





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబూ అబ్దుల్లాహ్ అన్నోమాన్ ఇబ్నె బషీర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “నిశ్చయంగా ‘హలాల్’ ఏమిటో (ఏమి అనుమతించ బడినదో) స్పష్టం చేయబడినది మరియు నిశ్చయంగా ‘హరామ్’ ఏమిటో (ఏమి నిషేధించబడినదో) స్పష్టం చేయబడినది. మరియు ఆ రెంటికి మధ్య ఉన్నవి సందిగ్ధ విషయాలు. వాటి గురించి ప్రజలలో చాలా మందికి (సరియైన) ఙ్ఞానము లేదు. ఎవరైతే సందిగ్ధ విషయాల నుండి దూరంగా ఉన్నాడో అతడు, తన ధర్మాన్ని గురించి బాధ్యతను మరియు తన గౌరవాన్ని స్పష్ట పరుచుకున్నాడు. మరియు ఎవరైతే సందిగ్ధ విషయాలలో పడిపోయాడో అతడు – ప్రవేశం నిషేధించబడిన పొలం గట్టున పశువులను మేపుతున్న పశువుల కాపరి యొక్క పశువులు, ఏదో క్షణంలో పొలం లోనికి వెళ్ళి పోయినట్లుగా – అతడు ‘హరామ్’ లో పడిపోతాడు. గుర్తుంచుకోండి, ప్రతి రాజుగారికి ఒక రక్షిత పొలం (భూమి) ఉంటుంది. గుర్తుంచుకోండి, అల్లాహ్ యొక్క రక్షిత పొలం (భూమి) ఏమిటంటే, ఆయన నిషేధించిన విషయాలు. మరియు గుర్తుంచుకోండి, శరీరంలో ఒక మాంసం ముద్ద ఉన్నది. అది ఆరోగ్యవంతంగా ఉంటే, మిగతా శరీరం అంతా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఒకవేళ అది కలుషితమై పోతే (చెడిపోతే) శరీరం మొత్తం కలుషితమై పోతుంది. అదే అతడి ‘గుండె’.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షరియత్’లో విషయాలకు సంబంధించి ఒక సాధారణ నియమాన్ని గురించి విశదీకరించారు. షరియత్ లో విషయాలు మూడు వర్గాలుగా విభజించ బడినాయి. అవి ‘హలాల్’ విషయాలుగా (అనుమతించబడిన విషయాలుగా) స్పష్టపరచ బడినవి, ‘హరామ్’ విషయాలుగా (నిషేధించబడిన విషయాలుగా) స్పష్టపరచ బడినవి మరియు ‘హలాల్’ వర్గానికి చెందినవా లేదా ‘హరామ్’ వర్గానికి చెందినవా అనే స్పష్టత లేని ‘సందిగ్ధ విషయాలు’. ఆ విషయాలకు సంబంధించి షరియత్ యొక్క ఆదేశం ఏమిటో ప్రజలలో చాలా మందికి తెలియదు. మరి ఎవరైతే అటువంటి సందిగ్ధ విషయాలను (వాటి జోలికి పోకుండా) వదిలివేస్తాడో, అతడు ‘హరామ్’ లో పడిపోకుండా తన ధర్మాన్ని స్థిరంగా, సురక్షితంగా ఉంచుకున్న వాడవుతాడు. అలాగే (తనకు ఙ్ఞానము లేని) సందిగ్ధ విషయాల జోలికి వెళ్ళినందుకు, ప్రజలు అతడిపై వేసే భాండాలనుండి తన గౌరవాన్ని కాపాడుకున్న వాడవుతాడు. మరియు ఎవరైతే అటువంటి సందిగ్ధ విషయాలనుండి దూరంగా ఉండడో, అతడు తనను తాను ‘హరామ్’ లో పడిపోవడానికి లేదా ప్రజల అపవాదులకు, అగౌరవానికి గురిచేసుకున్న వాడవుతాడు. సందిగ్ధ విషయాలకు దూరంగా ఉండకుండా, (తగినంత ఙ్ఞానము లేకపోయినా) వాటి జోలికి వెళ్ళే వాడిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక పశువుల కాపరితో పోల్చినారు. ఆ పశువుల కాపరి తన పశువులను, ఒక ఆసామి యొక్క స్వంత పొలానికి అతి దగ్గరగా మేపుతూ ఉంటాడు; ఏ క్షణమైనా తన పశువులు గట్టుదాటి ఆ పొలములోనికి దూరిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ. అదే విధంగా, ఒక విషయం ‘హలాల్’ వర్గానికి చెందినదా, లేక ‘హరామ్’ వర్గానికి చెందినదా అనే స్పష్టత లేనపుడు, ఆ విషయానికి సంబంధించి షరియత్ యొక్క ఆదేశం ఏమిటి అనే ఙ్ఞానం లేనపుడు దాని జోలికి వెళ్ళే వ్యక్తి, హరాం లో పడిపోయేటంత ప్రమాధకరమైన స్థితికి అతి దగ్గరగా వెళుతున్నాడన్నమాట. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వివరిస్తున్నారు. దేహంలో ఒక మాంసపు ముద్ద (హృదయం) ఉంటుందని, ఒకవేళ అది సరిగా (ఆరోగ్యవంతంగా) ఉంటే అది మొత్తం శరీరపు ఆరోగ్యతకు బాధ్యత వహిస్తుందని; ఒకవేళ అది కల్మష పడిపోతే, కలుషితమైపోతే మొత్తం శరీరం అదేవిధంగా మారడానికి కారణం అవుతుందని వివరిస్తున్నారు.
అబూ హమ్'జహ్ అనస్ ఇబ్నె మా లిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, అతను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సేవకుడు - ఆయన ఇలా అన్నారు: “మీలో ఎవడు తన కొరకు తాను ఇష్టపడేదే తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంతవరకు అతడు నిజమైన విశ్వాసి కాలేడు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వివరిస్తున్నారు – ఒక ముస్లిం, తాను తన స్వయం కొరకు దేనినైతే (ఏఏ విషయాలనైతే) ఇష్టపడతాడో, దానినే (ఆ విషయాలనే) తన సహోదరుని కొరకు కూడా ఇష్టపడనంతవరకు – తన విశ్వాసములో సంపూర్ణత సాధించలేడు. అంటే ఉదాహరణకు: అల్లాహ్’కు విధేయత చూపే ఆచరణలలో, ధార్మిక జీవనానికి సంబంధించి మరియు ప్రాపంచిక జీవనానికి సంబంధించి వివిధ రకాల సత్కార్యాలు చేయుట – మొదలైన వాటిలో తన కొరకు ఏమైతే ఇష్టపడతాడో, తన సోదరుని కొరకు కూడా దానినే ఇష్టపడనంత వరకు; అలాగే తన స్వయం కొరకు దేనినైతే అసహ్యించుకుంటాడో, ఇష్టపడడో, తన సోదరుని కొరకు కూడా దానిని ఇష్టపడనంత వరకు తన విశ్వాసములో సంపూర్ణత సాధించలేడు. ఒకవేళ అతడు తన సోదరునిలో – ధార్మిక విషయాలలో అంటే అల్లాహ్’కు విధేయత చూపుటలో ఏమైనా లోపాలు, కొరత గమనించినట్లయితే అతడు ఆ లోపాలను, కొరతను తొలగించడానికి పాటుపడతాడు; తన సోదరునిలో ఏమైనా మంచిని గమనించినట్లయితే అతడిని ప్రోత్సహిస్తాడు, మార్గదర్శకం చేస్తాడు; ధార్మిక జీవనానికి, ప్రాపంచిక జీవనానినికి సంబంధించిన విషయాలలో అతనికి మంచి సలహాలు ఇస్తాడు.
అబూ మస్ఊద్ ఉఖ్'బహ్ ఇబ్నె అమర్ అల్ అన్సారీ అల్ బద్'రియ్యి రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ప్రాచీన ప్రవచనాల నుండి ప్రజలు నేర్చుకున్న విషయాలలో ఒకటి: “(ఆ పనిలో) సిగ్గు, అవమానం ఏమీ లేకపోయినట్లైతే, మీకు నచ్చినది చేయండి.”
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: పూర్వపు ప్రవక్తల ఆదేశాలను ప్రజలు తమలో తాము వ్యాపింపజేసుకునేవారు; ఆ విధంగా అవి శతాబ్దాల తరబడి ఒక శతాబ్దం తరువాత మరొక శతాబ్దానికి తరువాతి తరాల వారికి వారసత్వంగా సంక్రమిస్తూ వచ్చేవి; చివరికి అవి ఈ ఉమ్మత్ యొక్క తొలితరం వారికి చేరాయి; వాటిలో ఒకటి: ముందుగా నీవు ఏమి చేయాలనుకుంటున్నావో చూడు; అది అవమానకరమైనది, సిగ్గుపడవలసినది కానట్లైతే, అపుడు ఆ పని చేయి; ఒకవేళ అది అవమానకరమైనది, సిగ్గుపడవలసిన పని అయినట్లైతే దానిని వదిలివేయి; ఎందుకంటే అవమానకరమైన పనుల నుండి మనలను నిరోధించేది సచ్ఛీలత, మరియు అణకువ. కనుక అణకువ మరియు సచ్ఛీలత లేని వారు ప్రతి అశ్లీల కార్యములో మరియు ప్రతి చెడులో, ప్రతి దుష్కర్మలో మునిగి పోతారు.
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "మీరు అల్లాహ్ పై సంపూర్ణంగా ఆధారపడినట్లయితే, ఆయన పక్షులకు ఆహారాన్ని ఇచ్చే విధంగానే మీకు కూడా ఇస్తాడు. అవి ఉదయం ఖాళీ కడుపుతో బయలుదేరి, సాయంత్రం నిండిన కడుపుతో తిరిగి వస్తాయి."ఏర్పాటు
ఇమామ్ అహ్మద్, అత్తిర్మిదీ, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్, మరియు ఇబ్న్ హిబ్బాన్ తన సహీహ్ లో మరియు హాకిమ్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధిస్తున్నారు – ప్రాపంచిక వ్యవహారాలలో గానీ లేక ధర్మానికి సంబంధించిన వ్యవహారాలలో గాని - ప్రయోజనం పొందేందుకు, కీడును లేక హాని కలుగజేసే వాటిని దూరం చేసేందుకు - మనం అన్ని వేళలా అల్లాహ్ పై ‘తవక్కల్’ను (దృఢమైన సంపూర్ణ నమ్మకాన్ని, భరోసాను) కలిగి ఉండాలి. ఎందుకంటే, ఎవరూ కూడా దేనినీ ప్రసాదించలేరు, దేనినీ ఆపి ఉంచలేరు, హాని కలిగించలేరు లేదా ప్రయోజనం కలిగించలేరు, కేవలం పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ తప్ప. ఇంకా ఇలా తెలియజేస్తున్నారు – ప్రయోజనం పొందడానికి లేదా కీడును, హానిని దూరం చేయడానికి వినియోగించే వనరులను, సాధనాలను, విధానాలను అల్లాహ్ నందు పూర్తి ‘తవక్కల్’తో (సంపూర్ణ విశ్వాసముతో, నమ్మకముతో, భరోసాతో) వినియోగించాలి. మనం ఎపుడైతే అలా చేస్తామో, పక్షులకు ప్రసాదించిన మాదిరిగా అల్లాహ్ మనకూ రిజ్’ఖ్ ను (ఉపాధిని) ప్రసాదిస్తాడు; ఎలాగైతే అవి ఉదయం తమ గూళ్ళ నుండి ఆకలితో బయలుదేరి, సాయంత్రం నిండిన పొట్టలతో సంతృప్తిగా తిరిగి వస్తాయో ఆ విధంగా. పక్షుల యొక్క ఈ చర్య ఉపాధిని పొందడానికి తగిన సాధనాలను వినియోగించాలి అనడానికి ఒక ఉదాహరణ, అంతే గానీ కేవలం భరోసాతో సోమరిపోతుగా ఉండి పోవడం తగదు.
అన్నవ్వాస్ ఇబ్నె సిమ్'ఆన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "పుణ్యం (అల్-బిర్ర్) అంటే మంచి ప్రవర్తన, మరియు పాపం (అల్-ఇథమ్) అంటే నీ హృదయంలో సందేహాన్ని కలిగించి, దానిని ప్రజలు తెలుసుకోవడాన్ని నీవు ఇష్టపడనిది." వాబిసహ్ ఇబ్నె మఅ'బద్ రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించబడినది, అతను ఇలా అన్నారు: "నేను అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళినప్పుడు, ఆయన ఇలా అన్నారు: 'నీవు పుణ్యం (బిర్ర్) మరియు పాపం (ఇథమ్) గురించి అడగడానికి వచ్చావు కదా?' నేను 'అవును' అన్నాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు: 'నీ హృదయాన్ని అడుగు. పుణ్యం అంటే మనస్సు ప్రశాంతంగా ఉన్నది మరియు హృదయం ప్రశాంతంగా ఉన్నది. మరియు పాపం అంటే నీ మనస్సు లో సందేహాన్ని కలిగించి, నీ హృదయంలో అటూఇటూ ఊగిసలాడేది, ప్రజలు నీకు తీర్పు ఇచ్చినా, మళ్ళీ మళ్ళీ తీర్పు ఇచ్చినా సరే.'"
మొదటి హదీథు: దీనిని ముస్లిం నమోదు చేసినారు:, మరియు రెండవ హదీథు: దీనిని అహ్మద్ మరియు అద్దార్మీ నమోదు చేసినారు:ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుణ్యం (అల్-బిర్ర్) మరియు పాపం (అల్-ఇథమ్) గురించి తెలియజేస్తూ, ఇలా అన్నారు: పుణ్యం యొక్క అత్యంత గొప్ప లక్షణం - అల్లాహ్ పట్ల భయభక్తులతో మరియు ప్రజలతో సహనంతో, కోపాన్ని తగ్గించుకొని, ప్రసన్నంగా, మంచి మాటలతో, సంబంధాలను కొనసాగించడం, విధేయత చూపడం, దయతో, మంచితనంతో మరియు మంచి సహవాసంతో వ్యవహరించడం. మరియు పుణ్యం అంటే హృదయం మరియు మనస్సు ప్రశాంతంగా ఉన్నది. పాపం (అల్-ఇథమ్) విషయానికి వస్తే, అది హృదయం ప్రశాంతంగా ఉండకుండా, మనస్సులో సందేహమును కలిగించి, అటూఇటూ ఊగిసలాడేలా చేస్తుంది. అది పాపమేమోనని హృదయంలో సందేహం మరియు భయం కలుగుతుంది. అంతేకాకుండా, అది ఒక చెడు పని కావడం వల్ల, ప్రజల దృష్టిలోకి, ముఖ్యంగా గొప్ప వ్యక్తులు మరియు పరిపూర్ణమైన వారి దృష్టిలోకి రావడం నీవు ఇష్టపడవు. ఎందుకంటే, మనస్సు సహజంగానే తన మంచి పనులను ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటుంది. కాబట్టి, అలాంటి నీ పనులను ప్రజలు తెలుసుకోవడాన్ని ద్వేషిస్తే, అది పాపం, దానిలో ఏ మంచీ లేదు. ప్రజలు నీకు తీర్పు ఇచ్చినా, నీ హృదయంలో సందేహం ఉన్నంత వరకు వారి తీర్పును అంగీకరించకు. ఎందుకంటే, సందేహం సరైనదైనప్పుడు మరియు తీర్పు ఇచ్చే వ్యక్తికి జ్ఞానం లేనప్పుడు ఆ తీర్పు అనుమానాన్ని తొలగించదు. అయితే, తీర్పు షరియా ఆధారంగా ఇచ్చినట్లయితే, ఆ వ్యక్తి తన హృదయం ప్రశాంతంగా లేకపోయినప్పటికీ, ఆ తీర్పును పాటించడం తప్పనిసరి.
అబ్దుల్లాహ్ ఇబ్నె బుస్ర్ రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించబడినది, అతను ఇలా అన్నారు: "ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఇలా అన్నాడు: 'ఓ అల్లాహ్ యొక్క ప్రవక్తా! ఇస్లాం యొక్క నియమాలు మాకు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మేము గట్టిగా పట్టుకోగలిగే ఒక సంక్షిప్త మార్గాన్ని తెలియజేయండి.' అప్పుడు ఆయన ఇలా అన్నారు:" "నీ నాలుక అల్లాహ్ యొక్క స్మరణతో తడిగా (సజీవంగా) ఉండేలా చూసుకో." ముఆద్ ఇబ్నె జబల్ రదియల్లాహు అన్హు నుండి ఉల్లేఖించబడిన మరొక హదీథులో ఇలా ఉంది: "నేను అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి చివరిగా వేరు అయినప్పుడు, నేను ఇలా అడిగాను: 'ఏ పని ఉత్తమమైనది మరియు అల్లాహ్ కు అత్యంత దగ్గరగా ఉంటుంది?' అప్పుడు ఆయన ఇలా అన్నారు: 'నీవు మరణించేటప్పుడు నీ నాలుక అల్లాహ్ యొక్క స్మరణతో తడిగా ఉండడం.'"
అహ్మద్, అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు ఇబ్న్ హిబ్బాన్ నమోదు చేసినారు:ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి తన శారీరక బలహీనత కారణంగా స్వచ్ఛంద ఆరాధనలు ఆచరించుట తనపై భారంగా మారిందని మొర పెట్టుకున్నాడు. తరువాత అతడు తాను అంటి పెట్టుకుని ఉండగలిగేలా, తద్వారా తనకు గొప్ప ప్రతిఫలం లభించేలా తనకు ఏదైనా ఒక తేలిక ఆచరణను బోధించమని అర్థించాడు. కనుక ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి అన్ని సమయాలలో, మరియు అన్ని పరిస్థితులలో నిరంతరం సర్వోన్నతుడైన అల్లాహ్ ‘తస్బీహ్’ అంటే - (సుబ్’హానల్లాహ్ – అల్లాహ్ పరమ పవిత్రుడు); ‘తమ్’హీద్’ (అల్’ హందులిల్లాహ్ – స్తోత్రములన్నీ కేవలం అల్లాహ్ కొరకే); ‘ఇస్తిగ్’ఫార్’ (అస్తగ్’ఫిరుల్లాహ్ – ఓ అల్లాహ్ నన్ను క్షమించు); ‘దుఆ’ చేయుట; మరియు మొరపెట్టుకొనుట - ఈ విధంగా అల్లాహ్’ను కీర్తించడం, ప్రశంసించడం; క్షమాపణ కోరడం, ప్రార్థించడం మొదలైన వాటి ద్వారా తన నాలుకను నిరంతరం తాజాగా మరియు చురుకుగా ఉంచుకోమని సలహా ఇచ్చినారు.
అబూ బక్రహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పెద్ద పాపములలోకెల్లా అతి పెద్ద పాపములు ఏమిటో మీకు తెలుపనా?” అలా మూడు సార్లు పలికారు. దానికి మేము “తప్పనిసరిగా చెప్పండి ఓ రసూలుల్లాహ్” అని అన్నాము. అపుడు ఆయన “అల్లాహ్ కు సాటి కల్పించుట, తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుట మరియు వారితో అమర్యాదగా ప్రవర్తించుట” అలా పలికి, అప్పటివరకు చేరగిలబడి కూర్చుని ఉన్న ఆయన నిటారుగా కూర్చుని “అబద్ధమాడుట మరియు అబద్ధపు సాక్ష్యము చెప్పుట” అని అన్నారు. ఈ మాటలను ఆయన ఆగకుండా పలుమార్లు పలుకుతూనే ఉన్నారు. ఎంతగా అంటే “వారు (ఇకనైనా) మౌనంగా ఉంటే బాగుండును” అని మేము భావించ సాగినాము.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు అతి ఘోరమైన పాపముల గురించి తెలుపుతూ, ఈ మూడు పాపములను ప్రస్తావించినారు: 1. ఇతరులను అల్లాహ్ కు సమానులుగా చేయడం – అంటే ఏవైనా ఆరాధనలను అల్లాహ్ కు గాక ఇతరులకు అంకితం చేయడం, ఆ విధంగా అల్లాహ్ యొక్క దైవత్వములో, ఆయన ప్రభుతలో (ఆయన ప్రభువు హోదాలో), ఆయన నామములలో మరియు ఆయన గుణగణాలలో ఇతరులను ఆయనకు సమానులుగా లేదా సాటిగా చేయడం, వారిని లేదా వాటిని ఆయనకు భాగస్వాములుగా చేయడం. 2. తల్లిదండ్రుల పట్ల అవిధేయత: అంటే మాటలలో గానీ, చేతలలో గానీ తల్లిదండ్రులకు హాని కలిగేలా, బాధ కలిగేలా ప్రవర్తించడం, వారి పట్ల ప్రేమాభిమానాలతో, దయతో మెలగకుండా వారిని పట్టించుకోక పోవడం, వదిలివేయడం. 3. అబద్ధాలాడుట మరియు అబద్ధపు సాక్ష్యము చెప్పుట: ఇది ఒకరి నుండి ధనం లేదా భూమి తీసుకుని, దానిని అతనికి తిరిగి ఇవ్వకుండా కాజేసే ఉద్దేశ్యంతో, అలాగే ఒకరి గౌరవాన్ని, ప్రాభవాన్ని మంటగలిపే ఉద్దేశ్యంతో చెప్పే ఏ అబద్ధమైనా, తప్పుడు మాటైనా, వాంగ్మూలమైనా, ప్రకటనైనా లేక అలాంటిది ఏదైనా దీని క్రిందకు వస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘అబద్ధాలాడుట మరియు అబద్ధపు సాక్ష్యము చెప్పుట’ ను గురించి పలుమార్లు హెచ్చరించడం, సమాజంపై దాని దుష్పరిణామాలను చూసి, దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటలలో వ్యక్తమయ్యే వ్యాకులతను చూసి సహాబాలు "అయ్యో! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇకనైనా ఆపితే బాగుండు" అని అనుకో సాగినారు.
మిఖ్'దామ్ బిన్ మ’అదీ కరిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఒక వ్యక్తి తన తోటి సోదరుడిని ప్రేమిస్తున్నట్లయితే, ఆ వ్యక్తి తను ప్రేమిస్తున్న విషయాన్ని అతనికి తెలియ జేయాలి”.
అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ కుబరాలో మరియు అహ్మద్ నమోదు చేసినారు:పరస్పరం విశ్వాసుల మధ్య ఉండే సంబంధాన్ని దృఢం గావించే మరియు వారి మధ్య ప్రేమను వ్యాపింప జేసే విషయాలలో ఒక దానిని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ హదీథులో వివరించినారు – అదేమిటంటే, ఒకవేళ ఎవరైనా తన సోదరుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే, ఆ విషయాన్ని అతడికి తెలియ జేయటం.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ ఇబ్న్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “అల్-కబాయిర్ (ఘోరమైన పాపములు, పెద్ద పాపములు) ఏమిటంటే: అల్లాహ్ కు సాటి కల్పించుట (అల్లాహ్ కు సరిసమానులు చేయుట), తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుట, హత్య చేయుట మరియు ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధపు సాక్ష్యము చెప్పుట.”
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘ఘోరమైన పాపములను’ (అల్ కబాయిర్) గురించి తెలియజేస్తున్నారు. వాటికి పాల్బడిన వానిని ఈ ప్రపంచములో గానీ, పరలోకములో గానీ అతి కఠినమైన శిక్షలు ఉన్నాయని హెచ్చరించడం జరిగింది. వాటిలో మొదటిది: “అల్లాహ్ కు సాటి కల్పించుట (ఇతరులను అల్లాహ్ కు సరిసమానులుగా చేయుట): అంటే ఆరాధనలలో ఏ ఆరాధననైనా అల్లాహ్ కు గాక ఇతరులకు చేయుట (అల్లాహ్ ను గాక ఇతరులను ఆరాధించుట), అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకమైన ఆయన దైవత్వములో, ఆయన ప్రభుతలో, ఆయన నామములలో, ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన ఆయన అపూర్వ గుణగణాలలో ఇతరులను ఆయనకు సమానులుగా చేయుట, నిలబెట్టుట. రెండవది “తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుట”: అంటే మాటల ద్వారా గానీ లేక చేతల ద్వారా గానీ, తల్లిదండ్రులకు కష్టము కలిగించే, హాని లేక కీడు కలిగించే ప్రతిదీ దీని క్రిందకు వస్తుంది; అలాగే వారి పట్ల ప్రేమగా ఉండడాన్ని, వారి పట్ల గౌరవంగా, మర్యాదగా, కరుణతో ప్రవర్తించడాన్ని నిర్లక్ష్యం చేయుట, వదిలి వేయుట. మూడవది “ఎవరి ప్రాణాన్నైనా తీయడం – హత్య చేయడం”: అంటే, షరియత్ పరిధిలోని కారణాలలో ఏ కారణమూ లేకుండా ఎవరి ప్రాణాన్నైనా తీయడం, హత్య చేయడం. దౌర్జన్యానికి పాల్బడి లేదా దాడి చేసి లేదా అక్రమంగా ఎవరి ప్రాణాన్నైనా తీయడం, హత్య చేయడం. నాలుగవది “ఉద్దేశ్యపూర్వకముగా అబద్ధపు సాక్ష్యము చెప్పుట”: అంటే తాను చెబుతున్నది అబద్ధమని తెలిసీ, అది నిజమని ఒట్టు పెట్టుకొనుట, ప్రమాణము చేయుట వంటివి దీని క్రిందకు వస్తాయి. ఈ ఆచరణ అతడిని మహాపాపంలో పడేలా చేస్తుంది, లేదా నరకాగ్నిలో పడేలా చేస్తుంది.