





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబూ హరైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఒకవేళ ప్రజలు అదాన్ (నమాజు కొరకు పిలుపు) ఇవ్వడం మరియు మొదటి వరుసలో (సలాహ్ చేయడంలో) ఉన్న గొప్ప ప్రతిఫలం గురించి తెలుసుకుంటే, దానిని పొందడానికి లాటరీ వేసుకోవాల్సి వచ్చినా, వారు తప్పనిసరిగా లాటరీ వేసుకునే వారు. వారు ముందుగా మస్జిద్కు రావడంలో (తహ్జీర్) ఉన్న గొప్ప ప్రతిఫలం గురించి తెలుసుకుంటే, అందరూ ముందుగా రావడానికి పోటీ పడేవారు. వారు ఇషా (రాత్రి నమాజ్) మరియు ఫజర్ (ఉదయం నమాజ్) లో ఉన్న ప్రతిఫలం గురించి తెలుసుకుంటే, ఎంత కష్టమైనా, నడవలేకపోయినా, కదలలేకపోయినా, చాలా కష్టంగా అయినా, చేతుల మీద నడుస్తూ రావలసి వచ్చినా, ఆ నమాజులకు తప్పకుండా హాజరవుతారు."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు - ఒకవేళ ప్రజలు అదాన్ (నమాజ్‌కు పిలుపు) మరియు మొదటి వరుసలో (నమాజులో) నిలబడడంలో ఉన్న గొప్ప పుణ్యం, ఫలితాన్ని నిజంగా తెలుసుకుంటే, దానిని పొందేందుకు ఎవరు ముందుగా హక్కు పొందాలో నిర్ణయించేందుకు లాటరీ వేసుకోవాల్సి వచ్చినా వారు అలా చేసేవారు. అలాగే, నమాజ్‌ను ప్రారంభ సమయంలోనే మస్జిద్కు రావడంలో ఉన్న ప్రతిఫలం తెలుసుకుంటే, అందరూ ముందుగా రావడానికి పోటీ పడేవారు. ఇంకా, ఇషా (రాత్రి) మరియు ఫజర్ (ఉదయం) నమాజుల్లో ఉన్న ప్రతిఫలం, పుణ్యం ఎంత గొప్పదో తెలుసుకుంటే, వారు నడవలేకపోయినా, చేతుల మీద నడుస్తూ అయినా ఆ నమాజులకు తప్పకుండా హాజరవుతారు.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరైనా కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే, నరకంలో కూడా అతడు నిరంతరం అలా దూకుతూనే ఉంటాడు; ఎవరైనా విషం తాగి ఆత్మహత్య చేసుకుంటే, నరకంలో కూడా ఆ విషం అతని చేతిలోనే ఉంటుంది మరియు అదే విషాన్ని అతడు నిరంతరం తాగుతూనే ఉంటాడు; ఎవరైనా కత్తితో లేదా ఇనుప వస్తువుతో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటే, నరకంలో కూడా అది అతని చేతిలోనే ఉంటుంది మరియు అదే వస్తువుతో అతడు నిరంతరం తన పొట్టను గాయపరుస్తూనే ఉంటాడు."
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆత్మహత్య గురించి స్పష్టంగా హెచ్చరించారు: ఎవరేనా ఈ లోకంలో ఆత్మహత్య చేసుకుంటే, ప్రపంచంలో చేసిన విధంగానే పరలోకంలో కూడా చేస్తూ నరకంలో శిక్ష అనుభవిస్తారు. ఎవరైనాా ఈలోకంలో కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే, నరకంలో కూడా అతడు శాశ్వతంగా కొండలపై నుంచి లోయలలోనికి దూకుతూ నిరంతరం శిక్ష అనుభవిస్తాడు. ఎవరైనా విషం ఆత్మహత్య చేసుకుంటే: నరకంలో కూడా అతని చేతిలో విషం ఉంటుంది, మరియు నరకంలో కూడా అదే విషాన్ని మళ్లీ మళ్లీ తాగుతూ శాశ్వతంగా శిక్ష అనుభవిస్తాడు. ఎవరైనా ఇనుప వస్తువుతో పొట్టను గాయపరుచుకుని చనిపోతే: నరకంలో అతని చేతిలో అదే ఇనుప వస్తువు ఉంటుంది, నరకంలో కూడా అదే వస్తువుతో పొట్టను గాయపరుచుకుంటూ శాశ్వతంగా శిక్ష అనుభవిస్తాడు.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఏడు రకాలవారు ఉన్నారు — అల్లాహ్ తన (అర్ష్) నీడను - ఆ రోజు (ప్రళయ దినం) ఆయన (అర్ష్) నీడ తప్ప మరే నీడ ఉండదు - వారికి ఇస్తాడు: న్యాయమైన పాలకుడు (ఇమామ్ అదుల్), తన యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో గడిపిన యువకుడు, మస్జిదుతో మనసు ముడిపడిన వ్యక్తి, అల్లాహ్ కోసం పరస్పరం ప్రేమించేవారు — ఆ ప్రేమ కోసం కలిసేవారు, దాని మీదే విడిపోయేవారు, ఒక మహిళ (పదవీ, అందం కలిగినది చెడుపనికి) పిలిచినప్పుడు — "నేను అల్లాహ్‌ను భయపడుతున్నాను" అని చెప్పిన పురుషుడు, దానం చేసినప్పుడు — తన కుడిచేతి దానం ఎడమచేతికి కూడా తెలియకుండా రహస్యంగా ఇచ్చినవాడు, ఒక్కడిగా ఉన్నప్పుడు ఆ ఏకాంతంలో అల్లాహ్‌ను జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నవాడు"
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏడు రకాల విశ్వాసులకు శుభవార్త చెప్పారు — ప్రళయ దినం నాడు, అల్లాహ్ అర్జ్ (సింహాసనం) నీడ తప్ప మరే నీడ ఉండని రోజున, వారిని అల్లాహ్ తన ప్రత్యేక నీడలో రక్షిస్తాడు. మొదటి వాడు: తన వ్యక్తిత్వంలో న్యాయవంతుడు అయిన ఇమాం (పాలకుడు), పాపిష్టి కాని, తన ప్రజల మధ్య న్యాయం చేసే, అన్యాయం చేయని వ్యక్తి. అతను 'అల్విలాయత్ అల్-ఉజ్మా' (అత్యున్నత అధికారం) కలిగినవాడు, ముస్లిముల వ్యవహారాల్లో ఏదైనా బాధ్యతను తీసుకున్నవారు మరియు ఆ బాధ్యతలో న్యాయం చేసినవారు కూడా ఈ (న్యాయమైన పాలకుడి) వర్గంలోకి వస్తారు. రెండవవాడు: అల్లాహ్ ఆరాధనలో పెరిగిన యువకుడు, తన యవనాన్ని, చురుకుతనాన్ని అంతటినీ అల్లాహ్ ఆరాధనకే అంకితం చేసినవాడు, మరియు అదే స్థితిలో మరణించినవాడు. మూడవ వాడు: ఒక వ్యక్తి – అతని హృదయం మస్జిద్‌తో ముడిపడి ఉంటుంది. అతను మస్జిద్ నుండి బయటకు వచ్చినా, తిరిగి మస్జిద్కు వెళ్లాలనే కోరికతో ఉంటాడు. అతనికి మస్జిద్‌పై ఎంతో ప్రేమ, అతను తరచూ మస్జిద్లో ఉండే అలవాటు కలవాడు. అతని శరీరం మస్జిద్ వెలుపల ఉన్నా, హృదయం మాత్రం ఎప్పుడూ మస్జిద్‌లోనే ఉంటుంది. నాలుగవ వాడు: ఇద్దరి వ్యక్తులు – వారు పరస్పరం అల్లాహ్ కోసం నిజమైన ప్రేమతో ప్రేమించేవారు. వారి మధ్య ఉన్న ప్రేమ, ధర్మం (దీను) ఆధారంగా ఉండేది, ప్రపంచ విషయాల వల్ల ఆ బంధాన్ని విడిచి పెట్టరు. వారు కలిసినా, కలవకపోయినా, చివరకు మరణమే వారిని వేరు చేసింది. ఐదవ వాడు: ఒక పురుషుడు - ఒక మహిళ అతన్ని పాపానికి (అనైతిక చర్యకు) పిలిచింది. ఆమెకు మంచి వంశపారంపర్యం, ప్రతిష్ట, ధనం, అందం అన్నీ ఉన్నాయి. కానీ, అతను ఆమెను తిరస్కరించి ఇలా అన్నాడు: "నేను అల్లాహ్ నుండి భయపడుతున్నాను." ఆరవ వాడు - అలాంటి వారు - ఎవరైతే తక్కువగా లేదా ఎక్కువగా దానం చేసి, దాన్ని ప్రదర్శించకుండా రహస్యంగా చేస్తారో—ఎంతగా అంటే ఎడమ చేతికి కుడి చేతి ఏమి ఇచ్చిందో తెలియదు—అటువంటి వారు. ఏడవ వాడు: ఒక వ్యక్తి — ఒంటరిగా ఉన్నప్పుడు, తన హృదయంలో లేదా నోటితో అల్లాహ్‌ను జ్ఞాపకం చేసుకుంటూ (ధ్యానం చేస్తూ), అల్లాహ్ భయంతో, గౌరవంతో తన కన్నీళ్లను ఆపుకోలేక పోయినవాడు.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఒక నమాజు తరువాత మరొక నమాజు కొరకు వేచి ఉండటంలోని విశిష్ఠత.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లిం తన సహోదర ముస్లింకు ఎలాంటి ఆయుధాన్నీ (కత్తి, తుపాకీ, మొదలైనవి) చూపించకూడదని, ఉద్దేశపూర్వకంగానైనా లేదా సరదాగానైనా సరే అలా చేయవద్దని హెచ్చరించారు. ఎందుకంటే, షైతాను అతడిని (తొందరపాటులో, కోపంలో) ఆ ఆయుధాన్ని ఉపయోగించేలా ప్రేరేపించవచ్చు; దాంతో అతను తన సహోదరుడిని గాయపరచ వచ్చు లేదా చంపవచ్చు. అలా జరిగితే, అతను పెద్ద పాపంలో పడిపోతాడు, దాని ఫలితంగా నరకంలో పడే ప్రమాదమూ ఉంది.
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు, అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు, అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు." అపుడు సహచరులు ఇలా అడిగారు: "ఎవరు, ఓ రసూలల్లాహ్?" దానికి ఆయన ఇలా జవాబిచ్చారు: "ఎవరి చెడు వలన అతడి పొరుగువారు సురక్షితంగా ఉండలేరో."
అల్ బుఖారీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా మూడుసార్లు ప్రమాణం చేసి మరీ, తను చెప్పబోతున్న విషయంలోని గంభీరతను ధృవీకరించారు: "అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు," దానికి సహచరులు ఆయనను ఇలా అడిగారు: "ఓ రసూలుల్లాహ్! ఎవరు విశ్వాసి కాడు?" అపుడ ఆయన ఇలా జవాబు ఇచ్చారు: "పొరుగువాడు ఎవరి ద్రోహం, అన్యాయం మరియు చెడుకు భయపడతాడో, అతడు (ముమిన్ అంటే విశ్వాసి కాజాలడు)."
అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మరణం సమీపించినప్పుడు, ఆయన చివరిగా ముఖ్యమైన ఉపదేశం చేసినారు: "నమాజును (సలాత్) పాటించండి, మీ కుడి చేయి కలిగి ఉన్న వారిని (మీ ఆధీనంలో ఉన్న మీ సేవకులను, బానిసలను) దయగా చూడండి. నమాజును పాటించండి, మీ ఆధీనంలో ఉన్న వారిని దయగా చూడండి." రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణదశలో కూడా ఆయన గుండెలో ఈ మాటలు ప్రతిధ్వనించాయి, ఆయన నాలుక మీద కూడా ఈ పదాలు చివరి వరకు వినిపించాయి.
అన్నసాయీ కుబరాలో మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చివరి శ్వాసల్లో తన సమాజానికి మాటి మాటికీ ఇచ్చిన ఉపదేశం: "నమాజును (సలాత్) పాటించండి, దాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. అలాగే, మీ ఆధీనంలో ఉన్న సేవకులకు, బానిసులకు వారి హక్కులను ఇవ్వండి, వారిని దయగా చూడండి." ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరణదశలో ఈ మాటలను పదే పదే పునరావృతం చేస్తూ, చివరికి ఆయన గొంతులో ఈ మాటలు మాత్రమే మోగుతూ ఉండినాయి, నాలుక స్పష్టంగా పలకలేని స్థితిలో కూడా ఈ ఉపదేశాన్ని విడిచిపెట్టలేదు.
ఉబాదహ్ బిన్ సామిత్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: బంగారానికి బంగారం, వెండికి వెండి, గోధుమలకు గోధుమలు, జొన్నలకు జొన్నలు, ఖర్జూరాలకు ఖర్జూరాలు, ఉప్పుకు ఉప్పు — ఏదైనా ఒక రకము వస్తువుకు బదులుగా అదే రకము వస్తువు మార్పిడి చేసుకునేటప్పుడు, (ఇచ్చే దానికి మరియు పుచ్చుకునేదానికి) సరిసమాన పరిమాణంలో, ఆ మార్పిడి ప్రత్యక్ష్యంగా తక్షణమే జరగాలి. ఒకవేళ ఈ వస్తువులు వేర్వేరు రకాలకు చెందినవి అయితే, మీకు ఇష్టమైన విధంగా అమ్ముకోవచ్చు (ఉదాహరణకు బంగారాన్ని వెండితో మార్చుకోవడం), కానీ ఆ లావాదేవీ ప్రత్యక్షంగా తక్షణమే జరగాలి.
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రిబాకు అంటే వ్యాపారానికి సంబంధించిన ఆరు వస్తువుల సరైన అమ్మకం - కొనుగోలు పద్ధతిని వివరించారు (దీని వలన ఆ లావాదేవీలో వడ్డీ ప్రమేయం ఉండదు). అవి: బంగారం, వెండి, గోధుమ, బార్లీ, ఖర్జూరం, ఉప్పు. ఒకే రకమైన వస్తువులను కొనుక్కుంటున్నప్పుడు లేదా అమ్ముతున్నప్పుడు (ఉదా: బంగారాన్ని బంగారంతో, వెండిని వెండితో...) ఈ రెండు షరతులు తప్పకుండా పాటించాలి: మొదటిది: పరమాణంలో సమానత్వం: బంగారం మరియు వెండి వంటి బరువుతో కొలిచే వస్తువుల విషయంలో — బరువులో సమానత్వం ఉండాలి. గోధుమలు, బార్లీ, ఖర్జూరాలు, ఉప్పు వంటి కొలతతో కొలిచే వస్తువుల విషయంలో — కొలతలో సమానత్వం ఉండాలి. రెండవది: అమ్మేవాడు మరియు కొనేవాడు వస్తువు మార్పిడిని తక్షణమే చేయాలి, అంటే అమ్మకం - కొనుగోలు మాట జరుగుతున్న స్థలంలో తక్షణమే (కూర్చున్న చోటనే) వస్తు మార్పిడి జరగాలి. ఒకవేళ ఈ వ్యాపార వస్తువులు భిన్నంగా ఉంటే (ఉదాహరణకు బంగారాన్ని వెండికి లేదా ఖర్జూరాలను గోధుమకు అమ్మడం), ఆ అమ్మకం ఒక షరతుతో మాత్రమే అనుమతించబడుతుంది. వస్తు మార్పిడి ఒప్పంద సమయంలోనే తక్షణం జరగాలి. అలా తక్షణం చేయకపోతే, అది నిషేధించబడిన వడ్డీ వ్యాపారంగా పరిగణించబడుతుంది మరియు ఇద్దరూ (విక్రేత మరియు కొనుగోలుదారు) నిషేధించబడిన వడ్డీ (రిబా) పాపంలో పడిపోతారు.
అబూ హురరైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "కిందటి దుస్తులలో ఏదైతే కాలి చీలమండలముల కంటే దిగువగా ఉంటుందో అది నరకాగ్నిలో ఉంటుంది (నరకశిక్షకు గురవుతాడు)"
అల్ బుఖారీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులను ఇలా హెచ్చరించారు — ఒకరు ధరించే క్రింది దుస్తులు అంటే ప్యాంటు, లుంగీ లేదా క్రింది దేహాన్ని కప్పే ఇతర వస్త్రాలు, వారి కాలిచీలమండలము కంటే దిగువగా వేలాడకూడదు. ఎవరైనా తమ క్రింది దుస్తులను కాలిచీలమండలము కంటే దిగువగా వేసుకుంటే, ఆ భాగం నరకాగ్నిలో పడుతుంది. ఇది అతడు చేసిన పనికి శిక్ష.
అమీరుల్ మూమినీన్ (విశ్వాసుల నాయకుడు) అబూ హఫ్స్ ఉమర్ ఇబ్నుల్-ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: "నిశ్చయంగా, ఆచరణలన్నీ (కర్మలన్నీ, పనుల్నీ) సంకల్పాలపైనే (నియ్యతులపైనే) ఆధారపడి ఉంటాయి, మరియు నిశ్చయంగా ప్రతి ఒక్కరికీ వారు సంకల్పించినదే లభిస్తుంది. కాబట్టి, ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కోసం హిజ్రత్ (వలస) చేస్తారో, వారి హిజ్రత్ (వలస) అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కొరకే అవుతుంది (దానికి తగిన ప్రతిఫలం వారికి లభిస్తుంది). మరియు ఎవరైతే ఏదైనా ప్రాపంచిక లాభం పొందడానికో లేదా ఎవరైనా స్త్రీని పెళ్లి చేసుకోవడానికో హిజ్రత్ (వలస) చేస్తారో, అది వారు హిజ్రత్ (వలస) చేసిన దాని కొరకే అవుతుంది."
దీనిని ఇమామా ముహద్దిసీన్ అబూ అబ్దుల్లాహ్ ముహమ్మద్ బిన్ ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం బిన్ ముఘీరా బిన్ బర్దిజ్బహ్ అల్ బుఖారీ, మరియు అబూ హుసైన్ ముస్లిం బిన్ హజ్జాజ్ బిన్ ముస్లిం కుషైరీ నీసాపూరీ తమ సహీహ్ గ్రంథాలలో నమోదు చేసినారు: ఇవి అత్యంత ప్రామాణికమైన రచనలుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు – ఆచరణలు అన్నీ వాటి వెనుక ఉండే సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి. ఈ నియమం సాధారణంగా ఆచరణలు అన్నింటికీ వర్తిస్తుంది – అవి ఆరాధనలకు సంబంధించిన ఆచరణలు గానీ లేక సాధారణ వ్యవహారాలకు సంబంధించిన ఆచరణలు గానీ. కనుక ఎవరైనా తాను చేసే పని ద్వారా ఏదైనా ప్రయోజనం లేదా లాభం పొందాలని సంకల్పించి ఉంటే, అతనికి ఆ ప్రయోజనం తప్ప పుణ్యఫలం ఏమీ లభించదు. అలాగే ఎవరైనా తాను చేసే పని కేవలం సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క సామీప్యం పొందే, ఆయన కరుణ పొందే సంకల్పము తో చేసి ఉంటే, అతనికి దాని ప్రతిఫలం మరియు పుణ్యఫలం లభిస్తాయి, అది తినడం లేక తాగడం లాంటి సాధారణ ఆచరణ అయినా సరే. ఆచరణలలో ‘సంకల్పము’ యొక్క ప్రాధాన్యత మరియు దాని ప్రభావాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ ద్వారా విశదీకరిస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల ‘హిజ్రత్’ (తన స్వస్థలాన్ని వదిలి శాస్వతంగా వేరే కొత్త ప్రదేశానికి వలస వెళ్ళుట) బాహ్యంగా చూడడానికి ఒకేలా కనిపించినా – ఎవరైతే కేవలం తన ప్రభువైన అల్లాహ్ యొక్క సంతుష్ఠి కొరకు, ఆయన సామీప్యం మరియు కరుణ పొందుటకు వలస వెళ్ళిపోవాలని సంకల్పిస్తాడో, అది షరియత్’కు అనుగుణంగా చేయబడిన ‘హిజ్రత్’ (వలస) గా స్వీకరించబడుతుంది. అతని సంకల్పములోని స్వచ్ఛత కారణంగా అతడికి పుణ్యఫలం లభిస్తుంది. అలాగే, ఎవరైతే తాను చేసే హిజ్రత్ (వలస వెళ్ళిపోవుట) ద్వారా ఏదైనా ప్రాపంచిక ప్రయోజనం పొందుట సంకల్పించి ఉంటే, అంటే ఉదాహరణకు ధనం సంపాదించుట కొరకు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుట కొరకు, లేదా వ్యాపారం కొరకు, లేదా ఆ ప్రదేశపు స్త్రీని వివామాడుట కొరకు సంకల్పించి ఉంటే, అతడికి అతడు ఆశించిన ప్రయోజనం తప్ప మరేమీ లబించదు. హిజ్రత్ పుణ్యఫలంలో అతడికి ఏమాత్రమూ భాగం ఉండదు.