





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను 'ఏ కారణంగా ప్రజలు ఎక్కువగా స్వర్గంలోనికి ప్రవేశింప జేయబడతారు?' అని ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, “అల్లాహ్ పట్ల ‘తఖ్వా’ (అల్లాహ్ పట్ల భయభక్తులు) కలిగి ఉండుట కారణంగా మరియు సత్ప్రవర్తన, సత్శీలము కారణంగా” అన్నారు. మరియు 'ఏ కారణంగా ప్రజలు ఎక్కువగా నరకంలోనికి ప్రవేశింప జేయబడతారు?' అని ఆయనను ప్రశ్నించడం జరిగింది. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “నోటి కారణంగా మరియు జననేంద్రియాల కారణంగా” అని సమాధాన మిచ్చినారు”.
అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గంలోనికి ప్రవేశించడానికి ప్రబలమైన కారణాలు రెండు అని తెలియజేస్తున్నారు. అవి, అల్లాహ్ పట్ల ‘తఖ్వా’ (అల్లాహ్ పట్ల భయభక్తులు) మరియు సత్ప్రవర్తన, సచ్ఛీలము, మంచి నడవడిక. అల్లాహ్ పట్ల ‘తఖ్వా’ (అల్లాహ్ పట్ల భయభక్తులు) కలిగి ఉండుట: అంటే నీకూ మరియు అల్లాహ్ యొక్క శిక్షకూ మధ్య ఒక రక్షణ తెర కలిగి ఉండుట. అది అల్లాహ్ యొక్క ఆదేశాలను ఆచరించుట ద్వారా మరియు ఆయన నిషేధించిన విషయాలనుండి దూరంగా ఉండుట ద్వారా సాధ్యమవుతుంది. మరియు సత్ప్రవర్తన, సత్శీలము: ప్రజలను గౌరవించడం, వారి పట్ల సహృదయత, ఔదార్యం, వారికి మంచి చేయుట, వారి నుండి చెడును, కీడును దూరం చేయుట మొదలైన వాటి వలన ప్రతీతమవుతుంది. అలాగే నరకంలోనికి ఎక్కువగా ప్రవేశించడానికి ప్రబలమైన కారణాలు రెండు. అవి నాలుక మరియు జననేంద్రియాలు. నాలుక, మనిషి పాపాల కారణాలలో ఒకటి. అబద్ధం చెప్పుట, అపనిందలు మోపుట, ప్రచారం చేయుట, వ్యక్తుల పరోక్షములో వారిని గురించి చెడుగా మాట్లాడుట మొదలైనవి. వ్యభిచారానికి పాల్బడుట, స్వలింగ సంపర్కము మొదలైనవి జననేంద్రియాల కారణాలలోని వస్తాయి.
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఒక వ్యక్తి తోటి సహోదరునితో ‘వినయం, నమ్రత కలిగి ఉండు’ అని అంటూ ఉండగా విన్నారు. అపుడు ఆయన ఇలా పలికారు “‘అల్ హయా’ (వినయము, నమ్రత) కలిగి ఉండుట విశ్వాసములో ఒక భాగము”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారురసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి తన సోదరుణ్ణి మరీ ఎక్కువ సిగ్గు పడరాదని అతడిని మందలించగా విన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘అల్-హయా’ కలిగి ఉండుట (స్వభావములో వినయము, నమ్రత కలిగి ఉండుట) విశ్వాసములోని భాగము అని, అది కేవలం మంచినే తోడుకుని వస్తుంది అని అతడికి వివరించినారు. ప్రవృత్తిలో వినయము, నమ్రత కలిగి ఉండుట అనేది వికారము కలిగించే పనులనుండి దూరంగా ఉంచుతుంది, అందమైన పనులు చేయుటకు దారి తీస్తుంది.
అన్నో’మాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “దుఆ (అల్లాహ్ ను వేడుకొనుట) యే అసలు ఇబాదత్ (ఆరాధన)” తరువాత ఆయన ఈ ఆయతును పఠించినారు: {“మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: "నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను.నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశించగలరు".} [గాఫిర్ 40:60]
అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “దుఆ (అల్లాహ్ ను వేడుకొనుట) యే అసలు ఇబాదత్ (ఆరాధన)” అని వివరిస్తున్నారు. కనుక ఇందులో అందరూ విధిగా చేయవలసిన విషయం ఏమిటంటే, అల్లాహ్’కు మనస్ఫూర్తిగా దుఆ చేయాలి – అది తనకు మేలు చేసే ఏదైనా విషయాన్ని గురించి అల్లాహ్’ను వేడుకొనుట గానీ లేక తనకు కీడు కలిగించే ఏదైనా విషయాన్ని దూరం చేయమని వేడుకొనుట గానీ – అది ఈ ప్రాపంచిక జీవితాన్ని గురించి గానీ లేక పరలోక జీవితాన్ని గురించి గానీ లేక అది మన ఆరాధనలో భాగంగా ఉచ్ఛరించే స్త్రోత్రపు పదాలు, వాక్యాలు గానీ. ఇవి మనస్ఫూర్తిగా చేయబడితే అల్లాహ్ వీటిని ఇష్టపడతాడు. అవి మాటలు గానీ, చేతలు గానీ, అలాగే హృదయం యొక్క ఆరాధనలు గానీ, భౌతికమైన ఆరాధనలు గానీ లేక ఆర్థిక పరమైన ఆరాధనలు గానీ ఏవైనా కావచ్చు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనిని “అల్లాహ్ ఇలా పలికినాడు” అని ఈ ఆయతును పఠించి దాని నుంచి గ్రహించినారు: {“మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: "నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశిస్తారు".} [గాఫిర్ 40:60]
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సత్యసంధతకు కట్టుబడి ఉండండి; నిశ్చయంగా సత్యసంధత ధార్మికతకు, ధర్మబద్ధతకు దారితీస్తుంది; మరియు నిశ్చయంగా ధర్మబద్ధత స్వర్గానికి దారి తీస్తుంది. ఒక వ్యక్తి నిత్యము సత్యమునే పలుకుతూ, సత్యమును పలకడానికే కష్టపడుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద సత్యసంధులలో నమోదు చేయబడతాడు. మరియు అసత్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. నిశ్చయంగా అసత్యము దుర్నీతికి, అధర్మానికి దారి తీస్తుంది. మరియు నిశ్చయంగా అధర్మము నరాగ్నికి దారితీస్తుంది. ఒక వ్యక్తి నిత్యము అసత్యమునే పలుకుతూ, అసత్యమును పలకడానికే కష్టపడుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద అబద్ధాలకోరుగా నమోదు చేయబడతాడు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సత్యం పలకమని ఆజ్ఞాపించారు మరియు దానికి కట్టుబడి ఉండటం నిరంతర సత్కార్యాలకు దారి తీస్తుంది అని తెలియజేసారు. నిలకడగా మంచిపనులు చేయడం అనేది చేసే వ్యక్తిని స్వర్గానికి చేరుస్తుంది మరియు అతను రహస్యంగానూ మరియు బహిరంగంగానూ సత్యాన్ని అవలంబిస్తూనే ఉంటాడు. అటువంటి వ్యక్తి అత్యంత సత్యవంతునిగా ముద్ర వేయబడటానికి అర్హుడు అవుతాడు. ఇది సత్యసంధత యొక్క పరాకాష్ఠ. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసత్యం పలుకుట పట్ల మరియు తప్పుడు మాటలు మాట్లాడుట పట్ల హెచ్చరించారు. ఎందుకంటే అది ధర్మం నుండి వైదొలగడానికి మరియు చెడు, అవినీతి మరియు పాపపు పనులకు పాల్బడడానికి దారి తీస్తుంది; చివరికి నరకాగ్నికి దారి తీస్తుంది. అతడు నిరంతరం అసత్యమునే పలుకుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద అబద్ధాలకోరులలో ఒకనిగా నమోదు చేయబడతాడు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “రెండు వచనాలున్నాయి - అవి (పలుకుటలో) నాలుకపై తేలికైనవి, సత్కర్మల త్రాసులో భారమైనవి మరియు అనంత కరుణామయునికి అత్యంత ప్రియమైనవి. అవి ‘సుబ్’హానల్లాహి వ బిహందిహి’ (అల్లాహ్ పరమపవిత్రుడు, లోపములకు అతీతుడు మరియు అన్ని రకాల స్తోత్రములు, ప్రశంసలు కేవలం ఆయన కొరకే శోభిస్తాయి); మరియు ‘సుబ్’హానల్లాహిల్ అజీం’ (మహోన్నతుడైన అల్లాహ్ పరమపవిత్రుడు, లోపములకు అతీతుడు).
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత ఘనమైన రెండు వచనాల గురించి తెలియజేస్తున్నారు. ఆ రెండు వచనాలను మనిషి ఎటువంటి కష్టము లేకుండా, (ఉదయమూ, రాత్రి అనే భేదము లేకుండా) అన్ని సమయాలలో ఉచ్ఛరించగలడు. అవి అత్యంత ఘనమైన వచనాలు మరియు సత్కర్మల త్రాసులో అత్యంత భారమైనవి మరియు పరమ పావనుడు, మహోన్నతుడు, మన ప్రభువైన అనంత కరుణామయునికి అత్యంత ఇష్టమైనవి. ‘సుబ్’హానల్లాహి వ బిహందిహి’ మరియు ‘సుబ్’హానల్లాహిల్ అజీం’ - ఈ పదాలు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క మహిమను, ప్రతి విషయం లోనూ అన్ని లోపాలకూ అతీతంగా ఆయన సంపూర్ణత్వాన్ని, వాటన్నిటికీ ఆవల ఆయన ఔన్నత్యాన్ని వర్ణిస్తున్నాయి.
అబీ హురైరాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అల్లాహ్ ఎదుట అత్యంత గౌరవనీయమైనది ‘దుఆ’ తప్ప మరింకేమీ లేదు”.
అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – అల్లాహ్ వద్ద, ఆరాధనలలో దుఆ కంటే ఉత్తమమైన విషయం ఏదీ లేదు అని తెలియజేస్తున్నారు. ఎందుకంటే అందులో ప్రతి విషయంలోనూ పరమ పవిత్రుడూ, మహోన్నతుడూ అయిన అల్లాహ్ యొక్క సుసంపన్నత కీర్తించబడుతుంది, అలాగే అందులో ఆయన ఎదుట ప్రతి విషయం లోనూ దాసుని అసహాయత, అతని లేమి ప్రకటితమవుతుంది.
అబీ అద్’దర్దా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే తన సోదరుని పరోక్షములో అతడి గౌరవాన్ని రక్షిస్తాడో, తీర్పు దినమున అల్లాహ్ అతడి ముఖాన్ని నరకాగ్ని నుండి రక్షిస్తాడు”.
అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లిం పరోక్షములో అతడి గౌరవాన్ని కాపాడే ముస్లిమును గురించి తెలియజేస్తున్నారు. ఆ ముస్లిం పరోక్షములో ఎవరైనా అతడి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే లేదా అతడి గురించి అపవాదులు ప్రచారం చేస్తూ ఉంటే, అతడు ఆవిధంగా చేస్తున్న వాడిని వారిస్తాడు. తన ముస్లిం సోదరుని గౌరవాన్ని కాపాడుతాడు. అటువంటి వాని నుండి తీర్పు దినము నాడు అల్లాహ్ శిక్షను మరల్చి వేస్తాడు.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు నేరుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి, వారు ఇలా పలికారని ఉల్లేఖిస్తున్నారు: “ఎవరైతే ‘సుబ్’హానల్లాహి వ బిహందిహి’ (అల్లాహ్ సకల లోపాలకు, కొరతలకు అతీతుడు, మరియు సకల స్తోత్రములు ఆయన కొరకే) అని వంద సార్లు ఉచ్ఛరిస్తాడో, అతని పాపాలు అతని నుండి దించి వేయబడతాయి (తుడిచి వేయబడతాయి) అవి సముద్రపు నురగ అంత ఎక్కువగా ఉన్నప్పటికీ”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఎవరైతే ‘సుబ్’హానల్లాహి వ బిహందిహి’ (అల్లాహ్ సకల లోపాలకూ, కొరతలకు అతీతుడు, మరియు సకల స్తోత్రములు ఆయనకే శోభిస్తాయి) అని వంద సార్లు ఉచ్ఛరిస్తాడో, అతని పాపాలు క్షమించి వేయబడతాయి, మరియు తుడిచి వేయబడతాయి, అవి సముద్రపు అలలు తీరాన్ని బలంగా తాకినపుడు ఏర్పడే నురగ కంటే కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ.
అబూ అయ్యూబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : "ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే పది సార్లు ‘లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్’ (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి ఎవరూ లేరు, ఈ సృష్టి సామ్రాజ్యమంతా ఆయనకు చెందినదే, సకల స్త్రోత్రములూ ఆయనకు మాత్రమే చెందినవి, మరియు ఆయన ప్రతి విషయము పై అధికారము కలవాడు) అని ఉచ్ఛరిస్తాడో, అతడు ఇస్మాయీల్ అలైహిస్సలాం సంతతి నుండి నలుగురు బానిసలను విముక్తి కలిగించిన వానితో సమానము”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియ జేస్తున్నారు. ‘ఎవరైతే ‘లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్’ (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి ఎవరూ లేరు, ఈ సృష్టి సామ్రాజ్యము ఆయనకు చెందినదే, సకల స్త్రోత్రములూ ఆయనకు మాత్రమే చెందినవి, మరియు ఆయన ప్రతి విషయము పై అధికారము కలవాడు) అని ఉచ్ఛరిస్తాడో అన్నారు – దాని అర్థం: సకల ఆరాధనలకు అర్హుడైన నిజ అరాధ్యుడు ఎవరూ లేరు కేవలం అల్లాహ్ తప్ప; కీర్తి, యశస్సు కలిగిన ఆయనకే (అల్లాహ్ కే) ఈ సృష్టి సామ్రాజ్యము చెందుతుంది; ప్రేమ మరియు భయభక్తులతో కూడిన సకల స్తోత్రములకు, ప్రశంసలకూ కేవలం ఆయన మాత్రమే అర్హుడు, ఆయనే సమర్థుడు, ఆయనకు సాధ్యము కానిది ఏదీ లేదు’ – అని. సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ గొప్ప స్తుతిని, స్తోత్రాన్ని ఎవరైతే ప్రతిరోజూ పదిసార్లు ఉచ్ఛరిస్తాడో – అతడు ఇస్మాయీల్ ఇబ్న్ ఇబ్రాహీం అలైహిముస్సలాం సంతతిలోని నలుగురు ‘మమ్లూకు’లను (రాజస్థానములలో ఉన్నత స్థాయీ, స్థానములలో నియమించబడిన బానిసలు) బానిసత్వమునుండి విముక్తులను గావించినంత పుణ్యము (ప్రతిఫలం) పొందుతారు. ఇక్కడ ‘ఇస్మాయీలు అలైహిస్సలాం సంతతి నుండి’ అని ప్రత్యేకముగా పేర్కొనుటలో ఉద్దేశ్యము వారు మిగతా వారికంటే ఎక్కువ గౌరవనీయులు కావడమే.