





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం , “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే వితంతువు యొక్క మరియు అక్కరగొన్న వాని యొక్క (మిస్కీన్ యొక్క) మంచిచెడ్డలు చూసుకుంటాడో అతడు అల్లాహ్ మార్గములో జిహాదు చేసిన వానితో (అల్లాహ్ మార్గములో శ్రమించిన వానితో) సమానము.” అబీ హురైరహ్ (రదియల్లాహు అన్హు) కొనసాగిస్తూ ఇంకా ఇలా అన్నారు: “లేక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “(నిరంతరం) రాత్రి అంతా నమాజులో గడిపి, ఉదయం ఉపవాసములు పాటించే వానితో సమానము.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతున్నారు: ఒక వితంతువు - ఆమె భర్త చనిపోయాడు, ఆమె మంచి చెడ్డలు చూడడానికి ఆమె తరఫున ఎవరూ లేరు – అటువంటి వితంతువు యొక్క, మరియు నిరుపేదలు, అక్కరలు గల పేదవారు – ఇటువంటి వారి యొక్క మంచిచెడ్డలు, కేవలం అల్లాహ్ నుంచి మాత్రమే ప్రతిఫలం ఆశిస్తూ, ఎవరైతే చూస్తారో, అందు కొరకు వారిపై ఖర్చు చేస్తారో, అటువంటి వాడు ప్రతిఫలములో అల్లాహ్ మార్గములో జిహాద్ చేసిన వానికి (శ్రమించిన వానికి), లేదా రాత్రుళ్ళు తహజ్జుద్ నమాజులో గడిపినా అలుపు లేకుండా, ఇఫ్తార్ లేకుండా ఉపవాసం పాటించేవానితో సమానం.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “వినాశకరమైన ఏడు పాపముల నుండి దూరంగా ఉండండి.” దానికి వారు (ఆయన సహచరులు) ఇలా అడిగారు “అవి ఏమిటి ఓ ప్రవక్తా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ కు సాటి కల్పించుట; చేతబడి; చట్టబధ్ధమైన కారణం ఉంటే తప్ప “ప్రాణము తీయరాదు” అని అల్లాహ్ నిషేధించిన ప్రాణము తీయుట; వడ్డీ తినుట; అనాథల సొమ్ము తినుట; యుధ్ధభూమి నుండి వెనుదిరిగి పారిపోవుట; శీలవంతులు, అమాయకులు మరియు విశ్వాసులైన స్త్రీలపై అపనిందలు వేయుట”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్’ను (తన సమాజాన్ని) ఏడు వినాశకరమైన, ఘోరమైన నేరములు మరియు పాపముల నుండి దూరంగా ఉండమని ఆదేశించారు. “అవి ఏమిటి?” అని ప్రశ్నించగా, “అవి ఇవి” అని ఆయన వాటి గురించి వివరించినారు. మొదటిది: అల్లాహ్’కు సాటి కల్పించుట – అంటే, అది ఏ రూపంలోనైనా సరే ఆయన స్థానములో మరొకరిని తీసుకొనుట, ఏ రూపములోనైనా సరే అల్లాహ్’కు మరొకరితో సాదృశ్యము కల్పించుట, మరొకరిని అల్లాహ్’తో పోల్చుట, పరమ పవిత్రుడైన అల్లాహ్ కొరకు గాక ఏ ఆరాధననైనా వేరొకరి కొరకు (మిధ్యాదైవాల కొరకు) ఆచరించుట, మరియు బహుదైవారాధనతో ఆరంభించారు. ఎందుకంటే అది అతిపెద్ద పాపము. రెండవది: చేతబడి. దీనిలో (చేతబడిలో భాగంగా) దారములపై ముడులు వేయుట, మంత్రతంత్రాలు ఉచ్ఛరించుట, చేతబడి కొరకు మందులు మాకులు ఉపయోగించుట, ధూపదీపాలు వేయుట, తద్వారా చేతబడి చేయబడిన వాని ప్రాణం పోయేలా చేయుట లేదా అతణ్ణి వ్యాధికి గురి చేయుట – ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ షైతాను చర్యలు. వీటిలో చాలా పనులు కేవలం బహుదైవారాధనలకు పాల్బడడం ద్వారా మరియు తనకు ప్రియమైన ఏదో ఒక పైశాచిక ఆత్మలకు సమర్పించుకోవడం ద్వారా తప్ప సాధ్యం కావు. మూడవది: దేశాధినేత ద్వారా షరియత్ పరమైన ఔచిత్యము అమలు చేయబడితే తప్ప, “చంపరాదు” అని అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణినైనా చంపుట. నాలుగవది: ప్రత్యక్షంగా వడ్డీ లావాదేవీలలో పాల్గొంటూ లేదా మరేదైనా పరోక్ష విధానాలతో వడ్డీల ద్వారా లాభం పొందుతూ, వడ్డీ వ్యవహారాలను నిర్వహించడం. ఐదవది: తండ్రి చనిపోయి, యుక్తవయస్సుకు ఇంకా చేరని అనాథల సొమ్మును అన్యాయముగా తినుట. ఆరవది: అవిశ్వాసులతో జరుగుతున్న యుధ్ధంలో యుద్ధభూమి నుండి వెన్నుచూపి పారిపోవుట. ఏడవది: శీలవతులైన స్త్రీలపై వ్యభిచారపు నిందారోపణలు చేయుట, అదే విధంగా అమాయక పురుషులను కూడా దోషులుగా నిలబెట్టుట.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “మీ ఇళ్ళను సమాధుల మాదిరి కానివ్వకండి. మరియు నా సమాధిని ఉత్సవ ప్రదేశంగా చేయకండి మరియు నాపై అల్లాహ్ అశీస్సుల కొరకు ప్రార్థించండి (నాపై దరూద్ పఠించండి), మీరెక్కడ ఉన్నా అది నన్ను చేరుతుంది”.
అబూదావూద్ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇళ్ళలో సలాహ్ (నమాజు) ఆచరించకుండా, వాటిని స్మశానాల మాదిరి అనిపించేలా చేయడాన్ని నిషేధించినారు. ఎందుకంటే స్మశానాలలో నమాజులు చదువబడవు. తన సమాధిని మాటిమాటికి దర్శించడాన్ని, ఒక అలవాటుగా అక్కడ మాటిమాటికీ సమావేశం కావడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారు. ఎందుకంటే అలా చేయడం షిర్క్’నకు దారి తీసే కారణాలలో ఒకటి కాగలదు. ఈ భూప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నా, తనపై (అల్లాహ్ యొక్క) శాంతి కొరకు ప్రార్థించమని (దరూద్ పఠించమని) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశిస్తున్నారు. ఆ దరూద్’లు ఎంత దూరం నుండైనా, దగ్గరి నుండైనా ఒకేలా తనకు చేరుతాయని తెలియ జేస్తున్నారు. కనుక వారి సమాధిని మాటిమాటికి దర్శించడానికి తొందర పడవలసిన అవసరం లేదు.
సహల్ బిన్ సాద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే తన రెండు దవడల మధ్య ఉన్న దాని విషయంలోనూ మరియు తన రెండు తొడల మధ్య ఉన్న దాని విషయంలోనూ నాకు హామీ ఇస్తారో, అతనికి నేను స్వర్గం యొక్క హామీ ఇస్తున్నాను”.
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు విషయాలను గురించి తెలియజేస్తున్నారు – ఒక ముస్లిం, ఒకవేళ ఈ రెండు విషయాల పట్ల తనను తాను కట్టడి చేసుకున్నట్లయితే, అతడు స్వర్గంలోనికి ప్రవేశిస్తాడు అని. మొదటిది: అల్లాహ్ ఆగ్రహానికి గురి చేసే మాటలు పలకడం నుంచి నాలుకను కట్టడి చేసుకోవడం. రెండవది: అశ్లీలతకు పాల్బడుట నుండి తన మర్మాంగాలను రక్షించుకోవడం. ఎందుకంటే, పాపకార్యాలు ఎక్కువగా ఈ రెండు అంగాల కారణంగానే జరుగుతాయి.
జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను: ‘జిక్ర్’ లలో (అల్లాహ్’ను ధ్యానించు విషయాలలో) అత్యుత్తమమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్” (వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, కేవలం అల్లాహ్ తప్ప) అని పలుకుట మరియు దుఆలలో అత్యుత్తమమైనది “అల్-హందులిల్లాహ్” (సకల స్తోత్రములు కేవలం అల్లాహ్ కొరకే) అని పలుకుట”.
అత్తిర్మిదీ, అన్నసాయీ కుబరాలో మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహ్ యొక్క ధ్యానంలో (స్మరణ వాక్యాలలో) అత్యుత్తమమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్” అనడం అని తెలియ జేస్తున్నారు. దాని అర్థము ‘నిజ ఆరాధ్యుడు, అన్ని ఆరాధనలకు ఏకైక అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే’ అని. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వేడుకోలు వచనాలలో అత్యుత్తమమైనది “అల్ హందులిల్లాహ్” అనడం అని తెలియ జేస్తున్నారు. దాని అర్థం సకల ప్రశంసలు, సకల స్తోత్రము, సకల కృతజ్ఞతలు కేవలం అల్లాహ్ కే శోభిస్తాయి అని. ఈ వాక్యము ‘దాత, ప్రధాత, ప్రసాదించేవాడు పరమ పవిత్రుడైన అల్లాహ్ మాత్రమే’ అనే భావాన్ని గుర్తింపజేస్తుంది. ఆయనకు చెందిన గుణగణాలలో ఆయన సంపూర్ణుడు అనే విషయం తెలియ జేస్తున్నది.
అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “మీలో (ప్రతి) ఒకరికి స్వర్గము అతని కాలి చెప్పు యొక్క తోలుపట్ట కంటే దగ్గరగా ఉన్నది, అలాగే నరకము కూడా దాని మాదిరిగానే (అతనికి దగ్గరగా) ఉన్నది”.
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గము మరియు నరకము మనిషికి ఎంత దగ్గరగా ఉన్నాయో తెలియ జేస్తున్నారు. అవి మనిషి కాలి పై (కట్టబడి) ఉండే తోలుపట్ట అంత దగ్గరగా ఉంటాయి. అతడు మహోన్నతుడైన అల్లాహ్ విధేయతలో ఆయనకు ప్రీతికరమైన పనులలో ఏదో ఒకటి చేస్తాడు, తద్వారా అతడు స్వర్గం లోనికి ప్రవేశిస్తాడు; లేదా ఏదైనా పాపపు పనికి పాల్బడతాడు, అది అతడు నరకం లోనికి ప్రవేశించడానికి కారణం అవుతుంది.
అబీ సయీద్ అల్ ఖుద్రీ మరియు అబీ హురైరహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక ముస్లింకు ఎలాంటి అలసట, అనారోగ్యం, చింత, దుఃఖం, హాని లేదా వేదన కలిగినా, చివరికి ముల్లు గుచ్చుకున్నా - అల్లాహ్ అతని పాపాలలో కొన్నింటిని క్షమించి వేస్తాడు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఒక విశ్వాసికి (ముస్లిమునకు) ఎలాంటి అలసట, అనారోగ్యం, చింత, దుఃఖం, కష్టం, హాని లేదా వేదన కలిగినా, పస్తులు ఉండవలసి వచ్చినా, చివరికి ముల్లు గుచ్చుకున్నా – అది అతని పాపాలకు పరిహారంగా మారుతుంది, మరియు అతని కొరకు పాపాలనుండి ఉపశమనంగా పరిణమిస్తుంది.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నరకము కోరికలు, వ్యామోహముల నడుమ ఉన్నది మరియు స్వర్గము కష్టము, ప్రయాసల నడుమ ఉన్నది”.
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నరకాన్ని చుట్టి ఉన్న విషయాల గురించి వివరిస్తున్నారు. అవి, మనసు వాంఛించే మరియు కావాలని కోరుకునే, నిషేధించబడిన విషయాలు మరియు తాను విధిగా ఆచరించ వలసిన విషయాలను నిర్లక్ష్యం చేసి, వాటిని వదిలివేయడం వంటివి అని వివరిస్తున్నారు. ఎవరైతే తన చపల చిత్తాన్ని మరియు దాని వాంఛలను అనుసరిస్తాడో, అతడు నరకానికి పాతృడు అవుతాడు. మరియు స్వర్గము, మనసు (సాధారణంగా) ఇష్టపడని విషయాలతో – అంటే, ఉదాహరణకు, (షరియత్’లో) ఆదేశించబడిన విషయాల పట్ల సహనం కలిగి ఉండి, వాటిని నిరంతరం పట్టుదలతో ఆచరించుట, (షరియత్) నిషేధించిన విషయాలను త్యజించుట మరియు అలా త్యజించడం పట్ల సహనం వహించుట మొదలైన విషయాలతో ఆవరించబడి ఉన్నది. ఒకవేళ ఎవరైతే వీటిని ఎదుర్కోవడానికి మరియు వీటి పట్ల నిరంతరం కృషి చేయడానికి సిధ్ధపడతాడో, అతడు స్వర్గములో ప్రవేశించడానికి పాత్రుడు అవుతాడు.
అబీ హురైరాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా నేను విన్నాను: “ఒక ముస్లిమునకు తోటి ముస్లిముపై ఐదు హక్కులు ఉన్నాయి: సలామునకు జవాబిచ్చుట, వ్యాధిగ్రస్తుని పరామర్శించుట, మృతులను శ్మశానమునకు కొనిపోవునపుడు, స్మశానము వరకు అనుసరించుట, ఎవరైనా ఆహ్వానించినట్లయితే వారి ఆహ్వానాన్ని మన్నించుట మరియు ఎవరైనా తుమ్మి నపుడు (అతడు అల్-హందులిల్లాహ్ అని పలికినట్లయితే) అతడికి ‘యర్హకుముల్లాహ్’ అని సమాధానమిచ్చుట”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లిమునకు తన తోటి సోదర ముస్లింపై కొన్ని హక్కులు ఉన్నాయని వివరిస్తున్నారు. ఆ హక్కులలో మొదటిది, మీపై శాంతి కురియాలని మీకు సలాముతో అభివాదం చేసిన వ్యక్తికి మీరు జవాబిచ్చుట. రెండవ హక్కు: వ్యాధిగ్రస్తుడై ఉన్న ముస్లిం సోదరుని చూచేందుకు అతని వద్దకు వెళ్ళుట మరియు అతడిని పరామర్శించుట. మూడవ హక్కు: ఎవరైనా ముస్లిం సోదరుడు చనిపోతే, అతడి జనాజాను (శవయాత్ర)ను అతని ఇంటి నుండి, జనాజా నమాజు కొరకు మస్జిదు వరకు, నమాజు తరువాత అతడిని ఖననం చేయుట కొరకు స్మశానము వరకు అనుసరించుట. నాలుగవ హక్కు: ఎవరైనా విందు భోజనానికి ఆహ్వానిస్తే - ఉదాహరణకు, వలిమా విందు లేదా అటువంటి ఇతర విందులు – ఆ ఆహ్వానాన్ని స్వీకరించుట. ఐదవ హక్కు: తుమ్మిన వ్యక్తికి జవాబిచ్చుట; ఒకవేళ తుమ్మిన వ్యక్తి (అల్ హందులిల్లాహ్ అని) అల్లాహ్ కు స్తోత్రములు పలికినట్లయితే, అతడికి “అల్లాహ్ నిన్ను కరుణించుగాక” (యర్హముకల్లాహ్) అని జవాబు ఇవ్వాలి, అపుడు తుమ్మిన వ్యక్తి “అల్లాహ్ మీకు మార్గదర్శకత్వం చేయుగాక మరియు మీ వ్యవహారములను చక్కదిద్దుగాక” (యహ్’దీకుముల్లాహు, వ యుస్లిహు బాలకుం) అని పలకాలి.