





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “దౌర్జన్యము, అణచివేతలకు పాల్బడుట పట్ల జాగ్రత్తగా ఉండండి; ఎందుకంటే నిశ్చయంగా దౌర్జన్యము, అణచివేతలు ప్రళయదినమునాడు పొరలు కలిగిన అంధకారమై నిలుస్తుంది; పిసినారితనం పట్ల జాగ్రత్తగా ఉండంది, నిశ్చయంగా పిసినారితనం మీకు పూర్వం గతించిన వారిని నాశనం చేసింది; అది వారిని రక్తం చిందించేలా ప్రేరేపించింది; నిషేధించబడిన వాటిని (హరాం విషయాలను); అనుమతించుకునేలా చేసింది (హలాల్ చేసుకునేలా చేసింది)”.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “జుల్మ్”నకు (దౌర్జన్యము, అణచివేతలకు) పాల్బడుటను గురించి హెచ్చరిస్తున్నారు. అది ప్రజల పట్ల దౌర్జన్యము గానీ, తన స్వయం పట్ల దౌర్జన్యము గానీ, లేక అల్లాహ్ యొక్క హక్కుల పట్ల దౌర్జన్యము గానీ – వీటన్నిటి పట్ల ఈ హదీథులో హెచ్చరిస్తున్నారు. “జుల్మ్” అంటే ఎవరి హక్కును వారికి చెల్లించకపోవడం. ఈ హదీథులో ప్రళయ దినమున “జుల్మ్” పొరలు కలిగిన అంధకారమై వస్తుంది అని వర్ణించడం జరిగింది – అంటే ఆ దినమునాడు “జుల్మ్” నకు పాల్బడిన వానిపై విరుచుకుపడే దుర్భరమైన శిక్షలు, భయానకమైన విషయాలు అన్నమాట. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిసినారితనం గురించి కూడా హెచ్చరించినారు. ఇక్కడ పిసినారితనం అంటే విపరీతమైన లోభము మరియు విపరీతమైన దురాశ అని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు పిసినారితనం వల్ల ఒకరికి హక్కుగా చెల్లించవలసిన ఆర్థికపరమైన విషయాలలో తక్కువ చేయడం; విపరీతమైన దురాశ కారణంగా ప్రాపంచిక లాభాల పట్ల తీవ్రంగా చింతించడం. ఈ విధమైన “జుల్మ్” మన పూర్వతరాలలో కొన్నిటిని నాశనం చేసింది; అది వారిని ఒకరినొకరు చంపుకునేలా చేసింది, హరాంను హలాల్ గా చేసుకునేలా చేసింది.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ఓక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు: “ఇస్లాంలో ఏ విషయం అన్నింటి కంటే ఉత్తమమైనది?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “(ఆకలిగొన్న వారికి) అన్నం తినిపించడం, ‘సలాం’ చేయడం, నీకు పరిచయం ఉన్న వారికీ, మరియు నీకు పరిచయం లేని వారికీ కూడా”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడగడం జరిగింది – ఇస్లాంలో ఏ విషయం అన్నింటి కంటే ఉత్తమమైనది? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు విషయాలను ప్రస్తావించారు: మొదటిది: పేదలకు తరచుగా అన్నం పెట్టడం, ఇందులో స్వచ్ఛంద సేవ, బహుమతులు, ఆతిథ్యం ఇవ్వడం మరియు విందు భోజనాలు ఏర్పాటు చేయడం ఉన్నాయి. ఇతరులకు ఆహారం ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం కరువు, ధరల పెరుగుదల కాలంలో మరింత స్పష్టమవుతుంది. రెండవది: ప్రతి ముస్లిం కి ‘సలాం’ చేయడం, వారు నీకు పరిచయం ఉన్నవారైనా, పరిచయం లేని వారైనా సరే.
అలీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నాతో ఇలా అన్నారు: “(ఓ అలీ!) నీవు ఇలా పలుకు “అల్లాహుమ్మహ్’దినీ వసద్దిద్’నీ” (ఓ అల్లాహ్! నాకు మార్గదర్శకం ప్రసాదించు మరియు నేను తిన్నటి మార్గమునే అంటి పెట్టుకుని ఉండేలా చేయి), ఈ దుఆ చేయునపుడు నీవు మార్గదర్శకం కొరకు ప్రార్థిస్తున్నపుడు ఆయన చేత నీవు సరళ మార్గములో మార్గదర్శకం చేయబడుతున్నావు అని మనసులో భావించు. అలాగే తిన్నటి మార్గమునే అంటి పెట్టుకుని ఉండేలా చేయి అని ప్రార్థిస్తున్నపుడు, ఎక్కుపెట్టబడిన బాణము సూటిగా లక్ష్యం ఛేదించడాన్ని మనసులో ఊహించుకో.”
ముస్లిం నమోదు చేసినారు:అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వేడుకుంటూ దుఆ చేయమని ఆదేశించినారు: (అల్లాహుమ్మహ్’దినీ) ఓ అల్లాహ్! నాకు మార్గదర్శకం చేయి, నాకు మార్గనిర్దేశనం చేయి, నాకు సన్మార్గాన్ని చూపు; (వ సద్దిద్’నీ) నాకు (ఆ మార్గముపై) స్థిరత్వాన్ని ప్రసాదించు, అందులో నాకు సాఫల్యాన్ని ప్రసాదించు, మరియు నాకు సంబంధించిన అన్ని వ్యవహారాలలో నేను సూటిగా ఉండేలా, సూటిగా వ్యవహరించేలా చేయి. అల్-హుదా: (మార్గదర్శకం): అంటే ఒక వ్యక్తి సత్యమును వివరముగాను, మొత్తముగాను తెలుసుకొనుట, మరియు అతడు దానిని బాహ్యంగాను, అంతర్గతంగాను అనుసరించుటకు మార్గనిర్దేశం చేయబడుటను సూచిస్తుంది అస్’సదాద్: (సరైన మార్గానికి కట్టుబడి ఉండుట): అంటే దీని అర్థము, సత్యానికి అనుగుణమైన దేనిలోనైనా అంటే మాటలలోనైనా, ఆచరణలలోనైనా మరియు విశ్వాసములలో అయినా – మార్గదర్శకాన్ని కలిగి ఉండుట, అన్ని విషయాలలోనూ, అన్ని వ్యవహారాలలోనూ సూటిగా ఉండుట, మరియు సూటియైన మార్గానికి కట్టుబడి ఉండుట. స్పష్టమైన రూపంలో వ్యక్తీకరించబడినప్పుడు అంత వరకూ అస్పష్టంగా ఉన్న విషయాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి, ఈ దుఆను చదివేటప్పుడు గుర్తుంచుకోండి: (అల్-హుదా: మిమ్మల్ని సరైన మార్గం వైపు మార్గనిర్దేశం చేయమని అల్లాహ్’ను వేడుకుంటున్నారు). కనుక మార్గనిర్దేశం కొరకు వేడుకుంటున్నపుడు ఒక ప్రయాణీకునికి ఇవ్వబడే మార్గనిర్దేశాన్ని మీ హృదయంలో గుర్తుకు తెచ్చుకోండి. మార్గనిర్దేశంలో భాగంగా తనకు ఇవ్వబడిన ఆదేశాల నుండి అతడు పక్కకు జరుగడు, వైదొలగడు, తత్కారణంగా అతడు సురక్షితంగా, ఆలస్యం చేయకుండా తన గమ్యాన్ని చేరుకుంటాడు. (వ అస్’సదాద్) అంటే సూటిగా ఎక్కు పెట్టబడిన బాణం: కొద్దిగా కూడా అటూ ఇటూ కాకుండా సూటిగా ఎక్కు పెట్టబడి వదిలిన బాణం ఎంత వేగంగా లక్ష్యాన్ని చేరుకుంటుందో మనం గమనించవచ్చు. విలుకాడు బాణాన్ని వదలడానికి ముందు లక్ష్యాన్ని గురి చూస్తాడు. అదే విధంగా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్’ను “అస్’సదాద్” (అన్ని విషయాలలో, అన్ని వ్యవహారాలలో సూటిగా ఉండేలా మార్గదర్శకం) కొరకు వేడుకుంటున్నపుడు, ఎక్కు పెట్టబడిన బాణం యొక్క ఋజుత్వాన్ని, సూటితత్వాన్ని కోరుకుంటున్న సంకల్పం మీలో ఉండాలి. అటువంటి సంకల్పం మీలో ఉంటే, మీరు అత్యున్నత స్థాయి ఋజుత్వం కొరకు, అత్యున్నత స్థాయి సూటితత్వం కొరకు, మరియు చరమస్థాయి మార్గదర్శకం కొరకు మీరు అర్థిస్తున్నారన్నమాట. కనుక సర్వోన్నతుడైన అల్లాహ్ ను “అస్’సదాద్” కొరకు వేడుకొంటున్నపుడు ఈ భావాన్ని మీ మనసులోనికి తెచ్చుకుని, లక్ష్యం వైపునకు ఎక్కు పెట్టబడే బాణం మాదిరిగా అర్థించండి.
అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : ఫాతిమా (రదియల్లాహు అన్హా), తిరగలి (ఇసుర్రాయి) కారణంగా తన చేతులు ఏ విధంగా అయి పోతున్నాయో చూడండి అంటూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ వద్ద ఫిర్యాదు చేసారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ వద్దకు కొంతమంది బానిస బాలికలను తీసుకు వచ్చినారని ఆమె విని ఉన్నది. కానీ (ఆమె అక్కడికి వచ్చినప్పుడు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు కనిపించలేదు. ఫాతిమా రదియల్లాహు అన్హా తన సమస్యను ఆయిషా రదియల్లాహు అన్హా కు చెప్పింది. ఆయిషా రదియల్లాహు అన్హా ఆ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేసినారు.” అలీ రదియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “(ఆ రాత్రి) మేము నిద్రపోవడానికి ఉపక్రమిస్తున్నపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మా వద్దకు వచ్చినారు. ఆయన రాగానే మేము లేవాలని అనుకున్నాము. కానీ ఆయన “(లేవకండి) అలాగే ఉండండి” అని అన్నారు. ఆయన మా వద్దకు వచ్చి మా మధ్య కూర్చొన్నారు. ఆయన పాదాల చల్లదనం నా ఉదరానికి తగిలినది. అపుడు ఆయన ఇలా అన్నారు: “నువ్వు కోరిన దానికంటే మంచి దాని వైపునకు నేను మార్గదర్శకం చేయనా? మీరు రాత్రి పడుకునేటపుడు “సుబ్’హానల్లాహ్” అని ముఫ్ఫై మూడు సార్లు, “అల్’హందులిల్లాహ్” అని ముఫ్ఫై మూడు సార్లు, మరియు “అల్లాహు అక్బర్” అని ముఫ్ఫై నాలుగు సార్లు ఉచ్ఛరించండి. అది (ఇంటిలో) ఒక సేవకుడిని కలిగి ఉండడం కంటే మేలైనది, శుభప్రదమైనది.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ కుమార్తె అయిన ఫాతిమా (రదియల్లాహు అన్హా) తిరగలి (ఇసుర్రాయి) కారణంగా తన చేతులు ఏ విధంగా పాడవుతున్నాయో చూడండి అంటూ ఫిర్యాదు చేయడం చూస్తున్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు కొంత మంది యుద్ధఖైదీలు వచ్చినారని తెలుసుకుని వారిలో ఒకరిని, తన ఇంటి పనుల కొరకు తనకు సేవకురాలిగా ఇవ్వమని అడగడానికి ఆమె ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళినది. ఆమె వెళ్ళినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటిలో లేరు. ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉన్నారు. ఫాతిమా రదియల్లాహు అన్హా తన సమస్యను ఆమెకు వివరించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటికి తిరిగి వచ్చినపుడు ఆయిషా రదియల్లాహు అన్హా, ఫాతిమారదియల్లాహు అన్హా ఒక సేవకురాలి కొరకు అడగడానికి వచ్చిన విషయాన్ని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లమ్ కు తెలియజేసినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫాతిమా మరియు అలీ రదియల్లాహు అన్హుమ్ ల వద్దకు వచ్చారు. అపుడు వారు పక్కలు పరుచుకుని నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లమ్ వారిద్దరి మధ్య కూర్చున్నారు. వారి పాదాల చల్లదనం అలీ రదియల్లాహు అన్హు కు తెలుస్తున్నది. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఇలా అన్నారు: “మీరు ఏదైతే సేవకురాలిని ఇవ్వమని అడగడానికి వచ్చారో, దానికంటే మేలైన దానిని నేను మీకు బోధించనా?” వారిద్దరూ “తప్పనిసరిగా బోధించండి” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “రాత్రి మీరు నిద్రించడానికి ముందు ముఫ్ఫై నాలుగు సార్లు “అల్లాహు అక్బర్” అని పలుకుతూ అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని కొనియాడండి;” “ముఫ్ఫైమూడు సార్లు “సుబ్’హానల్లాహ్” అని పలికి ఆయన ఘనతను కీర్తించండి;” “మరియు “సుబ్’హానల్లాహ్” అని ముఫ్ఫైమూడు సార్లు పలికి “సకల స్తోత్రములూ ఆయనకే శోభిస్తాయి” అని ఉచ్ఛరించండి.” “ఈ విధంగా అల్లాహ్’ను స్తుతించడం, ఒక సేవకుడిని కలిగి ఉండడం కన్నా మీకు మేలైనది.”
అబ్దుల్లాహ్ ఇబ్నె ఖుబైబ్ రజియల్లాహు అన్హు కధనం : “ఒకనాటి చిమ్మ చీకటి రాత్రి, వర్షం కురుస్తుండగా మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు బయలుదేరినాము, మాకు నమాజు చదివించమని కోరడానికి”. ఆయన ఇంకా ఇలా అన్నారు “నేను ఆయనను పట్టుకున్నాను”. ఆయన (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఇలా అను” అన్నారు; నేను ఏమీ అనలేదు. ఆయన మళ్ళీ “ఇలా అను” అన్నారు; నేను ఏమీ అనలేదు. ఆయన తిరిగి “ఇలా అను” అన్నారు. అపుడు నేను “ఏమని అనాలి (ఓ ప్రవక్తా!)” అన్నాను. దానికి ఆయన: “ఖుల్ హువల్లాహు అహద్” (సూరతుల్ ఇఖ్లాస్); మరియు ‘ముఅవ్విజతైన్’ (సూరతుల్ ఫలఖ్ మరియు సూరహ్ అల్-న్నాస్) వీటిని ప్రతి సాయంత్రం మరియు ప్రతి ఉదయం మూడు సార్లు పఠించు; అవి నీకు ప్రతి విషయానికీ సరిపోతాయి (అంటే ప్రతి విషయం నుండీ నీకు రక్షణ కల్పిస్తాయి)” అన్నారు.
అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అన్నసాయీ నమోదు చేసినారు:ఒక గొప్ప సహాబీ – అబ్దుల్లాహ్ ఇబ్నె ఖుబైబ్ రజియల్లాహు అన్హు – బాగా వర్షం కురుస్తూ, చిమ్మ చీకటిగా ఉన్న ఒక రాత్రి తాము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు, తమకు నమాజు చదివించమని కోరడాని బయలుదేరినామని, మరియు ఆయనను చూసినామని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో “ఇలా అను” అన్నారు, అంటే అక్కడ దాని అర్థం “పఠించు” అని. కానీ ఆయన ఏమీ పఠించకుండా అలాగే నిలబడ్డారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అవే మాటలను తిరిగి అన్నారు. అపుడు అబ్దుల్లాహ్ ఇబ్న్ ఖుబైబ్ “ఏమి పఠించను, ఓ ప్రవక్తా!” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “సూరహ్ అల్ ఇఖ్లాస్ (ఖుల్ హువాల్లాహు అహద్), మరియు ముఅవ్విజతైన్’ (సూరహ్ అల్ ఫలఖ్ - “ఖుల్ అఊజు బిరబ్బీల్ ఫలఖ్”, మరియు సూరహ్ అన్నాస్ “ఖుల్ అఊజు బిరబ్బీన్నాస్”) వీటిని సాయంత్రపు సమయాన, మరియు ఉదయం మూడు సార్లు పఠించు. అవి నీకు అన్ని విధాలా కీడు నుండి, మరియు అన్ని రకాల ఆపదల నుండి రక్షణ కల్పిస్తాయి” అన్నారు.
అబాన్ ఇబ్న్ ఉథ్మాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “నేను (నా తండ్రి) ఉథ్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) ఇలా పలుకగా విన్నాను: “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా విన్నాను: “ఎవరైతే (సాయంత్రం పూట) మూడుసార్లు “బిస్మిల్లా హిల్లదీ లాయదుర్రు మఅస్మిహి షైఉన్, ఫిల్ అర్ది, వలా ఫిస్సమాఇ, వహువస్సమీఉల్ అలీం” (అల్లాహ్ పేరుతో; ఎవరి పేరు ప్రస్తావించబడినపుడైతే, భూమిలోనూ, మరియు ఆకాశాలలోనూ ఉన్న దేదీ హాని కలిగించలేదో; ఆయన అన్నీ వినేవాడు, సర్వఙ్ఞుడు) అని పలుకుతాడో, అతడు ఉదయం వరకు ఏ ఆకస్మిక హానికి గురికాడు. మరియు ఎవరైతే ఈ పదాలను ఉదయం పలుకుతాడో, అతడు సాయంత్రం వరకు ఏ ఆకస్మిక హానికి గురికాడు.” (ఇది విని అక్కడే ఉన్న వ్యక్తి, పక్షవాతానికి గురి అయి ఉన్న అబాన్ ఇబ్న్ ఉథ్మాన్ (ర) ను చూడసాగినాడు, దానితో ఆయన అతనితో) “ఎందుకలా చూస్తున్నావు నా వైపు? అల్లాహ్ సాక్షిగా, నేను ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) పట్ల అబద్ధం చెప్పలేదు, అలాగే ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అబద్ధం చెప్పలేదు. ఏ రోజైతే నాకు ఈ పక్షవాతం వచ్చిందో, ఆ రోజు నేను కోపంలో ఉండి ఈ మాటలు పలుకడం మర్చిపోయాను” అన్నారు.
అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ కుబరా, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించినారు: ప్రతి రోజు ఉదయం, తెల్లవారుజామున, మరియు ప్రతి సాయంత్రం, సూర్యాస్తమయానికి ముందు మూడు సార్లు: (బిస్మిల్లా హిల్లదీ లాయదుర్రు మఅస్మిహి షైఇన్ ఫిల్ అర్ది వలా ఫిస్సమాఇ, వహుస్సమీఉల్ అలీం) అని పలుకుతాడో - అంటే (బిస్మిల్లాహి – అల్లాహ్ పేరుతో) నేను రక్షణ కోరుతున్నాను, (మఅస్మిహి) ఆయన పేరు పలికినంతనే (ఫిల్ అర్ది) భూమిపై ఉన్నది ఏదైనా, ఎంత పెద్దదైనా, లేక భూమి నుండి పుట్టుకు వచ్చే ఏ కీడు అయినా సరే, అలాగే (వలా ఫిస్సమాఇ) అలాగే ఆకాశాలలోని కీడులలో నుండి ఏ కీడు అవతరించినా (లాయదుర్రు) హాని కలిగించలేదు, (వహువస్సమీఉల్ అలీం) ఆయనే మనం మొరపెట్టుకునేదంతా వినేవాడు, మరియు మన పరిస్థితుల, స్థితిగతుల సంపూర్ణ ఙ్ఞానము కలవాడు – అని పలుకుతాడో; అతనికి అకస్మాత్తుగా కలిగే ఏ కీడూ హాని కలిగించదు. ఎవరైతే తాను నిద్రించడానికి పక్క పైకి చేరే ముందు ఈ వాక్యాలు ఉచ్ఛరిస్తాడో ఉదయం వరకు అతనిపై అకస్మాత్తుగా ఏ కీడూ, ఏ హానీ వచ్చి పడదు. అలాగే ఎవరైతే ఉదయం నిద్ర లేచినపుడు ఈ వాక్యాలను ఉచ్ఛరిస్తాడో సాయంత్రం వరకు అతనిపై అకస్మాత్తుగా ఏ కీడూ, ఏ హానీ వచ్చి పడదు. ఈ హదీథు ఉల్లేఖించిన అబాన్ ఇబ్న్ ఉథ్మాన్ (ర) పక్షవాతముతో బాధపడుతూ ఉండినారు. ఆయన శరీరంలో ఒక పార్శ్వము సాగిల పడినట్లుగా ఉండేది. ఆయన ఈ హదీథు ఉల్లేఖించినపుడు అక్కడే ఉన్న వ్యక్తి అబాన్ ఇబ్న్ ఉథ్మాన్ వైపునకు ఆశ్చర్యంగా చూడసాగినాడు. దాంతో ఆయన ఆ వ్యక్తితో “ఎందుకలా నావైపు చూస్తున్నావు? అల్లాహ్ సాక్షిగా నేను ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ పట్ల అబద్ధం చెప్పలేదు; ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అబద్ధం చెప్పలేదు. నాకు ఈ పక్షవాతం సంభవించిన దినమున నేను ఈ వాక్యములు పలకాలని అల్లాహ్ రాసిపెట్టలేదు. ఆ దినము నేను కోపంలో ఉండి ఈ వాక్యములు పలకడం మరిచిపోయాను” అన్నారు.
సాద్ ఇబ్నె అబీ వఖ్ఖాస్ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: “ఒక ఎడారివాసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి “ఓ ప్రవక్తా! అల్లాహ్’ను స్మరిస్తూ ఉండడానికి నాకు ఏదైనా నేర్పించండి”. ఆయన ఇలా అన్నారు: “నీవు ఇలా పలుకు “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీక లాహు, అల్లాహు అక్బర్ కబీరా, వల్’హందులిల్లాహి కథీరా, సుబ్’హానల్లాహి రబ్బీల్ ఆ’లమీన్, లా హౌల వ లా ఖువ్వత ఇల్లా బిల్లాహిల్ అజీజిల్ హకీం”; దానికి ఆ ఎడారివాసి “అవి నా ప్రభువు కొరకు, మరి నా కొరకు ఏమిటీ?” అని ప్రశ్నించాడు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకు అన్నారు: “అల్లాహుమ్మగ్’ఫిర్లీ, వర్హమ్’నీ, వహ్’దినీ; వర్జుఖ్’నీ.”
ముస్లిం నమోదు చేసినారు:ఒక ఎడారివాసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి అల్లాహ్’ను స్మరిస్తూ ఉండడానికి నాకు ఏదైనా నేర్పించండి అని కోరాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని ఇలా పఠించు అని అన్నారు: “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి తౌహీద్ యొక్క షహాదత్ పదాలతో (ఏకేశ్వరోపాసన, ఆరాధ్యదైవం అల్లహ్ ఒక్కడే అని సాక్ష్యం పలికే పదాలతో) ప్రారంభించారు, అంటే అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి, భాగస్వామి, ఎవరూ లేరు అని అర్థం. “అల్లాహు అక్బర్ కబీరా” అంటే అల్లాహ్ అందరి కంటే, అన్నిటి కంటే గొప్పవాడు మరియు గొప్పతనం కలవాడు. “వల్’హందులిల్లాహి కసీరా” (ఓ అల్లాహ్ నీకు సమృద్ధిగా ప్రశంసలు) (ఓ అల్లాహ్ నీకు సమృద్ధిగా ప్రశంసలు) అంటే అల్లాహ్ యొక్క గుణవిశేషణాలకు, ఆయన చర్యలకు మరియు మానవాళిపై ఆయన యొక్క లెక్కలేనన్ని అనుగ్రహాల కొరకు అల్లాహ్ కు సమృద్ధిగా ప్రశంసలు. “సుబ్’హానల్లాహి రబ్బిల్ ఆ’లమీన్” (సర్వలోకాల ప్రభువు అయిన అల్లాహ్ పవిత్రుడు). అంటే ఆయన సర్వశ్రేష్ఠుడు, మహోన్నతుడు, అసంపూర్ణత, మరియు కొరతలన్నింటికీ అతీతుడు. “లా హౌల, వలా ఖువ్వత ఇల్లా బిల్లాహిలజీజిల్ హకీం” (సర్వశక్తిమంతుడు మరియు వివేకవంతుడు అయిన అల్లాహ్తో తప్ప శక్తిగానీ లేదా బలం గానీ లేదు). అంటే: అల్లాహ్, మరియు ఆయన సహాయం, అనుగ్రహం మరియు మార్గదర్శకత్వం ద్వారా తప్ప మనిషి ఒక స్థితి నుండి మరొక స్థితికి మారలేడు – అని అర్థం ఇది విని ఆ మనిషి ఇలా అన్నాడు: “ఈ పదాలు నా ప్రభువును స్తుతించుట కొరకు, ఆయన ఘనతను కొనియాడుట కొరకు. మరి నేను నాకొరకు ఏమని వేడుకోవాలి?” అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నీవు ఇలా వేడుకో: “అల్లాహుమ్మగ్’ఫిర్లీ” “ఓ అల్లాహ్ నా పాపములను క్షమించు” “వాటిని చెరిపి వేయడం ద్వారా మరియు వాటిని కప్పివేయడం ద్వారా” “వర్’హమ్నీ” “నన్ను కరుణించు, నన్ను అనుగ్రహించు” “ఈ పాపంచిక జీవితానికి మరియు నా పరలోక జీవితానికీ ప్రయోజనం చేకూర్చే వాటిని నాకు ప్రసాదించడం ద్వారా” “వహ్’దినీ” “నాకు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించు” “అన్ని విషయాలలో, అన్ని పరిస్థితులలో; మరియు ఋజుమార్గం వైపునకు” “వర్’జుఖ్’నీ” “నన్ను ఆశీర్వదించు...” ధర్మబద్ధమైన (హలాల్) సంపదతో, ఆరోగ్యముతో, మంచితనం మరియు శ్రేయస్సుతో నన్ను ఆశీర్వదించు.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే “అల్’లాత్” మరియు “అల్’ఉజ్జా” ల సాక్షిగా అంటూ ప్రమాణం చేస్తాడో, అతడు మరలా ”లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలకాలి. ఎవరైతే తన సహచరునితో “రా, నీతో జూదమాడనివ్వు” అని ఆహ్వానిస్తాడో, అతడు దానధర్మాలు చేయాలి.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరునగాక వేరొకరి పేరుతో ప్రమాణం చేయరాదని హెచ్చరిస్తున్నారు, ఎందుకంటే ఒక విశ్వాసి కేవలం అల్లాహ్ పేరుతో మాత్రమే ప్రమాణం చేస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా తెలియజేస్తున్నారు: అల్’లాత్ మరియు అల్ ఉజ్జా అనేవి రెండు విగ్రహాలు, ఇస్లాంకు పూర్వం ప్రజలు వీటికి పూజలు చేసేవారు, వీటిని ఆరాధించేవారు. ఎవరైతే ఈ రెండు విగ్రహాల పేరున ప్రమాణం చేస్తాడో, అతడు – బహుదైవారాధనలో పడిపోకుండా, దాని నుండి దూరంగా ఉండేందుకు గానూ మరియు అల్’లాత్, అల్ ఉజ్జాల పేరిట తాను చేసిన ప్రమాణానికి పరిహారంగానూ, తనను తాను సరిదిద్దుకుంటూ – అతడు “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలకాలి. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసినారు: జూదము అంటే అందులో ఇద్దరు వ్యక్తులు పోటీ పడతారు. వారి మధ్య ధారాళంగా డబ్బు మార్పిడి ఉంటుంది. గెలిచిన వాడు మొత్తం డబ్బును తీసుకు వెళతాడు. ఇందులో ఉన్న ఇద్దరూ లాభనష్టాల ఊబి నుండి విముక్తులై లేరు. ఒకరి లాభము మరొకరి నష్టమవుతుంది. కనుక ఎవరైతే తన సహచరునితో ‘రా! మనం జూదమాడుదాం’ అని ఆహ్వానిస్తాడో, అలా ఆహ్వానించినందుకు ప్రాయశ్చితంగా అతడు దానధర్మాలు చేయాలి.
అబూ సఈద్ అల్ ఖుద్రీ మరియు అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ప్రకటన చేసేవాడు ఇలా ప్రకటిస్తాడు: “మీరు శాశ్వతంగా ఆరోగ్యవంతులై ఉంటారు; ఎన్నటికీ వ్యాధిగ్రస్తులు కారు; మీరు శాశ్వతంగా జీవితులై ఉంటారు, ఎన్నటికీ చనిపోరు; మీరు శాశ్వతంగా యవ్వనంలో ఉంటారు, ఎన్నటికీ వృద్ధులు కారు; మరియు మీరు ఎల్లప్పుడూ సిరిసంపదలతో, సంపన్న పరిస్థితుల్లో జీవిస్తారు మరియు ఎప్పటికీ నిరుపేదలుగా మారరు; ఇది సర్వోన్నతుడైన, సర్వశ్రేష్ఠుడైన అల్లాహ్ యొక్క వాక్కు: అపుడు వారికి ఒక వాణి వినబడుతుంది: ''మీరు చేస్తూ ఉండిన సత్కార్యాలకు ఫలితంగా మీరు వారసులుగా చేయబడిన స్వర్గం ఇదే! సూరతుల్ ఆరాఫ్ 7:43.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రస్తావించారు: స్వర్గములోనికి చేరిన ప్రజలు సంతోషానందాలతో ఉండగా వారిని ఉద్దేశించి ప్రకటన చేసేవాడొకడు ఇలా ప్రకటిస్తాడు: స్వర్గంలో మీరు శాశ్వతంగా ఆరోగ్యవంతులై ఉంటారు, ఎన్నటికీ వ్యాధిగ్రస్తులు కారు, అది ఎంత చిన్న సుస్తీ లేక నలత అయినా సరే; అక్కడ మీరు శాశ్వత జీవితులై ఉంటారు, ఎన్నటికీ మరణించరు, అది స్వల్పకాల మరణంగా భావించబడే నిద్ర అయినా సరే; అక్కడ మీరు శాశ్వతంగా యవ్వనవంతులై ఉంటారు, ఎన్నటికీ వృధ్ధులు కారు; మరియు మీరు అక్కడ సుఖసంతోషాలతో, సిరిసంపదలతో సంపన్నులుగా జీవిస్తారు, ఎప్పుడూ మీకు కష్టము, బాధ, పేదరికం కలుగవు. ఎందుకంటే ఇది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తెలిపిన ప్రకటన: అపుడు వారికి ఒక వాణి వినబడుతుంది: ''మీరు చేస్తూ ఉండిన సత్కార్యాలకు ఫలితంగా మీరు వారసులుగా చేయబడిన స్వర్గం ఇదే!) సూరతుల్ ఆరాఫ్ 7:43.