





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ఖౌలహ్ బింత్ హకీం అస్సులమియ్యహ్ రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఎవరైనా ఏదైనా ప్రదేశములో ఆగినపుడు, “అఊజు బి కలిమాతిల్లాహి త్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్” (నేను అల్లాహ్ యొక్క పరిపూర్ణ వాక్కుల ద్వారా ఆయన సృష్టించిన వాటి కీడు నుండి ఆయన శరణు కోరుతున్నాను) అని పలికినట్లయితే, అతడు ఆ ప్రదేశము నుండి వెడలి పోనంత వరకు అతనికి ఏదీ (ఏ విషయమూ) హాని కలిగించజాలదు”.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ ను - మనిషి భూమిపై ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా అతడు విరామం కోసం ఆగితే, తనకు కీడు జరుగుతుందని భయపడే ప్రతి విషయము నుండి, ఆ కీడును పారద్రోలే ఉత్తమమైన రక్షణ, ఉత్తమమైన శరణు వైపునకు మార్గదర్శకత్వం చేస్తున్నారు – అది ఏదైనా ప్రయాణములో ఎక్కడైనా ఆగడం కావచ్చు లేదా ఏదైనా ప్రదేశానికి విహార యాత్రగా వెళ్ళి ఉండవచ్చు లేదా మరింకేదైనా ప్రయాణం కావచ్చు; అతడు అల్లాహ్ యొక్క ఎటువంటి లోపము, ఎటువంటి దోషము, కొరత (తక్కువదనం) లేని వాక్కుల ద్వారా, ఆ వాక్కుల ఘనత ద్వారా, వాటి శుభాల ద్వారా, వాటి అమితమైన ప్రయోజనం ద్వారా – కీడు కలిగిన ఉన్న సృష్ఠితాల ప్రతి కీడు నుండి, అతనికి హాని కలిగించే ప్రతి విషయము నుండి, అతడు ఆ ప్రదేశములో ఆగినంత కాలము, అతడు ఆ ప్రదేశమునుండి పూర్తిగా వెడలిపోనంత వరకు క్షేమంగా ఉండేందుకు గాను అల్లాహ్ యొక్క రక్షణ, ఆయన శరణు కొరకు వేడుకోవాలి.
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ సంతానము కంటే, మీ తల్లిదండ్రుల కంటే మరియు ప్రజలందరి కంటే నేను మీకు అత్యంత ప్రియమైన వాడిని కానంతవరకు మీరు పరిపూర్ణ (Perfect) విశ్వాసాన్ని పొందజాలరు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో – ఒక ముస్లిం – తన తల్లిపై తనకు గల ప్రేమ కంటే, తన తండ్రిపై తనకు గల ప్రేమ కంటే, తన కుమారులపై, తన కుమార్తెలపై తనకు గల ప్రేమ కంటే మరియు ఈ ప్రపంచములోని మనుషులందరిపై తనకు గల ప్రేమకంటే – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై తనకు గల ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడో, అతడు తన ‘ఈమాన్’ (విశ్వాసములో) పరిపూర్ణత కలిగిన వాడు కాడు. పైన పెర్కొన్న అందరిపై ప్రేమ కంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై తనకు గల ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడమంటే, ప్రతి విషయములో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ను అనుసరించడం, ప్రతివిషయములోనూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు అండగా నిలవడం, మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఏ కొద్ది అవిధేయత ఉన్నా దానిని విడనాడడం మొదలైనవన్నీ వస్తాయి.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నేను ‘సుబ్’హానల్లాహి, వల్ హందులిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్’ అని పలకడం, సూర్యుడు ఉదయించే వాటన్నింటి కంటే కూడా నాకు అత్యంత ప్రియమైనది. (అంటే వేటివేటిపైనైతే సూర్యోదయం అవుతుందో, ఆ విషయాలన్నింటి కంటే కూడా అత్యంత ప్రియమైనదని భావము).”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: మహోన్నతుడైన అల్లాహ్’ను ఈ పదములతో స్మరించుట, ఆయనను స్తుతించుట, ఈ ప్రపంచము కంటే, ఈ ప్రపంచములోని విషయాన్నింటి కంటే కూడా ఉత్తమమైన విషయము. ఆ పదాలు ఇవి: “సుబ్’హానల్లాహి”: మహోన్నతుడైన అల్లాహ్ లోపరహితుడు, ఆయన ఔన్నత్యము లోపరహితమైనది. మహిమ, స్తోత్రము, కీర్తి, ప్రకాశము అన్నీ కేవలం అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి అని అర్థము. “అల్’హందులిల్లాహ్”: ‘సకల ప్రశంసలూ, కృతజ్ఞతలూ ఆయనకే శోభిస్తాయి’ – అంటే, పరిపూర్ణమైన ఆయన నామములు మరియు ఆయన గుణగణములను, ఆయనపై పూర్తి ప్రేమతో, ఆయన ఔన్నత్యాన్ని కొనియాడుట. “లా ఇలాహ ఇల్లల్లాహ్”: ‘అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన నిజ ఆరాధ్యుడెవ్వరూ లేరు’ “అల్లాహు అక్బర్”: ‘అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు’, సర్వోన్నతుడు, సర్వోత్కృష్టుడు, ప్రతి దాని కంటే కూడా మహోన్నతుడు.
అనస్ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖనం : “(ఒకసారి) మేము ఉమర్ రజియల్లాహు అన్హు వద్ద ఉన్నాము. అపుడు ఆయన ఇలా అన్నారు “అత్-తకల్లఫి చేయుట నుండి మనలను నిషేధించుట జరిగింది” (అత్-తకల్లుఫ్ التَّكَلُّفِ అంటే ‘ఎవరైనా, తాను నిజంగా అనుభూతి చెందని విషయాన్ని, అనుభూతి చెందినట్లు ఉద్దేశ్యపూర్వకంగా ప్రదర్శించుట)
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఇందులో ఉమర్ రజియల్లాహు అన్హు: “అవసరం లేకపోయినా, ఎదుటివారిని ఆకట్టుకోవడానికి తాను ఎక్కువ కష్టపడుతున్నట్లుగా ఉద్దేశ్యపూర్వకముగా మాట్లాడుటను, అలాగే అవసరం లేకపోయినా ఆచరణలలోనూ ఉద్దేశ్యపూర్వకముగా చేయుటను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారని” ఉల్లేఖించినారు.
ఉమర్ ఇబ్న్ అబీ సలమహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “నేను నా బాల్యములో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పెంపకములో ఉంటిని. (భోజన సమయాన) నా చేయి భోజనపళ్ళెం అంతటా తిరుగుతూ ఉండేది. దాంతో రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో ఇలా అన్నారు “ఓ బాలుడా! (తినుటకు ముందు) అల్లాహ్ పేరును స్మరించు, కుడి చేతితో తిను, మరియు నీకు దగ్గరగా (ఎదురుగా) ఉన్నదాని నుండి తిను.” అప్పటి నుండి నేను ఆ విధంగానే తింటున్నాను.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఉమర్ బిన్ అబీ సలమహ్ రజియల్లాహు అన్హుమా, ప్రవక్త భార్యలలో ఒకరైన ఉమ్మె సలమహ్ రజియల్లాహు అన్హా యొక్క కుమారుడు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పెంపకము మరియు సంరక్షణలో పెరిగినారు. ఆయన ఇలా వివరిస్తున్నారు: భోజన సమయాన ఆయన చేయి భోజన పళ్ళెంలో అటు పక్కకు, ఇటు పక్కకు కదులుతూ ఉండేది అక్కడి నుండి పళ్ళెంలోని పదార్థాలను తీసుకోవడానికి. అది చూసి ప్రవక్త ఆయనకు మూడు భోజన మర్యాదలు బోధించినారు: మొదటిది: భోజనం తినుట ప్రారంభించడానికి ముందు ‘బిస్మిల్లాహ్’ పఠించుట. రెండవది: కుడి చేతితో తినుట. మూడవది: భోజన పళ్ళెంలో తన వైపున అంటే తన ఎదురుగా, తనకు దగ్గరగా ఉన్న దానిలో నుండి తినుట.
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “మీలో ఎవరైనా ఒకవేళ తింటే కుడి చేతితోనే తినండి, త్రాగితే కుడి చేతితోనే త్రాగండి, ఎందుకంటే నిశ్చయంగా షైతాను ఎడమ చేతితో తింటాడు మరియు ఎడమ చేతితో త్రాగుతాడు.”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లిం కుడి చేతితోనే తినాలని, మరియు కుడి చేతితోనే త్రాగాలని ఆదేశిస్తున్నారు. మరియు ఎడమ చేతితో తినుటను, త్రాగుటను నిషేధిస్తున్నారు. ఎందుకంటే షైతాను అలా (ఎడమ చేతితో) తింటాడు మరియు త్రాగుతాడు కనుక.
అబ్బాస్ ఇబ్న్ అబ్దుల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ఒకసారి నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్! నేను సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను అర్థించడానికి నాకు ఏదైనా బోధించండి”. దానికి ఆయన “ ‘అల్-ఆఫియహ్’(క్షేమము, శ్రేయస్సు, సుస్థితి, ఆరోగ్యము మొ.) ప్రసాదించమని అర్థించు” అన్నారు. కొన్ని రోజుల తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళి “ఓ రసూలల్లాహ్! నేను సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను అర్థించడానికి నాకు ఏదైనా బోధించండి” అని అడిగాను. దానికి ఆయన: “ఓ అబ్బాస్, ఓ రసూలల్లాహ్ యొక్క బాబాయ్, ఈ ప్రపంచములోనూ మరియు పరలోకములోనూ “ఆఫియహ్” ప్రసాదించమని అర్థించు” అన్నారు.”
అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త యొక్క బాబాయి, అల్-అబ్బాస్ ఇబ్న్ అబ్దుల్-ముత్తలిబ్ (రదియల్లాహు అన్హు), ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అల్లాహ్ ను వేడుకోవడానికి ఒక దుఆను (ప్రార్థనను) నేర్పించమని అడిగారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మం లోనూ, ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ విపత్తులు మరియు లోపాల నుండి భద్రత ప్రసాదించమని, మరియు శ్రేయస్సు, క్షేమము, సుస్థితి, ఆరోగ్యము మరియు భద్రత ప్రసాదించమని అల్లాహ్’ను వేడుకొనమని ఆయనకు బోధించారు. అల్-అబ్బాస్ ఇలా అన్నారు: "కొన్ని రోజుల తరువాత, నేను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తిరిగి వచ్చాను, అల్లాహ్’ను వేడుకోవడానికి నాకు ఒక దుఆ (ప్రార్థనను) నేర్పించమని అడిగాను”. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు స్నేహపూర్వకంగా ఇలా చెప్పారు: “ఓ అబ్బాస్!, ఓ రసూలల్లాహ్ యొక్క బాబాయ్, మీరు శ్రేయస్సు కొరకు అల్లాహ్’ను అడగండి, అన్ని రకాల కీడులను, హానిని నివారించమని, ఇహలోకంలోనూ పరలోకం లోనూ మంచినీ, ప్రయోజనాన్ని కలిగించమని ప్రార్థించండి”.
అబ్దుర్రహ్మాన్ ఇబ్నె అబూ లైలా ఉల్లేఖనం : “మేము హుజైఫహ్ వద్ద కూర్చుని ఉన్నాము. అతడు నీళ్ళు తీసుకురమ్మని అడిగాడు. ఒక మజూసీ అతనికి నీళ్ళు తెచ్చాడు. కానీ ఎపుడైతే అతడు నీటి కప్పును అతని చేతిలో ఉంచినాడో, హుదైఫహ్ దానిని అతని పైకి విసిరినాడు. తరువాత ఇలా అన్నాడు: “అలా చేయవద్దని నేను ఇప్పటికే ఒకటి, రెండుసార్లు అతనికి చెప్పి ఉండకపోతే...” “నేను ఇలా చేసి ఉండే వాడిని కాదు” అని అనాలని బహుశా ఆయన అనుకున్నాడు. (ఆయన ఇంకా ఇలా అన్నాడు) “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా నేను విన్నాను: “పట్టు వస్త్రాలను లేక జరీ వస్త్రాలను ధరించకండి, వెండి లేక బంగారపు పాత్రలలో నీళ్ళు త్రాగకండి, మరియు వాటితో చేసిన పళ్ళాలలో తినకండి; ఎందుకంటే (ఈ ప్రాపంచిక జీవితంలో) అవి వారి కొరకు (అవిశ్వాసుల కొరకు); మన కొరకు పరలోక జీవితంలో ఉన్నాయి.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులను అన్ని రకాల పట్టు వస్త్రాలను ధరించుటనుండి నిషేధించినారు. అలాగే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పురుషులను, స్త్రీలను బంగారము లేక వెండి పళ్ళాలలో, పాత్రలలో తినుట మరియు త్రాగుట నుండి నిషేధించినారు. అవి (బంగారు మరియు వెండి పాత్రలు మొదలైనవి) పునరుత్థాన దినమున కేవలం విశ్వాసులకు మాత్రమే ప్రత్యేకించబడతాయి, ఎందుకంటే ఈ ఇహలోక జీవితములో అల్లాహ్ యొక్క విధేయతలో వారు వాటికి దూరంగా ఉన్నారు కనుక. అలాగే పరలోక జీవితం లో అవిశ్వాసులకు ఇవేవీ లభించవు, ఎందుకంటే వారు తమ ప్రాపంచిక జీవితంలో అల్లాహ్ ఆదేశానికి అవిధేయత చూపి, వేగిరపడి మంచిమంచి విషయాలను, విలాసాలను, సొంతం చేసుకుంటూ అనుభవించారు కనుక.
ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(పట్టు వస్త్రాలు ధరించకండి, ఎందుకంటే) ఎవరైతే ఈ ప్రపంచములో పట్టు ధరిస్తారో, పరలోక జీవితములో వారు దానిని ధరించలేరు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: పురుషులలో ఎవరైతే ఈ ప్రపంచములో పట్టు వస్త్రాలు ధరిస్తారో, వారు పరలోక జీవితం లో దానిని ధరించలేరు; ఒకవేళ దానికి అతడు పశ్చాత్తాప పడకపోయినట్లయితే, అతడు ఆ విధంగా శిక్షించబడతాడు.