





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబూహురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా దుఆ చేస్తూ ఉండేవారు: “అల్లాహుమ్మ అస్లిహ్’లీ దీనీ అల్లదీ హువ ఇస్మతు అమ్రీ; వ అస్లిహ్’లీ దున్యాయా, అల్లతీ ఫీహా మఆషీ; వ అస్లిహ్’లీ ఆఖిరతీ, అల్లతీ ఫీహా మఆదీ; వ అజ్’అలిల్ హయాత జియాదతన్’లీ ఫీ కుల్లి ఖైరిన్; వజ్’అలిల్ మౌత రాహతన్’లీ మిన్ కుల్లి షర్రిన్”; (ఓ అల్లాహ్! నా ధర్మాన్ని (నా ధర్మానుసరణను) నా కొరకు సరిచేయి - ఎందులోనైతే నా రక్షణ ఉన్నదో; మరియు నా ఈ ప్రపంచాన్ని సరిచేయి - ఎందులోనైతే నా జీవనం ఉన్నదో; మరియు శుభప్రదమైన ప్రతి దానిలోనూ నా జీవనాన్ని పొడిగించు; మరియు వినాశనాన్ని కలిగించే ప్రతి దానిలోనూ మరణాన్ని నాకు ప్రశాంతత కలిగించే దానిలా చేయి”.
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక గొప్ప దుఆను పఠిస్తూ ఉండేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఏ నైతిక విలువలను, ఏ నైతిక సూత్రాలను పరిపూర్ణం చేయడానికి పంపబడినారో, వాటికి సంబంధించిన విషయాల వేడుకోలు ఉంది ఆ దుఆలో. అవి: ధర్మానుసరణలో నీతిమంతంగా, ధర్మబద్ధంగా గడపడం - ఈ ప్రాపంచిక జీవితంలో మరియు పరలోకజీవితంలో. ఆ దుఆలో ఉన్నటువంటి సంక్షిప్తమైన పదాల ద్వారా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మూడు విషయాల ప్రాముఖ్యత సమగ్రంగా తెలిసేలా చేసారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మానుసరణను సరిచేయమనే వేడుకోలుతో ఆ దుఆను ప్రారంభించినారు; ఎందుకంటే ఇహలోకజీవితము, పరలోక జీవితము యొక్క పరిస్థితులు సఫలీకృతం కావడానికి హామీనిచ్చేది ధర్మబద్ధమైన, నీతిమంతమైన ధర్మానుసరణ మాత్రమే. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అల్లాహుమ్మ అస్లిహ్’లీ దీనీ” ధర్మం ఆదేశించిన ఆచరణలను ఆదేశించిన విధానములో, అత్యంత పరిపూర్ణంగా ధార్మిక పరమైన విధులను నిర్వహించడానికి నన్ను అనుమతించడం ద్వారా ‘ఓ అల్లాహ్! నా కొరకు నా ధర్మాన్ని (నా ధర్మానుసరణను) సరిచేయి.” అల్లదీ హువ ఇస్మతు అమ్రీ - ఎందులోనైతే నా రక్షణ ఉన్నదో; మరియు నా వ్యవహారాలన్నింటి సంరక్షణ ఉన్నదో. నా ధర్మానుసరణ కలుషితమైపోతే, నా వ్యవహారలన్నీ కలుషితమైపోతాయి; నాకు ఆశాభంగమైపోతుంది, నేను ఓడిపోయిన వాడినవుతాను. ఎందుకంటే నా ధర్మం (నా ధర్మానుసరణ) సంపూర్ణంగా సవరించకపోతే నా ప్రపంచం (నా ప్రాపంచిక జీవితం) సవరించబడుట కూడా సాధించబడదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: (ఓ అల్లాహ్!) నాకు శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించు, నాకు రక్షణను, తద్వారా శాంతిని ప్రసాదించు, నాకు జీవనోపాధిని ప్రసాదించు, ధార్మికురాలైన జీవితభాగస్వామిని ప్రసాదించు, ఉత్తమ సంతానాన్ని ప్రసాదించు, అలాగే నాకు అవసరమైన ప్రతి దానినీ నాకు ప్రసాదించు, మరియు దానిని ధర్మబద్ధమైనదిగా చేయి (హలాల్), అది నీకు విధేయునిగా ఉండుటలో నాకు సహాయపడుతుంది; తద్వారా నా ఈ ప్రపంచాన్ని సరి చేయి” (“వ అస్లిహ్’లీ దున్యాయా” - నా ప్రాపంచిక జీవితాన్ని సరిచేయి). తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రపంచాన్ని సరి చేయి అని అర్థించడానికి వెనుక గల కారణాన్ని ఆయన ఇలా వివరించినారు: (అల్లతీ ఫీహా మ’ఆషీ) ఎందుకంటే అది నా ఉపాధి స్థలం మరియు నా జీవితకాలాన్ని గడిపే ప్రదేశం. (వ అస్లిహ్’లీ ఆఖిరతీ, అల్లతీ ఫీహా మఆదీ) మరియు నా పరలోకాన్ని సరిచేయి; ఎందుకంటే అది నిన్ను కలుసుకునే నా తిరుగు ప్రయాణం – ఇది ధర్మబద్ధమైన పనులు మరియు ఆరాధన, చిత్తశుద్ధి మరియు మంచి ముగింపు కోసం అల్లాహ్ తన దాసునికి ప్రసాదించే మార్గదర్శకత్వం ద్వారా మాత్రమే సాధించబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరలోక జీవితాన్ని, ఈ ప్రాపంచిక జీవితం తరువాత పేర్కొన్నారు. ఎందుకంటే మొదటిది (ఇహలోక జీవితం), రెండవదానిని (పరలోకజీవితాన్ని) సరిచేసే సాధనం. కనుక ఎవరైతే ఈ ఇహలోక జీవితంలో అల్లాహ్ యొక్క అభీష్ఠానికి అనుగుణంగా నిజాయితీగా, ధర్మబద్ధంగా ఉంటాడో అతని పరలోక జీవితం సరిగా ఉంటుంది మరియు అతడు అందులో సుఖసంతోషాలతో ఉంటాడు. వ అజ్’అలిల్ హయాత జియాదతన్’లీ ఫీ కుల్లి ఖైరిన్; వజ్’అలిల్ మౌత రాహతన్’లీ మిన్ కుల్లి షర్రిన్) మరియు నా ధర్మబద్ధమైన పనులను పెంచుకుంటూ పోవడానికి ప్రతి మంచిలో నా జీవితాన్ని, మరియు నా ఆయుర్ధాయాన్ని పెంచు; మరియు ప్రతి చెడు నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి పరీక్ష నుండి, అవిధేయత, అజాగ్రత్తల నుండి, మరియు బాధల నుండి నాకు ఉపశమనం కలిగించేలా, వాటన్నిటి నుండి విముక్తిగా, ఓదార్పు పొందేలా మరణాన్ని నాకు చేరువ చేయి.
అబూ మూసా అల్ అష్’అరీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ చేస్తూ ఉండేవారు: “రబ్బిఘ్’ఫిర్లీ ఖతీఅతీ వ జహ్లీ; వ ఇస్రాఫీ ఫీఅమ్రీ కుల్లిహి; వమా అన్త ఆలము బిహి మిన్నీ; అల్లాహుమ్మగ్’ఫిర్లీ ఖతాయాయ, వఅమ్’దీ, వ జహ్’లీ, వ హజ్’లీ, వ కుల్లు జాలిక ఇన్దీ; అల్లాహుమ్మగ్'ఫిర్’లీ మా ఖద్దంతు; వ మా అఖ్ఖర్తు, వమా అస్రర్’తు, వమా ఆ’లన్’తు; అన్తల్ ముఖద్దిము, వ అన్తల్ ముఅఖ్ఖిరు; వ అన్త అలా కుల్లి షైఇన్ ఖదీర్” (ఓ నా ప్రభూ! నా తప్పులను మన్నించు, నా వ్యవహారాలన్నింటిలో నేను అతిక్రమించిన ప్రతి విషయాన్ని మన్నించు, ఈ విషయాల గురించి నాకన్నా నీకు బాగా తెలుసు. ఓ అల్లాహ్! నేను ఉద్దేశ్యపూర్వకంగా లేదా నా అఙ్ఞానం వలన లేదా నేను హాస్యంగా లేక అపహాస్యంగా చేసిన తప్పులన్నింటినీ మన్నించు మరియు నేను చేసే ప్రతి పనిలో నా తప్పులన్నింటినీ మన్నించు. ఓ అల్లాహ్! నా గత పాపాలను, నా భవిష్యత్తు పాపాలను, నా రహస్య పాపాలను, నా బహిరంగ పాపాలను క్షమించు. ఆది నీవే, అంతమూ నీవే, అన్ని విషయలపై అధికారం గలవాడవు నీవే)
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమగ్రమైన దుఆలలో ఈవిధంగా దుఆ చేయుట ఒకటి: “రబ్బిఘ్’ఫిర్’లీ ఖతీఅతీ” వదంబీ, “వజహ్’లీ” వమావఖఅ మిన్నీ బిదూన ఇల్మ్: ఓ నా ప్రభూ! నా తప్పులను క్షమించు, నా పాపాలను క్షమించు, నా అఙ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని క్షమించు, మరియు అఙ్ఞానం కారణంగా నా వలన జరిగే వాటన్నింటినీ క్షమించు. వ ఇస్రాఫీ ఫీ అమ్రీ కుల్లహు, “వతఖ్’సీరీ, వతజావుజీ లిల్’హద్”: నా విషయాలలో నేను అతి చేయడాన్ని (దుబారాను) క్షమించు; నా ఆచరణలలో చోటు చేసుకునే కొరతలను, మరియు మితిమీరడాన్ని క్షమించు. వమా అంత ఆలము బిహీ మిన్నీ “అలిమ్’తహు అన్’త యా అల్లాహ్ వ నసీతుహు అనా” నా గురించి నా కన్నా బాగా ఎరిగిన వాడవు నీవే, నీకు నా గురించి అన్నీ తెలుసు, నాకు మతిమరుపు ఉంది (కనుక నీవు ఎరిగిన నా తప్పులన్నింటినీ క్షమించు). అల్లాహుమ్మఘ్’ఫిర్’లీ ఖతాయాయ వ అమ్’దీ, “వమా సదర అన్ అమ్’దిన్ మిన్నీ, వ ఇల్మిన్ మిన్నీ బిద్దూనూబ్” ఓ అల్లాహ్! నేను ఉద్దేశ్యపూర్వకంగా చేసిన తప్పులన్నింటినీ క్షమించు; “ఆ పాపాల గురించి తెలిసి ఉండీ, ఉద్దేశ్యపూర్వకంగా నేను పాల్బడిన పాపాలన్నింటినీ క్షమించు” “వ జదీ, వ హజ్’లీ” వమా సదర అన్ ముజాహ్, వమా వఖ్అ మిన్నీ ఫిల్ హాలైన్: ఓ అల్లాహ్ ! నా వల్ల జరిగిన గంభీరమైన పాపములను, మరియు నా వల్ల పరిహాసపూరితంగా, లేక అపహాస్యపరంగా జరిగిన పాపాలను మరియు ఈ రెండు రకాలుగా జరిగిన పాపాలను క్షమించు. “వకుల్లు దాలిక ఇందీ” “హైథు జమ’అత్ మా జుకిర మినల్ దునూబి వల్ ఉయూబ్” పాపాలు మరియు తప్పులను గురించి ప్రస్తావించబడిన ప్రతిదీ నాలో ఉంది. (వాటన్నిటినీ క్షమించు). “అల్లాహుమ్మఘ్’ఫిర్’లీ మా ఖద్దంతు ఫీమా మాదీ; వ మా అఖ్ఖర్తు ఫీమా సయ’తీ” "ఓ అల్లాహ్, నేను గతంలో చేసిన దాని కోసం నన్ను క్షమించు, మరియు నేను తరువాత చేసిన దాని కోసం, మరియు రాబోయే దాని కోసం నన్ను క్షమించు. “వమా అస్’రర్తు” వ ఉఖ్’ఫియత్, “వమా అ’లన్తు” వ ఉజ్’హిరత్” నేను గోప్యంగా ఉంచిన వాటిని క్షమించు, మరియు దాచిపెట్టిన మరియు నేను ప్రకటించిన మరియు స్పష్టం చేసిన వాటన్నింటిని క్షమించు. “అంతల్ ముఖద్దిము, వ అంతల్ ముఅఖ్ఖిరు” (ఆది నీవే అంతమూ నీవే) నీవు తలచిన వానిని, అతనికి సాఫల్యాన్ని ప్రసాదించడం ద్వారా నీవు నీ కరుణకు చేరువ చేస్తావు; మరియు నీవు తలచిన వానిని నిరాశకు గురి చేసి నీ కరుణ నుండి దూరం చేస్తావు. కనుక నీవు దేనినైనా దూరం చేస్తే దానిని ప్రసాదించగలవాడెవడూ లేడు, మరియు నీవు దేనినైనా ప్రసాదించదలిస్తే దానిని దూరం చేయగలవాడేవ్వడూ లేడు. “వ అంత అలా కుల్లి షఇన్ ఖదీర్” అన్ని విషయాలపై అధికారం గలవాడవు నీవే - శక్తిలో సంపూర్ణుడవు మరియు సంకల్పంలో పరిపూర్ణుడవు, కోరుకున్న ప్రతి విషయాన్నీ చేయగలవాడవు నీవే.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ఉదయమూ ప్రతి సాయంత్రమూ ఈ దుఆ పఠించకుండా ఎప్పుడూ వదిలి వేయలేదు: “అల్లాహుమ్మ, ఇన్నీ అస్అలుకల్ ఆఫియత ఫిద్దున్యా వల్ ఆఖిరతి, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్’వ వల్ ఆఫియత ఫీ దీనీ, వ దున్యాయ, వ అహ్’లీ, వ మాలీ, అల్లాహుమ్మస్తుర్ ఔరాతీ, అవ్: వ ఆమిన్ రౌఆతీ, అల్లాహుమ్మహ్’ఫజ్’నీ మింబైని యదయ్య, వమిన్ ఖల్ఫీ, వ అన్’యమీనీ, వ అన్’షిమాలీ, వమిన్ ఫౌఖీ; వ అఊదు బిఅజ్’మతిక అన్ ఉగ్’తాల మిన్ తహ్’తీ” (ఓ అల్లాహ్, నేను నిన్ను ఇహలోకంలో మరియు పరలోకంలో మంచిని, క్షేమాన్ని, శ్రేయస్సును ప్రసాదించమని కోరుతున్నాను; ఓ అల్లాహ్, నేను నిన్ను క్షమించమని మరియు నా ధర్మములో, నా ప్రాపంచిక జీవితంలో, నా కుటుంబంలో మరియు నా సంపదలో శ్రేయస్సు ప్రసాదించమని అడుగుతున్నాను. ఓ అల్లాహ్! నా తప్పులను కప్పివేసి, నా భయాన్ని తగ్గించు; ఓ అల్లాహ్! నా ముందు నుండి, నా వెనుక నుండి, నా కుడి నుండి మరియు నా ఎడమ నుండి మరియు నా పై నుండి నన్ను రక్షించు. మరియు నా క్రింద నుండి హఠాత్తుగా చంపబడకుండా నేను నీ ఘనతను, గొప్పతనాన్ని ఆశ్రయిస్తున్నాను.)
అబూ దావూద్, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉదయం మరియు సాయంకాలములలో ఎప్పుడూ ఈ దుఆ చేయకుండా ఉండలేదు. (అల్లాహుమ్మ అస్అలుకల్ ఆఫియత) ఓ అల్లాహ్! నాపై త్వరలో వచ్చి పడబోయే, లేక ఆలస్యంగా వచ్చి పడబోయే వ్యాధులు, దురదృష్టాలు, ప్రాపంచిక ప్రతికూలతలు, కోరికలు మరియు ధర్మపరమైన పరీక్షల నుండి రక్షణ ప్రసాదించి ఇహలోకం లోనూ మరియు పరలోకం లోనూ మంచిని, క్షేమాన్ని, శ్రేయస్సును ప్రసాదించమని నేను నిన్ను కోరుతున్నాను. (అల్లాహుమ్మ, ఇన్నీ అస్అలుకల్ అఫ్’వ, వల్ఆఫియత ఫీ దీనీ, వ దున్యాయ, వ అహ్’లీ, వ మాలీ) ఓ అల్లాహ్! నేను నీ క్షమాపణను వేడుకుంటున్నాను, నా పాపాలను తుడిచి వేయమని, మరియు వాటిని ఉపేక్షించమని వేడుకుంటున్నాను, నా తప్పులనుండి నాకు రక్షణ కల్పించి, నా ధర్మములో బహుదైవారాధన నుండి, ధర్మములో కొత్త విషయాలను జొప్పించుట నుండి, నా ప్రాపంచిక జీవితములో కష్ఠాలు, హాని, విపత్తులు మరియు చెడుల నుండి నాకు రక్షణను ఇవ్వమని వేడుకుంటున్నాను; మరియు నా కుటుంబములో, నా భార్యలు, నా సంతానము, నా బంధువులు, నా సంపద, నా ధనము నా ఉద్యోగము అన్నింటిలో శ్రేయస్సు కలిగించమని వేడుకుంటున్నాను. (అల్లాహుమ్మస్తుర్ ఔరాతీ) ఓ అల్లాహ్, నా లోపాలను, నా దోషాలను, కొరతలను కప్పివేయి, నా పాపాలను తుడిచివేయి, భయం మరియు ఆందోళణలనుండి నన్ను సురక్షితంగా ఉంచు. (అల్లాహుమ్మఫజ్’నీ మిమ్’బైని యదయ్య, వమిన్ ఖల్ఫీ, వఅన్ యమీనీ, వఅన్ షిమాలీ, వ మిన్ ఫౌఖీ) ఓ అల్లాహ్, బాధల నుండి మరియు హానికరమైన వాటి నుండి, నా ముందు నుండి, నా వెనుక నుండి, నా కుడి నుండి, నా ఎడమ నుండి మరియు నా పై నుండి నన్ను రక్షించు. అన్ని దిశల నుండి రక్షించమని అల్లాహ్ కోరడం ఎందుకంటే, ప్రతికూలతలు, దురదృష్టాలు ఈ దిశలలో ఒకదాని నుండి మాత్రమే మనిషిని ప్రభావితం చేయగలవు, మరియు చేరుకోగలవు కనుక. (వ అఊజు బి అజ్మతిక, అన్ ఉగ్'తాల) మరియు ఓ అల్లాహ్! నేను అకస్మాత్తుగా చంపబడకుండా, మరియు నా క్రిందనుండి అకస్మాత్తుగా భూమి నన్ను మ్రింగి వేయకుండా నీ ఘనతను, మరియు నీ గొప్పతనాన్ని ఆశయిస్తున్నాను.
ఆయిషా (రదియల్లాహు అన్హా) తనకు రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ నేర్పించినారని ఉల్లేఖిస్తున్నారు: “అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఖైరి కుల్లిహి, ఆ’జిలిహి, వ ఆజిలిహి, మా అలింత మిన్హు మాలం, అ’అలం; వ అఊజుబిక మిన్ షర్రి కుల్లిహి ఆ’జిలిహి, వ ఆజిలిహి, మా అలింత మిన్హు మాలం, అ’అలం; అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఖైరి మా సఅలక అబ్దుక వ నబియ్యుక; వ అఊజుబిక మిన్ షర్రి మా అజాబిహి అబ్దుక వ నబియ్యుక; అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ జన్నత, వమా ఖర్రబ ఇలైహ మిన్ ఖౌలిన్ అవ్ అమలిన్; వ అఊజుబిక మినన్నారి, వమా ఖర్రబ ఇలైహ మిన్ ఖౌలిన్ అవ్ అమలిన్; వ అస్అలుక అన్’తజ్’అల కుల్ల ఖదాయిన్ ఖదైతహు లీ ఖైరన్”. (ఓ అల్లాహ్! నేను ప్రతి శుభాన్ని ప్రసాదించమని నిన్ను అడుగుతున్నాను, అది త్వరగా (సమీప భవిష్యత్తులో) రాబోయేదైనా, లేక ఆలస్యంగా రాబోయేదైనా, దానిని గురించిన ఙ్ఞానము నాకు ఉన్నా, లేకపోయినా; మరియు ప్రతి చెడు నుండి, ప్రతి కీడు నుండి, వినాశం కలిగించే ప్రతి దాని నుండి నీ రక్షణ కోరుతున్నాను, అది త్వరగా (సమీప భవిష్యత్తులో) రాబోయేదైనా, లేక ఆలస్యంగా రాబోయేదైనా, దానిని గురించిన ఙ్ఞానము నాకు ఉన్నా, లేకపోయినా; ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీప్రవక్త నిన్ను కోరిన మంచి కొరకు నేను నిన్ను అడుగుతున్నాను మరియు నీ సేవకుడు మరియు ప్రవక్త శరణు కోరిన చెడు నుండి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను, నీ రక్షణ కోరుతున్నాను; ఓ అల్లాహ్! నేను నిన్ను స్వర్గం కొరకు అడుగుతున్నాను, మరియు దానికి చేరువ చేసే మాటలు మరియు ఆచరణల కొరకు కూడా; నరకాగ్ని నుండి నీ రక్షణ కోరుతున్నాను మరియు దానికి చేరువ చేసే మాటలు మరియు ఆచరణలనుండి కూడా. మరియు (ఓ అల్లాహ్!) నీవు నా కొరకు నిర్ణయించిన ప్రతి ఉత్తర్వును, ప్రతి ఆదేశాన్ని, నా కొరకు మంచిదిగా చేయమని నేను నిన్ను అడుగుతున్నాను.)
ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా (రదియల్లాహు అన్హా) కు సమగ్రమైన దుఆలను నేర్పించినారు, అవి నాలుగు దుఆలు: మొదటిది: సాధారణంగా అంతా మంచి జరగాలని కోరుకుంటూ చేసే దుఆ (అల్లాహుమ్మ, ఇన్నీ అస్అలుక మిన్ ఖైరి కుల్లిహి) – ఓ అల్లాహ్! నేను ప్రతి శుభాన్ని ప్రసాదించమని నిన్ను అడుగుతున్నాను; అది సమీప భవిష్యత్తు లోనిదైనా, లేక చాలా దూరంగా ఉన్నదైనా, దానిని గురించిన ఙ్ఞానము నాకు ఉన్నదైనా (నీవు నాకు బోధించినది అయినా), దానిని గురించిన ఙ్ఞానము నాకు లేకపోయినా (అది కేవలం నీ ఙ్ఞానపరిధి లోనిది అయినా), ఓ అల్లాహ్! నీవు పరమ పవిత్రుడవు, ఘనత అంతా నీకే చెందును. ఇందులో, అన్ని విషయాల ఙ్ఞానం కలవాడు, సర్వజ్ఞుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్’కు విషయాన్ని అప్పగించడం వలన మహిమాన్వితుడైన అల్లాహ్ ముస్లిం కోసం ఉత్తమమైనది మరియు అత్యంత శ్రేష్ఠమైనది ఎంపిక చేస్తాడు. అందుకని నేను ఆయన క్షమాభిక్షను గట్టిగా పట్టుకుని ఆయన ఆశ్రయం పొందుతాను - ప్రతి చెడు నుండి, ప్రతి కీడు నుండి, వినాశం కలిగించే ప్రతి దాని నుండి, అది త్వరగా (సమీప భవిష్యత్తులో) రాబోయేదైనా, లేక ఆలస్యంగా రాబోయేదైనా, దానిని గురించిన ఙ్ఞానము నాకు ఉన్నా, లేకపోయినా. రెండవ దుఆ: ఇది దుఆలో అతిక్రమించకుండా ముస్లింకు ఒక రక్షణ వంటిది (అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక) ఓ అల్లాహ్! నేను నిన్ను అడుగుతున్నాను, మరియు కోరుతున్నాను (మిన్ ఖైరి మా సఅలక అబ్దుక వ నబియ్యుక) నీ దాసుడు మరియు నీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను కోరిన మంచినంతా; (వ అఊదు) మరియు నీ రక్షణ కోరుతున్నాను, నీ ఆశ్రయం కోరుతున్నాను, వేడుకుంటున్నాను - నీ దాసుడు మరియు నీ ప్రవక్త రక్షణ ప్రసాదించమని, నీ ఆశ్రయం ప్రసాదించమని కోరిన చెడు నుండి, కీడు నుండి. ఇది అల్లాహ్ తరఫు నుండి ఒక దుఆ, ఒక ప్రార్థన, దుఆ చేయు వ్యక్తికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన కొరకు ఏదైతే ప్రార్థించినారో, అవి ఏమిటి అనే వివరణలు ఏవీ లేకుండా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థించిన వాటినన్నింటినీ, దుఆ చేయు వ్యక్తికి ప్రసాదించుటకు గాను. మూడవ దుఆ: స్వర్గములో ప్రవేశింపజేయుట కొరకు మరియు నరకాగ్ని నుండి దూరంగా ఉంచుట కొరకు చేయు దుఆ. ఇది ప్రతి ముస్లిం యొక్క కోరిక మరియు అతని ఆచరణలన్నింటి లక్ష్యం. (అల్లాహుమ్మ ఇన్నీ అస్అలౌకల్ జన్నహ్) ఓ అల్లాహ్! నేను స్వర్గము కొరకు నిన్ను అడుగుతున్నాను. దానిని సాధించాలని, మరియు దానికి చేరువ చేసే మరియు నిన్ను సంతోష పరిచే ప్రతి మంచి మాట, ప్రతి మంచి పని కొరకు నిన్ను అడుగుతున్నాను. (వ అఊజుబిక మినన్నార్) మరియు నరకాగ్ని నుండి నీ రక్షణ మరియు శరణు కోరుతున్నాను – ఎందుకంటే చెడు పనుల నుండి నీ కరుణ, మరియూ కృప తప్ప వేరే రక్షణ లేదు; (వమా ఖర్రబ ఇలైహ మిన్ ఖౌలిన్ అవ్ అమలిన్) అలాగే నరకాగ్నికి చేరువ చేసే ప్రతి పలుకు మరియు ప్రతి పని నుండి కూడా (నీ రక్షణ మరియు శరణు కోరుతున్నాను). నాలుగవ దుఆ: అల్లాహ్ తీర్పు పట్ల, ఆయన అదేశాల సంతృప్తి కొరకు దుఆ, ప్రార్థన (వ అస్అలుక అన్’తజ్అల్ కుల్ల ఖదాఇన్, ఖదైతహు ఖైరన్) మరియు (ఓ అల్లాహ్!) నీవు నా కోరకు నిర్ణయించిన ప్రతి ఉత్తర్వును, ప్రతి ఆదేశాన్ని, నా కొరకు మంచిదిగా చేయమని నేను నిన్ను అడుగుతున్నాను. ఇది అల్లాహ్ యొక్క ప్రతి తీర్పు, ప్రతి ఆదేశం పట్ల తృప్తి కోసం చేయు దుఆ, ప్రార్థన.
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఇలా ఉల్లేఖించినారు: “ఇది రసూలిల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం దుఆలలో ఒకటి: “అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ జవాలి ని’మతిక, వతహవ్వులి ఆ’ఫియతిక, వ ఫుజాఅతి నిఖ్’మతిక, వజమీఅ సఖతిక” (ఓ అల్లాహ్! (నా నుండి) నీ అనుగ్రహాలు, నీ ఆశీర్వాదాలు తొలగిపోవుట నుండి, మరియు (నాకు నీవు ప్రసాదించిన) సౌఖ్యము, క్షేమము మార్చివేయబడుట నుండి, మరియు హఠాత్తుగా నీ నుండి వచ్చిపడే విపత్తు నుండి, మరియు మొత్తంగా నీ ఆగ్రహం నుండి నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను.)
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాలుగు విషయాల నుండి అల్లాహ్ శరణు వేడుకున్నారు: మొదటిది: (అల్లాహుమ్మ, ఇన్నీ అఊదుబిక మిన్ జవాలి ని’మతిక): ఓ అల్లాహ్! నా నుండి, ధార్మికపరమైన మరియు ప్రాపంచిక పరమైన నీ అనుగ్రహాలు, నీ ఆశీర్వాదాలు తొలగిపోవుట నుండి నీ శరణు వేడుకుంటున్నాను; ఇస్లాంలో స్థిరంగా ఉండడానికి, నీ ఆశీర్వాదాలను, నీ అనుగ్రహాలను దూరం చేసే పాపాలలో పడకుండ ఉండడానికి నిన్ను ఆశ్రయిస్తున్నాను. రెండవది: (వతహవ్వులి ఆ’ఫియతిక): మరియు నీవు నాకు ప్రసాదించిన సౌఖ్యము, క్షేమము, విపత్తుగా మార్చి వేయబడకుండా నీ శరణు వేడుకుంటున్నాను, నిన్ను ఆశ్రయిస్తున్నాను, కనుక ఓ అల్లాహ్! నిరంత శ్రేయస్సు కొరకు, బాధలు, కష్టాలు మరియు అనారోగ్యం నుండి భద్రత కొరకు నిన్ను వేడుకుంటున్నాను. మూడవది: (వ ఫుజాఅతి నిఖ్’మతిక) మరియు హఠాత్తుగా నీ నుండి వచ్చి పడే నీ ఆగ్రహం, నీ విపత్తు నుండి నేను నీ రక్షణ, నీ ఆశ్రయం కోరుతున్నాను. ఎందుకంటే హఠాత్తుగా వచ్చి పడే విపత్తు, జరిగిన తప్పుల నుండి, పాల్బడిన పాపపు పనుల నుండి పశ్చాత్తాప పడే సమయాన్ని లేదా వాటి నుండి కోలుకునే అవకాశాన్ని ఇవ్వదు. అది ఆ వ్యక్తికి కలిగించే కష్టము, బాధ, నష్టము అత్యంత గొప్పది, బాధాకరమైనది అయి ఉంటుంది. నాలుగవది: (వ జమీఅ సఖతిక) మరియు మొత్తంగా నీ ఆగ్రహం నుండి ఆశ్రయిస్తున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, అంతేగాక నీ ఆగ్రహానికి కారణమయ్యే అన్ని విషయాల నుండి కూడా నీ శరణు వేడుకుంటున్నాను, ఎందుకంటే నీవు ఎవరి పట్ల ఆగ్రహించినావో వారు విఫలమయ్యారు మరియు ఓడిపోయారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ఆగ్రహానికి సంబంధించి బహువచనాన్ని ఉపయోగించినారు “జమీఅ” (మొత్తంగా నీ ఆగ్రహం నుండి) అని. సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ఆగ్రహానికి కారణమయ్యే అన్ని విషయాలు, అవి మాటలు గానీ, లేక ఆచరణలు గానీ, లేక అల్లాహ్ యొక్క ఆగ్రహానికి కారణమయ్యే (అంధ) విశ్వాసాలు గానీ, మొత్తంగా, పూర్తిగా అందులో వస్తాయి.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ ఇబ్న్ అల్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ పదాలతో దుఆ చేసేవారు: “అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ ఘలబతిద్దైని, వ గలబతిల్ అ’దువ్వి, వ షమామతిల్ అ’దాఇ” (ఓ అల్లాహ్! అప్పుల భారం నన్ను అధిగమించకుండా నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, శత్రువు నన్ను అధిగమించకుండా నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, మరియు శత్రువు యొక్క ఈర్ష్యాసూయల నుండి, నా దురదృష్టాల పట్ల ఆనందించడం నుండి నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను)
అన్నసాయీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాల నుండి అల్లాహ్ యొక్క రక్షణ మరియు శరణు వేడుకున్నారు: మొదటిది: (అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ గలబతిద్దైని) ఓ అల్లాహ్ నేను రక్షణ మరియు ఆశ్రయం కోరుతున్నాను, కేవలం నీ నుంచి, మరింకెవ్వరి నుంచీ కాదు, అప్పుల ఆధిపత్యం నుంచి, అవి నన్ను లొంగదీసుకోవడం నుంచి, వాటి వలన కలిగే దుఃఖము మరియు బాధ నుంచి. మరియు వాటిని తిరిగి చెల్లించడంలో మరియు వాటిని పరిష్కరించడంలో నీ సహాయాన్ని అడుగుతున్నాను. రెండవది: (వ గలబతిల్ అదువ్వి): ) ఓ అల్లాహ్! నేను నీ రక్షణ మరియు శరణు వేడుకుంటున్నాను – శత్రువు నన్ను అధిగమించడం నుండి, ఆ భారము నుండి, అతడి అణచివేత నుండి. మరియు అతని వలన జరిగే హానిని తొలగించమని, మరియు అతనిపై విజయం ప్రసాదించమని నేను నిన్ను అడుగుతున్నాను. మూడవది: (వ షమామతిల్ అ’అదాయి) శత్రువుల ఈర్ష్యాసూయలనుండి మరియు ముస్లింలకు సంభవించిన దురదృష్టం మరియు విపత్తుల పట్ల వారు ఆనందించడం నుండి నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఉదయం అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు: “అల్లాహుమ్మ బిక అస్బహ్’నా, వబిక అమ్’సైనా, వబిక నహ్యా, వబిక నమూతు, వ ఇలైకన్నుషూర్” సాయంత్రం అయితే ఆయన (స) ఇలా పలికేవారు: “బిక అమ్’సైనా, వబిక అస్బహ్’నా, వబిక నహ్యా, వబిక నమూతు, వైలైకన్నుషూర్”. అబూహురైరహ్ (ర) ఇంకా ఇలా అన్నారు: “ఒక్కోసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అనేవారు: “...వ ఇలైకల్ మసీర్”. (ఓ అల్లాహ్! నీ ద్వారా మేము ఉదయంలోనికి ప్రవేశించినాము, మరియు నీ ద్వారా మేము సాయంత్రం లోనికి ప్రవేశించినాము; నీ ద్వారా మేము జీవిస్తున్నాము మరియు నీ ద్వారా మేము మరణిస్తాము మరియు పునరుత్థానము కూడా నీవైపునకే. ఓ అల్లాహ్! నీ ద్వారా మేము సాయంత్రం లోనికి ప్రవేశించినాము; మరియు నీ ద్వారా మేము ఉదయం లోనికి ప్రవేశించినాము, మరియు నీ ద్వారా మేము జీవిస్తున్నాము మరియు నీ ద్వారా మేము మరణిస్తాము మరియు పునరుత్థానము కూడా నీవైపునకే. (ఒక్కోసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు: “...అంతిమ గమ్యం కూడా నీ వైపునకే)
అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ కుబరా మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:ఉషోదయపు వెలుగు నుంచి ఉదయములోనికి ప్రవేశించునపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు: (అల్లాహుమ్మ, బిక అస్బహ్’నా) ఓ అల్లాహ్! నీ ద్వారా మేము ఉదయాన్ని ప్రారంభించినాము, నీ రక్షణను దుస్తులుగా ధరించి, నీ కృపలో మునిగి, నీ నామస్మరణలో నిమగ్నమై, నీ నామం సహాయంతో నీ సహాయాన్ని కోరుతూ, నీవు ప్రసాదించే విజయాన్ని ఆవరింపజేసుకుని, నీవు ప్రసాదించిన బలమూ మరియు శక్తితో కదులుతూ (ఓ అల్లాహ్! మేము నీ ద్వారా ఉదయాన్ని ప్రారంభించినాము). (వబిక అమ్’సైనా, వబిక నహ్యా, వబిక నమూతు) దీని అర్థము ‘ఓ అల్లాహ్! నీ ద్వారా మేము సాయంకాలము లోనికి ప్రవేశించినాము, నీ ద్వారా మేము జీవించి ఉన్నాము, మరియు నీ ద్వారా మేము మరణిస్తాము’. ఇక్కడ కూడా ఇంతకు ముందు పైన చెప్పబడిన భావాలే ప్రస్ఫుటమవుతాయి; అయితే ఈ పదాలు సాయంకాలము పలుకబడతాయి. కనుక ఈ పదాలు పలుకునపుడు దాసుడు “ఓ అల్లాహ్! నీ ద్వారా మేము సాయంకాలము లోనికి ప్రవేశించినాము; జీవితాన్ని ప్రసాదించేవాడా! నీ నామము ద్వారా మేము జీవిస్తున్నాము; మరియు మరణాన్ని ప్రసాదించేవాడా! నీ నామము ద్వారా మేము మరణిస్తాము. (వ ఇలైకన్నుషూర్) మరియు నీ వైపునకే మా పునరుథ్థానము కూడా. మరణము తరువాత పునరుథ్థానము; సమీకరించబడిన తరువాత (కర్మానుసారం) వేరు చేయబడడం, సర్వకాల సర్వావస్థలలో మా స్థితి ఇదే; నేను ఆయన నుంచి వేరు కాను, మరియు ఆయనను విడిచి పెట్టను. మరియు మధ్యాహ్నము తరువాత సాయంత్రము వచ్చినపుడు (అంటే అస్ర్ తరువాత) ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు: (అల్లాహుమ్మ బిక అమ్’సైనా, వబిక అస్బహ్’నా, వబిక నహ్యా, వబిక నమూతు, వఇలైకల్ మసీర్) ఓ అల్లాహ్! నీ ద్వారా మేము సాయంత్రం లోనికి ప్రవేశించినాము; మరియు నీ ద్వారా మేము ఉదయం లోనికి ప్రవేశించినాము, మరియు నీ ద్వారా మేము జీవిస్తున్నాము మరియు నీ ద్వారా మేము మరణిస్తాము మరియు అంతిమ గమ్యం కూడా నీవైపునకే. ఈ లోకం లోనికి రావడం, మరియు పరలోకము లోనికి తిరిగి వెళ్ళడం అంతా నీ ద్వారానే, ఎందుకంటే నీవే నాకు జీవనాన్ని ఇచ్చే వాడవు, మరియు నీవే నాకు మరణాన్ని ఇచ్చేవాడవు.
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “(మిగతా దుఆల కన్నా) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ ఎక్కువగా పఠించేవారు: “అల్లాహుమ్మ, రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతన్, వ ఫిల్ ఆఖిరతి హసనతన్, వఖినా అజాబన్నార్” (ఓ అల్లాహ్! మా ప్రభువా! ఈ ప్రపంచములో మాకు మంచిని కలుగజేయుము, మరియు పరలోకమునందును మాకు మంచిని కలుగజేయుము, మరియు నరకాగ్ని నుండి మమ్ములను రక్షింపుము.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక దుఆలు చేసేవారు; వాటిలో ఈ దుఆ కూడా ఒకటి: “అల్లాహుమ్మ, రబ్బనా, ఆతినా ఫిద్దున్యా హసనతన్, వ ఫిల్ ఆఖిరతి హసనతన్, వఖినా అజాబన్నార్”(ఓ మా ప్రభువా మాకు ఇహలోకములో మంచిని,పరలోకములో మంచిని ప్రసాధించు మరియు మమ్మల్ని నరక శిక్ష నుండి రక్షించు.) ఈ ప్రార్థనలో, ఈ లోకంలో ఉన్న మంచి విషయాలు ప్రసాదించమనే అభ్యర్థన ఉన్నది, ఉదాహరణకు: ఆమోద యోగ్యమైన, విస్తారమైన మరియు చట్టబద్ధమైన (హలాల్) సంపాదన; ధార్మికురాలైన జీవిత భాగస్వామి, కనులకు చలువను చేకూర్చే సంతానము, జీవితములో ఉపశమనము, ప్రయోజనకరమైన జ్ఞానం, ఉత్తమమైన ఆచరణలు, ఇంకా జీవితానికి అవసరమైన మరియు అనుమతించబడిన ఇటువంటి అనేక ఇతర విషయాలు; అలాగే పరలోకములోనూ మంచిని ప్రసాదించమనే అభ్యర్థన ఉన్నది, ఉదాహరణకు: సమాధి శిక్షనుండి సురక్షితంగా ఉండుట, తీర్పు దినము నాడు నిలబడి ఉండు స్థితి నుండి సురక్షితంగా ఉండుట, మరియు నరకాగ్ని నుండి సురక్షితంగా ఉండుట; అలాగే అల్లాహ్ యొక్క ప్రసన్నతను, ఆయనకు ఇష్ఠులయ్యే భాగ్యాన్ని పొందుట; తీర్పు దినమునాడు సాఫల్యవంతులగుట; శాశ్వతమైన సుఖసంతోషాలతో అనంత కరుణామయుడైన ఆ ప్రభువు యొక్క సాన్నిహిత్యాన్ని పొందుట మొదలైనవన్ని.
షద్దాద్ ఇబ్న్ ఔస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా పలికినారు: సయ్యిదుల్ ఇస్తిఘ్’ఫార్: ( అంటే “పాపక్షమాపణ కొరకు చేయు దుఆలలో (ప్రార్థనలలో) ఉత్తమమైన దుఆ): ఇలా పలకాలి: “అల్లాహుమ్మ, అంత రబ్బీ, లా ఇలాహ ఇల్లా అంత, ఖలఖ్’తనీ, వ అనా అబ్దుక, వ అనా అలా అహ్’దిక, వ వ’దిక మస్తత’తు, అఊదుబిక మిన్ షర్రి మా సన’తు, అబూఉలక బి ని’మతిక అలయ్య, వ అబూఉలక బి జంబీ ఫగ్’ఫిర్లీ, ఫ ఇన్నహు లా యగ్’ఫిరుజ్జునూబ ఇల్లా అంత” (ఓ అల్లాహ్! నీవే నా ప్రభువు, నీవు తప్ప వేరే ఆరాధ్యుడు ఎవరూ లేరు; నీవు నన్ను సృష్ఠించినావు, నేను నీ దాసుడను, నీ ఒడంబడికకు, నీకు చేసిన వాగ్దానానికి నా సామర్థ్యం మేరకు కట్టుబడి, విశ్వాసపాత్రునిగా ఉంటాను. నా కర్మల కీడు నుండి నీ రక్షణ కోరుతున్నాను. నాపై నీవు అనుగ్రహాలు కురిపించినావని అంగీకరిస్తున్నాను; అలాగే నా పాపాలను అంగీకరిస్తున్నాను. (ఓ అల్లాహ్) నన్ను క్షమించు. నీవు తప్ప పాపాలను క్షమించేవాడు ఎవ్వరూ లేరు). తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా అన్నారు: “ఎవరైతే ఈ దుఆ అర్థాన్ని ఖచ్చితంగా ఆకళింపు చేసుకుని, సంపూర్ణ విశ్వాసముతో, ఉదయం ఈ దుఆను ఉచ్ఛరిస్తాడో, ఒకవేళ అతడు సాయంత్రానికి ముందే మరణిస్తే అలాంటి వ్యక్తి స్వర్గవాసులలో ఒకడు అవుతాడు. మరియు ఎవరైతే ఈ దుఆ అర్థాన్ని ఖచ్చితంగా ఆకళింపు చేసుకుని, సంపూర్ణ విశ్వాసముతో, రాత్రి ఈ దుఆను ఉచ్ఛరిస్తాడో, ఒకవేళ అతడు ఉదయానికి ముందే మరణిస్తే అలాంటి వ్యక్తి స్వర్గవాసులలో ఒకడు అవుతాడు.”
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: (అల్లాహ్’ను) పాపక్షమాపణ కొరకు అర్థించేందుకు అనేక పదాలు ఉన్నాయి. అయితే వాటన్నింటిలోనూ ఉత్తమమైనది, ఉన్నతమైనది – దాసుడు ఇలా వేడుకోవడం (దుఆ చేయడం): “అల్లాహుమ్మ, అంత రబ్బీ, లా ఇలాహ ఇల్లా అంత, ఖలఖ్’తనీ, వ అనా అబ్దుక, వ అనా అలా అహ్’దిక, వ వ’దిక మస్తత’తు, అఊదుబిక మిన్ షర్రి మా సన’తు, అబూఉలక బి ని’మతిక అలయ్య, వ అబూఉలక బి జంబీ ఫగ్’ఫిర్లీ, ఫ ఇన్నహు లా యగ్’ఫిరుజ్జునూబ ఇల్లా అంత” (ఓ అల్లాహ్! నీవే నా ప్రభువువి. నీవు తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. నీవే నన్ను పుట్టించావు. నేను నీ దాసుడను. నేను నీకు చేసిన వాగ్దానానికి, నీతో చేసుకున్న ఒప్పందానికి నా శాయశక్తులా కట్టుబడి ఉన్నాను. నేను చేసిన కర్మల నుండి నీ శరణు కోరుతున్నాను. నాపై ఉన్న నీ అనుగ్రహాలను ఒప్పుకుంటున్నాను. నేను చేసిన పాపాలను ఒప్పుకుంటున్నాను. కనుక నన్ను క్షమించు. ఎందుకనగా నీవు తప్ప పాపాలను క్షమించేవాడు ఎవడూ లేడు.) ఈ దుఆలో దాసుడు ముందుగా అల్లాహ్ యొక్క తౌహీదును (ఏకత్వాన్ని) అంగీకరిస్తున్నాడు మరియు అల్లాహ్’యే తన సృష్ఠికర్త అని, తన ఆరాధ్యుడు ఆయన మాత్రమే అని, ఆయనకు సాటి, సమానులు, భాగస్వాములు ఎవరూ లేరు అని విశ్వసిస్తున్నాడు; తాను సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తో చేసిన ఒడంబడికకు కట్టుబడి ఉన్నానని, ఆయనను విశ్వసించి, తనకు వీలైనంతవరకు, తన సమర్థత మేరకు ఆయనకు విధేయత చూపుతానని పేర్కొంటున్నాడు; ఎందుకంటే దాసుడు ఎంతగా ఆరాధించినా అతడు అల్లాహ్ యొక్క ఆదేశాలను అన్నింటినీ నెరవేర్చలేడు అలాగే అల్లాహ్ తనకు ప్రసాదించిన అనుగ్రహాలకు తగినంతగా కృతఙ్ఞతలు కూడా అర్పించుకోలేడు. అప్పుడు దాసుడు అల్లాహ్ వైపునకు మరలుతాడు, ఆయనను అంటిపెట్టుకుని ఉంటాడు, తన పాపాల కీడు నుండి ఆయన రక్షణ కోరుతాడు. తరువాత అతడు అల్లాహ్ తనపై శుభాలను, అనుగ్రహాలను కురిపించినాడని స్వచ్ఛందంగా అంగీకరిస్తాడు; మరియు తాను పాపాలు చేసినానని, తద్వారా అవిధేయతకు పాల్బడినానని అంగీకరిస్తూ స్వచ్ఛందంగా ఆయన వైపునకు మరలుతాడు. అల్లాహ్’ వద్ద ఈ వేడుకోలు చేసిన తర్వాత, అతడు తన పాపాలను కప్పివేయడం ద్వారా తనను క్షమించమని, వాటి భయంకర పరిణామాలనుండి తన క్షమాభిక్షతో, తన దయ మరియు కరుణతో తనను రక్షించమని ప్రార్థిస్తాడు. ఎందుకంటే ఆయన, సర్వశక్తిమంతుడు, మహిమాన్వితుడు, మరి ఆయన తప్ప మరెవరూ పాపాలను క్షమించలేరు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసారు – ఈ దుఆ రాత్రింబవళ్ళలో పరంపరగా నిత్యం చేయవలసిన అల్లాహ్ యొక్క స్మరణలలో (అజ్’కార్ లలో) ఒకటి, ఎవరైతే ఈ దుఆ అర్థాన్ని ఖచ్చితంగా ఆకళింపు చేసుకుని, సంపూర్ణ విశ్వాసముతో, దినపు ప్రారంభములో – సూర్యోదయము నుండి మొదలుకుని సూర్యుడు అస్తమించేవరకు మధ్య ఉన్న సమయము ఆ రోజు యొక్క పగటి సమయము అనబడుతుంది - ఈ దుఆను ఉచ్ఛరిస్తాడో, ఒకవేళ అతడు పగలు (సాయంత్రానికి ముందే) పూర్తి కాకముందే మరణిస్తే అలాంటి వ్యక్తి స్వర్గములో ప్రవేశిస్తాడు.. మరియు ఎవరైతే ఈ దుఆను రాత్రి ఉచ్ఛరిస్తాడో – అంటే సూర్యాస్తమయం నుండి మొదలుకుని సూర్యోదయం వరకు - ఒకవేళ అతడు సూర్యోదయానికి ముందే మరణిస్తే అలాంటి వ్యక్తి స్వర్గములో ప్రవేశిస్తాడు.”