





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ఖుత్బహ్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా దుఆ చేస్తూ ఉండేవారు: “అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బికబిక మిన్ మున్కరాతిల్ అఖ్లాఖి, వల్ ఆ’మాలి, వల్ అహ్’వాయి” (ఓ అల్లాహ్! చెడు నైతికత నుండి, చెడు పనులు చేయుట నుండి మరియు చెడు కోరికల నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను)”
అత్తిర్మిదీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దుఆలలో ఇది కూడా ఒకటి: (అల్లాహుమ్మ ఇన్నీ అఊదు) (నీ వైపునకు తిరిగి) ఓ అల్లాహ్ నేను శరణు వేడుకుంటున్నాను; (బిక) కేవలం నీ శరణు, మరింకెవరి శరణు కాదు; (మినల్ మున్కరాతి) అన్ని రకాల చెడుల నుండి, వేటినైతే అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు సల్లల్లాహు అలైహి వసల్లం నిషేధించినారో; అంటే (అల్ అఖ్లాఖి) నైతికతకు చెందిన చెడులు, దుర్మార్గం, అసూయ మరియు అహంకారం వంటి చెడుల నుండి; (వ మిన్ మున్కరాతిల్ ఆ’మాల్) మరియు ఆచరణకు చెందిన చెడులు – అవమానించడం, శపించడం వంటి చెడుల నుండి, (వ మిన్ జమీ’ అల్ అహ్’వాల్) మరియు ఏవైతే షరియహ్ బోధనలకు విరుద్ధమైనవో – ఆత్మ కోరుకునే అటువంటి అన్ని రకాల కోరికల నుండి నీ రక్షణ, నీ శరణు వేడుకుంటున్నాను.
బనీ ముజాషీ తెగ సోదరుడైన ఇయాద్ ఇబ్న్ హిమార్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ఒకరోజు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్యన ఒక ప్రసంగకర్తగా నిలబడి ఇలా అన్నారు:” ఇయాద్ ఇబ్న్ హిమార్ (రదియల్లాహు అన్హు) ఆ హదీథును వివరించినారు; అందులో ఇలా ఉన్నది: “నిశ్చయంగా అల్లాహ్ నాకు ఈ విధంగా వహీ చేసినాడు (దివ్యజ్ఞానాన్ని అవతరింపజేసినాడు) – ఎవరూ ఒకరిపై మరొకరు గొప్పలు చెప్పుకోకండి, మరియు ఎవరూ ఒకరిని మరొకరు అణచివేతకు గురిచేయకండి.”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను సంబోధిస్తూ ప్రసంగించినారు – ఆ ప్రసంగములో మిగతా విషయాలతో పాటు వారు ఇలా అన్నారు: నిశ్చయంగా అల్లాహ్ తనపై ఈ విధంగా దివ్యఙ్ఞానాన్ని అవతరింపజేసినాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినారు: ప్రజలు పరస్పరం వినయంతో మెలగాలి, ఇతరుల కొరకు తమ రెక్కలు వంచి, సౌమ్యంగా ఉండాలి. తద్వారా ఎవరూ తమ వంశపారంపర్యత, సంపద లేదా మరే విషయం ఆధారంగానైనా గొప్పతనం, గర్వం లేదా గౌరవం గురించి గొప్పలు చెప్పుకోరాదు; మరియు ఎవరూ ఎవరినీ అణచివేయరాదు లేదా అతిక్రమించరాదు.
విశ్వాసుల మాతృమూర్తి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య అయిన ఆయిషా రదియల్లాహు అన్హా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని ఉల్లేఖిస్తున్నారు: “ఓ ఆయిషా, అల్లాహ్ సౌమ్యుడు మరియు సౌమ్యతను ఇష్టపడతాడు. మరియు ఆయన హింసకు, కఠినత్వానికి ఇవ్వని దానిని సౌమ్యతకు ప్రసాదిస్తాడు, మరింకా దేనికీ ఇవ్వని దానిని సౌమ్యతకు ప్రసాదిస్తాడు.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం, విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హాను సౌమ్యంగా ఉండమని హితబోధ చేస్తున్నారు, అల్లాహ్ తన దాసుల పట్ల సౌమ్యుడు మరియు దయగలవాడు అని, ఆయన వారికి కఠినత్వాన్ని, కష్టాన్ని కాదు, వారికి సౌలభ్యాన్ని కోరు కుంటున్నాడు అని అన్నారు. ఆయన వారి సామర్ధ్యానికి మించి వారిపై భారాన్ని మోపడు. మరియు అల్లాహ్, తన దాసుడు ఇతరులతో వ్యవహరించడంలో సౌమ్యతను మరియు సౌలభ్యాన్ని అవలంబించడాన్ని, అలాగే ఇతరులతో వ్యవహరించుటలో కఠినత్వాన్ని లేదా తీవ్రతను నివారించడాన్ని ఇష్టపడతాడు. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు - సౌమ్యత మరియు కరుణ చూపేవారికి ఈ లోకంలో అల్లాహ్ ప్రశంసనీయమైన ఖ్యాతిని ప్రసాదిస్తాడు; మరియు వారు తమ లక్ష్యాలను సాధించడములో మరియు వారి వ్యవహారాలు కొనసాగించడంలో అల్లాహ్ సౌలభ్యాన్ని ప్రసాదిస్తాడు. మరియు హింస, కఠినత్వాలకు ఇవ్వని గొప్ప ప్రతిఫలాన్ని ఆయన ప్రసాదిస్తాడు; ఎందుకంటే సౌమ్యత మరేదీ తీసుకురాలేని ఫలితాలను తెస్తుంది.
జైద్ ఇబ్న్ అర్ఖం రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని పలికేవారో అది తప్ప మరింకేమీ చెప్పను, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు: “అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ అజ్’జి వల్ కసల్; వల్ జుబ్ని వల్ బుఖ్’ల్; వల్ హరమి వల్ అజాబిల్ ఖబ్ర్; అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తఖ్వాహా; వ జక్కిహా అన్’త ఖైరు మన్ జక్కాహా; అన్’త వలియ్యుహా వ మౌలాహా; అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ ఇల్మిన్ లా యన్’ఫఉ; వమిన్ ఖల్బిన్ లా యఖ్’షఉ; వమిన్ నఫ్సిన్ లా తష్’బఉ; వమిన్ ద’వతిన్ లా యుస్తజాబ లహా” { ఓ అల్లాహ్! నేను నీ నుండి అసమర్థత, సోమరితనం, పిరికితనం, లోభితనం, దుర్బలత్వం మరియు సమాధి శిక్షల నుండి శరణు వేడుకుంటున్నాను. ఓ అల్లాహ్! నాకు నీ పట్ల భయభక్తులను ప్రసాదించు మరియు నా ఆత్మను శుద్ధి చేయు, దానిని శుద్ధి చేయడంలో నీవే అత్యుత్తముడివి. నీవే దాని రక్షకుడివి మరియు సంరక్షకుడివి. ఓ అల్లాహ్! ప్రయోజనకరం కాని జ్ఞానము నుండి, భయపడని హృదయము నుండి, సంతృప్తి చెందని ఆత్మ నుండి మరియు సమాధానం లభించని దుఆ (ప్రార్థన) నుండి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను.}
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ప్రార్థనలలో ఒకటి: "ఓ అల్లాహ్, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను"; "అసమర్థత" నుండి, అంటే సమర్థవంతంగా పనిచేయలేకపోవడం నుండి, "నిరాశ" నుండి అంటే చర్య తీసుకోవాలనే, పని చేయాలనే సంకల్పం లేకపోవడం నుండి నీ వైపునకు మాత్రమే మరలుతున్నాను. అసమర్థుడు చర్య తీసుకోలేడు మరియు సోమరి అలా చేయాలనుకోడు. "పిరికితనం" నుండి, అది చేయవలసిన పని చేయకుండా ఆపుతుంది, "పిసినారితనం" నుండి, అది ఇవ్వవలసినది ఇవ్వకుండా ఆపి ఉంచుకునేలా చేస్తుంది, "ముదిమి" నుండి, అది శరీరం బలహీనపడటానికి దారి తీస్తుంది, "సమాధి శిక్ష" నుండి మరియు దానికి దారితీసే కారణాల నుండి (ఓ అల్లాహ్! నీ శరణు వేడుకుంటున్నాను). "ఓ అల్లాహ్! నాకు భక్తి భావాన్ని ప్రసాదించు మరియు నీ విధేయత వైపునకు నా ఆత్మను నడిపించు మరియు నీ అవిధేయతకు పాల్బడకుండా నివారించు మరియు నా ఆత్మను శుద్ధి చేయి, దానిని దుర్గుణాల నుండి మరియు నీచమైన లక్షణాల నుండి శుద్ధి చేయి. నీవు తప్ప మరెవ్వరూ దానిని పవిత్రం చేయలేరు, దానిని పవిత్రపరుచుటలో నీవే అత్యుత్తముడవు. "నీవే దాని రక్షకుడవు", దాని సహాయకుడవు, సంరక్షకుడవు, దాని వ్యవహారాలను నిర్వహించేవాడవు, దాని ప్రభువు, యజమాని, మరియు ఆశీర్వాదాలను ప్రసాదించే వాడవు.” “ఓ అల్లాహ్! ప్రయోజనకరం కాని జ్ఞానము నుండి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను” అంటే, జాదూ, జ్యోతిషం, భవిష్యవాణి మరియు మాయాజాలం లేదా పరలోకంలో ఎటువంటి ప్రయోజనం చేకూర్చని ఙ్ఞానం నుండి, లేదా ఆచరించదగని ఙ్ఞానము నుండి నీ శరణు వేడుకుంటున్నాను; “మరియు నీకు భయపడని హృదయము నుండి నీ శరణు వేడుకుంటున్నాను”; నీ ముందు నీ విధేయతకు తనను తాను సమర్పించుకోని హృదయం నుండి, నీ స్మరణలో శాంతి పొందని హృదయం నుండి; మరియు నీలో భరోసా పొందని హృదయం నుండి నీ శరణు వేడుకుంటున్నాను. “సంతృప్తి చెందని ఆత్మ నుండి నీ శరణు వేడుకుంటున్నాను”, ఓ అల్లాహ్! నీవు ధర్మబధ్ధంగా ప్రసాదించిన దాని పట్ల సంతృప్తి చెందని ఆత్మ నుండి, ఎల్లప్పుడూ దురాశకు లోనయ్యే ఆత్మ నుండి నీ శరణు వేడుకుంటున్నాను; మరియు తిరస్కరించబడిన మరియు సమాధానం లభించని దుఆ నుండి (వేడుకోలు నుండి) నీ శరణు వేడుకుంటున్నాను.
అలీ (రదియల్లాహు అన్హు) ఇలా ఉల్లేఖిస్తున్నారు – ఒకసారి ఒక “ముకాతబ్” (తన యజమాని నుండి తన స్వతంత్రాన్ని వెల చెల్లించి కొనుక్కునే బానిస వ్యక్తి) ఆయన వద్దకు వచ్చి ఇలా అన్నాడు “వాస్తవానికి నేను నా దాస్య విమోచన ఒప్పందాన్ని నెరవేర్చ లేకపోతున్నాను. నాకు సహాయం చెయ్యండి.” అపుడు అలీ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు నేర్పించిన మాటలు నీకు నేర్పించనా? దాని ద్వారా నీపై ‘సీర్’ కొండంత అప్పు ఉన్నా, అల్లాహ్ ఆ అప్పును తీర్చివేస్తాడు.” అలీ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “నీవు ఇలా అను “అల్లాహుమ్మ, ఇక్ఫినీ బి హలాలిక, అన్ హరామిక, వ అఘ్నినీ బి ఫజ్లిక, అమ్మన్ సివాక్” (ఓ అల్లాహ్! నీవు నిషేధించిన వాటికి బదులుగా నీవు అనుమతించిన వాటిని నాకు అందించు, మరియు నీ నుండి తప్ప మిగతా వారందరి నుండీ నన్ను స్వతంత్రుడిని చేయి.”
అత్తిర్మిదీ నమోదు చేసినారు:అమీరుల్ మొమినీన్ (విశ్వాసుల నాయకుడు) అలీ (రదియల్లాహు అన్హు) వద్దకు ఒక బానిస వ్యక్తి వచ్చినాడు; అతడు తన యజమానితో తన దాస్యవెమోచన ఒప్పందాన్ని చేకొని ఉన్నాడు, ఆ ఒప్పందాన్ని పూర్తి చేయడం ద్వారా అతడు స్వతంత్రుడు అవుతాడు. ఆ ఒప్పందాన్ని నెరవేర్చడానికి అతని వద్ద తగినంత ధనం లేదు. అతడు అలీ (రదియల్లాహు అన్హు) తో ఇలా అన్నాడు: “నిశ్చయంగా, నా యజమానికి చెల్లించడానికి నేను ఒప్పుకున్న ధనం నా వద్ద లేదు; నాకు ధనాన్ని సమకూర్చి సహాయం చేయండి, లేదా నాకేదైనా బోధించండి, లేదా నాకు మార్గం చూపండి.” అప్పుడు అమీరుల్ మోమినీన్ అతనితో ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు నేర్పించిన మాటలు నీకు నేర్పించనా? దాని ద్వారా నీపై తాయ్ తెగవారి సీర్ కొండంత అప్పు ఉన్నా నీతరఫున అల్లాహ్ దానిని అర్హులైన వారికి చెల్లించివేస్తాడు మరియు నిన్ను దాని యొక్క అవమానం నుండి రక్షిస్తాడు” తరువాత అలీ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “నువ్వు ఇలా అను: (అల్లాహుమ్మక్’ఫినీ) ఓ అల్లాహ్, నీవు ప్రసాదించినదే నాకు చాలునట్లు చేయి, (బి హలాలిక) నీవు హలాల్ (ధర్మసమ్మతం) చేసిన దానితో నన్ను హరాము నుండి దూరంగా ఉంచు, తద్వారా నేను (బి హరామిక) నీవు నిషేధించిన దానిలో పడకుండా చేసి, దానితోనే నేను సంతృప్తి పడునట్లు చేయి, (బి ఫజ్లిక) నీ అనుగ్రహంతో నన్ను (వ అఘ్నినీ) స్వయం సమృధ్ధుడిని చేయి; మరియు (అమ్మన్ సివాక్) నీవు తప్ప నాకు మరింకెవరి అవసరం లేకుండా చేసి, నాకు నీ దాతృత్వాన్ని ప్రసాదించు.
సల్మాన్ అల్ ఫార్సీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మూడు రకాల వ్యక్తులతో అల్లాహ్ పునరుత్థాన దినమున మాట్లాడడు, వారిని శుద్ధి చేయడు, మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది: వృద్ధుడైన వ్యక్తి వ్యభిచారానికి పాల్బడినట్లైతే, పేదవాడైన వ్యక్తి అహంకారిగా ఉంటే, మరియు ఆ వ్యక్తి, ఎవరికైతే అల్లాహ్ వర్తక సామాగ్రిని ఇచ్చినాడో – అతడు కొన్నా ‘అల్లాహ్ మీద ఒట్టు’ అని, అమ్మినా ‘అల్లాహ్ మీద ఒట్టు’ అని వర్తకం చేస్తాడు.
అత్తబ్రానీ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో మూడు రకాల వ్యక్తులను గురించి తెలియజేసినారు: వారు పశ్చాత్తాప పడకపోయినా లేక క్షమించబడక పోయినా పునరుత్థాన దినమున అల్లాహ్ యొక్క మూడు శిక్షలకు పాత్రులవుతారు. మొదటిది: అల్లాహ్ తన తీవ్రమైన కోపం కారణంగా పునరుత్థాన దినాన వారితో మాట్లాడడు. పైగా ఆయన వారి నుండి దూరంగా ఉంటాడు లేదా ఆయన వారితో వారికి నచ్చని విధంగా మాట్లాడి వారి పట్ల తనకున్న అసంతృప్తిని సూచిస్తాడు. రెండవది: ఆయన వారిని స్తుతించడు, పొగడడు, మరియు వారి పాపాలను కడిగివేయడు. మూడవది: వారు పరలోకంలో కఠినమైన మరియు బాధాకరమైన శిక్షను అనుభవిస్తారు. ఆ మూడు రకాల వ్యక్తులు వీరే: మొదటి రకం: వ్యభిచారానికి పాల్బడిన వృద్ధుడు. రెండవది: సంపద లేకపోయినా ప్రజల పట్ల అహంకారంతో ఉండే పేదవాడు. మూడవది: కొనేటప్పుడు మరియు అమ్మేటప్పుడు తరచుగా అల్లాహ్ పై ప్రమాణం చేసేవాడు (అల్లాహ్ మీద ఒట్టు అనుట), తద్వారా అల్లాహ్ పేరును దిగజార్చేవాడు, కించపరిచేవాడు మరియు దానిని ధనం సంపాదించడానికి ఒక మాధ్యమంగా ఉపయోగించేవాడు.
అబూ మూసా అల్ అష్’అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: «ఆకలిగొన్నవారికి అన్నంపెట్టండి, వ్యాధిగ్రస్తులను పరామర్శించండి, ఖైదీలను విడిపించండి»
అల్ బుఖారీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టం చేసినదేమిటంటే, ఒక ముస్లింకు తన సోదర ముస్లింపై ఉన్న హక్కులలో ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం, వ్యాధిగ్రస్తుడిని పరామర్శించడం మరియు ఖైదీని విడిపించడం కూడా ఉన్నాయి.
అబూ ఉమామ అల్-బహిలి రదియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఇద్దరు వ్యక్తులను గురించి ప్రస్తావించబడినది. అందులో ఒక వ్యక్తి అమిత భక్తిపరుడు, మరొక వ్యక్తి ధర్మపండితుడు. (వారిద్దరిని గురించి) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “భక్తి పరునిపై ధర్మపండితుని శ్రేష్ఠత, ఘనత యొక్క ఉపమానం ఎటువంటిది అంటే, మీలోని సాధారణ వ్యక్తిపై నా యొక్క శ్రేష్ఠత మరియు ఘనత వంటిది”. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దైవదూతలు, ఆకాశాలు మరియు భూమిలో ఉన్న వారందరూ, చివరికి తన పుట్టలో ఉన్న చీమ మరియు నీటిలో ఉన్న చేప కూడా ప్రజలకు మంచిని బోధించే వానిపై ఆశీర్వాదాలు పలుకుతారు.”
అత్తిర్మిదీ నమోదు చేసినారు:ఇద్దరు వ్యక్తులను గురించి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రస్తావించబడినది; ఒకరు అమిత భక్తి పరుడు, మరొకరు ధర్మపండితుడు (ఆలిమ్). ఆ ఇద్దరిలో ఎవరు ఉత్తములు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించడం జరిగింది? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “షరియత్ యొక్క అన్ని శాస్త్రముల ధార్మిక ఙ్ఞానమును కలిగి ఉండి, దానిపై ఆచరిస్తూ, మరియు ఆ ఙ్ఞానాన్ని ఇతరులకు బోధించే ధర్మపండితుని శ్రేష్ఠత మరియు ఘనత; తాను ఆచరించే ఆరాధనను సక్రమంగా ఆచరించడానికి అవసరమైన ఙ్ఞానాన్ని మత్రమే కలిగి ఉన్న అపర దైవ భక్తుని పై ఎటువంటిది అంటే; మీలోని ఒక సాధారణ వ్యక్తిపై నా యొక్క శ్రేష్టత మరియు గౌరవమును పోలినటువంటిది.” తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ గొప్పతనానికి కారణాన్ని వివరించారు: “ఇది ఎందుకంటే, నిశ్చయంగా పరమపవిత్రుడైన అల్లాహ్ మరియు దైవదూతలలో ఆయన సింహాసనాన్ని మోసే దూతలు; అలాగే దైవదూతలందరిలో ఆకాశాలాలో నివాసం ఉండేవారు మరియు భూనివాసులు, అంటే మానవులు, జిన్నాతులు, పశుపక్ష్యాదులన్నీ చివరకి భూమి లోపల లోతైన తన రంద్రములో నివసించే చీమ, మరియు సముద్రములోని చేపలు – అంటే భూచరాలు, జలచరాలు అన్నీ – ఇవన్నీ, ప్రజలకు ఎందులోనైతే మోక్షము మరియు సాఫల్యము ఉన్నదో అటువంటి ఙ్ఞానాన్ని బోధించే గురువు యొక్క మంచి కొరకు, అతనికి శుభం కలగాలని ప్రార్థిస్తాయి.
హుదైఫహ్ ఇబ్న్ అల్ యమాన్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రకు ఉపక్రమించినపుడు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతిని తలక్రింద ఉంచుకుని, అపుడు ఇలా పలికేవారు: “అల్లాహుమ్మ ఖినీ అజాబక యౌమ తజ్మ’ఉ అవ్ తబ్’అసు ఇబాదక్” (ఓ అల్లాహ్! నీవు నీ దాసులను సమీకరించే దినమున లేదా నీవు నీ దాసులను తిరిగి బ్రతికించే దినమున (పునరుత్థాన దినమున) నీ శిక్ష నుండి నన్ను రక్షించు).”
అత్తిర్మిదీ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రకు ఉపక్రమించినపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన కుడి చేతిని దిండుపై ఉంచి, ఆ అరచేతిపై తన కుడి చెంపను ఆనించి ఇలా పలికేవారు: “అల్లాహుమ్మ” (ఓ అల్లాహ్!) నా ప్రభూ! “ఖినీ” నన్ను రక్షించు, నన్ను కాపాడు; “మిన్ అజాబక” నీ శిక్ష నుండి, నీ దండన నుండి; “యౌమ తజ్మఉ, ఔ తబ్’అసు ఇబాదక్” నీ దాసులను సమీకరించే దినము నాడు లేదా నీ దాసులను తిరిగి జీవింపజేసే దినము (పునరుథ్థాన దినము) నాడు.”