





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు ను గురించి (అతడు చాలా కాలంగా కనిపించకపోవడంతో) వాకబు చేసినారు. అక్కడ ఉన్న వారిలో ఒకతను “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! మీకొరకు అతడిని గురించి తెలుసుకుని వస్తాను” అని పలికి, అతని (సాబిత్ బిన్ ఖైస్) వద్దకు వెళ్ళాడు. సాబిత్ బిన్ ఖైస్ తన ఇంటిలో తలను క్రిందకు వేలాడదీసుకుని (విచారములో మునిగిపోయినట్లుగా) కూర్చుని ఉండుట గమనించి “విషయం ఏమిటి” అని అడిగాడు. దానికి అతడు “కీడు” అన్నాడు. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షములో వారి స్వరానికి మించి పై స్థాయిలో మాట్లాడేవాడు. కనుక తన సత్కార్యాలన్నీ వృధా అయిపోయాయి, వ్యర్థమై పోయాయి, తానింక నరకవాసులలోని వాడై పోయాడు (అని బాధపడసాగినాడు). ఆ వచ్చిన వ్యక్తి తిరిగి వెళ్ళి ‘అతడు ఇలా ఇలా అన్నాడు’ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సమాచారమిచ్చినాడు. తర్వాత ఆ వ్యక్తి సాబిత్ వద్దకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి అమోఘమైన శుభవార్తతో తిరిగి వెళ్ళాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: “అతని వద్దకు వెళ్ళు, వెళ్ళి ‘నీవు నరకవాసులలోని వాడవు కావు, నీవు స్వర్గవాసులలోని వాడవు” అని అతనికి చెప్పు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు ను గురించి వాకబు చేసినారు. వారిలో ఒకతను “మీ కొరకు అతడి సమాచారాన్ని, అతడి గైరుహాజరు కారణాన్ని కనుక్కొని వస్తాను” అని అతని వద్దకు వెళ్ళి, అతడు తన ఇంటిలో తల వేలాడ దీసుకుని విచారములో మునిగి కూర్చుని ఉండడాన్ని చూసి “విషయం ఏమిటి?” అని అడిగాడు. దానికి సాబిత్ తనకు జరిగిన కీడు ఏమిటో చెప్పాడు. సాబిత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షములో, వారి స్వరానికి మించి, పై స్థాయిలో మాట్లాడుతూ ఉండేవాడు. అలా చేసిన వాని గురించి అల్లాహ్ ‘అటువంటి వాని సత్కార్యాలు అన్నీ వృథా చేయబడతాయి, మరియు అతడు నరకవాసులలోని వాడు అవుతాడు’ అని హెచ్చరించినాడు. అది విని ఆ వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి అతడి విషయాన్ని వివరించాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని సాబిత్ వద్దకు తిరిగి వెళ్ళి, అతడు నరకవాసులలోని వాడు కాదని, అతడు స్వర్గవాసులలోని వాడనే అమోఘమైన శుభవార్తను అతనికి వినిపించమని ఆదేశించినారు. ఎందుకంటే అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వక్తగా వ్యవహరించేవాడు మరియు అన్సారులలో ధర్మప్రసంగీకునిగా పనిచేసేవాడు, ఇంకా అతని స్వరం సహజంగానే ఉచ్ఛస్థాయిలో ఉండేది.
అబ్దుల్లాహ్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను: “ముఅజ్జిన్ అజాన్ పలుకుతున్నపుడు మీరు విన్నట్లయితే, అతను పలుకునట్లుగానే మీరూ పలకండి, తరువాత నాపై శాంతి మరియు శుభాలకొరకు ప్రార్థించండి (దరూద్ పఠించండి) ఎవరైతే నాపై ఒకసారి దరూద్ పఠిస్తాడో, అల్లాహ్ దానికి పది రెట్లు ఎక్కువగా అతనిపై శాంతి, శుభాలు కురిపిస్తాడు. తరువాత నాకు ‘అల్-వసీలహ్’ ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకొనండి. అది (అల్-వసీలహ్) స్వర్గములో ఒక సమున్నతమైన స్థానము. అది కేవలం ఒకరికి మాత్రమే ప్రసాదించబడుతుంది. ఆ ఒక్కరు నేనే కావాలని నా ఆశ. ఎవరైతే నా కొరకు వసీల ప్రసాదించమని ప్రార్థిస్తాడో, (తీర్పు దినము నాడు) అతని కొరకు (అల్లాహ్ వద్ద) సిఫారసు చేయడం నాపై విధి అవుతుంది.”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సూచించినారు: ఎవరైతే సలాహ్ (నమాజు) కొరకు ముఅజ్జిన్ పలికే అజాన్ పలుకులు వింటే, ఆ అజాన్ పదాలను ముఅజ్జిన్ (పలికిన వెంటనే అతని) వెనుకే తిరిగి వల్లించాలి, “హయ్య అలస్సలాహ్ – హయ్య అలల్ ఫలాహ్” అనే రెండు వాక్యాలు తప్ప. అజాన్ వింటున్న వ్యక్తి ఈ రెండు వాక్యాలు విన్నప్పుడు, “లా హౌల, వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్” అని పలకాలి. అజాన్ పూర్తి అయిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ‘సలవాత్’ (దరూద్) పఠించాలి. ఎందుకంటే ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఒకసారి ‘సలవాత్’ పఠిస్తారో, దాని కారణంగా అల్లాహ్ వారికి పదింతలుగా ‘సలవాత్’ ను ప్రసాదిస్తాడు. అల్లాహ్ ‘సలవాత్’ ను ప్రసాదించడం అంటే దాని అర్థము అల్లాహ్ అటువంటి దాసుణ్ణి గురించి తన దైవదూతల మధ్య ప్రస్తావించడం, పొగడడం. తరువాత తనకు ‘వసీలహ్’ ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకొనమని ఆదేశించినారు. అది ఒక సమున్నతమైన స్థానము. (స్వర్గములోని స్థానములన్నింటిలోనూ) అది అత్యున్నతమైన స్థానము. ఆ స్థానము పొందుటకు ఎవ్వరూ అర్హులు కారు, మరియు ఎవరికీ సాధ్యము కాదు – సర్వోన్నతుడైన అల్లాహ్ దాసులందరిలోను కేవలం ఒక్కరికి తప్ప. (దానిని గురించి) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఆ ఒక్కరూ నేను కావాలని నా ఆశ” అని. నిజానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా అనడం వారి వినయాన్ని, అణకువను, నమ్రతను తెలుపుతుంది. ఆ స్థానము పొందడానికి కేవలం ఒక్కరు మాత్రమే అర్హులైనట్లయితే, అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాక ఇంకెవరు కాగలరు. ఎందుకంటే సృష్ఠి మొత్తంలో కేవలం ఆయన మాత్రమే అత్యుత్తముడు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు – ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు 'వసీలహ్’ ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకొంటారో, వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సిఫారసు పొందుతారు.
ఉస్మాన్ ఇబ్న్ అబీ అల్ ఆస్ రజియల్లాహు అన్హు తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళి ఇలా అన్నారని ఉల్లేఖిస్తున్నారు: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నిశ్చయంగా షైతాన్ నాకూ, నా సలాహ్’కు (నమాజుకు), మరియు (నమాజులో) నా ఖుర్’ఆన్ పఠనానికి మధ్య వస్తున్నాడు, నా ఏకాగ్రతను భంగపరుస్తున్నాడు.” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “వాడి ‘ఖింజబ్’ అని పిలువబడే షైతాను. నీవు వాడి ప్రభావాన్ని గ్రహించినట్లయితే, వెంటనే (అ’ఊజు బిల్లాహ్ అని) అల్లాహ్ యొక్క శరణు కోరుకో, మరియు నీ ఎడమ వైపునకు మూడు సార్లు (ప్రతీకాత్మకంగా) ఉమ్మివేయి.” నేను అలాగే చేసాను. అల్లాహ్ వాడిని నా నుండి దూరం చేసినాడు.”
ముస్లిం నమోదు చేసినారు:ఉస్మాన్ బిన్ అబీ అల్ ఆస్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి “ఓ ప్రవక్తా! నాకు నా సలాహ్’కు (నమాజుకు) మధ్య షైతాన్ వచ్చి నన్ను నమాజులో మనసు సంపూర్ణంగా లగ్నం చేయకుండా చేస్తున్నాడు, నా ఖుర్’ఆన్ పఠనంలో నన్ను గందరగోళానికి గురి చేస్తున్నాడు; అందులో (నేను సరిగానే పఠిస్తున్నానా అనే) సందేహాన్ని కలుగజేస్తున్నాడు” అన్నారు. అతనితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “వాడు “ఖిన్’జబ్” అని పిలువబడే షైతాను. ఒకవేళ నీవు వాడి ప్రభావాన్ని గ్రహించినట్లయితే, అల్లాహ్ (యొక్క స్మరణ) నే గట్టిగా పట్టుకుని ఉండు, మరియు ఆయన శరణు వేడుకో. మరియు నీ ఎడమ చేయి వైపునకు మూడు సార్లు కొద్దికొద్దిగా ఉమ్మి వేయి.” ఉథ్మాన్ ఇలా అన్నారు “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించిన విధంగానే నేను చేసాను. అల్లాహ్ వాడిని (షైతానును) నా నుండి దూరం చేసినాడు.
అల్ అబ్బాస్ ఇబ్న్ అల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హు) తాను రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించగా విన్నాను అని ఉల్లేఖిస్తున్నారు: “అల్లాహ్’ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను తన సందేశహరునిగా సంతృప్తి చెందిన వ్యక్తి, విశ్వాసము యొక్క మాధుర్యాన్ని చవిచూసినాడు.”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఒక విశ్వాసి తన విశ్వాసములో నిజాయితీగా ఉండి, మరియు ఆ విశ్వాసముతో అతని హృదయం శాంతిని పొందుతుందో, అతడు మూడు విషయాలతో సంతృప్తి చెందినట్లైతే, అటువంటి విశ్వాసి తన హృదయంలో విశాలతను కనుగొంటాడు, అందులో ఆనందాన్ని గ్రహిస్తాడు, సర్వశక్తిమంతుడైన అల్లాహ్’కు చేరువగా ఉండే ప్రీతిని, ఆనందాన్ని పొందుతాడు. మొదటిది: అల్లాహ్’యే తన ప్రభువు అని సంతృప్తి చెందుట: అతడు ఆ విషయంతో సంతృప్తి చెందినట్లైతే, అతని ప్రభువు నుండి అతని భాగంగా అతనికి చేరే ఉపాధి, మరియు అతనిపై వచ్చిపడే పరిస్థితులు అన్నింటి పట్లా అతని హృదయం సంతృప్తితో విశాలం అవుతుంది. అతను తన హృదయంలో దేనిపైనా ఎటువంటి అభ్యంతరాన్ని కనుగొనడు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్’ను వదిలి మరొక ప్రభువు కావాలని కోరడు. రెండవది: ఇస్లాం తన ధర్మమని సంతృప్తి చెందుట: అతడు ఆ విషయంతో సంతృప్తి చెందినట్లైతే, ఇస్లాంయొక్క విధులు మరియు బాధ్యతలపట్ల అతని హృదయం విశాలం అవుతుంది, మరియు అతడు ఇస్లాంను వదిలి మరొక మార్గాన్ని ఎంచుకొనడు. మూడవది: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అనే విషయంలో సంతృప్తి చెందుట: ఆ విషయంలో సంతృప్తి చెందితే, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకు వచ్చిన సందేశము మరియు బోధించిన ప్రతి విషయంతో అతడు ఎటువంటి సందేహమూ, సంశయమూ లేకుండా అతని హృదయం విశాలం అవుతుంది. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గదర్శకం చేసిన విషయాన్ని తప్ప మరింక దేనినీ అనుసరించడు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నాలుగు లక్షణాలు ఉన్నాయి, వాటిని కలిగి ఉన్నవాడు స్వచ్ఛమైన కపటుడు, మరియు వాటిలో ఒకటి ఉన్నవాడు దానిని వదులుకునే వరకు కపటత్వం యొక్క ఒక లక్షణం కలిగి ఉంటాడు: అతను మాట్లాడినప్పుడు, అతను అబద్ధం చెబుతాడు; అతను ఒడంబడిక చేసినప్పుడు, అతను దానిని విచ్ఛిన్నం చేస్తాడు; అతను వాగ్దానం చేసినప్పుడు, అతను దానిని ఉల్లంఘిస్తాడు; మరియు అతను ఎవరితోనైనా వివాదం లోనికి దిగితే, అతను అనైతికంగా ప్రవర్తిస్తాడు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాలుగు లక్షణాలకు వ్యతిరేకంగా హెచ్చరించారు, ఒక ముస్లింలో ఈ నాలుగు లక్షణాలు కలిసి ఉంటే, ఈ లక్షణాల కారణంగా అతను కపటులను బలంగా పోలి ఉంటాడు. ప్రగాఢంగా ఈ లక్షణాలను కలిగి ఉన్నవారికి ఇది వర్తిస్తుంది, కానీ అరుదుగా ఉన్నవారు ఈ వర్గంలో చేర్చబడరు. అవి: మొదటిది: అతను మాట్లాడేటప్పుడు, అతను ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెబుతాడు మరియు అతడు తన మాటలలో సత్యవంతముగా ఎప్పుడూ ఉండడు. రెండవది: అతను ఒడంబడిక చేస్తే, అతను దానిని నెరవేర్చడు, మరియు అతని సహచరుడికి ద్రోహం చేస్తాడు. మూడవది: అతను వాగ్దానం చేస్తే, అతను దానిని నెరవేర్చడు మరియు దానిని ఉల్లంఘిస్తాడు. నాల్గవది: అతను ఎవరితోనైనా వాదనకు దిగి, గొడవపడితే, అతని వాదన తీవ్రంగా ఉంటుంది, అతను సత్యం నుండి వైదొలగుతాడు, మరియు అతను దానిని తిరస్కరించడానికి మరియు దానిని చెల్లనిదిగా చేయడానికి కుతంత్రాలను పన్నుతాడు, మరియు అతను అబద్ధాలు చెబుతాడు. కపటత్వము అంటే, అది లోన ఉన్న దానికి వ్యతిరేకంగా బయటకు చూపడం. ఈ అర్థం ఈ లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తిలో కనుగొనవచ్చు. అతని కపటత్వం అతనితో మాట్లాడే, అతడు వాగ్దానం చేసే, అతను వాదనకు దిగే మరియు అతడు ప్రజలలో ఏదైనా ఒడంబడిక చేసుకునే వారి పట్ల కనిపిస్తుంది. కపటవాది అంటే ఇస్లాంలో అని మాత్రమే కాదు. అతడు తన అవిశ్వాసాన్ని కప్పిపుచ్చుకుంటూ తన కపటత్వాన్ని చూపుతాడు. ఎవరైతే ఈ లక్షణాలలో ఒకదానిని కలిగి ఉంటారో, అతను దానిని విడిచిపెట్టే వరకు అతను కపటత్వం యొక్క ఒక లక్షణాన్ని కలిగి ఉంటాడు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ఒకసారి ఆయన అతా ఇబ్న్ అబీ రబాహ్ తో ఇలా అన్నారు: "స్వర్గవాసులలోని ఒక స్త్రీని నేను నీకు చూపించనా?" దానికి అతా “తప్పనిసరిగా చూపిండి" అని అన్నారు: . అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు అతనితో ఇలా అన్నారు: “ఆ నలుపు రంగు స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నది: “నేను మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాను. దాని కారణంగా (స్పృహ తప్పి పడిపోయినపుడు) నా శరీరం (పై బట్టలు తొలగిపోయి) అనాచ్చాదితం అవుతున్నది. నా కొరకు అల్లాహ్’ ను ప్రార్థించండి”. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నువ్వు కావాలనుకుంటే (ఈ వ్యాధి పట్ల) సహనం వహించు, నువ్వు స్వర్గంలో ప్రవేశిస్తావు; లేదా, నువ్వు కోరుకుంటే, నిన్ను స్వస్థపరచమని నేను అల్లాహ్ను వేడుకుంటాను.”. దానికి ఆమె ఇలా అన్నది: “అయితే నేను సహనం వహిస్తాను. అయితే మూర్ఛ స్థితిలో నేను అనాచ్ఛాదితం అవుతున్నాను. నేను అలా అనాచ్ఛాదితం కాకుండా ఉండేలా చూడమని అల్లాహ్’కు దుఆ చేయండి.” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె కొరకు ఆ విధంగా దుఆ చేసినారు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఅబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు, అతా ఇబ్న్ అబీ రబాహ్ తో “స్వర్గప్రవేశానికి అర్హులైన స్త్రీలలో నుండి ఒక స్త్రీని నీకు చూపించనా?” అని అన్నారు. దానికి అతా “తప్పనిసరిగా చూపించండి” అన్నారు. అపుడు ఆయన “ఒకసారి ఈ నల్లటి స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నది: “నాకు మూర్ఛవ్యాధి ఉన్నది, దాని కారణంగా నేను స్పృహ కోల్పోయి పడిపోతూ ఉంటాను. ఆ స్థితిలో నాకు తెలియ కుండానే నా బట్టలు తొలగిపోయి, నా శరీరం అనాచ్ఛాదితం అయి నా శరీర భాగాలు బయటకు కనిపిస్తూ ఉంటాయి. నా వ్యాధి నయం చేయమని అల్లాహ్ ను ప్రార్థించండి.” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నీవు కావాలనుకుంటే ఈ వ్యాధి పట్ల సహనం వహించు, నీకు స్వర్గం లభిస్తుంది. లేదా నువ్వు కోరుకుంటే నీ వ్యాధి నయం చేయమని అల్లాహ్’ను ప్రార్థిస్తాను.” అపుడు ఆ స్త్రీ ఇలా అన్నది: “అయితే నేను సహనం వహిస్తాను.” ఇంకా ఆమె ఇలా అన్నది: “అయితే నేను స్పృహ కోల్పోయి పడిపోతే నా బట్టలు తొలగి నేను అనచ్ఛాదితం కాకుండా ఉండేలా చేయమని అల్లాహ్’ను ప్రార్థించండి”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె కొరకు ఆ విధంగా దుఆ చేసినారు.
ఉమ్మె అద్’దర్దా మరియు అబూ అద్’దర్దా రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తరుచూ ఇలా పలుకుతూ ఉండేవారు: "ఒక ముస్లిం తోటి ముస్లిం సోదరుని పరోక్షములో అతని కోసం చేసే దుఆకు సమాధానం లభిస్తుంది. ప్రతి ముస్లిం తల వద్ద అతని కొరకు నియమించబడిన ఒక దైవదూత ఉంటాడు. ఆ ముస్లిం తోటి ముస్లిం సోదరుడి మంచి కొరకు దుఆ చేసినప్పుడల్లా, అతని కొరకు నియమించబడిన దైవదూత ఇలా అంటాడు: “ఆమీన్, ఇదే మంచిని అల్లాహ్ మీకు కూడా ప్రసాదించు గాక."
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఒక ముస్లిం తన తోటి ముస్లిం కొరకు అతను తన దగ్గర లేనపుడు (అతని పరోక్షంలో) చేసే దుఆకు సమాధానం లభిస్తుంది; ఎందుకంటే అది అతని పట్ల గొప్ప నిజాయితీని ప్రదర్శిస్తుంది. దుఆ చేసే వ్యక్తి తల వద్ద ఒక దైవదూత ఉంటాడు, అతను తన సోదరుడికి మంచి జరగాలని దుఆ చేసినప్పుడల్లా ఆ దైవదూత ఇలా అంటాడు: “ఆమీన్, మరియు నీవు కూడా అదే పొందుతావు”.
అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అల్లాహ్ కు అత్యంత ప్రియమైన ప్రదేశాలు మస్జిదులు, మరియు అల్లాహ్ కు అత్యంత అయిష్టమైన ప్రదేశాలు మార్కెట్లు (బజార్లు, సంతలు, అంగళ్ళు, వాణిజ్యకేంద్రాలు, వ్యాపార లావాదేవీలు జరిగే ప్రదేశలు మొ.)”.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: సర్వశక్తిమంతుడైన అల్లాహ్’కు అత్యంత ప్రియమైన ప్రదేశాలు మస్జిదులు, ఎందుకంటే అవి విధేయతా గృహాలు మరియు దైవభక్తిపై స్థాపించ బడినటువంటివి. అల్లాహ్’కు అత్యంత అసహ్యకరమైన ప్రదేశాలు మార్కెట్లు, ఎందుకంటే అవి తరచుగా మోసం, వంచన, వడ్డీ, తప్పుడు ప్రమాణాలు, వాగ్దానాల ఉల్లంఘనలు మరియు అల్లాహ్ యొక్క జ్ఞాపకం (స్మరణ) నుండి తప్పుదారి పట్టించే ప్రదేశాలు.
అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరైతే తన సోదరుడికి తన గౌరవం విషయంలో లేదా మరేదైనా విషయంలో అన్యాయం చేసి ఉన్నట్లైతే, అతడు ఒక దీనార్ లేదా ఒక దిర్హమ్ కూడా లేని సమయం రాకముందే అంటే ఈరోజే అతడిని (ఆ సోదరుడిని) క్షమాపణ వేడుకోవాలి. (లేకపోతే తీర్పు దినమున) అతడు మంచిపనులు చేసి ఉంటే, అతడు చేసిన తప్పుకు సమానమైన మొత్తములో అతడి మంచి పనులను తీసుకోవడం జరుగుతుంది; అతడి మంచిపనులు లేకపోతే అతని సోదరుని చెడు పనుల నుండి కొన్ని అతనిపై మోపబడతాయి."
అల్ బుఖారీ నమోదు చేసినారు:ఎవరైతే తన ముస్లిం సోదరుడికి అతడి గౌరవం, డబ్బు లేదా రక్తం విషయంలో అన్యాయం చేస్తారో, అలాంటి ప్రతి ఒక్కరూ, పునరుత్థాన దినం రాకముందే, తాను అన్యాయం చేసిన వ్యక్తిని క్షమించమని అడగాలి అని ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. ఆ రోజు ఒక దీనార్ బంగారం లేదా ఒక దిర్హం వెండి తనకు తానుగా విమోచన క్రయధనంగా అంటే పరిహారంగా చెల్లించాలి అనుకున్నా ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆ రోజు శిక్ష మంచి పనులు మరియు చెడు పనుల రూపంలో ఉంటుంది. అన్యాయానికి గురైన వ్యక్తి, తనకు జరిగిన అన్యాయానికి తగినట్టుగా, అన్యాయం చేసిన వ్యక్తి యొక్క సత్కార్యాల నుండి సత్కార్యాలను తీసూంటాడు. అన్యాయం చేసిన వ్యక్తి వద్ద సత్కార్యాలు లేకపోయినట్లైతే, అన్యాయానికి గురైన వ్యక్తి యొక్క చెడు పనులలో కొన్ని అన్యాయం చేసిన వ్యక్తిపై వేయబడతాయి.