





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నా భుజాన్ని పట్టుకుని (ఒకసారి) నాతో ఇలా అన్నారు: “ఈ ప్రపంచంలో నీవు ఒక అపరిచితునిలా లేదా ఒక బాటసారిలా ఉండు”. ఇబ్న్ ఉమర్ ఇలా అంటూ ఉండేవారు: “సాయంత్రమైతే నీవు ఉదయం కొరకు వేచి చూడకు; మరియు ఉదయం అయితే సాయంత్రం కొరకు వేచి చూడకు. అనారోగ్య సమయంలో పనికి వచ్చేలా ఆరోగ్యం నుండి ఏదైనా గ్రహించు; మరణంలో పనికి వచ్చేలా (ఈ ప్రాపంచిక) జీవితం నుండి.”
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీథులో ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఇలా ప్రస్తావించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన భుజం – అంటే భుజంతో చేయి కలిపే భాగాన్ని- పట్టుకుని తనతో ఇలా అన్నారు: “ఉండడానికి ఇల్లు గానీ, లేదా ఆశ్రయమిచ్చి, తమతో పాటు ఉంచుకోవడానికి, తనకంటూ ఎవ్వరూ లేని ఒక ప్రదేశానికి వచ్చిన అపరచితునిలా; సృష్టికర్త నుండి దూరం చేసే కారణాలలో ఒకటైన కుటుంబము, పిల్లలు మరియు బంధుత్వ సంబంధాలు లేని అపరిచితునిలా ఈ ప్రపంచంలో ఉండు. వాస్తవానికి పరాయి దేశానికి చేరుకున్న కొత్తవానిలా కాకుండా, తన మాతృభూమిని చేరుకోవాలని తపన పడే బాటసారిలా ఉండు. ఎందుకంటే పరాయి దేశానికి చేరుకున్న కొత్త వ్యక్తి అక్కడ స్థిరపడవచ్చు. కానీ తన మాతృదేశానికి మరలి పోవాలని ఆతృతపడే బాటసారి, ఆ పరాయి దేశాన్ని తేలికగా తీసుకుంటాడు, తను అక్కడే ఆగిపోకుండా తన తిరుగు ప్రయాణం పైననే పూర్తి ధ్యాస పెడతాడు. ఒక బాటసారి చివరికి తన మాతృదేశానికి చేరుకునే ప్రయాణంలో తనకు ఎంత అవసరమో అంత కంటే ఎక్కువ కావాలని కోరుకోడు. అలాగే ఒక విశ్వాసికి పరలోకంలో తన గమ్యాన్ని చేరుకోవడానికి అవసరమయ్యే, సహాయపడే దాని కంటే ఈ ప్రపంచంలో ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఇబ్న్ ఉమర్ ఈ ఉపదేశాన్ని అనుసరించేవారు. ఇంకా ఆయన ఇలా చెప్పేవారు: మీరు (ఉదయం) మేల్కొన్నట్లయితే, సాయంత్రం కోసం వేచి ఉండకండి, మరియు మీరు సాయంత్రం గడిపినట్లయితే, ఉదయం కోసం వేచి ఉండకండి మరియు సమాధులలోని వారి మధ్య మిమ్మల్ని మీరు సమాధిలో ఖననం చేయబడి ఉన్న వారిలా పరిగణించండి, ఎందుకంటే ఆరోగ్యం మరియు అనారోగ్యం లేకుండా జీవితం లేదు. కనుక ఆరోగ్యాన్ని అనుసరించి వచ్చే అనారోగ్యం వచ్చి పడి మిమ్మల్ని నిరోధించకముందే అల్లాహ్ యొక్క విధేయతలో సత్కార్యములు చేయుటకై త్వరపడండి; మరణానంతర జీవితంలో ప్రయోజనం కలిగించే ప్రతి దానిని చేస్తూ ఈ ప్రాపంచిక జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి.
అబ్దుల్లాహ్ ఇబ్న్ బుస్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాడు: “ఓ రసూలుల్లాహ్! షరియత్ ఆదేశాలు (ఇస్లామీయ ధర్మశాస్త్ర ఆదేశాలు) నాకు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. కనుక నేను (స్థిరంగా పాటించేలా) పట్టుకుని ఉండేలా నాకు ఏదైనా బోధించండి”. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జనాబిచ్చారు: "అల్లాహ్ నామస్మరణంతో (దిక్ర్ తో) నీ నాలుకను తడిగా ఉంచు."
అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి తన శారీరక బలహీనత కారణంగా స్వచ్ఛంద ఆరాధనలు ఆచరించుట తనపై భారంగా మారిందని మొర పెట్టుకున్నాడు. తరువాత అతడు తాను అంటి పెట్టుకుని ఉండగలిగేలా, తద్వారా తనకు గొప్ప ప్రతిఫలం లభించేలా తనకు ఏదైనా ఒక తేలిక ఆచరణను బోధించమని అర్థించాడు. కనుక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి అన్ని సమయాలలో, మరియు అన్ని పరిస్థితులలో నిరంతరం సర్వోన్నతుడైన అల్లాహ్ ‘తస్బీహ్’ అంటే - (సుబ్’హానల్లాహ్ – అల్లాహ్ పరమ పవిత్రుడు); ‘తమ్’హీద్’ (అల్’ హందులిల్లాహ్ – స్తోత్రములన్నీ కేవలం అల్లాహ్ కొరకే); ‘ఇస్తిగ్’ఫార్’ (అస్తగ్’ఫిరుల్లాహ్ – ఓ అల్లాహ్ నన్ను క్షమించు); ‘దుఆ’ చేయుట; మరియు మొరపెట్టుకొనుట - ఈ విధంగా అల్లాహ్’ను కీర్తించడం, ప్రశంసించడం; క్షమాపణ కోరడం, ప్రార్థించడం మొదలైన వాటి ద్వారా తన నాలుకను నిరంతరం తాజాగా మరియు చురుకుగా ఉంచుకోమని సలహా ఇచ్చినారు.
అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవడు తన కొరకు తాను ఇష్టపడేదే తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంతవరకు అతడు నిజమైన విశ్వాసి కాలేడు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వివరిస్తున్నారు – ఒక ముస్లిం, తాను తన స్వయం కొరకు దేనినైతే (ఏఏ విషయాలనైతే) ఇష్టపడతాడో, దానినే (ఆ విషయాలనే) తన సహోదరుని కొరకు కూడా ఇష్టపడనంతవరకు – తన విశ్వాసములో సంపూర్ణత సాధించలేడు. అంటే ఉదాహరణకు: అల్లాహ్’కు విధేయత చూపే ఆచరణలలో, ధార్మిక జీవనానికి సంబంధించి మరియు ప్రాపంచిక జీవనానికి సంబంధించి వివిధ రకాల సత్కార్యాలు చేయుట – మొదలైన వాటిలో తన కొరకు ఏమైతే ఇష్టపడతాడో, తన సోదరుని కొరకు కూడా దానినే ఇష్టపడనంత వరకు; అలాగే తన స్వయం కొరకు దేనినైతే అసహ్యించుకుంటాడో, ఇష్టపడడో, తన సోదరుని కొరకు కూడా దానిని ఇష్టపడనంత వరకు తన విశ్వాసములో సంపూర్ణత సాధించలేడు. ఒకవేళ అతడు తన సోదరునిలో – ధార్మిక విషయాలలో అంటే అల్లాహ్’కు విధేయత చూపుటలో ఏమైనా లోపాలు, కొరత గమనించినట్లయితే అతడు ఆ లోపాలను, కొరతను తొలగించడానికి పాటుపడతాడు; తన సోదరునిలో ఏమైనా మంచిని గమనించినట్లయితే అతడిని ప్రోత్సహిస్తాడు, మార్గదర్శకం చేస్తాడు; ధార్మిక జీవనానికి, ప్రాపంచిక జీవనానినికి సంబంధించిన విషయాలలో అతనికి మంచి సలహాలు ఇస్తాడు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త్ర సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక ముస్లింను తిట్టుట, దూషించుట, శాపనార్థాలు పెట్టుట అవిధేయత అవుతుంది; మరియు అతనితో కొట్లాటకు దిగుట, యుద్ధానికి దిగుట అవిశ్వాసము.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఒక ముస్లిం తన ముస్లిం సోదరుడిని శపించడం, అవమానించడం, దూషించడం నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం నిషేధించారు; ఇది ఒక విధమైన అనైతికత, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లంకు అవిధేయత చూపుట అవుతుంది; మరియు ఒక ముస్లిం తన ముస్లిం సోదరుడితో పోరాడటం ఒక అవిశ్వాస చర్య, అయితే అది “కుఫ్ర్ అస్గర్’ అవుతుంది (తక్కువస్థాయి కుఫ్ర్ – చిన్నపాటి అవిశ్వాసము).
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “యూదునికి గానీ లేక క్రైస్తవునికి గానీ మీరు ముందుగా “సలాం” చెప్పకండి. మరియు ఒకవేళ మీకు వారిలో ఎవరినైనా దారిలో ఎదురైతే వారిని దారి అంచుకు పోయేలా చేయండి.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా వివరించారు: "ఒక యూదునికి గానీ, లేక ఒక క్రైస్తవునికి గానీ, వారు ‘జిమ్మీ’ లు గా ఉన్నప్పటికీ, ఒక ముస్లిం ముందుగా సలాం చెప్పరాదు, మిగతా అవిశ్వాసుల సంగతి ఇక చెప్పనే అక్కరలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా వివరించారు: ఒకవేళ మనలో ఎవరైనా వారిలో ఒకరిని (యూదులు, లేక క్రైస్తవులలో ఒకరిని) రహదారిలో కలవడం జరిగితే, అతన్ని రహదారి యొక్క ఇరుకైన ప్రాంతానికి (దారి అంచులకు) వెళ్ళి పోయేలా చేయాలి. విశ్వాసి ఎప్పుడూ దారి మధ్యలో నడుస్తాడు. అవిశ్వాసి ఎప్పుడూ అతనికి దారి ఇస్తాడు. ఒక ముస్లిం ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించబడడు.
అబూ అద్దర్దా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: తీర్పు రోజున విశ్వాసుల త్రాసులో మంచి నైతికత కంటే బరువైనది ఏదీ లేదు. నిశ్చయంగా, అల్లాహ్ అసభ్యకరమైన మరియు నిత్యం తిట్లు, బూతులు పలికే అవమానకరమైన వ్యక్తిని అసహ్యించుకుంటాడు.
అబూదావూద్ మరియు అత్తిర్మిదీ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: పునరుత్థాన దినమున ఒక విశ్వాసి యొక్క మాటలు మరియు చేతలలో, అతని త్రాసుపై అన్నింటికన్నా భారమైనది అతని నైతికత మరియు నైతిక విలువలు, అనగా ప్రసన్నమైన వ్యక్తిత్వము, చిరునవ్వు కలిగిన ముఖముతో ఇతరులను కలవడం, ఇతరులకు హాని కలిగించే వాటి నుండి దూరంగా ఉండడం, ప్రజలకు మంచి చేసే పనులు చేయడం మొదలైనవి. మరియు మాటలు చేతలలో అసహ్యకరమైన వ్యక్తిని అల్లాహ్ అసహ్యించుకుంటాడు, అతడు తన నాలుకతో తిట్లు, బూతులు పలుకుతాడు.
అల్ హుస్సేన్ ఇబ్న్ అలీ ఇబ్న్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పిసినారి ఎవరంటే, తన సమక్షములో నా ప్రస్తావన వచ్చినప్పటికీ నాపై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు మరియు దీవెనల కొరకు ప్రార్ధించని వాడు (దరూద్ పఠించనివాడు).”
అత్తిర్మిదీ, అన్నసాయీ కుబరాలో మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన పేరు గానీ, మారు పేరు గానీ లేక తన వర్ణన గానీ ప్రస్తావించబడినప్పుడు తనపై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు మరియు దీవెనల కొరకు ప్రార్థించకుండా (దరూద్ చదవకుండా) ఉండరాదని హెచ్చరించినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అసలైన పిసినారి ఎవరంటే, ఎవరైతే నాపై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు మరియు దీవెనల కొరకు ప్రార్థించడో (దరూద్ చదవడో)”. దీనికి అనేక కారణాలున్నాయి: మొదటిది: చిన్నదైనా, పెద్దదైనా తనకు ఎటువంటి నష్టమూ కలిగించని, మరియు దాని కొరకు అతడు ఎటువంటి ఖర్చూ చేయనవసరం లేని, ఎటువంటి కష్టమూ పడనవసరం లేని విషయంలో అతడు పిసినారిగా ప్రవర్తించినాడు. రెండవది: అతడు తన పట్ల తానే పిసినారితనం చూపుకున్నాడు. తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు మరియు దీవెనల కొరకు ప్రార్థించుట (దరూద్ పంపుట) వలన అతనికి లభించే ప్రతిఫలం నుండి దూరమై పోయినాడు. ఎందుకంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై శుభాల కొరకు ప్రార్థించకుండా ఉండిపోయి తన పట్ల తానే పిసినారితనం చేసుకున్నాడు; ఆదేశపాలన చేయడం అతని పై ఉన్న విధి, ఆ విధిని నెరవేర్చకుండా దూరంగా ఉండిపోయాడు, తద్వారా అతనికి లభించే ప్రతిఫలం నుండి కూడా తనను తాను వంచించుకొన్నాడు. మూడవది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు మరియు దీవెనల కొరకు ప్రార్థించడం, ఆయనకు మనపై ఉన్న హక్కులలో ఒకటి, ఎందుకంటే ఆయనే మనకు ధర్మాన్ని బోధించినారు, మనకు మార్గదర్శకం చేసినారు; సర్వోన్నతుడైన అల్లాహ్ వైపునకు మనకు పిలుపునిచ్చినారు; ఆయనే మనకు ఈ వహీని (దివ్యవాణిని) మరియు ఈ షరియత్ ను అందజేసినారు. మనకు సన్మార్గ దర్శకం లభించడానికి కారణం సర్వోన్నతుడైన అల్లాహ్ తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాత్రమే. కనుక ఎవరైతే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు మరియు దీవెనల కొరకు ప్రార్థించడో (దరూద్ పంపడో) అతడు తన పట్ల తాను పిసినారితనానికి పాల్బడినాడు, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హక్కులలో ఒక కనీస హక్కును తీర్చడం పట్ల పిసినారితనం వహించినాడు.
సహల్ బిన్ ము’ఆజ్ ఇబ్న్ అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఆహారం భుజించిన తరువాత ఎవరైతే “అల్ హందులిల్లాహిల్లదీ అత్’అమనీ హాదా వ రజఖనీహి మిన్ గైరి హౌలిమ్మిన్నీ వలా ఖువ్వహ్” (ప్రశంసలన్నీ ఆ అల్లాహ్ కొరకే శోభిస్తాయి, ఎవరైతే నాలో ఎటువంటి శక్తి, బలమూ లేకపోయినా నాకు ఈ ఆహారాన్ని సమకూర్చినాడో) – అని పలుకుతాడో, అతని పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి.”
అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఆహారం భుజించిన తరువాత ప్రతి ఒక్కరూ అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడాలని (ఆయన ఘనత ముందు మన అశక్తతను గుర్తించాలని) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హితబోధ చేస్తున్నారు. ‘అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, ఆయన సహాయంతో తప్ప, ఆహారం తెచ్చుకొనుటకు గానీ, దానిని భుజించుటకు గానీ శక్తిలేని వాడను’ అని. ఆహారం భుజించిన తరువాత ఎవరైతే ఆ విధంగా అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడుతారో, అతని పూర్వపు చిన్న చిన్న పాపాలన్నీ క్షమించబడుటకు అర్హుడవుతాడు అనే శుభవార్తను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందజేస్తున్నారు.
అనస్ ఇబ్న్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అదాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) మరియు అఖామత్ (నమాజు ప్రారంభం కాబోతున్నదని తెలియజేసే పిలుపు) ఈ రెండింటికి మధ్య చేసే దుఆ రద్దు చేయబడదు.”
అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అన్నసాయీ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదాన్’కు మరియు ఇఖామహ్’కు మధ్య చేయు దుఆ యొక్క ఘనతను వివరించారు మరియు ఇది తిరస్కరించబడదని; సమాధానం పొందే అవకాశం ఉందని, కాబట్టి ఈ సమయంలో అల్లాహ్’ సన్నిధిలో దుఆ చేయండి అని పేర్కొన్నారు.