





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై {إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ} (అన్నస్ర్ సూరహ్ 1) అవతరించిన తర్వాత, ఆయన ప్రతి నమాజ్‌లో ఇలా పలకకుండా ఉండలేదు (నమాజు కొనసాగించలేదు): "సుబహానక రబ్బనా వ బిహమ్దిక, అల్లాహుమ్మఘ్ఫిర్లీ (మా ప్రభువా! నీవు పరమ పవిత్రుడవు, స్తుతులన్నీ నీకే శోభిస్తాయి, ఓ అల్లాహ్! నన్ను క్షమించు)." ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా పలికినారు: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన రుకూలో, సజ్దాలో తరచుగా ఇలా పలికేవారు: "సుబహానకల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక, అల్లాహుమ్మఘ్ఫిర్లీ ("ఓ అల్లాహ్! ఓ మా ప్రభువా, నీవు పరమ పవిత్రుడవు, సకల స్తుతులు నీకే శోభిస్తాయి. ఓ అల్లాహ్! నన్ను క్షమించు)." ఆయన ఇలా చేయడాన్ని 'అల్-ఖుర్ఆన్'ను అమలు చేయడంగా (యతఅవ్వలుల్-ఖుర్ఆన్) భావించేవారు (అంటే, ఖుర్ఆన్లో "నీవు నీ ప్రభువును మహిమపరచు, క్షమాపణ కోరు" అని వచ్చిన ఆదేశాన్ని ప్రవక్త ﷺ తన నమాజ్‌లో ఈ దుఆ ద్వారా పూర్తి చేసేవారు).
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా పలికినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై "ఇదా జాఅ న్నస్రుల్లాహి వల్ ఫత్హు" (నస్ర్ సూరహ్) అవతరించినప్పుడు, ఆయన ఆ ఖుర్ఆన్ ఆయతులోని ఆదేశాన్ని అమలు చేయడంలో ఆత్రుత చూపారు. అల్లాహ్ ఆదేశించినట్లు: "కాబట్టి నీ ప్రభువును స్తుతితో మహిమపరచు, ఆయనను క్షమాపణ కోరు" (నస్ర్: 3). దీని ప్రకారం, ప్రవక్త ﷺ నమాజ్‌లోని రుకూలో, సజ్దాలో తరచుగా ఇలా పలికేవారు: "సుబహానక" అంటే: "ఓ అల్లాహ్! నీవు ప్రతి లోపం నుండి, కొరత నుండి పరమ పవిత్రుడవు, నీకు తగనిది ఏదీ నీలో లేదు."; "అల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక" అంటే: "ఓ అల్లాహ్! ఓ మా ప్రభువా, సకల స్తుతులు నీకే శోభిస్తాయి, నీ స్వరూపంలో, లక్షణాలు, కార్యాల్లో నీవు పరిపూర్ణుడవు."; "అల్లాహుమ్మగ్ఫిర్లీ" అంటే: "ఓ అల్లాహ్! నన్ను క్షమించు, నా పాపాలను తొలగించు, వాటిని మన్నించు."
అబూ ఉమామా ఇయాస్ బిన్ థఅలబహ్ అల్-హారిసీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ ﷺ ఇలా పలికినారు: "ఎవరైనా తప్పుడు ప్రమాణం చేసి (అల్లాహ్ పేరుతో అసత్య ప్రమాణం చేసి) ఒక ముస్లింకు చెందిన హక్కును (ఆస్తిని, వస్తువును, హక్కును) కాజేస్తే, అల్లాహ్ అతడి కొరకు స్వర్గాన్ని నిషేధిస్తాడు, నరకాన్ని తప్పనిసరి చేస్తాడు." అప్పుడు ఒక వ్యక్తి ఇలా అడిగారు: "ఓ రసూలుల్లాహ్! అది చిన్నది అయినాా (తక్కువ విలువది అయినా)?" ప్రవక్త ﷺ ఇలా జవాబు ఇచ్చారు: "అది ఒక చిన్న మిస్వాక్ పంటి పుల్ల అయినా సరే."
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు: అల్లాహ్ పేరుతో తప్పుడు ప్రమాణం చేయడం (అబద్ధమని తెలిసీ ప్రమాణం చేయడం), ముఖ్యంగా ఒక ముస్లింకు చెందిన హక్కును (ఆస్తిని, హక్కును) అన్యాయంగా కాజేయడం కోసం చేస్తే, దానికి శిక్ష పడే: నరకానికి అర్హుడు కావడం, స్వర్గాన్ని కోల్పోవడం. ఇది పెద్ద పాపాల్లో (కబీరా గునాహ్) ఒకటి. అప్పుడు ఒక వ్యక్తి అడిగాడు: "ఓ రసూలుల్లాహ్! ఆ (అబద్ధపు) ప్రమాణం చేసిన వస్తువు (హక్కు) చిన్నదైనా (తక్కువ విలువదైనా) ఇదే శిక్షా?" దానికి ప్రవక్త ముహమ్మద్ ﷺ ఇలా చెప్పినారు: "అది (తప్పుడు ప్రమాణం చేసి కాజేసిన హక్కు) ఒక చిన్న అరాక్ చెట్టు నుండి తీసిన సివాక్ పుల్ల (మిస్వాక్) అయినా సరే."
ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రోగిని సందర్శించినప్పుడు, ఆయన ఇలా దువా చేసేవారు: "అద్-హిబిల్-బాస, రబ్బన్నాస్, వష్ఫి, అంత అష్షాఫీ, లా షిఫాఅ’ ఇల్లా షిఫాఉక, షిఫా’అన్ లా యుగాదిరు సఖమా." (ప్రజల ప్రభువా! బాధను తొలగించు. నీవే ఆరోగ్యదాతవు. నీ ఆరోగ్యమే నిజమైన ఆరోగ్యం. నీ ఆరోగ్యం తప్ప మరొకటి లేదు. అలాంటి ఆరోగ్యాన్ని ప్రసాదించు — అది ఎలాంటి వ్యాధినీ మిగల్చకుండా పూర్తిగా నయం చేసే ఆరోగ్యాన్ని ప్రసాదించు."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రోగిని సందర్శించినప్పుడు ఇలా ప్రార్థించేవారు: "ఓ అల్లాహ్! బాధను, తీవ్రమైన వ్యాధిని తొలగించు. ప్రజల ప్రభువా, వారి సృష్టికర్తా, పోషకుడా! ఈ రోగిని నీవే నయం చేయుము. నీవే, పరమ పవిత్రుడవు, నిజమైన ఆరోగ్యదాతవు. నీ 'అష్షాఫీ' అనే పేరుతో నేను నీకు వేడుకుంటున్నాను. ఈ రోగి కొరకు నీ ఆరోగ్యం తప్ప మరొక ఆరోగ్యం లేదు. నీ ఆరోగ్యం పూర్తిగా వ్యాధిని తొలగించేలా ఉండాలి, ఏ రకమైన వ్యాధి, మరొక అనారోగ్యం మిగలకుండా పూర్తిగా నయం చేయుము."
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: నువ్వు ఒక దీనార్ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేశావు మరొకటి బానిస విముక్తి కోసం ఇంకొకటి బీధవాడికి దానం చేశావు మరో దీనార్ నీ కుటుంబీకులపై ఖర్చు చేశావు అందులో పుణ్యప్రధంగా విలువైనది ‘నీ కుటుంబీకుల పై ఖర్చు చేసినదే’
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని దానధర్మాల గురించి ఇలా పేర్కొన్నారు: "నీవు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసిన దీనార్, బానిసను విముక్తి చేయడంలో ఖర్చు చేసిన దీనార్, అక్కరగల పేదవారికి దానం చేసిన దీనార్, మరియు నీ కుటుంబ సభ్యులు, నీపై ఆధారపడిన వారిపై ఖర్చు చేసిన దీనార్ — వీటన్నింటిలో అల్లాహ్ దృష్టిలో అత్యధిక ప్రతిఫలం కలిగినది, నీవు నీ కుటుంబంపై మరియు నీపై ఆధారపడినవారి అవసరాలకు ఖర్చు చేసినదే" అని ప్రవక్త స్పష్టం చేశారు.
అబ్దుల్లాహ్ బిన్ అమర్ బిన్ అల్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: నీవు పగలంతా ఉపవాసం పాటించి, రాత్రంతా నమాజ్ చేస్తూ ఉంటావా?" అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు. నేను "అవును" అన్నాను. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "ఇలా చేస్తే, నీ కన్నులు బలహీనపడతాయి, నీ ఆత్మ అలసిపోతుంది. ఎవరైతే ఎడతెరపి లేకుండా ఉపవాసం పాటిస్తారో, వారి ఉపవాసం లెక్కించ బడదు. నెలలో మూడు రోజులు ఉపవాసం పాటిస్తే, మొత్తం సంవత్సరమంతా ఉపవాసం పాటించినట్టే అవుతుంది." నేను మరలా ఇలా అన్నాను: "నేను దాని కంటే ఇంకొంత ఎక్కువ చేయగలను." అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "అయితే దావుదు (అలైహిస్సలామ్) పాటించిన ఉపవాసాన్ని పాటించు: ఆయన ఒక రోజు ఉపవాసం పాటించి, మరుసటి రోజు ఉపవాసం పాటించేవారు కాదు (అంటే రోజు విడచి రోజు ఉపవాసం పాటించేవారు) మరియు శత్రువును ఎదుర్కొనడంలో వెనక్కు తగ్గేవారు కాదు."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు'అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రదియల్లాహు అన్హుమా సంవత్సరమంతా నిరంతరం ఉపవాసాలు ఉండేవారని, రాత్రి అంతా నమాజు చేస్తూ నిద్రించకుండా ఉండేవారని "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేయబడింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా చేయడాన్ని నిషేధించారు. ఆయన సల్లల్లాహు అలైహి వస్లలం అతనితో ఇలా అన్నారు: "నీవు (కొన్ని రోజులు) ఉపవాసం ఉండి, (కొన్ని రోజులు) విరమించు, అలాగే రాత్రి (కొంత సమయం) నమాజు చేసి, (కొంత సమయం) నిద్రించు." ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని నిరంతరం ఉపవాసం ఉండకుండా, రాత్రంతా నమాజులో నిలబడకుండా వారించి, అతనితో ఇలా అన్నారు: నువ్వు అలా చేస్తే, నీ కళ్ళు బలహీనంగా, మునిగిపోతాయి, నీ ఆత్మ అలసిపోతుంది మరియు నీరసించిపోతుంది. ఏడాది పొడవునా ఉపవాసం ఉండే వ్యక్తి నిజంగా ఉపవాసం ఉన్నట్లు కాదు, ఎందుకంటే నిషేధాన్ని ఉల్లంఘించడం వల్ల ఉపవాసం పాటించిన ప్రతిఫలం అతనికి లభించదు మరియు అతను నిరంతరం ఉపవాసం ఉండటం వల్ల ఉపవాసం పాటించని దినాల వలన కలిగే ప్రయోజనాన్ని అతను అనుభవించడు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని ప్రతి నెలా మూడు రోజులు ఉపవాసం ఉండాలని మార్గనిర్దేశం చేశారు, ఎందుకంటే అది మొత్తం సంవత్సరం ఉపవాసం పాటించడంతో సమానం, ఎందుకంటే ప్రతి (ఉపవాసం) రోజు పది రోజులుగా లెక్కించబడుతుంది (ప్రతి పుణ్యానికి కనీసం పదింతల ప్రతిఫలం లభిస్తుంది), ఇది ఒక మంచి కార్యం యొక్క కనీస గుణకారం. దానికి అబ్దుల్లాహ్ బిన్ అమర్ బిన్ అల్ ఆస్ రదియల్లాహు అన్హుమా ఇలా అన్నారు: నిజానికి, నేను దాని కంటే ఎక్కువ చేయగలను. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా అన్నారు: అయితే దావూద్ అలైహిసలాం ఉపవాసం పాటించు, ఇది ఉపవాసాలలో ఉత్తమమైనది, ఎందుకంటే ఆయన (అ) రోజు విడచి రోజు ఉపవాసం ఉండేవారు మరియు శత్రువును ఎదుర్కొన్నప్పుడు పారిపోయేవారు కాదు. ఎందుకంటే ఆయన (అ) ఉపవాసం పాటించడంలో అనుసరించిన విధానం ఆయన (అ) శరీరాన్ని బలహీనపరచలేదు.
నుమాన్ బిన్ బషీర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: తన తల్లి బింతె రవాహా తన తండ్రిని తన సంపదలో కొంత భాగాన్ని అతని కొడుకుకు బహుమతిగా ఇవ్వమని అడిగింది. అతను ఒక సంవత్సరం పాటు సంకోచించాడు, కానీ ఆ తరువాత అతను నిర్ణయించుకున్నాడు. దానికి ఆమె ఇలా అంది: "నీవు నా కొడుకుకు ఇచ్చిన దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను సాక్షిగా ఉంచే వరకు నేను సంతృప్తి చెందను. అపుడు, నా తండ్రి నా చేయి పట్టుకున్నాడు, ఆ సమయంలో నేను చిన్నవాడిని, మరియు అతను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లం వద్దకు తీసుకుని వెళ్ళి, ఇలా పలికినాడు: "ఓ రసూలుల్లాహ్! ఇతని తల్లి బింత్ రవాహా, నేను తన కొడుకుకు బహుమతిగా ఇచ్చిన దానికి మీరు సాక్ష్యంగా ఉండాలని కోరుకుంటున్నది." దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఓ బషీర్! నీకు ఇతనే కాకుండా ఇంకా వేరే పిల్లలు కూడా ఉన్నారా?" దానికి అతను "అవును" అని అనగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: "నీవు వారందరికీ ఇదే బహుమతి ఇచ్చావా?" అతను "లేదు" అని సమాధానమిచ్చినాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "అయితే నన్ను సాక్షిగా చేయవద్దు, ఎందుకంటే నేను అన్యాయానికి సాక్ష్యమివ్వను." మరియు ముస్లిం హదీథు గ్రంథంలో నమోదు చేయబడిన పదాలలో ఇలా ఉన్నది: "అప్పుడు నన్ను కాదు, మరొకరిని దానికి సాక్షిగా ఉంచు."
అల్ బుఖారీ, ముస్లిం నమోదు చేసినారు, వేర్వేరు పదాలతోనుమాన్ బిన్ బషీర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: నుమాన్ తల్లి, అమ్రహ్ బింట్ రావాహా (రదియల్లాహు అన్హా), తన భర్త బషీర్‌ను (నుమాన్ తండ్రిని) ఇలా అడిగింది: "నా కొడుకు నుమాన్‌కు మీ ఆస్తిలోంచి ఒక భాగాన్ని బహుమతిగా ఇవ్వండి" . దానికి బషీర్ మొదట అంగీకరించలేదు, దాన్ని ఒక సంవత్సరం పాటు ఆలస్యం చేశారు. తర్వాత, తన భార్య అభ్యర్థనను గౌరవించి, తన కుమారుడు నుమాన్‌కు ఆ బహుమతిని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అపుడు ఆమె అతనితో ఇలా అన్నది: 'మీరు నా కొడుకు నుమాన్‌కు ఇచ్చిన బహుమతికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను సాక్షిగా చేయకపోతే నాకు సంతృప్తి ఉండదు.' అప్పుడు నా తండ్రి (బషీర్) నా చేతిని పట్టుకుని, అపుడు నేను చిన్న వయసులో ఉన్నాను, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకెళ్ళి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా పలికినారు: "ఓ రసూలుల్లాహ్! ఇతని తల్లి అమ్రహ్ బింతె రవాహ రదియల్లాహు అన్హా తన కొడుకు కోసం నేను ఇచ్చిన బహుమతికి మీరు సాక్ష్యంగా ఉండాలని కోరుకుంటుంది." అది విని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఓ బషీర్! నీకు ఇతనే కాకుండా ఇంకా ఇతర పిల్లలు కూడా ఉన్నారా?" అతడు "అవును" అన్నాడు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు, "నీవు నీ ఇతర పిల్లలందరికీ కూడా ఇదే బహుమతి ఇచ్చావా?" అతడు "లేదు" అన్నాడు, అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బషీర్ తో ఇలా అన్నారు: "అయితే నన్ను దీనికి సాక్షిగా చేయవద్దు, ఎందుకంటే నేను అన్యాయానికి (అన్యాయమైన పనికి) సాక్ష్యం ఇవ్వను." మరియు ముస్లింలో నమోదు చేయబడిన మరొక రివాయత్‌లో: "అయితే నన్ను సాక్షిగా చేయవద్దు, ఇంకెవ్వరినైనా సాక్షిగా చేసుకో." అని ఉంది.
ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: మరణ సమయం ఇంకా సమీపించని రోగిని సందర్శించి, అతని సమక్షంలో ఎవరైనా ఏడుసార్లు ఇలా అంటే అల్లాహ్ అతనిని ఆ వ్యాధి నుండి నయం చేస్తాడు: 'అస్’అలల్లాహుల్-‘అజీమ్ రబ్బుల్-‘అర్షిల్-‘అజిమ్ అన్ యష్ఫియక్ (నిన్ను నయం చేయమని నేను గొప్ప సింహాసనానికి అధిపతి అయిన అల్లాహ్‌ను అర్థిస్తున్నాను)'
అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపినారు: 'ఇంకా తన మరణ సమయం సమీపించని, అనారోగ్యంతో పడి వున్న ముస్లింను ఎవరైనా ఒక ముస్లిం సందర్శించి, ఈ దుఆను ఆ అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కోసం ఏడుసార్లు రిపీట్ చేస్తే, అల్లాహ్ ఆ వ్యక్తిని ఆ అనారోగ్యం నుండి తప్పక స్వస్థపరుస్తాడు."' దుఆ: "నిన్ను స్వస్థపరచాలని నేను అల్లాహుల్ అజీమ్‌ను వేడుకుంటున్నాను - ఆయన స్వరూపంలో, షిఫాతులలో, కార్యాలలో గొప్పవాడు, గొప్ప సింహాసనానికి ప్రభువు."
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర భార్య ఉమ్ముల్ ముమినీన్ ఉమ్మె సలమా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "ఎవరి వద్దనైనా (బక్రీద్ పండుగ నాడు) ఖుర్బానీ చేయడానికి ఒక పశువు ఉంటే , దుల్ హజ్ నెలవంక (హిలాల్) కనిపించిన తర్వాత, తన ఖుర్బానీ పూర్తి చేసే వరకు అతడు తన వెంట్రుకలు లేదా గోర్ల నుండి ఏదీ కత్తిరించకూడదు."
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్బానీ చేయాలని సంకల్పం చేసుకున్న వారికి ఇలా ఆదేశించారు: "ఎవరైతే ఖుర్బానీ (ఉద్దియ్యా) చేయాలనుకుంటున్నారో, దుల్-హిజ్జహ్ నెలవంక కనిపించిన తర్వాత, తన ఖుర్బానీ పూర్తి చేసే వరకు: తన తల వెంట్రుకల నుండి, చంకల క్రింద పెరిగే వెంట్రుకల నుండి, మీసం నుండి, శరీరంలోని ఇతర ప్రాంతాలలోని అంటే మర్మాంగాలు మొదలైన చోట పెరిగే వెంట్రుకల నుండి, చేతి/కాళ్ల గోర్ల నుండి ఏమీ తీయకూడదు."
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "రమదాన్ (మాసం) వచ్చినప్పుడు, స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి మరియు షైతానులు సంకెళ్లలో బంధించబడతారు."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారురమదాన్ నెల ప్రారంభమైనప్పుడు, మూడు విషయాలు జరుగుతాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తెలిపినారు: మొదటిది: స్వర్గద్వారాలు తెరవబడతాయి మరియు వాటిలో ఏదీ మూసివేయబడదు. రెండవది: నరకద్వారాలు మూసివేయబడతాయి మరియు వాటిలో ఏదీ తెరవబడదు. మూడవది: షైతానులు మరియు దుష్ట జిన్నులు సంకెళ్లతో కట్టివేయబడతారు. అందువలన, రమదాన్ కాకుండా ఇతర నెలలలో వారు సాధించగలిగిన సాఫల్యాలు, ఈ నెలలో సాధించలేరు (అంటే ప్రజలను మార్గభ్రష్టత్వం వైపు ప్రేరేపించలేరు). ఇవన్నీ ఈ పవిత్రమైన నెల గొప్పదనాన్ని కీర్తించడానికీ, అలాగే నమాజ్, సదకా, జిక్ర్, ఖుర్ఆన్ పారాయణం మొదలైన పుణ్యకార్యాలు ఎక్కువగా చేసేలా, పాపాలు మరియు అవిధేయతలు నుండి దూరంగా ఉండేలా విశ్వాసులను ప్రోత్సహించడానికీను.