





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
సుహైబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “స్వర్గవాసులు స్వర్గములోనికి ప్రవేశించిన తరువాత సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వారిని ఇలా అడుగుతాడు: “నేను మీకు ఇంకా ఏమైనా ప్రసాదించాలని కోరుకుంటున్నారా?” దానికి వారు ఇలా సమాధానమిస్తారు: “(ఓ అల్లాహ్!) నీవు మా ముఖాలను ప్రకాశవంతం చేయలేదా? నీవు మమ్ములను స్వర్గములోనికి ప్రవేశింపజేసి మమ్ములను నరకాగ్ని నుండి కాపాడలేదా? అపుడు అల్లాహ్ (తనకు, వారికీ మధ్య ఉన్న) పరదాను తొలగిస్తాడు. అప్పుడు వారు సర్వశక్తిమంతుడైన తమ ప్రభువును చూస్తారు. అప్పుడు వారికి సర్వశక్తిమంతుడైన తమ ప్రభువు దర్శన భాగ్యం కంటే గొప్ప అనుగ్రహం మరొకటి కనిపించదు.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: స్వర్గవాసులు స్వర్గములోనికి ప్రవేశించిన తరువాత అల్లాహ్ వారితో ఇలా అంటాడు: మీకు ఇంకా ఏమైనా కావాలా? అప్పుడు స్వర్గవాసులందరూ ముక్త కంఠముతో “(ఓ అల్లాహ్!) నీవు మా ముఖాలను తెల్లగా (మెరిసిపోయేలా) చేయలేదా? మమ్ములను స్వర్గములోనికి ప్రవేశింపజేసి, నరకాగ్ని నుండి రక్షించలేదా?” అంటారు. అప్పుడు అల్లాహ్ అడ్డుగా ఉన్న తెరను తొలగించి దానిని పైకి లేపివేస్తాడు. ఆయన యొక్క తెర ఒక ప్రకాశవంతమైన కాంతి. అప్పుడు స్వర్గవాసులకు తమ ప్రభువు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుని చూడడం కంటే అత్యంత ప్రియమైనది ఏదీ ఉండదు.
జాబిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “నిశ్చయంగా, అరేబియా ద్వీపకల్పంలో “ముసల్లూన్” (నమాజులను తప్పనిసరిగా ఆచరిస్తూ ఉండేవారు) తనను ఆరాధిస్తారనే ఆశను సాతాను కోల్పోయాడు, కానీ వారి మధ్య విభేదాల బీజాలను నాటగలనని అతడు ఆశిస్తున్నాడు.”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: అరేబియా ద్వీపకల్పంలో నమాజులను ఆచరించే విశ్వాసులు తనను ఆరాధించడం మరియు విగ్రహాలకు సాష్టాంగం చేయడం వైపు తిరిగి వస్తారనే ఆశను సాతాను కోల్పోయాడు. అయినప్పటికీ, వివాదాలు, శత్రుత్వం, యుద్ధాలు, కలహాలు మొదలైన వాటిని ప్రేరేపించడం ద్వారా వారి మధ్య విభేదాలను నాటడానికి అతను ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు మరియు కష్టపడుతూనే ఉన్నాడు.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: నరకపు వాసులలో నేను చూడని రెండు రకాలు ఉన్నారు, వారిని నేను ఎన్నడూ చూడలేదు. ఆవు తోకలవంటి కొరడాలు కలిగిన జాతి, వాటితో వారు ప్రజలను కొడుతున్నారు; తాము స్వయంగా చెడు వైపునకు మొగ్గు చూపుతూ, చెడు వైపునకు ఆహ్వానిస్తూ దుస్తులు ధరించి కూడా నగ్నంగా కనిపించే స్త్రీలు; వారి తలలు (కొప్పులు) ఒంటెల మూపురాల మాదిరి ఎత్తుగా ఉండి ఒక వైపునకు వంగి ఉంటాయి. వారు స్వర్గములో ప్రవేశించలేరు, స్వర్గపు పరిమళం కూడా చూడలేరు – వాస్తవానికి స్వర్గపు పరిమళం చాలా చాలా దూరం నుండి వస్తూ ఉంటుంది.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు రకాల ప్రజలను గురించి హెచ్చరించినారు. వారిని ఆయన ఎప్పుడూ చూడలేదు, అంటే ఆ రెండు రకాల ప్రజలు ఆయన కాలంలో లేరు, ఆయన తరువాతి కాలంలో ఉంటారు. మొదటి రకం ప్రజల లక్షణాలు: వీరు ఆవు తోకల వంటి పొడవాటి కొరడాలు కలిగి ఉంటారు. వాటితో ప్రజలను కొడుతూ ఉంటారు. వీరు ప్రజలను అన్యాయంగా కొట్టే పోలీసులు మరియు అణచివేతదారుల సైనికులు. రెండవ రకం ప్రజల లక్షణాలు: వీరు స్త్రీలు. వీరు సాధారణంగా స్త్రీ స్వభావంలో భాగమైన పవిత్రత, నమ్రత, బిడియం అనే వస్త్రాన్ని తొలగించిన స్త్రీలు. వారి వర్ణన: వారు తమ చర్మం రంగును బహిర్గతం చేసే పారదర్శక దుస్తులను ధరిస్తారు కాబట్టి వారు దుస్తులు ధరించినప్పటికీ, వాస్తవార్థంలో నగ్నంగా ఉంటారు; మరియు వారు తమ శరీర భాగాలను కొన్నింటిని కప్పి ఉంచి, తమ అందాన్ని చూపించడానికి ఇతర భాగాలను బహిర్గతం చేస్తారు. వారు తమ వస్త్రధారణతో, మరియు పొగరైన నడకతో మగవారి హృదయాలను తమ వైపునకు త్రిప్పుకుంటారు. వారు తమ భుజాలను కవ్వించే విధంగా వంచి నడుస్తారు; మరియు ఇతరులను కూడా వారు అనుసరించే దుర్మార్గపు మార్గాల వైపునకు ఆహ్వానిస్తారు. అంతేకాదు, వారి తలలు (కొప్పులు) ఒక వైపునకు వొంగి ఉండే, ఒంటె యొక్క మూపురం లాగా ఉంటాయి, ఎందుకంటే వారు తమ తలలను ఉత్తరీయము లేక అటువంటి వస్త్రాలను (స్కార్ఫ్’ల వంటివి) చుట్టడం ద్వారా ఘనంగా, పెద్దదిగా కనబడేలా చేస్తారు. ఒంటెల మూపురాలతో పోలిక ఎందుకంటే, వారి తల వెంట్రుకలు మరియు వారి జడలు వారి తలల పైభాగానికి ఎగిసిపోయి ఉంటాయి. వారు ఆ తల వెంట్రుకలను జడలుగా వేరు చేసి, ఒంటె మూపురం ఒకవైపుకు వాలిపోయి ఎలా ఉంటుందో, అలా తలకు ఒకవైపు వాలిపోయేలా చేస్తారు. ఈ వర్ణన ఏ స్త్రీలకైతే సరిపోతుందో, వారికి ఈ హదీసులో కఠినమైన హెచ్చరిక ఉన్నది. వారు స్వర్గములోనికి ప్రవేశించలేరు, దాని పరిమళాన్ని కూడా ఆస్వాదించలేరు, కనీసం దాని దరిదాపులకు కూడా వెళ్ళలేరు – వాస్తవానికి స్వర్గపు పరిమళం దూరదూరాల నుండి కూడా ఆఘ్రాణించబడుతుంది
అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఒక పురుషుడు మరో పురుషుని ‘ఔరహ్’ ను చూడరాదు. మరియు ఒక స్త్రీ మరో స్త్రీ ‘ఔరహ్’ ను చూడరాదు. అలాగే ఇద్దరు పురుషులు ఒకే వస్త్రములో (లేదా ఒకే వస్త్రము క్రింద నగ్నంగా) పడుకోరాదు, మరియు ఇద్దరు స్త్రీలు ఒకే వస్త్రములో (లేదా ఒకే వస్త్రము క్రింద నగ్నంగా) పడుకోరాదు.”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పురుషుడు మరొక పురుషుని ‘ఔరహ్’ను, మరియు ఒక స్త్రీ మరొక స్త్రీ యొక్క ‘ఔరహ్’ను చూడరాదు అని నిషేధించినారు. ఔరహ్: ఏది బహిర్గతమైతే మనిషి సిగ్గుపడతాడో అటువంటి ప్రతిదీ ‘ఔరహ్’ అనబడుతుంది. పురుషుని శరీరం లో అతని నాభి నుండి మోకాలి వరకు మధ్య ఉన్న శరీర భాగము అతని ‘ఔరహ్’ అనబడుతుంది. స్త్రీ విషయానికి వస్తే, పరపురుషులకు సంబంధించి ఆమె పూర్తిగా (తల నుండి పాదాల వరకు) ‘ఔరహ్’గా భావించబడుతుంది. కానీ ఇతర స్త్రీలకు సంబంధించి మరియు తన ‘మహ్రం’ పురుష బంధువులకు (షరియత్ అనుమతించిన పురుష బంధువులు) సంబంధించి తాను ఇంటి పనులు చేసుకునేటపుడు సాధారణంగా బహిర్గతమయ్యే శరీర భాగాలు వారి ఎదుట బహిర్గతం కావచ్చును. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఒకే వస్త్రంలో లేదా ఒకే వస్త్రము క్రింద (దుప్పట్లో) ఇద్దరూ నగ్నంగా ఉండడాన్ని నిషేధించారు. మరియు ఒక స్త్రీ మరొక స్త్రీతో ఒకే వస్త్రంలో లేదా ఒకే వస్త్రము క్రింద (దుప్పట్లో) ఇద్దరూ నగ్నంగా ఉండడాన్ని నిషేధించారు. ఎందుకంటే అది ఒకరి ఔరహ్ ను మరొకరు తాకడానికి దారి తీస్తుంది. ఏవిధంగానైతే ఒకరి ‘ఔరహ్’ మరొకరు చూడడం నిషేధమో, అదే విధంగా ఒకరి ‘ఔరహ్’ను మరొకరు తాకడం కూడా నిషేధం. నిజానికిది మరింత కఠినంగా నిషేధించబడింది. అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒక వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నాడు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! చిన్న పాపము, పెద్ద పాపము అనే భేదం లేకుండా నేను చేయని పాపపు పని లేదు (మరి నేను క్షమించబడతానా?); దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ తప్ప మరొక నిజ ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు” అని నీవు సాక్ష్యం పలుకలేదా?” అని అతడిని మూడు సార్లు ప్రశ్నించారు. దానికి అతడు “పలికాను” అని జవాబిచ్చాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నిశ్చయంగా అది (ఆ సాక్ష్యము పలుకుట అనేది), దీనిని జయిస్తుంది (నీ పాపలను తుడిచి వేస్తుంది)” అన్నారు.
అబూ యఅలా, అత్తబ్రానీ మరియు దియాఉల్ ముఖద్దసీ నమోదు చేసినారు:ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను అనేక పాపపు పనులకు ఒడిగట్టాను, అనేక అవిధేయతలకు పాల్బడ్డాను. ఏ ఒక్క చిన్న పాపాన్నీ, ఏ ఒక్క పెద్ద పాపాన్నీ వదలలేదు. మరి నేను క్షమించబడతానా?” అని ప్రశ్నించాడు బదులుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఏం నీవు ‘అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు వేరెవ్వరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు’ అని సాక్ష్యము పలుకలేదా?” అని తిరిగి అతడిని ప్రశ్నించారు. అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని మూడు సార్లు ప్రశ్నించారు. అతడు “అవును, నేను సాక్ష్యము పలికాను” అని సమాధానం ఇచ్చాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘షహాదతైన్’ (సాక్ష్యపు వాక్యములో ఉన్న రెండు సాక్ష్యపు పదబంధాలు) యొక్క ఘనతను వివరించారు, మరియు వాటిని ఉచ్ఛరించడం చెడు పనులకు పరిహారంగా అవుతుందని, మరియు అతడి పశ్చాత్తాపము అంతకు ముందు జరిగిన వాటిని హరిస్తుంది అని తెలియజేసారు.
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు “పండితులు, విద్వాంసుల ముందు ప్రదర్శించే (ప్రదర్షనా) బుద్ధితోనో, లేక అఙ్ఞానులు, మూర్ఖులతో వాదించడానికో (వారిలో పైచేయి అనివిపించు కోవడానికో) ఙ్ఞాన సముపార్జన చేయకండి. అలాగే సమావేశాలలో ఉన్నత ఆసనం (కావాలని) ఎంచుకోకండి. ఎవరైతే అలా చేస్తారో – (వారి కొరకు) నరకాగ్ని, నరకాగ్ని”.
ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఉలమాలు, పండితులు, విద్వాంసుల ముందు డాంబికాలు పలుకడానికో, లేదా ‘నేను కూడా మీలాగే పండితుడిని’ చెప్పుకోవడానికో, లేక బుద్ధి హీనులు, అఙ్ఞానులతో వాదనలో వారిలో పైచేయి అనిపించుకోవడానికో, లేక సభలు, సమావేశాలలో ప్రాముఖ్యత సాధించుకోవడానికో ఙ్ఞాన సముపార్జన చేయరాదని హెచ్చరిస్తున్నారు. ఎవరైతే అలా చేస్తారో అలాంటి వారు తమ ప్రదర్శనా బుద్ధి కారణంగా, మరియు ఙ్ఞాన సముపార్జన కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే చేయాలి అనే సంకల్పశుద్ధి లేకపోయినందువల్ల అతడు నరకాగ్నికి పాత్రుడు అవుతాడు.
నవాస్ ఇబ్న్ సమ్ఆన్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “రాచమార్గానికి (సిరాతల్ ముస్తఖీమ్’నకు) సంబంధించి అల్లాహ్ ఒక ఉపమానాన్ని ఇలా ఇచ్చినాడు: “(ఒక రాచమార్గము), ఆ రాచమార్గానికి ఇరువైపులా రెండు ఎత్తైన గోడలు, ఆ గోడలలో పరదాలు వేయబడి ఉన్న అనేక తెరిచి ఉన్న ద్వారాలు, ఆ రాచమార్గపు ప్రవేశ ద్వారం వద్ద ఒక దాయీ (పిలిచేవాడు) ఇలా పిలుస్తూ ఉంటాడు: “ఓ ప్రజలారా! మీరందరూ ఆ మార్గములోనికి ప్రవేశించండి, సంకోచించకండి.” ఆ మార్గపు చివరన ఉండే దాయీ దానికి ఇరువైపులా ఉన్న ద్వారాలలో దేనినైనా తెరవాలని ప్రయత్నించే వానితో ఇలా అన్నాడు “నీ పాడుగాను! దానిని తెరువకు. ఒకవేళ తెరిస్తే నీవు దాని లోనికి వెళ్ళి పోతావు”. ఆ రాచమార్గము ఇస్లాం; ఆ రెండు గోడలు అల్లాహ్ విధించిన హద్దులు; మరియు ఆ చెరిచి ఉన్న ద్వారాలు అల్లాహ్ నిషేధాలు. ఆ రాచమార్గపు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న దాయీ అల్లాహ్ యొక్క దివ్య గ్రంథము; మరియు మార్గపు చివరన ఉన్న దాయీ ప్రతి ముస్లిం హృదయములో ఉండే అల్లాహ్ యొక్క మందలింపు, హెచ్చరిక”.
అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: అల్లాహ్ ఇస్లాంను వంకరటింకరలు లేని ఒక విశాలమైన మరియు సూటియైన రహదారి (రాచమార్గము) తో పోల్చినారు. ఆ మార్గానికి ఇరువైపులా రెండు ఎత్తైన గోడలున్నాయి, లేక ఆ మార్గము రెండు ఎత్తైన గోడలతో పరివేష్టించబడి ఉన్నది. అవి రెండూ అల్లాహ్ విధించిన హద్దులు. ఆ రెండు గోడలలో అనేక తెరువబడి ఉన్న తలుపులు ఉన్నాయి. అవి అల్లాహ్ నిషేధాలు. ఆ తలుపులపై తెరలు వేయబడి ఉన్నాయి. ఆ తెరలు రహదారిపై వెళుతున్న వ్యక్తికి లోన ఎవరున్నారో (లేక ఏమి ఉన్నదో) కనిపించ నీయవు. ఆ రహదారి ప్రవేశం వద్ద ఒక దాయీ (పిలిచేవాడు) ఉంటాడు, అతడు ప్రజలను పిలుస్తూ, వారికి సూచనలిస్తూ, మార్గదర్శకత్వం చేస్తూ వారితో ఇలా అంటాడు ‘దారికి ఇరువైపులా ఎటు వైపునకూ వంగకుండా తిన్నగా నడుస్తూ ఉండండి’. ఆ దాయీ (పిలిచే వాడు) అల్లాహ్ యొక్క దివ్య గ్రంథము. ఆ రహదారికి చివరన మరొక దాయీ ఉంటాడు. ఆ దాయీ, ఆ మార్గమున పోతూ ఉండే బాటసారి దానికి ఇరువైపులా ఉండే తలుపుల పై తెరలలో దేనినైనా ఏ కొద్దిగా తెరెవడానికి ప్రయత్నించినా అతనితో ఇలా అంటాడు: “నీ పాడు గాను! దానిని తెరువకు. తెరిచావో నీవు దానిలోనికి ప్రవేశిస్తావు, ప్రవేశించకుండా నిన్ను నీవు ఆపుకోలేవు”. ఈ దాయీ ప్రతి ముస్లిం హృదయములో ఉండే అల్లాహ్ యొక్క మందలింపు మరియు హెచ్చరిక.
అబీ హురైరహ్ రజీయల్లాహు అన్హు ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా తాను తన కుటుంబము వద్దకు తిరిగి వచ్చినపుడు ఎదురుగా పెద్ద పెద్ద, బాగా బలిసిన మరియు గర్భముతో ఉన్న మూడు ఆడ ఒంటెలను చూడడానికి ఇష్టపడతారా?” దానికి మేమందరమూ “అవును, ఇష్టపడతాము” అన్నాము. అపుడు ఆయన “నీవు సలహ్ లో (నమాజులో) పఠించే మూడు ఆయతులు పెద్ద పెద్ద, బాగా బలిసిన మరియు గర్భముతో ఉన్న మూడు ఆడ ఒంటెల కంటే నీ కొరకు శుభప్రదమైనవి” అన్నారు.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాహ్ లో (ఖుర్ఆన్ నుండి కనీసం) మూడు ఆయతులను పఠించడం యొక్క ఘనతను మరియు దాని ప్రతిఫలాన్ని గురించి తెలియజేస్తున్నారు – అది పెద్ద పెద్ద, బాగా బలిసిన మరియు గర్భముతో ఉన్న మూడు ఆడ ఒంటెల కంటే కూడా మేలైనది.
ఉఖబహ్ బిన్ ఆమిర్ అల్ జుహనీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ఖుర్’ఆన్ ను బహిరంగంగా పఠించే వాడు, బహిరంగంగా సదఖా (దాన ధర్మములు) చేసినటువంటి వాడు, ఖుర్’ఆన్ ను ఒంటరిగా (ఏకాంతములో) పఠించేవాడు, రహస్యముగా సదఖా చేసినటువంటి వాడు”.
అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అన్నసాయీ నమోదు చేసినారు:ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఎవరైతే ప్రకటించి ఖుర్’ఆన్ పఠనం గావిస్తాడో అతడు ప్రకటించి దానధర్మములు చేయువాని వంటివాడు; అలాగే ఎవరైతే చాటుగా, ఏకాంతములో ఖుర్’ఆన్ పఠనం గావిస్తాడో అతడు రహస్యంగా దానధర్మములు చేయునటువంటి వాడు.