





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ఎటువంటి వ్యక్తినంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఏదైనా హదీథు వింటే దాని ద్వారా అల్లాహ్ నాకు ఎంత మేలు చేకూర్చ దలిస్తే అంత మేలు చేకూర్చేవాడు (అంత మంచిగా నేను ఆ హదీసును ఆచరించేవాడిని). ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో నుండి ఎవరైనా నాకు హదీథు వినిపిస్తే అతణ్ణి ప్రమాణం చేసి చెప్పమని అడిగే వాడిని. అతడు ప్రమాణం చేస్తే నేను (అతడు చెప్పినది సత్యమని) అతడిని విశ్వసించే వాడిని. అబూబక్ర్ రజియల్లాహు అన్హు ఒకసారి ఒక హదీసును ఉల్లేఖించినారు. ఆయన సత్యము పలికినారు. ఆయన ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఎవరైనా పాపపు పనికి పాల్బడితే, అతడు లేచి నిలబడి, తనను తాను పరిశుద్ధ పరుచుకుని, నమాజును ఆచరించి, అల్లాహ్ యొక్క క్షమాభిక్షను అర్థించినట్లయితే, అల్లాహ్ అతడిని తప్పక క్షమిస్తాడు”, తరువాత ఆయన (అబూబక్ర్ రజియల్లాహు అన్హు ఈ ఆయతును పఠించినారు: {وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنْفُسَهُمْ ذَكَرُوا اللهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ} [آل عمران: 135] {మరియు ఎవరైతే, అశ్లీలపనులు చేసినా, లేదా తమకు తాము అన్యాయం చేసుకున్నా, అల్లాహ్ను స్మరించి తమ పాపాలకు క్షమాపణ వేడుకుంటారో! మరియు అల్లాహ్ తప్ప, పాపాలను క్షమించగలవారు ఇతరులు ఎవరున్నారు? మరియు వారు తాము చేసిన (తప్పులను) బుద్ధిపూర్వకంగా మూర్ఖపుపట్టుతో మళ్ళీ చేయరు!} [సూరహ్ ఆలి ఇమ్రాన్: 3:135]
అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ కుబరా, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: (అల్లాహ్ యొక్క) దాసులలో ఎవరైనా ఏదైనా పాపపు పనికి పాల్బడితే, అతడు లేక ఆమె తనను తాను పరిశుద్ధపరుచుకుని (వుదూ అవసరమైతే వుదూ, లేక ఘుసుల్ అవసరమైతే గుసుల్ ఆచరించి), నిలబడి తను పాల్బడిన పాపానికి పశ్చాత్తాప పడే సంకల్పముతో, రెండు రకాతుల నమాజు ఆచరించి, అల్లాహ్ ను క్షమాభిక్ష కోరితే అల్లాహ్ తప్పకుండా క్షమిస్తాడు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క వాక్కులను పఠించినారు: {والذين إذا فعلوا فاحشة أو ظلموا أنفسهم ذكروا الله فاستغفروا لذنوبهم ومن يغفر الذنوب إلا الله ولم يصروا على ما فعلوا وهم يعلمون} {మరియు ఎవరైతే, అశ్లీలపనులు చేసినా, లేదా తమకు తాము అన్యాయం చేసుకున్నా, అల్లాహ్ను స్మరించి తమ పాపాలకు క్షమాపణ వేడుకుంటారో! మరియు అల్లాహ్ తప్ప, పాపాలను క్షమించగలవారు ఇతరులు ఎవరున్నారు? మరియు వారు తాము చేసిన (తప్పులను) బుధ్ధిపూర్వకంగా మూర్ఖపుపట్టుతో మళ్ళీ చేయరు!} [సూరహ్ ఆలె ఇమ్రాన్: 3:135]
అబూ ఉమామహ్ అల్ బాహిలీ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగాడు: “ప్రతిఫలం మరియు కీర్తి కోసం యుద్ధానికి వెళ్ళే వ్యక్తి గురించి మీరు ఏమనుకుంటున్నారు? అతను ఏమి పొందుతాడు?” దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం “అతని కొరకు ఏమీ లేదు” అన్నారు. అతడు అదే ప్రశ్నను మూడు సార్లు అడిగాడు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లూ “అతని కొరకు ఏమీ లేదు” అని జవాబిచ్చారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ కేవలం తనకొరకు, చిత్తశుద్ధితో చేసే పనిని తప్ప మరే పనిని అంగీకరించడు”.
అన్నసాయీ నమోదు చేసినారు:ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు, అల్లాహ్ నుండి ప్రతిఫలం మరియు ప్రజల నుండి ప్రశంసలు మరియు కీర్తి కోరుతూ పోరాడటానికి (జిహాద్’కు) బయలుదేరిన వ్యక్తిపై షరియత్ పరమైన తీర్పును గురించి అడగడానికి వచ్చాడు. అతడు ప్రతిఫలం పొందుతాడా అని? దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు: "అతనికి ఎలాంటి ప్రతిఫలం లభించదు. ఎందుకంటే, అతడు (జిహాద్’లో పాల్గొనాలనే) తన సంకల్పములో అల్లాహ్’కు ఇతరులను భాగస్వాములుగా చేసినాడు”. ఆ వ్యక్తి తన ప్రశ్నను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు మూడు సార్లు పునరావృతం చేశాడు. మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి మూడుసార్లు సమాధానమిచ్చారు మరియు మూడుసార్లూ అదే సమాధానం ధృవీకరించారు - అతనికి ఎటువంటి ప్రతిఫలం ఉండదు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ చేత ఆచరణలు అంగీకరించబడే నియమాన్ని గురించి అతనికి తెలియజేశారు: అల్లాహ్ కార్యాలను అంగీకరించడు, అవన్నీ కేవలం అల్లాహ్ కొరకు, మరియు ఇతరులను పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు అయిన ఆయనకు (అల్లాహ్’కు) భాగస్వాములను చేయకుండా ఆచరిస్తే తప్ప.
"అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖన, 'అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:'" "ఒక వ్యక్తి కొరకు ఇస్లాంలోని ఒక ఉత్తమమైన విషయం ఏమిటంటే, తనకు సంబంధం లేని వాటిని వదిలిపెట్టడం."
అత్తిర్మిదీ మరియు తదితరులు నమోదు చేసినారు:"ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్టం చేసినారు: ఒక ముస్లిం యొక్క ఇస్లాం ఎంత పరిపూర్ణమైనదంటే, అతనికి సంబంధం లేని, అతనితో ప్రత్యేకంగా లేని, అతనికి ముఖ్యం కాని మరియు అతనికి ఏ ప్రయోజనం లేని మాటలు మరియు పనుల నుండి, లేదా ధర్మం మరియు ఈ లోకపు విషయాలలో తనకు సంబంధం లేని వాటి నుండి దూరంగా ఉండడం. ఎందుకంటే, ఒక వ్యక్తి తనకు సంబంధం లేని వాటిలో నిమగ్నమైతే, అది అతనికి ముఖ్యమైన వాటి నుండి దూరం చేయవచ్చు, లేదా అతను విడిచిపెట్టవలసిన వాటికి దారితీయవచ్చు. నిశ్చయంగా, ఒక వ్యక్తి తన పనులకు తీర్పు రోజున బాధ్యత వహిస్తాడు."
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక విశ్వాసి అపవాది కాజాలడు (ఇతరులపై అపవాదులు మోపు వాడు), ఇతరులను శపించడు మరియు అనైతిక చర్యలకు పాల్బడడు లేదా సిగ్గుమాలిన పనులు చేయడు.”
అత్తిర్మిదీ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన ఒక విశ్వాసి యొక్క ప్రవృత్తి ఇలా ఉండదు – ఇతరులను వారి వంశం ఆధారంగా (కులం, మతం, ధర్మం ఆధారంగా) విమర్శించడం, లేదా శపించడం, లేదా తిట్లు తిట్టడం, మాటలలోగానీ లేక చేతలలో గానీ సిగ్గుమాలిన తనానికి పాల్బడడం. ఒక నిజమైన విశ్వాసి ఇవన్ని చేయడు.
అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే ఒక దినములో: “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్” (అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు; ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి ఎవరూ లేరు; రాజ్యము, సార్వభౌమత్వము ఆయనదే; మరియు అన్ని రకాల ప్రశంసలూ కేవలం ఆయనకు మాత్రమే శోభిస్తాయి) అని వందసార్లు ధ్యానం చేస్తాడో అతనికి పది మంది బానిసలను విడిపించిన దానికి సమానమైన ప్రతిఫలం ఉంటుంది; అతని ఖాతాలో వంద మంచి పనులు (పుణ్యాలు) జోడించబడతాయి; అతని వంద పాపాలు తుడిచివేయబడతాయి; మరియు ఆ రోజు సాయంత్రం వరకు అతను షైతాను నుండి రక్షించబడతాడు; సత్కార్యాలు చేయడంలో అతడిని ఎవరూ అధిగమించలేరు – ఎవరైతే అతనికంటే ఎక్కువ మార్లు పలుకుతాడో అతడు తప్ప.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: “ఎవరైతే ఇలా పలుకుతాడో: (లా ఇలాహ) ఆరాధనకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు, (ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీక లహు) కేవలం అల్లాహ్ తప్ప, ఆయన దైవత్వములో, ఆయన ప్రభుతలో, ఆయన నామములు మరియు గుణవిశేషణాలలో ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి, భాగస్వామి, ఆయనకు సమానులు ఎవరూ లేరు; (లహుల్ ముల్క్) సార్వభౌమత్వము కేవలం ఆయనదే; ఆధిపత్యము, నిర్వహణ కేవలం ఆయనదే; (వలహుల్ హందు) ఆయన సృష్టించిన ప్రతి దాని కొరకూ మరియు ఆయన ఆదేశించిన ప్రతిదాని కొరకూ కేవలం ఆయన మాత్రమే సర్వ స్తోత్రాలు, ప్రశంసలకు అర్హుడు; (వహువ అలాకుల్లి షైఇన్ ఖదీర్) మరియు ఆయన అన్ని విషయాలపై అధికారము, ఆధిపత్యము గలవాడు, ఎలాంటి అడ్డంకులు లేదా సాటి లేకుండా, మరియు ఆయన కోరనిది ఏదీ జరగనే జరుగదు. ఎవరైతే ఈ స్మరణను రోజుకు వందసార్లు పఠిస్తాడో, అతనికి అల్లాహ్ వద్ద వంద మంది బానిసలకు బానిసత్వమునుండి విముక్తి కలిగించిన వానికి సమానంగా ప్రతిఫలం లభిస్తుంది; అతని ఖాతాలో వంద మంచి పనులు మరియు స్వర్గంలో హోదాలు నమోదు చేయబడతాయి మరియు వంద పాపాలు, చెడు పనులు తొలగించబడతాయి. ఆ విధంగా వంద సార్లు పఠించడం – షైతాను, అతని ప్రలోభాలు, అతని ఆధిపత్యానికి వ్యతిరేకంగా అతనికి శరణు, రక్షణ, కాపుదల కల్పిస్తుంది, మరియు అతనికి రక్షణ కోటగా ఉంటుంది. పునరుత్థాన దినమున ఎవరూ అతడు తీసుకు వచ్చిన దాని కంటే మెరుగైనది తీసుకు రాలేరు, అయితే అంతకంటే ఎక్కువ చేసి, అంతకు మించి చేసిన (పఠించిన) వ్యక్తి తప్ప.
అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: “ఒక వృద్ధుని హృదయం రెండు విషయాలలో యవ్వనంగా ఉంటుంది, ప్రపంచం పట్ల అతని ప్రేమ (అంటే దాని సంపద, వినోదం మరియు విలాసాలు) మరియు అతని నిరంతర ఆశ."
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా తెలియజేస్తున్నారు: ఒక వృద్ధుడు వృద్ధాప్యములో పెరుగుతూ ఉంటాడు, అతని శరీరం బలహీనపడుతుంది, కానీ అతని హృదయం రెండు విషయాల పట్ల ప్రేమలో యవ్వనంగా ఉంటుంది: మొదటిది: సంపదను కూడబెట్టడం ద్వారా ఈ ప్రపంచముపై ప్రేమ; రెండవది: దీర్ఘాయువు, ఆయుర్దాయం, నిరంతర జీవితం మరియు శాశ్వతమైన ఆశలు.
అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా పలికినారు: “సుఖాలను, భోగాలను నాశనం చేసే దానిని తరుచూ గుర్తు చేసుకుంటూ ఉండండి” అంటే మృత్యువును.
అత్తిర్మిదీ, అన్నసాయీ మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణాన్ని తరచుగా స్మరించుకోవాలని కోరారు, ఇది ఒక వ్యక్తికి పరలోకాన్ని గుర్తు చేస్తుంది మరియు ప్రాపంచిక సుఖాల పట్ల, ముఖ్యంగా నిషేధించబడిన వాటి పట్ల అతని ప్రేమను నాశనం చేస్తుంది.
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “మేము రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ‘అల్-హిజ్ర్’ ప్రాంతాన్ని దాటినాము. దాటుతున్నపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాతో ఇలా అన్నారు: “ఎవరైతే స్వయంగా తమకు తామే అన్యాయం చేసుకున్నారో వారి ఇళ్లలోనికి (ప్రాంతము లోనికి) ప్రవేశించకండి, మీరు ఏడుస్తూ ఉన్న స్థితిలో ఉంటే తప్ప. లేకపోతే వారికి చుట్టుకున్న ఆపదే మీకూ చుట్టుకొనవచ్చును.” అలా పలికి ఆయన సల్లల్లాహు అలైహి వ సల్లం త్వరత్వరగా ఆ ప్రాంతాన్ని వెనుక వదిలి సాగిపోయినారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సమూద్ ప్రజల నివాసాల గుండా వెళుతున్నప్పుడు, శిక్షించబడిన మరియు తమకు తామే అన్యాయం చేసుకున్న వారి ఇళ్లలోకి ఎవరూ ప్రవేశించకూడదని ఆయన నిషేధించారు, ఏడుస్తూ మరియు వారికి పట్టిన దుస్థితిని గురించి ఆలోచిస్తూ, వారికి సంభవించిన ఆపద తనకు కూడా వస్తుందేమోనని భయపడుతూ ఉన్న స్థితిలో తప్ప. తరువాత, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన గుర్రాన్ని త్వరగా వెళ్ళమని ఆజ్ఞాపించి, ఆ ప్రాంతాన్ని వదిలి త్వరత్వరగా వెళ్ళిపోయినారు.
హుదైఫహ్ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు: “మేము ఉమర్ (రదియల్లాహు అన్హు) వద్ద కూర్చుని ఉన్నాము. ఆయన ఇలా అన్నారు: మీలో ఎవరు రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) (హఠాత్తుగా వచ్చిపడే) విపత్తు, ఆపద (అల్’ఫిత్నా) గురించి ప్రస్తావించడం విన్నారు? కొంతమంది “మేము విన్నాము” అన్నారు. దానికి ఆయన ఇలా అన్నారు: “బహుశా మీరు ఒక వ్యక్తికి తన కుటుంబములోని సమస్యలు, మరియు అతని పొరుగువారితో సమస్యలు గురించి అనుకుంటున్నారు, అవునా?” వారు “అవును” అన్నారు. అపుడు ఆయన ఇలా అన్నారు: “అవి నమాజు, ఉపవాసం మరియు దానధర్మాల ద్వారా ప్రాయశ్చిత్తం చేయబడతాయి. కానీ మీలో ఎవరు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సముద్రపు అలల వలె ఎగసిపడే ‘అల్-ఫిత్నా’ గురించి ప్రస్తావించగా విన్నారు?”. హుదైఫహ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “అక్కడున్న ప్రజలు మౌనంగా ఉండిపోయారు”. ఆయన ఇంకా ఇలా అన్నారు “నేను విన్నాను”. ఉమర్ రదియల్లాహు అన్హు “మీ తండ్రి నీ కొరకు త్యాగం చేయబడుగాక (మీ తండ్రి గొప్ప ధర్మపరుడు)”. హుదైఫహ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: “రెల్లు చాపను రెల్లు పుల్లలతో ఒకదాని తరువాత ఒకటి కలిపి నేసినట్లుగా, “అల్-ఫితన్” (ఆకర్షణలు, ప్రలోభాలు, వాంఛలు, కోరికలు, సంకటములు, పరీక్షలు మొ.) మనుషుల హృదయాలకు ప్రస్తుతపరచబడతాయి. ఏ హృదయమైతే వాటితో నిండిపోతుందో దానిపై ఒక నల్లటి మచ్చ వేయబడుతుంది. మరియు ఏ హృదయమైతే వాటిని తిరస్కరిస్తుందో దానిపై ఒక తెల్లని మచ్చ వేయబడుతుంది; అలా హృదయాలు రెండు రకాలుగా తయారవుతాయి. ఒకటి శ్వేత వర్ణములో, దానిపై ఏది పడినా దానికి అంటకుండా జారిపోయేటంతటి అతి నున్నటి ఉపరితలం కలిగిన రాయిలాగా, ఆకాశాలూ మరియు భూమి మిగిలి ఉన్నంత కాలం ఏ ప్రలోభాలూ, ఆకర్షణలూ తాకకుండా ఉంటుంది. మరియు మరొకటి నలుపు మరియు ధూళి రంగులో బోర్లించి ఉన్న పాత్రలాగా, మంచిని గుర్తించకుండా లేదా చెడును, కీడును తిరస్కరించకుండా, తాను నింపుకున్న వాంఛలు, మోహము, కోరికలతో నిండి ఉంటుంది.” హుదైఫహ్ (రదియల్లాహు అన్హు) ఇంకా ఇలా అన్నారు: “మీకూ వాటికి (అల్ ఫితన్) మధ్య ఒక మూసివేసిన ద్వారం ఉంది. అది త్వరలోనే బ్రద్దలు కాబోతున్నది”. ఉమర్ రదియల్లాహు అన్హు “అది బ్రద్దలవుతుందా? నీకు తండ్రి లేకుండా పోవుగాక? ఒకవేళ అది తెరుచుకున్నా, తిరిగి అది మూసుకుపోవచ్చుకదా?” నేను ఇలా అన్నాను “లేదు అది బ్రద్దలవుతుంది”, నేను ఆయనకు వివరించాను “నిశ్చయంగా ఆ ద్వారము మనిషిని సూచిస్తుంది. అతడు చంపబడవచ్చు, లేదా చనిపోవచ్చు. ఈ హదీథులో ఎంతమాత్రమూ తప్పు అనేది లేదు. అబూ ఖాలిద్ ఇలా ఉల్లేఖించినారు నేను సా’అద్ తో ఇలా చెప్పాను “ఓ అబూ మాలిక్, “అస్వద్ ముర్బద్ద” అనే పదానికి అర్థం ఏమిటి?” దానికి అతడు “నలుపులో (కలిసిఉన్న) ఉత్తమ స్థాయి తెలుపు” అన్నాడు. నేను “మరి “అల్ కూజు ముజక్ఖియన్” అంటే అర్థం ఏమిటి?” అని ప్రశ్నించాను. దానికి అతడు: “అంటే అది బోర్లించబడి యున్న పాత్ర” అన్నాడు.
ముస్లిం నమోదు చేసినారు:విశ్వాసుల నాయకుడు (అమీరుల్ ము’మినీన్) ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) తన సభలో ఉన్నారు, మరియు ఆయనతో సహచరుల బృందం ఉంది, ఆయన వారితో ఇలా అన్నారు: “అల్ ఫితన్” ను గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ప్రస్తావించగా మీలో ఎవరు విన్నారు?” వారిలో కొందరు “ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అల్-ఫితన్ ను గురించి ప్రస్తావించగా మేము విన్నాము” అన్నారు. అపుడు ఉమర్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఒక వ్యక్తి తన వ్యక్తిగత జీవితములో అతడు, తన భార్య, పిల్లల పట్ల అధిక ప్రేమ, లేక అతని పిసినారితనం, వారితో ఎక్కువ సమయం గడపడం వల్ల తాను సత్కార్యాలు చేలేక పోవడం, తన విధులను సరిగా నిర్వర్తించలేక పోవడం, వారి (భార్యా, పిల్లల) హక్కులు నెరవేర్చలేకపోవడం, వారి క్రమశిక్షణ, వారి విద్య మొదలైన విషయాలలో కొరతలు, అలాగే తన పొరుగు వారితో సమస్యలు – బహుషా వీటన్నిటినీ మీరు “అల్-ఫితన్” అనుకుంటున్నారు, అవునా?” దానికి వారు “అవును” అన్నారు. అపుడు ఉమర్ రదియల్లాహు అన్హు “ఇవి జవాబుదారీ తనానికి సంబంధించిన పరీక్షలు (ఫిత్నాలు), మరియు వాటిలో నమాజు, ఉపవాసం మరియు దానధర్మాలు వంటి మంచి పనుల ద్వారా ప్రాయశ్చిత్తం చేయబడే పాపాలు ఉన్నాయి. కానీ మీలో ఎవరు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) సాధారణంగా ఎదురయ్యే బహిరంగ ఫిత్నాలను (ఆకర్షణలు, ప్రలోభాలు, వాంఛలు, కోరికలు, సంకటములు, పరీక్షలు మొ.) గురించి – వాటి తీవ్రత మరియు విస్తృత వ్యాప్తి కారణంగా, అల్లకల్లోలంగా ఉన్న సముద్రపు అలల వలె ప్రజలను కదిలించే ఫిత్నాల గురించి చెప్పగా విన్నారా? ప్రజలందరూ మౌనంగా ఉండిపోయారు. అప్పుడు హుదైఫహ్ ఇబ్న్ అల్ యమాన్ (రదియల్లాహు అన్హుమా) ఇలా అన్నారు: “నేను విన్నాను”. అది విని ఉమర్ రదియల్లాహు అన్హు సంతోషంగా ఇలా అన్నారు: “నీలాంటి వాడిని పుట్టించినందుకు అల్లాహ్ మీ తండ్రికి ప్రతిఫలం ప్రసాదించుగాక. చెప్పు”. హుదైఫహ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా అన్నారు: 'ఒక సిరి చాప యొక్క పుల్లలు, ముద్రలు దానిపై నిద్రిస్తున్న వ్యక్తి వీపుకు, ప్రక్కలకు అంటుకున్నట్లుగా, ఫిత్నాలు (పరీక్షలు) మానవ హృదయానికి మరియు దాని ప్రక్కలకు అంటుకుంటాయి. పరీక్షల తీవ్రత హృదయాన్ని ప్రభావితం చేస్తుంది మరియు ఈ పరీక్షలు ఒకదాని తర్వాత ఒకటి పునరావృతమవుతాయి. ఈ ఫిత్నాలు ప్రవేశించే ఏ హృదయమైనా వాటిని ఆలింగనం చేసుకుని, ఒక పానీయం శరీరం లోనికి ప్రవేశించిన తరువాత ఎలాగైతే శరీరమంతా దాని ప్రభావం వ్యాపిస్తుందో అలా, ఈ ఫిత్నాలు తనలో వ్యాపించడానికి అనుమతిస్తుంది. అటువంటి హృదయం పై ఒక నల్లని మచ్చ వేయబడుతుంది. మరియు ఏ హృదయమైతే వాటిలో (ఫిత్నాలలో) పడకుండా ఫిత్నాలను తిరస్కరిస్తుందో, ఒక తెల్లని మచ్చ దానిపై వేయబడుతుంది. అలా హృదయాలు రెండు రకాలుగా తయారవుతాయి. తెల్లని హృదయం - ఇది విశ్వాసం (ఈమాన్) పట్ల దృఢమైన నిబద్ధత కలిగి ఉంటుంది, లోపాల నుండి విముక్తమై ఉంటుంది, అది అల్లాహ్’ను కలుసుకునేంత వరకు దానికి ఏ ఫిత్నాలు (పరీక్షలు, వ్యామోహాలు మొ.) అతుక్కోవు, లేదా దానిని ప్రభావితం చేయవు – ఎలాగైతే ఒక అత్యంత మృదువైన, స్వచ్ఛమైన రాయిపై ఏదైనా పడినా దానికి అతుక్కోకుండా జారిపోతుందో ఆ విధంగా. మరొక హృదయం – ఫిత్నాల కాతణంగా (వ్యామోహాలు, వాంఛలు, పరీక్షల కారణంగా) నల్లగా మారిన హృదయం, ఇది తలక్రిందులుగా బోర్లించబడిన కూజా లాంటిది, ఇందులో నీరు నిలిచి ఉండలేదు. అదేవిధంగా, ఈ హృదయం మంచితనం లేదా జ్ఞానం ద్వారా ప్రభావితం కాదు. అది మంచిని గుర్తించదు, చెడును ఖండించదు, అది ఇష్టపడే, ప్రేమించే మరియు కోరుకునే వాటిని తప్ప. హుదైఫా రదియల్లాహు అన్హు ఉమర్ రదియల్లాహు అన్హుతో ఇలా అన్నారు: "మీ జీవితకాలంలో ఈ పరీక్షలేవీ (ఈ ఫిత్నాలు ఏవీ) జరగవు; మీకు మరియు వాటికి మధ్య ఒక మూసిన ద్వారం ఉంది; అయితే అది త్వరలోనే విరిగిపోతుంది.” ఉమర్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “అది విరిగి పోతుందా? ఒకవేళ అది తెరుచుకున్నా, బహుషా అది తిరిగి మూసుకు పోవచ్చును కూడా”. దానికి హుదైఫహ్ రదియల్లాహు అన్హు “లేదు, అది విరిగిపోతుంది. ఆ ద్వారం ఒక మనిషి, అతడు చంపివేయ బడతాడు, లేక చనిపోతాడు.” నేను ప్రస్తావించినది నిజమైన మరియు ధృవీకరించబడిన ఉల్లేఖన. ఇది గ్రంథ ప్రజల రచనల నుండి కాదు, లేదా ఒక వ్యక్తి యొక్క ఇజ్తిహాద్ అభిప్రాయం నుండి కాదు, కానీ ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసు నుండి.