడు ‘సలాం’ చెప్పాలి. మొదటిది చివరిదానికంటే ఎక్కువ అర్హమైనది కాదు.
అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ కుబరాలో మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పేర్కొన్నారు: ఎవరైనా నలుగురు కూర్చుని ఉన్న దగ్గరికి వెళితే అతడు ‘సలాం’ చెప్పాలి, అలాగే అతడు సెలవు తీసుకుని అక్కడి నుండి వెళ్ళడానికి లేచినపుడు కూడా అక్కడి వారికి ‘సలాం’ చేయాలి; వెళ్ళేటప్పుడు చేసే రెండవ ‘సలాం’ కంటే వచ్చినప్పుడు చేసిన మొదటి ‘సలాం’ మరింత అర్హమైనది కాదు.
ముస్’అబ్ ఇబ్న్ స’అద్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “ఒకసారి సఅద్ (బిన్ అబీ వక్కాస్) (రదియల్లాహు అన్హు) తనకంటే తక్కువ హోదా ఉన్నవారి కంటే తాను గొప్పవాడినని భావించారు. దానిపై ప్రవక్త (ﷺ) ఇలా అన్నారు: “మీలోని పేదలు, బలహీనుల (ఆశీర్వాదాలు మరియు దు’ఆల) ద్వారా తప్ప మీకు (అల్లాహ్ యొక్క) సహాయం మరియు జీవనోపాధి లభించిందా?”
అల్ బుఖారీ నమోదు చేసినారు:స’ఆద్ బిన్ అబీ వఖ్ఖాస్ (రదియల్లాహు అన్హు) తన ధైర్యము, సాహసము, శౌర్యపరాక్రమాలు మొదలైన వాటి కారణంగా తాను బలహీనులకంటే గొప్పవాడిని అనే భావనలో పడిపోయినారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: “మీలోని బలహీనులు, నిజాయితీతో కూడిన వారి ప్రార్థనలు, వేడుకోళ్ళు, దుఆలు మొదలైవ వాటి ద్వారా తప్ప నీవు విజయన్ని, జీవనోపాధిని పొందినావా?” వారు తరచుగా తమ ప్రార్థనలలో, దుఆలలో, వేడుకోళ్ళలో నిజాయితీగా ఉంటారు, ఎందుకంటే వారి హృదయాలు ఈ ప్రాపంచిక జీవితపు అలంకారాల పట్ల, ఆడంబరాల పట్ల అనుబంధాన్ని కలిగి ఉండవు.
హుదైఫహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి భోజనం చేసిన సందర్భములలో, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం భోజనం వైపునకు చేతిని చాచే వరకు మేము మా చేతిని చాచే వారము కాము. ఒకసారి మేము ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం భోజనానికి హాజరైనపుడు, ఒక చిన్న అమ్మాయి, ఎవరో ముందుకు తోస్తున్నట్టుగా పరుగెత్తుకుంటూ వచ్చి, ఆహారపు పళ్ళెములో తన చేయి పెట్టబోతుండగా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె చేతిని పట్టుకున్నారు. అలాగే ఒక ఎడారివాసి కూడా ఎవరో ముందుకు నెడుతున్నట్టుగా పరుగెత్తుకుంటు రాగా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని చేతిని కూడా పట్టుకున్నారు. అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ పేరు ఉచ్ఛరించబడని ఏ ఆహారాన్నైనా షైతాన్ తన కొరకు ‘హలాల్’ (అనుమతించ బడినదిగా) చేసుకుంటాడు. అతను (షైతాన్) ఈ చిన్న అమ్మాయిని తీసుకువచ్చాడు (ఆమె ద్వారా) ఆహారం తన కొరకు తినగలిగేలా (హలాల్) చేసుకునేందుకు గాను, కానీ నేను ఆమె చేతిని పట్టుకున్నాను. అప్పుడు ఈ ఎడారివాసిని తీసుకు వచ్చాడు, ఆహారం తన కొరకు తినగలిగేలా (హలాల్) చేసుకునేందుకు. నేను అతని చేయి కూడా పట్టుకున్నాను. నా ఆత్మ ఎవరి చేతిలోనైతే ఉన్నదో, ఆయన సాక్షిగా, వాడి చేయి (షైతాను చేయి) ఆమె చేతితో పాటు నా చేతిలో ఉన్నది.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో హుదైఫహ్ రదియల్లాహు అన్హు ఇలా అంటున్నారు: వారు (సహాబాలు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఎపుడు భోజనం చేసినా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం భోజనం వైపునకు తన చేయి చాచనంత వరకు వారిలో ఎవరూ భోజనంలో చేయి పెట్టేవారు కాదు. ఆయన ఇంకా ఇలా అంటున్నారు: “ఒకసారి మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో భోజనం చేయడానికి కూర్చున్నాము. ఇంతలో ఒక చిన్న బాలిక, ఎవరో తనను ముందుకు నెడుతున్నట్టుగా పరుగెత్తుకుంటు వచ్చి ఆ భోజనములో చేయి పెట్టబోయింది. అయితే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే ఆమె చేయి పట్టుకున్నారు. తరువాత ఒక ఎడారివాసి కూడా ఎవరో ముందుకు నెడుతున్నట్టుగా పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతడు ఆ భోజనంలో చేయి పెట్టకముందే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అతని చేతిని కూడా పట్టుకున్నారు. తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ పేరు ఉచ్ఛరించబడని ఏ ఆహారాన్ని అయినా షైతాను తినగలడు. షైతాను ఈ బానిస అమ్మాయిని తీసుకువచ్చాడు, తద్వారా ఆహారాన్ని తాను తినడానికి అనువుగా చేసుకునేందుకు గాను. కానీ నేను ఆ అమ్మాయి చేయి పట్టుకున్నాను. అప్పుడు ఈ ఎడారివాసిని తీసుకువచ్చాడు తద్వారా ఆహారాన్ని తాను తినడానికి అనువుగా చేసుకునేందుకు గాను. కానీ అతని చేతిని కూడా నేను పట్టుకున్నాను. ఎవరి చేతిలోనైతే నా ఆత్మ ఉన్నదో ఆయన సాక్షిగా ఆమె చేతితో పాటు షైతాను చేయి కూడా నా చేతిలో ఉన్నది.” అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరు ఉచ్ఛరించి భోజనాన్ని తిన్నారు.
అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఈ ప్రపంచము విశ్వాసి కొరకు ఒక జైలు వంటిది; మరియు అవిశ్వాసి కొరకు ఒక స్వర్గము వంటిది.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు: విశ్వాసికి ఈ ప్రాపంచిక జీవితం జైలు లాంటిది, ఎందుకంటే అతడు షరియత్’లో ఆదేశించబడిన వాటిని చేయడం మరియు నిషేధించబడిన వాటిని నివారించడం, వాటి నుండి దూరంగా ఉండడం అనే ధార్మికపరమైన బాధ్యతలకు కట్టుబడి ఉంటాడు. అతను మరణించినప్పుడు, దీని నుండి విముక్తి పొంది, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అతని కోసం సిద్ధం చేసిన శాశ్వత ఆనందానికి మరలుతాడు. అవిశ్వాసికి ఈ ప్రపంచం స్వర్గం లాంటిది, ఎందుకంటే అందులో అతను తన మనసు కోరినది చేస్తాడు మరియు తన మనోభావాలు, వాంఛలు, కోరికలు అతనికి ఏమి ఆజ్ఞాపిస్తాయో అది చేస్తాడు. అతను మరణించినప్పుడు, పునరుత్థాన దినమున సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అతని కోసం సిద్ధం చేసిన శాశ్వత నరక శిక్షలోనికి విసిరి వేయబడతాడు.
హకీం ఇబ్న్ హిజామ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లంను కొంత డబ్బు అడిగాను, ఆయన దానిని నాకు ఇచ్చారు. తరువాత నేను ఆయనను మళ్ళీ అడిగాను, ఆయన దానిని నాకు ఇచ్చారు. తరువాత నేను ఆయనను మళ్ళీ అడిగాను, ఆయన మళ్ళీ నాకు ఇచ్చారు, మరియు ఆయన ఇలా అన్నారు: “ఓ హకీం! నిశ్చయంగా ఈ డబ్బు మధురమైన తాజా ఫలం వంటిది. ఎవరైతే అత్యాశలేని అంతరాత్మతో దానిని తీసుకుంటారో (సంపాదిస్తారో), అతని కొరకు అందులో ఆశీర్వాదము, శుభము ఉంటుంది. మరియు ఎవరైతే అత్యాశతో దానిని తీసుకుంటారో (సంపాదిస్తారో) అతనికి అందులో శుభము, ఆశీర్వాదము ఉండవు. అతడు ఎంత తిన్నా సంతృప్తి చెందని వంటి వాడు. పైన ఉండే చేయి, క్రింద ఉండే చేయి కంటే గొప్పది.” హాకిం రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్! ఎవరైతే మిమ్ములను సత్యముతో పంపినాడో ఆ అల్లాహ్ సాక్షిగా, (మీనుండి తీసుకున్నాను) ఇక మీ తరువాత, నేను ఈ ప్రపంచము నుండి వెళ్ళిపోయే వరకూ ఇంకెవరి నుండీ ఏమీ తీసుకోను.” తరువాత అమీరుల్ ము’మినీన్ అబూ బక్ర్ రదియల్లాహు అన్హు, హకీమ్ రదియల్లాహు అన్హుకు ఏమైనా ఇవ్వడానికి పిలిచే వారు, కానీ ఆయన ఏమీ తీసుకోకుండా నిరాకరించేవాడు. తరువాత ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు అయనకు ఏమైనా ఇవ్వడానికి పిలిచే వారు. కానీ ఆయన ఏమీ తీసుకోకుండా నిరాకరించేవాడు. అప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ ముస్లిములారా! ఈ యుద్ధ సంపదలో అల్లాహ్ తనకు హక్కుగా ఇచ్చిన వాటాను నేను అతనికి అందించడానికి పిలిచాను. కానీ దానిని తీసుకోవడానికి అతడు నిరాకరించినాడు.” అలా హాకిం రదియల్లాహు అన్హు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత తాను మరణించేవరకు ఎవరి నుండి ఏమీ తీసుకోలేదు. అల్లాహ్ ఆయనపై కరుణ చూపుగాక.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుహకీం ఇబ్న్ హిజాం రదియల్లాహు అన్హు ప్రాపంచిక జీవితావసరాలకు సంబంధించి కొన్ని సరుకుల కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అర్ధించినారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి వాటిని ఇచ్చినారు. హాకిం (ర) మళ్ళీ అడిగినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ వాటిని ఇచ్చినారు. తరువాత హాకిం (ర) మళ్ళీ అడిగినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ ఆయనకు ఇచ్చినారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఓ హకీమ్! ఈ సంపద మధురమైనది మరియు ఆకర్షణీయమైనది. ఎవరైతే అత్యాశకు పోకుండా, వెంటపడి ఎవరినీ యాచించకుండా దానిని తీసుకుంటాడో (సంపాదిస్తాడో) అది అతనికి ఆశీర్వాదము అవుతుంది. కానీ ఎవరైతే దాని పట్ల లాలస మరియు కోరికతో దానిని తీసుకుంటాడో (సంపాదిస్తాడో) అది అతనికి ఆశీర్వాదము అవదు. అటువంటి వాడు ఎంత తిన్నా ఎన్నటికీ తృప్తి చెందనివాని వంటి వాడు. అల్లాహ్ దృష్టిలో పైన ఉండే దానం చేసే చేయి, క్రింద ఉండే యాచించే చేయి కంటే గొప్పది.” హాకిం రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “అపుడు నేను ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీ తరువాత నేను ఇంకెవరినీ, నేను ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయే వరకూ, దేని కొరకూ అడగను.” రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఖలీఫా అబూబక్ర్ రదియల్లాహు అన్హు ఖజానా నుండి అతనికి బహుమతిగా రావలిసిన వాటాను ఇవ్వడానికి హాకిం రదియల్లాహు అన్హుని పిలిచేవారు. కానీ ఆయన ఏమీ తీసుకోకుండా నిరాకరించేవారు. అబూబక్ర్ రదియల్లాహు అన్హు తరువాత ఉమర్ రదియల్లాహు అన్హు కూడా ఆయనను పిలిచినారు, కానీ హాకిం రదియల్లాహు అన్హు ఆయన నుండి కూడా ఏమీ తీసుకోకుండా నిరాకరించినారు. అపుడు ఉమర్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ ముస్లిములారా! అవిశ్వాసులతో యుద్ధం గానీ జిహాద్ గానీ చేయకుండానే సంపాదించిన యుద్ధసంపద నుండి అల్లాహ్ అతనికి కేటాయించిన అతని హక్కు వాటాను నేను అతనికి అందజేస్తున్నాను. అయినప్పటికీ అతడు దానిని తీసుకోకుండా నిరాకరిస్తున్నాడు.” ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత హకీం రదియల్లాహు అన్హు తాను చనిపోయేవరకూ ఎవరినీ ఏమీ అడుగలేదు, ఎవరి నుండీ ఏమీ తీసుకోలేదు. అల్లాహ్ ఆయన పట్ల ప్రసన్నుడవు గాక.
అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “చెదిరిన జుట్టుతో, శరీరం మీద దుమ్ముతో తలుపుల దగ్గర నిలబడిన చాలామంది ప్రక్కకు నెట్టివేయబడతారు; అయితే అతడు అల్లాహ్ పేరు మీద ఏదైనా ప్రమాణం చేస్తే, అతడు దానిని నెరవేరుస్తాడు.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: ప్రజలలో, తలమీద జుట్టు జడలు కట్టుకుపోయి ఉండి, శరీరం దుమ్ము కొట్టుకుపోయి ఉండి, తలకు నూనెగానీ, శరీరానికి స్నానం గానీ లేకుండా ఉండేవాళ్లు కూడా ఉన్నారు. వారికి ప్రజల దృష్టిలో హోదా ఉండదు, ఒక స్థాయి ఉండదు, మరియు వారు తలుపుల దగ్గరినుండి దూరంగా నెట్టివేయబడతారు మరియు ధిక్కారంతో తిరస్కరించబడతారు. అయితే, వారు ప్రమాణం చేస్తే, అల్లాహ్ వారి గౌరవార్థం దానిని నెరవేరుస్తాడు, వారి అభ్యర్థన మంజూరు చేయబడుతుందని నిర్ధారిస్తాడు మరియు అల్లాహ్ వద్ద వారి ఈమాన్ (విశ్వాసము) మరియు హోదా కారణంగా వారు తాము చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించకుండా వారిని రక్షిస్తాడు.
సా’ద్ ఇబ్న్ అబీ వఖ్'ఖా స్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద కూర్చుని ఉండగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు: “మీలో ఎవరైనా ప్రతిరోజూ వెయ్యి పుణ్యాలు సంపాదించలేకపోతున్నారా?" అక్కడ కూర్చుని ఉన్న వారిలో ఒకరు ఇలా అడిగారు: “మాలో ఎవరైనా ఒక రోజులో వెయ్యి పుణ్యాలు ఎలా సంపాదించగలరు?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ యొక్క ఘనతను కీర్తిస్తూ వంద సార్లు “సుబ్’హానల్లాహ్” అనండి. తద్వారా మీ కొరకు వెయ్యి పుణ్యాలు రాయబడతాయి, లేదా వెయ్యి పాపాలు తుడిచి వేయబడతాయి” అన్నారు.”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలను ఇలా అడిగినారు: మీలో ఎవరైనా ప్రతిరోజూ వెయ్యి పుణ్యాలు సంపాదించలేరా? అక్కడ కూర్చుని ఉన్న సహాబాాలలో ఒకరు అడిగారు: “ఎవరైన ఒక వ్యక్తి అంత తేలికగా ఒక్క రోజులో వెయ్యి పుణ్యాలు ఎలా సంపాదించగలడు?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైనా “సుబ్’హానల్లాహ్’ అని వంద సార్లు పలకినట్లయితే, అతని పేర వెయ్యి పుణ్యాలు రాయబడతాయి, ఎందుకంటే ఒక మంచి పని (ప్రతిఫలం) పది రెట్లు గుణించబడుతుంది. లేదా అతని వెయ్యి పాపాలు తుడిచి వేయబడతాయి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని (దుఆ చేసినారని) అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు: “ఓ అల్లాహ్, పరలోక జీవితం తప్ప నిజమైన జీవితం మరొకటి లేదు, కనుక (ఓ అల్లాహ్!) అన్సార్లను (సహాయకులు) మరియు ముహాజిరులను (వలస వచ్చినవారిని) క్షమించు”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు: పరలోక జీవితం తప్ప నిజమైన జీవితం మరొకటి లేదు, అల్లాహ్ యొక్క ప్రసన్నత, కరుణ మరియు స్వర్గం తప్ప మరొకటి లేదు, ఎందుకంటే ఇహలోక జీవితం క్షణికమైనది, మరి పరలోక జీవితం నిత్యమైనది మరియు శాశ్వతమైనది. ఆ తరువాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మరియు ముహాజిర్లకు ఆశ్రయం ఇచ్చిన అన్సార్ల కోసం వారి క్షమాపణ, గౌరవం మరియు ధర్మం కోసం దుఆ చేసారు. మక్కా నుండి మదీనాకు వలస వచ్చిన ముహాజిర్లకు అన్సారులు మద్దతుగా నిలిచారు, తమ సంపదను వారితో పంచుకున్నారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తమ ఇళ్ళను, తమ సంపదలను వదిలి కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కొరకు మరియు ఆయన ప్రసాదించే ప్రతిఫలం కొరకు వలస వచ్చిన ముహాజిర్ల కొరకు కూడా దుఆ చేసినారు.