





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలలో బానిసపై మరియు స్వతంత్ర వ్యక్తిపై, పురుషులపై మరియు స్త్రీలపై, చిన్నవారిపై మరియు పెద్దవారిపై మొత్తం అందరిపై ఒక సాఅ ఖర్జూరాలు లేదా ఒక సాఅ బార్లీ జకాతుల్-ఫితర్ దానం చెల్లింపును విధిగావించారు. ప్రజలు ఈద్ నమాజుకు వెళ్ళే ముందే దానిని చెల్లించాలని ఆయన ఆదేశించారు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్ తర్వాత వెంటనే జకాతుల్ ఫితర్ దానం చెల్లింపును తప్పనిసరి చేశారు.దీని పరిమాణం ఒక "సాఅ (దాదాపు 2.75 కిలోగ్రాములు)", ఇది బరువులో నాలుగు "ముద్ లకు (దాదాపు 0.6875 గ్రాములు)" సమానం. ఒక ముద్ద్ అంటే సగటు వ్యక్తి రెండు దోసేళ్ళ పరిమాణం (ఖర్జూరాలు లేదా యవలు). ప్రతి ముస్లిం—స్వతంత్రుడైనా, బానిస అయినా, పురుషుడైనా, స్త్రీయైనా, చిన్నవాడైనా, పెద్దవాడైనా — ఇది తప్పక దానం చేయాలి. ఇది తన అవసరాలకు మించి, తన కుటుంబ సభ్యులకు ఆ దినము మరియు రాత్రి అవసరాలకు మించి కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ప్రజలు ఈద్ నమాజ్‌కు వెళ్లే ముందే జకాతుల్-ఫిత్ర్ దానం చెల్లించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఒక ముస్లిం మహిళకు, మహ్రమ్ (భర్త లేదా వివాహం చేయరాని సన్నిహిత బంధువు) అయిన పురుషుడు తోడుగా లేకుండా, ఒక రాత్రి ప్రయాణ దూరం ప్రయాణించడం అనుమతించబడలేదు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఒక ముస్లిం మహిళ కొరకు, తన మహ్రమ్ (వివాహం చేయరాని సన్నిహిత బంధువు) అయిన పురుషుడు తోడుగా లేకుండా, ఒక రాత్రి ప్రయాణ దూరం ప్రయాణించడం అనుమతించబడలేదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా తెలిపినారు.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహ వసల్లం ఇలా పలికినారు: "ఎవరైనా ఉపవాసంలో ఉండగా మర్చిపోయి తిన్నా లేదా తాగినా, అతను తన ఉపవాసాన్ని పూర్తిగా కొనసాగించాలి. ఎందుకంటే అతనికి ఆహారం, పానీయం ఇచ్చింది స్వయంగా అల్లాహ్ యే."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్టం చేసినారు: ఎవరైనా ఉపవాసం (ఫర్జ్ అయినా, నఫిల్ అయినా) లో ఉండగా మర్చిపోయి తినినా లేదా తాగినా సరే, అతను తన ఉపవాసాన్ని కొనసాగించాలి; ఉపవాసాన్ని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే అతను ఉపవాసాన్ని ఉల్లంఘించాలనే ఉద్దేశంతో తినలేదు. ఇది అల్లాహ్ నుండి వచ్చిన దీవెన; అతనికి తినిపించినది, త్రాపించినది స్వయంగా అల్లాహ్ యే.
ఇబ్నె అజ్'హర్ యొక్క ఒకప్పటి బానిస అయిన అబూ ఉబైద్ ఇలా ఉల్లేఖించినారు: నేను ఈద్ రోజున ఉమర్ ఇబ్నుల్-ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు)తో ఉన్నాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు: "ఇవి రెండు రోజులు — ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రెండు రోజులలో ఉపవాసం పాటించడం నిషేధించారు: ఒకటి ఉపవాసాన్ని ముగించే రోజు (ఈదుల్-ఫిత్ర్), మరొకటి మీ ఖుర్బానీ నుండి తినే రోజు (ఈదుల్-అద్హా)."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈద్ అల్-ఫిత్ర్ (రమదాన్ పండుగ) మరియు ఈదుల్-అద్హా (బక్రీదు పండుగ) దినాలలో ఉపవాసం చేయడం నిషేధించారు. ఈదుల్-ఫిత్ర్ అనేది రమదాన్ నెల తర్వాత ఉపవాసాన్ని ముగించే రోజు; ఈదుల్-అద్హా అనేది ఖుర్బానీ చేసి, దాని నుండి తినే రోజు. ఈ రెండు రోజులలో ఉపవాసం పాటించడం ఇస్లాంలో అనుమతించబడలేదు, ఎందుకంటే ఇవి ఆనందం, పండుగ, మరియు విందుభోజనం కోసం ప్రత్యేకించబడిన పవిత్ర దినాలు.
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తల్బియ ఇలా ఉండేది: "లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక, లబ్బైక లా షరీక లక లబ్బైక, ఇన్నల్ హమ్ద వన్ని'మత లక వల్ ముల్క్, లా షరీక లక్." ("హాజరయ్యాను, ఓ అల్లాహ్! నేను హాజరయ్యాను, నీకు భాగస్వామి లేడు, నేను హాజరయ్యాను. నిశ్చయంగా సకల ప్రశంసలు కృతజ్ఞతలు, అనుగ్రహాలు, సార్వభౌమాధికారం అన్నీ నీకే శోభిస్తాయి; నీకు భాగస్వామి లేడు)." ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఇంకా ఇలా జోడించేవారు: "లబ్బైక లబ్బైక, వ స'దైక, వల్ ఖైరు బియదైక్. లబ్బైక వ రఘ్బా ఇలైక వల్ అమల్." ("నేను నీ పిలుపుకు హాజరయ్యాను, నేను హాజరయ్యాను. నన్ను సంతోషపెట్టమని కోరుతున్నాను. సర్వమైన మంచి నీ చేతుల్లోనే ఉంది. నేను నీ పిలుపుకు స్పందిస్తున్నాను. ఆశలు, కృషి అన్నీ నీ వైపే."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్జ్ లేదా ఉమ్రహ్ ఆరంభించేటప్పుడు ఇలా తల్బియ పలికేవారు: (ఓ అల్లాహ్! నేను నీ పిలుపుకు స్పందిస్తున్నాను, నేను స్పందిస్తున్నాను) — నువ్వు మమ్మల్ని పిలిచిన ప్రతిదానికీ, దానిలో నిజాయితీ, ఏకేశ్వరవాదం (తౌహీద్), హజ్జ్ మరియు ఇతర అన్ని మంచి పనులు ఉన్నాయి, వాటన్నిటిలోను నేను నీ పిలుపుకు మళ్లీ మళ్లీ స్పందిస్తున్నాను; (నేను నీ పిలుపుకు స్పందిస్తున్నాను, నీకు భాగస్వామి లేడు, నేను స్పందిస్తున్నాను) — నీవే ఆరాధనకు అర్హుడు, నీ దైవత్వంలో, ఆరాధనలో, పేర్లలో, లక్షణాలలో నీకు భాగస్వామి లేడు; (నిశ్చయంగా, సకల ప్రశంసలు) — ప్రశంస, కృతజ్ఞత, గొప్పతనం అన్నీ నీకే; (దయ) — దయ కూడా నీవే ప్రసాదించేవాడు; (నీదే) — ఈ ప్రశంస, కృతజ్ఞత, దయ అన్నీ ఎల్లప్పుడూ నీకే అంకితం, శోభిస్తాయి;(అధికారం కూడా నీదే) — ప్రపంచంలోని అధికారం, రాజ్యం నీదే; (నీకు భాగస్వామి లేడు) — ఈ అన్నిటిలోను నీవే ఏకైకుడవు; నీకు ఎవరూ భాగస్వామి లేరు. ఇంకా ఇబ్నె ఉమర్ (రదియల్లాహు అన్హుమా) తల్బియ్యాలో ఇలా జోడించేవారు: (నేను నీ పిలుపుకు స్పందిస్తున్నాను, నేను నీ పిలుపుకు మళ్లీ మళ్లీ స్పందిస్తున్నాను, నన్ను సంతోషపరచమని కోరుతున్నాను) అర్థం: నన్ను ఎప్పటికప్పుడు సంతోషంగా ఉంచు, నీ దయతో నన్ను ఆనందపరచు. (మంచి అన్నీ నీ చేతుల్లోనే ఉంది) అర్థం: సర్వమైన మంచి నీదే, నీ కృప వల్లే అది లభిస్తుంది. (నేను నీ పిలుపుకు స్పందిస్తున్నాను, ఆశలు నీవైపే ఉన్నాయి) అర్థం: మన ఆశలు, మన కోరికలు, మన అవసరాలు అన్నీ నీదే; నీవే వాటిని నెరవేర్చగలవు. (మరియు చర్యలు) అర్థం: ఆరాధన, సేవ, సత్కార్యాలు—నీ కోసమే చేయబడతాయి, ఎందుకంటే నీవు మాత్రమే ఆరాధనకు అర్హుడవు.
ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: రమదాన్ చివరి పది దినాలలోని బేసి రాత్రుల్లో లైలతుల్-ఖదర్ రాత్రిని అన్వేషించండి.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లైలతుల్ ఖదర్ ను అన్వేషించడంలో, మంచి పనులను అధికం చేయడంలో, పశ్చాత్తాప పడుతూ తౌబా చేయడంలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని ప్రోత్సహించారు. ఈ రాత్రి ప్రతి సంవత్సరం రమదాన్ చివరి పది రోజులలోని బేసి రాత్రుల్లో (21, 23, 25, 27, 29వ రాత్రులు) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో కొంతమంది పురుషులకు, లైలతుల్ ఖదర్ (ఖదర్ రాత్రి) చివరి ఏడు రాత్రుల్లోనే ఉన్నట్లుగా వారి కలల్లో కనబడింది. దీనిపై రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "మీ కలలు చివరి ఏడు రాత్రులపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. కాబట్టి, ఎవరైనా ఖదర్ రాత్రిని అన్వేషిస్తూ ఉంటే, వారు దానిని చివరి ఏడు రాత్రుల్లో అన్వేషించాలి."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో కొంతమంది పురుషులకు, లైలతుల్ ఖదర్ రమదాన్ నెల చివరి ఏడు రాత్రుల్లో ఉందని కలలో చూపించబడింది. దీనిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "మీ కలలు చివరి ఏడు రాత్రులపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. కాబట్టి, ఎవరైనా ఖదర్ రాత్రిని వెతకాలని ఆశిస్తు ఉంటే, వారు దానిని చివరి ఏడు రాత్రుల్లో శ్రద్ధగా వెతకాలి." ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రోత్సహించారు: ఖదర్ రాత్రి రమదాన్ చివరి పది రాత్రుల్లో, ప్రత్యేకంగా చివరి ఏడు రాత్రుల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రమదాన్ నెల 30 రోజులు అయితే, చివరి ఏడు రాత్రులు 24వ రాత్రి నుంచి మొదలు అవుతాయి. ఒకవేళ రమదాన్ నెల 29 రోజులు అయితే, 23వ రాత్రి నుంచి మొదలవుతాయి. ఈ రాత్రుల్లో మంచి పనులు, అల్లాహ్ యొక్క దిక్ర్, దుఆలు మరింత ఎక్కువగా చేయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రోత్సహించారు
అబూ దర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కొంతమంది సహాబాలు ఇలా అన్నారు: "ఓ ప్రవక్తా! ధనవంతులు ఎన్నో పుణ్యాలు సంపాదించేస్తున్నారు. వారు కూడా మేము చేస్తున్నట్లుగానే నమాజ్ చేస్తారు, మేము ఉన్నట్లుగానే ఉపవాసం ఉంటారు, కానీ (మేము చేయలేని విధంగా) తమ అదనపు ధనాన్ని దానం కూడా చేస్తారు." అప్పుడు ప్రవక్త ఇలా పలికినారు: "అల్లాహ్ మీకు కూడా అలా దానం చేసే అవకాశం ఇవ్వలేదు అని భావిస్తున్నారా? ప్రతిసారి 'సుబహానల్లాహ్' (అల్లాహ్ పరమ పవిత్రుడు) అని ధ్యానం చేయడమూ దానమే, ప్రతిసారి 'అల్లాహు అక్బర్' (అల్లాహ్ గొప్పవాడు) అని పలకడమూ దానమే, ప్రతిసారి 'అల్హమ్దులిల్లాహ్' (అల్లాహ్‌కే సకల స్తుతులు) అని పలకడమూ దానమే, ప్రతిసారి 'లా ఇలాహ ఇల్లల్లాహ్' (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు) అని పలకడమూ దానమే. మంచి పనిని ప్రోత్సహించడమూ దానమే, చెడు పనిని నిషేధించడము కూడా దానమే. ఇంతేకాదు, మీలో ఎవరు తమ శారీరక కోరికను హలాల్ మార్గంలో తీరుస్తారో, వారికి దాని పుణ్యమూ లభిస్తుంది." అప్పుడు సహాబాలు ఆశ్చర్యపడి, "ఓ రసూలుల్లాహ్! మాలో ఎవరు తమ కోరికను తీర్చుకున్నా అతనికి కూడా పుణ్యం లభిస్తుందా?" అని అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: "అతడు అదే కోరికను హరామ్ మార్గంలో తీర్చుకుంటే అతడు పాపం చేసినట్లుగా లెక్కించబడతాడని మీకు తెలియదా? అలాగే, హలాల్ మార్గంలో తన కోరిక తీర్చుకుంటే అతనికి పుణ్యం లభిస్తుంది."
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులలోని కొంతమంది పేదవారు ఆయన దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: ‘‘ఓ అల్లాహ్ ప్రవక్తా! ధనవంతులు అన్ని పుణ్యాలూ సంపాదించేసు కుంటున్నారు. వారు మేము చేసేలా నమాజ్ చేస్తారు, మేము ఉండేలా ఉపవాసం ఉంటారు, కానీ వారు తమ అదనపు ధనాన్ని దానం కూడా చేస్తారు, కానీ మేము మాత్రం (బీదరికం వలన) దానం చేయలేము!’’ అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇలా ఉత్సాహపరిచారు: ‘‘అల్లాహ్ మీకు కూడా దానం చేసే అవకాశాన్ని ఇవ్వలేదు అని అనుకుంటున్నారా? ప్రతిసారి ‘‘సుబహానల్లాహ్’’ (అల్లాహ్ పరమ పవిత్రుడు) అనడం దానం, ప్రతిసారి ‘‘అల్లాహు అక్బర్’’ (అల్లాహ్ గొప్పవాడు) అనడం దానం, ప్రతిసారి ‘‘అల్ హమ్దులిల్లాహ్’’ (అల్లాహ్‌కే సకల స్తుతులు) అనడం దానం, ప్రతిసారి ‘‘లా ఇలాహ ఇల్లల్లాహ్’’ (అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు) అనడం దానం. మంచి పనిని ప్రోత్సహించడం దానం, చెడు పనిని నిషేధించడం కూడా దానం. మీలో ఎవరైనా తన భార్యతో తన కోరిక తీర్చుకుంటే, దానికీ పుణ్యం లభిస్తుంది.’’ దానికి వారు ఆశ్చర్యపడి, ‘‘ఓ రసూలుల్లాహ్! మాలో ఎవరైనా తమ కోరికను తీర్చుకున్నా అతనికి కూడా పుణ్యం లభిస్తుందా?’’ అని అడిగారు. దానికి ప్రవక్త ఇలా సమాధానమిచ్చారు: ‘‘అతడు అదే కోరికను హరామ్ మార్గంలో తీర్చుకుంటే అతనికి పాపం చుట్టుకుంటుందని మీకు తెలియదా? అలాగే, హలాల్ మార్గంలో తన కోరిక తీర్చుకుంటే, అతనికి పుణ్యం లభిస్తుంది.’’
ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: పది (రమదాన్ చివరి పది రాత్రులు) ప్రారంభమైనప్పుడు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిని మేల్కొని గడిపేవారు, తన కుటుంబాన్ని కూడా లేపేవారు, తాను మరింత ఎక్కువగా (ఆరాధనలలో) శ్రమించేవారు, మరియు తన నడుము బిగించేవారు (అర్థం: పూర్తిగా ధ్యానం, ఆరాధనలలో నిమగ్నమయ్యేవారు).
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారురమదాన్ చివరి పది రోజులు ప్రారంభమైనప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రంతా అనేక విధాలుగా అల్లాహ్‌కు విధేయత చూపుతూ గడిపేవారు. ఆయన తన కుటుంబాన్ని కూడా లేపి నమాజు చేయించేవారు. సాధారణంగా చేసే ఆరాధనల కంటే మరింతగా ఎక్కువగా శ్రమించేవారు. తాను పూర్తిగా ఆరాధనలలో నిమగ్నమై, తన భార్యలతో సన్నిహిత సంబంధాన్ని కూడా నివారించేవారు.