Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way






























Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
ఈ హదీసు ద్వారా మనకు తెలుస్తున్న విషయాలు: ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి "నేను సవారీ అయి వచ్చిన జంతువు చనిపోయింది. కనుక నాకొక సవారీ జంతువును సమకూర్చండి" అని అర్థించాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం అతడిని క్షమించమని అన్నారు, ఎందుకంటే ఆయన వద్ద అతడికి సవారీగా ఇవ్వడానికి ఏమీ లేదు కనుక. అక్కడే హాజరై ఉన్నవారిలో ఒకతను "ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వ సల్లం, నేను ఇతనికి సవారీ జంతువును ఎవరు ఇవ్వగలరో ఆయనను చూపిస్తాను" అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం "మంచిపని చేసే వానితో పాటు (సవారీ జంతువును ఇచ్చే వానితో పాటు) ఇతడు కూడా పుణ్యఫలం లో భాగస్వామి అవుతాడు, ఎందుకంటే, అగత్యపరుణ్ణి అతని అవసరం తీర్చే వాని వైపునకు మార్గదర్శనం చేసినాడు కనుక" అన్నారు.
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బంధుత్వాలను త్రెంచుకునే వాని గురించి వివరిస్తున్నారు. ఎవరైతే తన బంధువులతో బంధుత్వాన్ని త్రెంచుకుంటాడో లేక వారి హక్కులను వారికి ఇవ్వకుండా ఉల్లంఘిస్తాడో లేక వారికి హాని కలిగించడం, వారితో అవమానకరంగా ప్రవర్తించడం చేస్తాడో, అటువంటి వాడు స్వర్గం’లో ప్రవేశించడానికి అర్హుడు కాడు.
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అపోహలను కల్పించేవాని గురించి వివరిస్తున్నారు. ‘నమీమా’ అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య (లేక రెండు సమూహాల మధ్య, రెండు జాతుల మధ్య) కలహాలు రేకెత్తించే ఉద్దేశ్యంతో ఒకరి మాటలను మరొకరికి చేరవేయుట. అలా చేయడం వలన వారి మధ్య అపోహలు ఉత్పన్నమవుతాయి. అవి కలహాలకు, తద్వారా అశాంతికి దారి తీస్తాయి. అటువంటి వారు కఠినమైన శిక్షకు పాత్రులు. స్వర్గంలోనికి ప్రవేశించడానికి అర్హులు కారు.
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బంధుత్వాలను నిలిపి ఉంచుకొనుటను గురించి ఉద్బోధిస్తున్నారు. బంధుత్వాలను నిలిపి ఉంచుకొనుట, కొనసాగించుట అనేది తరుచుగా వెళ్ళి వారిని కలుస్తూ ఉండుట, వారితో దయతో, స్నేహంతో మెలుగుట, వారికి అవసరమైనప్పుడు వారి కొరకు శారీరకంగా శ్రమ పడుట, ఆర్థికంగా సహాయం అందించుట మొదలైన వాటి వలన జరుగుతుంది. ఆ విధంగా బంధుత్వాలను నిలిపి ఉంచుకోవడం, కొనసాగించడం జీవనోపాధి విస్తరించడానికి మరియు జీవిత కాలం పొడిగించ బడడానికి కారణం అవుతుంది.
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దా చేసినపుడు దాసుడు తన ప్రభువుకు అతి చేరువలో ఉంటాడు అని; అలాగే, దాసుడు అల్లాహ్ కు విధేయత చూపుతూ అణకువతో, వినమ్రతతో తన శరీరంలోని సమున్నతమైన తల భాగాన్ని నేలకు ఆనించి ‘సజ్దా’ చేస్తాడు అని తెలియజేస్తున్నారు. సజ్దా స్థితిలో అల్లాహ్’ను మరింత ఎక్కువగా వేడుకోండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశిస్తున్నారు, సజ్దా చేయుటలో దాసుడు చూపే విధేయత, వినమ్రత, అణకువ అతడి వేడుకోలుతో మమేకం కావాలి.
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వివరిస్తున్నారు: అల్లాహ్ ను మరియు అంతిమ దినమును విశ్వసించుట – దాసుడు చివరికి మరలవలసినది ఈ రెండు విషయాల వైపునకే. అక్కడ అతని విశ్వాసము మరియు ఆచరణల ఆధారంగా అతనికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. కనుక ఎవరైతే అల్లాహ్ ను మరియు అంతిమ దినమును విశ్వసిస్తారో, వారు ఈ లక్షణాలు కలిగి ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్బోధిస్తున్నారు. మొదటిది: మంచి మాటలు పలుకుట/మాట్లాడుట: ఇందులో అల్లాహ్ నామమును స్మరించుట, ఉదాహరణకు ‘తహ్లీల్’ (లా ఇలాహ ఇల్లాల్లాహ్), ‘తక్బీర్’ (అల్లాహు అక్బర్), ‘తమ్’హీద్’ (అల్-హందులిల్లాహ్) మొదలైనవి, మంచి చేయమని ఉద్బోధించుట, ఆదేశించుట, చెడు నుండి ఆపుట, నిరోధించుట, అలాగే, వ్యక్తుల మధ్య సయోధ్య కుదుర్చుట, వారికి సన్మార్గము వైపునకు మార్గదర్శనం చేయుట మొదలైనవన్నీ ఉన్నాయి. ఒకవేళ అతడు ఇది చేయలేకపోతే, అపుడు అతడు కనీసం మౌనంగానైనా ఉండాలి, ఎవరికీ హాని, నష్టము కలిగించే రీతిలో మాట్లాడకుండా తన నాలుక పట్ల జాగ్రత్త వహించాలి. రెండవది: పొరుగు వానిని గౌరవించుట: అతనికి నష్టము కలిగించరాదు. అతని పట్ల గౌరవము, ఔదార్యము కలిగి ఉండాలి. మూడవది: మిమ్మల్ని చూడడానికి మీ ఇంటికి వచ్చిన అతిధిని గౌరవించాలి: అతిథుల పట్ల ఆదరణ, గౌరవము కలిగి ఉండాలి, వారికి వీలైనంతలో తగిన విధంగా అతిథి సత్కారాలు చేయాలి.
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ప్రజలపై కరుణ చూపని వానిపై సర్వోన్నతుడైన అల్లాహ్ కూడా కరుణ చూపడు అని వివరిస్తున్నారు. కనుక దాసుడు అల్లాహ్ యొక్క సృష్టితాలపై కరుణ చూపడం అనేది, సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క కరుణ పొందే మార్గాలలో అత్యుత్తమమైన మార్గము.
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ప్రజలలో ఎవరైతే ఏదైనా విషయంపై విపరీత స్థాయిలో జగడానికి దిగుతాడో లేక ఎక్కువగా అలాంటి జగడాలు పెట్టుకుంటాడో అటువంటి వానిని పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు, స్వయం సమృధ్ధుడూ అయిన అల్లాహ్ అసహ్యించుకుంటాడు. అటువంటి వాడు సత్యానికి విధేయత చూపడు. తన వాదనలతో సత్యాన్ని త్రోసి పుచ్చడానికి ప్రయత్నిస్తాడు. లేదా ఒకవేళ అతడు సత్యము పైనే ఉన్నా, జగడంలో ఎంత విపరీత స్థాయికి వెళతాడూ అంటే సహనము, సభ్యతల హద్దు దాటి ప్రవర్తిస్తాడు, మూర్ఖత్వంతో వాదిస్తాడు.
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ అత్యంత ఎక్కువగా ఇష్టపడే నాలుగు పదాలను గురించి వివరిస్తున్నారు. సుబ్’హానల్లాహ్’ (పరమ పవిత్రుడు): అల్లాహ్ ఎటువంటి లోపము లేనివాడు, లోపరహితుడు అని అర్థము. లోపములన్నింటికీ అతీతుడు కేవలం అల్లాహ్ మాత్రమే, ఆయన ఎటువంటి లోపములు లేని పరమ పవిత్రుడు అని అర్థము. ‘అల్’హందులిల్లాహ్’ (స్తోత్రములన్ని కేవలం అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి): ఈ పదం ప్రతి విషయంలోను అల్లాహ్ యొక్క సంపూర్ణతను, ఆయన ప్రేమను మహిమ పరుస్తున్నది. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’: అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు అని అర్థము. అల్లాహు అక్బర్’: (అల్లాహ్ అందరికంటే గొప్పవాడు): అవును, ఆయన అందరికంటే గొప్పవాడూ, అందరికంటే ప్రియమైన వాడూను. ఈ పదాలను ఉచ్ఛరించుట యొక్క ఘనత, ఉచ్ఛరించి నందుకు లభించే పుణ్యము వాటిని ఏ వరుసలో ఉచ్ఛరించినాము అనే దానిపై ఆధారపడి ఉండదు.