





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాడు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నాకు బంధువులు ఉన్నారు, వారితో నేను బంధుత్వ సంబంధాలను కొనసాగిస్తున్నాను, కానీ వారు నాతో బంధుత్వాన్ని త్రెంచుకున్నారు; నేను వారిపట్ల ప్రేమ, అభిమానాలతో ప్రవర్తిస్తాను, కానీ వారు నా పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తారు; నేను వారి పట్ల సహనంతో వ్యవహరిస్తాను, కానీ వారు నా పట్ల అసహనం, ద్వేషంతో వ్యవహరిస్తారు”. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నీవు (నాతో) చెప్పినట్లుగానే వారితో ఉన్నట్లయితే, నీవు వారికి వేడివేడి బూడిద తినిపిస్తున్న దానితో సమానం. నీవు వారితో ఈ విధంగానే (ప్రవర్తిస్తూ) ఉన్నంత కాలం వారికి వ్యతిరేకంగా అల్లాహ్ నుండి ఒక సహాయకుడు నీతో ఎప్పుడూ ఉంటాడు.”
ముస్లిం నమోదు చేసినారు:ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో తనకు బంధువులు మరియు రక్తసంబంధీకులూ ఉన్నారని, తాను వారితో మంచిగా వ్యవహరిస్తాననీ, కానీ తనతో వారు దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారనీ; తాను వారితో బంధుత్వాలను మంచిగా నిర్వహిస్తాననీ, వారిని వెళ్ళి చూస్తాననీ, పలుకరిస్తాననీ, కానీ వారు తనతో బంధుత్వాన్ని త్రెంచి వేసుకున్నారనీ; తాను వాళ్లతో దయగా, నమ్మకంగా వ్యవహరిస్తాననీ, కానీ వాళ్లు తనతో అన్యాయంగా, కఠినంగా వ్యవహరిస్తారనీ; తాను వారి పట్ల సహనంగా వ్యవహరిస్తాననీ, కానీ వారు తన పట్ల మాటలలో మరియు చేతలలో చెడుగా వ్యవహరిస్తారనీ విన్నవించుకున్నాడు. తాను ఇప్పుడు విన్నవించుకున్న పరిస్థితులలో కూడా వారితో బంధుత్వాలను నిర్వహించాలా? అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: “పరిస్థితి వాస్తవములో నీవు చెప్పినట్లుగానే ఉన్నట్లయితే; వారి పట్ల ఉత్తమమైన మరియు దయాపూరితమైన నీ వ్యవహరణ ద్వారా; దానికి వ్యతిరేకంగా రోతపుట్టించే వారి వ్యవహారం కారణంగా, భగభగలాడే బూడిదను నీవు వారికి తినిపిస్తున్నట్టు అవుతుంది, స్వయంగా తమ దృష్టిలో తమను తామే వారు అవమానం మరియు పరాభవం పాలయ్యేలా చేస్తున్నావు నువ్వు. అంతేగాక, నీవు చెప్పినట్లుగా నీవు వారికి మేలు చేస్తూ ఉన్నంత కాలం, దానికి వ్యతిరేకంగా వారు నీ పట్ల చెడుగా వ్యవహరిస్తున్నంత కాలం అల్లాహ్ తరఫు నుండి ఒక సహాయకుడు, వారి చెడు వల్ల కలిగే హానిని దూరం చేయుటకుగానూ, నీ వెంట ఉంటాడు.”
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఏ సమావేశములోనైతే అల్లాహ్ నామస్మరణ జరుగదో, అటువంటి సమావేశము నుండి లేచిన ప్రజలు, వాస్తవానికి ఒక గాడిద శవము వద్ద నుండి లేచిన వారితో సమానము. అది వారి కొరకు దుఃఖ కారణం అవుతుంది.”
అబూదావూద్ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసినారు: “ప్రజలు ఏదైనా ఒక సమావేశములో పాల్గొని ఉండి, అందులో అల్లాహ్ యొక్క ప్రస్తావన లేకుండానే వెళ్ళిపోయినట్లయితే, అది దుర్గంధం మరియు ధూళితో కలిసి ఉన్న ఒక గాడిద మృతదేహం చుట్టూ కూర్చుని లేచి వెళ్ళిన దానితో సమానం. ఎందుకంటే, వారు అల్లాహ్ పేరును ప్రస్తావించకుండా మిగతా విషయాలు మాట్లాడడంలో మునిగిపోయారు. తీర్పుదినము నాడు అటువంటి సమావేశము వారి కొరకు దుఃఖ కారణం అవుతుంది, మరియు నిరంతర విచారానికి కారణం అవుతుంది.
అబూ మూసా అల్ అష్’అరి (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “తన ప్రభువును (అల్లాహ్’ను) స్మరించు వాడు మరియు తన ప్రభువును (అల్లాహ్’ను) స్మరించని వాడు – వీరిరువురి ఉదాహరణ జీవించి ఉన్న మరియు మరణించిన వానికి మధ్య ఉన్న పోలిక వంటిది”; సహీహ్ ముస్లింలో ఈ హదీథు పదాలు ఇలా ఉన్నాయి: “ఏ ఇంటిలోనైతే అల్లాహ్ నామ స్మరణ జరుగుతుందో, మరియు ఏ ఇంటిలోనైతే అల్లాహ్ నామ స్మరణ జరుగదో, ఆ రెంటి ఉదాహరణ జీవించి ఉన్న వానికి మరియు మరణించిన వానిని పోలియున్నది”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో అల్లాహ్ ను స్మరించే వ్యక్తికి, స్మరించని వ్యక్తికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మంచి రూపం కలిగి ఉండి ప్రయోజనంతో జీవించి ఉన్న వ్యక్తికి, చనిపోయిన వ్యక్తికి పోలి ఉంటుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టం చేశారు. తన ప్రభువు నామాన్ని స్మరించే వ్యక్తి బాహ్యంగా జీవనపు ప్రకాశాన్ని మరియు అంతరంగా ఙ్ఞానపు మరియు వివేకపు ప్రకాశాన్ని కలిగి ఉంటాడు; అందులో ప్రయోజనం ఉన్నది. మరియు అల్లాహ్ నామమును స్మరించని వాని పోలిక మృతుని పోలినటువంటిది. మృతుడు బాహ్యంగా కాంతి విహీనుడై ఉంటాడు, అంతరంగములో నిష్ఫలుడై, సోమరిపోతుగా ఉంటాడు; మరియు అందులో ప్రయోజనం ఏమీ ఉండదు. అదే విధంగా, ఏ ఇంటిలోనైతే అందులో నివసించే వారు అల్లాహ్ నామ స్మరణ చేస్తూ ఉంటారో ఆ ఇల్లు సజీవమైనదిగానూ; దానికి వ్యతిరేకంగా ఉంటే అది నిర్జీవమైనదిగానూ అభివర్ణించబడింది, ఎందుకంటే అందులో నివసించేవారు అల్లాహ్ నామాన్ని స్మరించడంలో సోమరిపోతులుగా ఉంటారు గనుక. ఇందులో ఇల్లు సజీవమైనది, నిర్జీవమైనది అనే పోలిక అందులో నివసించే వారికి వర్తిస్తుంది, స్వయంగా ఇంటికి కాదు.
అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెంబర్’పై కూర్చుని ఉన్నారు. మేమంతా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ కూర్చుని ఉన్నాము, అపుడు వారు ఇలా అన్నారు: “నా తరువాత, మీ గురించి నేను భయపడే వాటిలో ఒకటి ఏమిటంటే మీ కొరకు తెరువబడే ఈ ప్రాపంచిక వైభవం, దాని సౌందర్యము మరియు దాని అలంకరణ”. ఒక వ్యక్తి “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఏమీ, మంచి చెడును తీసుకు వస్తుందా?” అని ప్రశ్నించాడు. దానిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మౌనంగా ఉండి పోయారు. అక్కడున్నవారు అతడిని “ఏమైంది నీకు? నీవు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడుతావా? ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాట్లాడుతున్నది నీతో కాదు కదా?” అని మందలించారు. అయితే మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఏదో అవతరిస్తున్నట్లుగా గమనించినాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన నుదుటిపై పట్టిన చెమట బిందువులను తుడిచి వేసుకుని “ఆ ప్రశ్నించిన వ్యక్తి ఎక్కడ?” అని అడిగారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ ప్రశ్న అడిగినందుకు అతడిని మెచ్చుకుంటున్నట్లుగా అనిపించింది. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మంచి ఎప్పుడూ చెడును పుట్టించదు. నిజానికి అది నీటి ప్రవాహం ఒడ్డున పెరిగే ఒక రకం పచ్చిక లాంటిది, అది జంతువులను చంపుతుంది లేదా అనారోగ్యానికి గురి చేస్తుంది, ఒక జంతువు ఖదీరా (ఒక రకమైన కూరగాయ) తిని, ఆపై సూర్యుని వైపు తిరిగి, మలవిసర్జన చేసి, మూత్ర విసర్జన చేసి, మళ్ళీ మేస్తుంది తప్ప (తినేసి అలాగే ఉండిపోయి ప్రాణం మీదకు తెచ్చుకోదు). నిస్సందేహంగా ఈ సంపద మధురమైనది, పచ్చగా (ఆకర్షణీయంగా) ఉంటుంది. అయితే తన సంపదలో నుండి పేదవారికి, అనాథలకు, అన్నీ కోల్పోయిన ప్రయాణీకులకు దానం చేసేవాని సంపద ధన్యమైనది." లేక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహుశా ఇలా అన్నారు: “నిస్సందేహంగా, దానిని (సంపదను) ధర్మవిరుద్ధంగా సంపాదించేవాడు ఎంత తిన్నప్పటికీ సంతృప్తి చెందని వానిలాంటి వాడు. మరియు అతని సంపద పునరుత్థాన దినమున అతనికి వ్యతిరేకంగా సాక్షిగా మారుతుంది.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెంబెర్ పై కూర్చుని తన సహాబాలతో మాట్లాడుతున్నారు, అపుడు వారు ఇలా అన్నారు: “నేను (చని) పోయిన తరువాత, మీ గురించి నేను భయపడే విషయాలలో ఒకటి ఏమిటంటే మీ కొరకు తెరువబడే ఈ ప్రాపంచిక వైభవం, దాని సౌందర్యము మరియు అలంకారాలు, దాని ఆనందాలు – మరియు జీవితం ఎంతో స్వల్పమైనది అయినప్పటికీ ప్రజలు గొప్పగా చెప్పుకునే వస్తువులు, దుస్తులు, పంటలు మరియు ఇతర వస్తువులు. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగాడు: “ఈ ప్రాపంచిక వైభవం, దాని సౌందర్యము మొదలైనవి అల్లాహ్ తరఫు నుండి ఆయన అనుగ్రహం మరియు శుభాలు కదా! మరి ఆ శుభాలే వెనుదిరిగి శాపాలుగా, శిక్షలుగా మారుతాయా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మౌనంగా ఉండి పోవడం చూసి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆగ్రహానికి గురయ్యారేమో అనుకుని అక్కడున్న వారు ఆ ప్రశ్నించిన వానిని మందలించారు. తరువాత అక్కడున్న వారికి – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఎదో అవతరిస్తున్నది అన్న విషయం స్పష్టమై పోయింది. కొద్ది సేపటికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం (వహీ అవతరణ కారణంగా) తన నుదిటికి పట్టిన చెమటను తుడుచుకుని “ఆ ప్రశ్నించిన వ్యక్తి ఎక్కడ?” అని అడిగారు. అతడు: “హాజరుగా ఉన్నాను ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను స్తుతించి, ఆయనకు ప్రశంసలు అర్పించి ఇలా అన్నారు: “నిజమైన మంచితనం మంచితనాన్ని మాత్రమే తీసుకు వస్తుంది. కానీ ఈ ప్రాపంచిక వైభవం, దాని అలంకారం, సౌదర్యము – ఇవి స్వచ్ఛమైన మంచితనం కాదు. ఎందుకంటే దాని ఆకర్షణ, ప్రలోభము, మరియు పోటీ మొదలైనవి సంపూర్ణంగా పరలోక జీవితంపై శ్రద్ధ వహించ కుండా, వాటిలోనే నిమగ్నమై పోయేలా చేస్తాయి. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని ఒక ఉదాహరణ ద్వారా వివరించినారు: వసంతకాలపు మొక్కలు మరియు ఖదిర్’ని (ఇది ఒక రకమైన మొక్క, దీనిని పశువులు ఇష్టంగా తింటాయి) అధికంగా తినడం వల్ల ఆ మొక్కలు పశువులను చంపవచ్చు లేదా మృత్యువు అంచులకు చేర్చవచ్చు. దీనికి మినహాయింపు – ఖదిర్ తినే పశువు, దాని కడుపు రెండు వైపులా నిండిపోయే వరకు తిని, తరువాత అది సూర్యుని వైపునకు తిరిగి, తన కడుపు నుండి పేడని విసర్జిస్తుంది, లేదా మూత్రవిసర్జన చేస్తుంది. తరువాత అది తన కడుపులో ఉన్న దానిని పైకి తెచ్చి నెమరు వేస్తూ, నమిలిన తరువాత మింగుతుంది, తరువాత మళ్ళీ మేయడం ప్రారంభిస్తుంది. సంపద మధురంగా, పచ్చగా ఆకర్షణీయంగా ఉండే ఒక రకమైన మొక్క లాంటిది. ఆ మొక్క ఒకవేళ చాలా ఎక్కువగా ఉంటే అది ప్రాణం తీయగలదు, లేదా దాదాపు మృత్యువు అంచుల వరకూ తీసుకు వెళ్ళగలదు. నిజానికి సంపద అవసరమైనదే. దానిని ధర్మబధ్ధమైన మార్గములో, కొద్ది మొత్తములో తీసుకుని, అవసరానికి తగినంత మాత్రమే ఉపయోగించినట్లయితే, అది అతనికి ఎటువంటి హాని కలుగజేయదు. ఒక ముస్లిం తన సంపదలో కొద్ది భాగాన్ని పేదలకు, అనాథలకు, సర్వమూ కోల్పోయిన బాటసారులకు పంచినట్లయితే (దానము చేసినట్లయితే), ఆ సంపద అతనికి ఒక మంచి సహచరునిగా మారుతుంది. ఎవరైతే సంపదను ధర్మబద్ధంగా సంపాదించి తనతో ఉంచుకుంటాడో అది అతనికి ఒక వరం లాంటిది. కానీ ఎవరైతే దానిని అధర్మంగా, అధర్మ మార్గాలలో సంపాదిస్తాడో అతడు ఎంత తిన్నా సంతృప్తి చెందని వ్యక్తి లాంటి వాడు. ఆ సంపద తీర్పు దినమున అతనికి వ్యతిరేకంగా సాక్షిగా నిలబడుతుంది.
అన్ ను’మాన్ బిన్ బషీర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా నరకాగ్నిలో అతి తక్కువ శిక్ష అనుభవించే వాడు ఎవరంటే, అతని కాళ్ళకు అగ్నితో చేయబడిన రెండు పాదరక్షలు, మరియు వాటిని కట్టి ఉంచే రెండు పట్టీలు తొడగబడతాయి. అవి అతని మెదడును, కుండలోని పదార్థము తుకతుక ఉడికినట్లు, మరిగేలా చేస్తాయి. అతడు తన కంటే ఘోరమైన శిక్ష మరెవ్వరూ అనుభవిస్తూ ఉండరని అనుకుంటాడు; నిజానికి అతడు అందరి కంటే తక్కువ శిక్ష అనుభవిస్తున్న వాడు అయినప్పటికీ.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసినారు: పునరుత్థాన దినమున నరకములో అతి తక్కువ శిక్షను పొందే వ్యక్తికి అగ్నితో చేసిన రెండు పాదరక్షలు, మరియు (వాటిని కట్టి ఉంచే) రెండు పట్టీలు తొడగబడతాయి. వాటి వేడి కారణంగా అతని మెదడు రాగి కుండలో ఉడకబెట్టిన పదార్థం తుకతుక ఉడికినట్టుగా మరుగుతుంది. తన కంటే ఘోరంగా శిక్షించబడుతున్న వారెవ్వరూ అతనికి కనబడరు (తనకంటే ఘోరంగా శిక్షించబడుతున్న వారెవ్వరూ లేరు అని అతడు తలపోస్తాడు), వాస్తవానికి అందరికంటే తక్కువగా శిక్షించబడున్న వ్యక్తి అతడే అయినప్పటికీ. ఇది అతనికి శారీరకంగా శిక్షించడంతో పాటు అతన్ని మానసికంగా శిక్షకు గురిచేస్తుంది.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “వాహనం పై సవారీ అయి ఉన్న వాడు, పాదచారునికి సలాం చేయాలి; పాదచారుడు కూర్చుని ఉన్నవానికి సలాం చేయాలి; కొద్దిమంది ఉన్న సమూహం, ఎక్కువమంది ఉన్న సమూహానికి సలాం చేయాలి.” సహీహ్ బుఖారీలో: “చిన్న వారు (వయసులో) పెద్దవారికి; పాదచారుడు కూర్చుని ఉన్న వానికి, చిన్న సమూహం పెద్ద సమూహానికి సలాం చేయాలి” అని నమోదు చేయబడి ఉన్నది.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో ‘సలాం’ ను విస్తరించే విధానానికి సంబంధించిన విధానాలను బోధిస్తున్నారు – అది “అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” (అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు మీపై కురియుగాక). చిన్న వాళ్ళు (వయసులో) పెద్దవారికి సలాం చేయాలి; సవారీ అయి ఉన్న వ్యక్తి, కాలినడకన వెళుతున్న వానికి సలాం చేయాలి; కాలినడకన వెళుతున్న వ్యక్తి కూర్చుని ఉన్న వ్యక్తికి సలాం చేయాలి; కొద్దిమంది ఉన్న సమూహం, ఎక్కువమంది ఉన్న సమూహానికి సలాం చేయాలి.
అన్’నవ్వాస్ ఇబ్న్ సిమ్’ఆన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను ధర్మం మరియు పాపం గురించి అడిగాను, వారు ఇలా జవాబిచ్చారు: "ధర్మం యొక్క సారాంశం మంచి ప్రవర్తన (అఖ్లాక్) లో వ్యక్తమవుతుంది, అయితే పాపం అనేది నీ హృదయంలో నీకు అసౌకర్యాన్ని కలిగించేది, మరియు నీవు దానిని ఇతరులకు బహిర్గతం చేయడాన్ని అసహ్యించుకునేది”.
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ధర్మము మరియు పాపమును గురించి ప్రశ్నించడం జరిగింది. ఆయన (స) ఇలా అన్నారు: ధర్మము యొక్క అతి గొప్ప లక్షణాలు: సత్శీలము కలిగి ఉండుట, తద్వారా అల్లాహ్ పట్ల దైవభీతి కలిగి ఉండుట; హాని, కీడు, మొదలైన వాటిని సహించడం ద్వారా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండుట; అతిగా ఆగ్రహానికి గురి కాకుండా ఉండుట; ఉల్లాసమైన ముఖం; దయగల మాటలు; బంధుత్వములను నిభాయించుట; విధేయత; నీతి, మంచి సహవాసం మరియు సాంగత్యము. ఇక పాపకార్యాల విషయానికి వస్తే, ఇది ఆత్మలో కదిలే మరియు ఊగిసలాడుతూ ఉండే అనుమానాస్పద విషయాలను సూచిస్తుంది, ఏ విషయం కారణంగా హృదయం ఎప్పుడూ తేలికగా ఉండదో; హృదయంలో ఎపుడూ అది సందేహాస్పదంగానే ఉంటుందో, అది పాపం అని హృదయం ఎప్పుడూ భయపడుతూ ఉంటుందో; మరియు ఆ విషయం యొక్క వికారత్వాన్ని బట్టి దానిని సమాజంలోని ఉన్నత వర్గాలకు, లేదా ఉత్తమమైన మరియు పరిపూర్ణమైన వ్యక్తులకు తెలియడాన్ని ఇష్టపడదో ఇది అటువంటి విషయం. ఇలా ఎందుకంటే ఆత్మకు తన మంచి లక్షణాలను ప్రజలకు చూపించాలనే సహజ కోరిక ఉంటుంది. కనుక తన కొన్ని చర్యలను, ఆచరణలను ప్రజలకు తెలియజేయడం, లేక వారికి తెలియడం ఆత్మ ఇష్టపడనప్పుడు అటువంటి చర్య, ఆచరణ పాపం అనబడుతుంది. అందులో ఎటువంటి మంచీ ఉండదు.
అబూ మూసా ఇబ్న్ ఖైస్ అల్ అష్’అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: : “నిశ్చయంగా సర్వశక్తిమంతుడు, సర్వోత్కృష్టుడు అయిన అల్లాహ్ (ప్రతి) రాత్రి తన చేతిని ముందుకు చాచుతాడు, పగటిపూట పాపానికి ఒడిగట్టినవాడు పశ్చాత్తాప పడుటకు గాను; మరియు (ప్రతి) పగలు తన చేతిని ముందుకు చాచుతాడు, రాత్రి పూట పాపము చేసినవాడు పశ్చాత్తాప పడుటకు గాను; ఇలా సూర్యుడు పడమటి నుండి ఉదయించే వరకు జరుగుతుంది.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో అల్లాహ్ తన దాసులనుండి పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. ఒకవేళ దాసుడు పగటి పూట పాపానికి పాల్బడి, రాత్రి పూట అతడు పశ్చాత్తాపం చెందితే, అతడి పశ్చాత్తాపాన్ని అల్లహ్ స్వీకరిస్తాడు. ఒకవేళ అతడు రాత్రి పూట పాపానికి పాల్బడి, ఉదయం అతడు పశ్చాత్తాపం చెందితే, అతడి పశ్చాత్తాపాన్ని అల్లాహ్ స్వీకరిస్తాడు. పరమ పవిత్రుడైన అల్లాహ్ తన చేతిని ముందుకు చాచుతాడు దాసుల పశ్చాత్తాపం కొరకు, వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించుటలో ఆయన ఆహ్లాదం పొందుతాడు, అమితంగా సంతోషిస్తాడు. ఈ పశ్చాత్తాపపు ద్వారము, ప్రళయాన్ని సూచిస్తూ, సూర్యుడు పడమటి నుండి ఉదయించేంత వరకూ తెరుచుకునే ఉంటుంది. సూర్యుడు పడమటి నుండి ఉదయించినపుడు ఆ పశ్చాత్తాపపు ద్వారం మూసుకుపోతుంది.
అబూ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “ప్రాచీన ప్రవచనాల నుండి ప్రజలు నేర్చుకున్న విషయాలలో ఒకటి: “(ఆ పనిలో) సిగ్గు, అవమానం ఏమీ లేకపోయినట్లైతే, మీకు నచ్చినది చేయండి.”
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: పూర్వపు ప్రవక్తల ఆదేశాలను ప్రజలు తమలో తాము వ్యాపింపజేసుకునేవారు; ఆ విధంగా అవి శతాబ్దాల తరబడి ఒక శతాబ్దం తరువాత మరొక శతాబ్దానికి తరువాతి తరాల వారికి వారసత్వంగా సంక్రమిస్తూ వచ్చేవి; చివరికి అవి ఈ ఉమ్మత్ యొక్క తొలితరం వారికి చేరాయి; వాటిలో ఒకటి: ముందుగా నీవు ఏమి చేయాలనుకుంటున్నావో చూడు; అది అవమానకరమైనది, సిగ్గుపడవలసినది కానట్లైతే, అపుడు ఆ పని చేయి; ఒకవేళ అది అవమానకరమైనది, సిగ్గుపడవలసిన పని అయినట్లైతే దానిని వదిలివేయి; ఎందుకంటే అవమానకరమైన పనుల నుండి మనలను నిరోధించేది సచ్ఛీలత, మరియు అణకువ. కనుక అణకువ మరియు సచ్ఛీలత లేని వారు ప్రతి అశ్లీల కార్యములో మరియు ప్రతి చెడులో, ప్రతి దుష్కర్మలో మునిగి పోతారు.