





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
సఫ్’వాన్ ఇబ్న్ ముహ్రిజ్ (రహిమహుల్లాహ్) ఉల్లేఖన: “ఒక వ్యక్తి అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హు) వద్దకు వచ్చి ఇలా అడిగాడు: “ ‘నజ్వా’లో (నజ్వా: రహస్య సమావేశం) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమి పలుకగా మీరు విన్నారు?” అని. దానికి ఆయన ఇలా అన్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “తీర్పు దినమున ఒక విశ్వాసి సర్వశక్తిమంతుడైన తన ప్రభువు దగ్గరికి తీసుకురాబడతాడు, మరియు ఆయన అతనికి తన కనఫహ్ (దాచి ఉంచుట) ను ప్రసాదిస్తాడు (అతడిని మిగతా వారి నుండి మరుగు పరుస్తాడు) తరువాత అతని పాపాలను ఒప్పుకునేలా చేస్తాడు, అల్లాహ్ అతనితో ఇలా అంటాడు: “(నువ్వు ఈ విధంగా చేసావు) నీకు తెలుసు కదా!” దానికి అతడు “ఓ నా ప్రభూ! అవును (నేను చేసాను) నాకు తెలుసు” అంటాడు. అపుడు అల్లాహ్ ఇలా అంటాడు: “నిశ్చయంగా నేను వాటిని నీ కొరకు ఇహలోకంలో దాచి ఉంచినాను, మరియు ఈ దినము నీ కొరకు వాటిని క్షమించినాను.” మరియు అతనికి అతని సత్కార్యాల చిట్ఠా ఇవ్వబడుతుంది. సత్యతిరస్కారులు మరియు కపటుల విషయానికొస్తే, వారు సమస్త సృష్టి ముందు పిలవబడతారు: వీరే అల్లాహ్ పై అబద్ధం చెప్పినవారు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పునరుత్థాన దినమున విశ్వాసి అయిన తన దాసుడితో అల్లాహ్ జరిపే సన్నిహిత సంభాషణ గురించి తెలియజేస్తూ ఆయన (స) ఇలా అన్నారు: పునరుత్థాన దినమున విశ్వాసి తన ప్రభువు దగ్గరికి తీసుకురాబడతాడు. అపుడు అల్లాహ్ అతడిని మిగతా వారి నుండి మరుగు పరుస్తాడు, అతని రహస్యాలు మిగతావారికి తెలియకుండా ఉండేలా. తరువాత అతనితో అల్లాహ్ ఇలా అంటాడు: “(నువ్వు) ఫలానా, ఫలానా పాపం (చేసినావు) నీకు తెలుసు కదా?” దాసునికీ మరియు అతని ప్రభువుకు మధ్య ఉన్న పాపాలను అతను గుర్తించేలా చేస్తాడు. దానికి అతడు: “అవును ఓ నా ప్రభూ” అని ఒప్పుకుంటాడు. విశ్వాసి భయపడిపోతాడు, అపుడు సర్వ శక్తిమంతుడైన అల్లాహ్, అతనితో ఇలా అంటాడు: నేను ఈ లోకంలో నీ కోసం దానిని కప్పి ఉంచాను మరియు ఈ రోజు నీ కోసం దానిని క్షమించాను. తరువాత అతనికి అతని మంచి పనుల రికార్డు ఇవ్వబడుతుంది. సత్యతిరస్కారికి, కపట విశ్వాసికి సంబంధించి, అందరి ముందు ఇలా అనబడుతుంది: “వీరే తమ ప్రభువుపై అబద్ధం చెప్పినవారు. దుర్మార్గులపై అల్లాహ్ శాపం పడుగాక.”
ముఆద్ ఇబ్న్ జబల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో కలిసి ప్రయాణంలో ఉన్నాను. ఒక రోజు ఉదయం మేము ప్రయాణిస్తున్నపుడు, నేను వారికి దగ్గరగా ఉన్నాను. అపుడు నేను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం!, నన్ను స్వర్గంలోనికి ప్రవేశింపజేసే, మరియు నరకాగ్ని నుండి నన్ను దూరంగా ఉంచే ఒక ఆచరణను గురించి నాకు తెలియజేయండి”. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిజంగా నీవు నన్ను గొప్ప విషయం గురించి అడిగావు, అయితే అల్లాహ్ ఎవరికి సులభతరం చేస్తాడో, వారికి అది చాలా సులభం. కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించు, ఆయనతో పాటు ఎవరినీ, దేనినీ సాటిగా నిలబెట్టకు, సలాహ్’ (నమజు) స్థాపించు, జకాత్ చెల్లించు, రమదాన్ మాసము ఉపవాసాలు పాటించు మరియు అల్లాహ్ గృహం యొక్క (కాబతుల్లాహ్ యొక్క) హజ్ చేయి”. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇంకా ఇలా అన్నారు: "నేను నిన్ను శుభాల ద్వారముల వైపునకు మార్గదర్శకం చేయనా! ఉపవాసం ఒక కవచం, నీరు అగ్నిని ఆర్పినట్లు దాతృత్వం పాపాన్ని ఆర్పివేస్తుంది అలాగే రాత్రి సగభాగములో మనిషి ఆచరించే సలాహ్". తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు: “{تَتَجَافَى جُنُوبُهُمْ عَنِ الْمَضَاجِعِ} నుండి మొదలుకుని {يَعْمَلُونَ} వరకు (సూరహ్ అస్’సజ్దహ్ 16-17). తరువాత ఇలా అన్నారు: "ఈ మొత్తం విషయం యొక్క శిరస్సు, ఈ మొత్తం విషయం యొక్క మూల స్థంభము మరియు దాని శిఖరం గురించి నేను నీకు తెలియజేయనా?" దానికి నేను: “తప్పకుండా ఓ రసూలల్లాహ్! నాకు తెలియజేయండి” అన్నాను. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "ఈ మొత్తం విషయానికి శిరస్సు ఇస్లాం, దాని మూలస్థంభము సలాహ్ మరియు దాని శిఖరం జిహాద్." తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇలా అన్నారు: “వీటన్నింటినీ పట్టి ఉంచేది ఏమిటో తెలుపనా?” దానికి నేను “తప్పకుండా తెలపండి ఓ ప్రవక్తా!” అన్నాను. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన నాలుకను పట్టుకుని “దీనిని నియంత్రణలో ఉంచుకో” అన్నారు. నేను “ఓ అల్లాహ్ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! మనం మాట్లాడే మాటలకు మనం జవాబుదారీగా ఉంటామా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నీ తల్లి నిన్ను పోగొట్టుకోను, ఓ ముఆద్! నాలుకలు పండించే పంట తప్ప మనుషులను వారి ముఖాల మీదనో లేదా వారి ముక్కు మీదనో నరకాగ్నిలో పడవేసేది ఏదైనా ఉందా?”
అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ముఆద్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ఒక ప్రయాణంలో ఉన్నాను, మరియు ఒక రోజు మేము నడుచుకుంటూ వెళుతున్నప్పుడు నేను ఆయనకు దగ్గరగా ఉన్నాను, అపుడు నేను ఇలా అడిగాను: "ఓ రసూలల్లాహ్! నన్ను స్వర్గములోనికి ప్రవేశింపజేసే మరియు నన్ను నరకం నుండి దూరంగా ఉంచే ఆచరణ గురించి చెప్పండి." ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇలా అన్నారు: "వాస్తవానికి నీవు ప్రజలు నిర్వహించడం కష్టతరమైన ఒక కార్యం గురించి అడిగావు, అయితే అల్లాహ్ ఎవరికి సులభతరం చేస్తాడో అది వారికి చాలా సులభం మరియు తేలిక - ఇస్లాం విధిగా ఆచరించమని ఆదేశించిన వాటిని ఆచరించు." మొదటిది: ఎవరినీ, దేనినీ ఆయనకు సాటిగా, సహవర్తిగా, భాగస్వామిగా నిలబట్టకుండా కేవలం అల్లాహ్’ను మాత్రమే ఆరాధించు. రెండవది: రాత్రంబవళ్ళలో విధిగా ఆచరించవలసిన ఐదు నమాజులు ఆచరించు – ఫజ్ర్, దొహ్ర్, అస్ర్, మగ్రిబ్ మరియు ఇషా నమాజులు; వాటి నిర్ధారిత సమయాలలో, వాటికి సంబంధించిన అన్ని నియమాలను, సంప్రదాయాలను పాటిస్తూ ఆచరించు. మూడవది: విధి చేయబడిన జకాతును చెల్లించు. ఇది ఒక ఆర్ధిక పరమైన ఆరాధన. ఇది నిర్ణీత స్థాయికి చేరిన కొన్ని సంపదలపై షరియత్ విధి చేసిన మొత్తము. ఇది అర్హులైన వారికి ఇవ్వబడుతుంది. నాలుగవది: రమదాన్ మాసము ఉపవాసములు పాటించుట. ఉపవాసము అంటే ఉషోదయం నుండి మొదలుకుని, సూర్యాస్తమయం వరకు, ఆరాధనా సంకల్పముతో తినుట, త్రాగుట మరియు ఉపవాసమును భంగపరిచే ప్రతి విషయము నుండి దూరంగా ఉండుట. ఐదవది: హజ్ యొక్క నియమాలను పాటిస్తూ, కేవలం సర్వోన్నతుడైన అల్లహ్’ను ఆరాధించే సంకల్పముతో, మక్కాహ్ నగరాన్ని దర్శించి బైతుల్లాహ్ యొక్క (అల్లాహ్ యొక్క గృహము) హజ్ చేయుట. అప్పుడు ఆయన (స) ఇలా అన్నారు: “నేను నీకు శుభాల ద్వారాలకు దారి తీసే మార్గం గురించి తెలియజేయనా? విధిగా ఆచరించ వలసిన విషయాలతో పాటు స్వచ్ఛంద ఆరాధనలను (సున్నతు, నఫిల్) నిర్వర్తించు”. మొదటిది: స్వచ్ఛంద ఉపవాసములు పాటించుట, ఇది వాంఛలను, కోరికలను అణచివేసి, వ్యక్తిలో శక్తిని తక్కువ చేస్తుంది, తద్వారా పాపకార్యములలో పడిపోకుండా నిరోధిస్తుంది. రెండవది: (విధిగా చెల్లించే జకాతు కాక) స్వచ్ఛందంగా దానములు చేయుట, ఒకవేళ మన వల్ల ఏదైనా తప్పుడు పని, పాపపు పని జరిగిపోయినట్లైతే, ఈ స్వచ్చంద దానములు దానిని తుడిచివేస్తాయి. మూడవది: రాత్రి చివరి భాగములో ఆచరించే తహజ్జుద్ సలాహ్. తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్కులను పఠించినారు: {تتجافى جنوبهم } అంటే “వారు తమ ప్రక్కలను (కుడి, ఎడమ ప్రక్కలను) దూరం చేసుకుంటారు”; {عن المضاجع} “తమ మెత్తని పరుపులనుండి”; {يدعون ربهم} “తమ ప్రభువును వేడుకుంటారు” సలాహ్ ద్వారా, ఆయనను స్మరించుట ద్వారా; ఖుర్’ఆన్ పఠనం ద్వారా, మరియు దుఆ చేయుట ద్వారా; {خَوْفًا وَطَمَعًا وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ فَلَا تَعْلَمُ نَفْسٌ مَّا أُخْفِيَ لَهُم مِّن قُرَّةِ أَعْيُنٍ} “భయంతో మరియు ఆశతో వేడుకుంటారు; మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చుచేస్తారు; కాని వారికి, వారికర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచిపెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు”; అంటే, తీర్పు దినాన మరియు స్వర్గంలో వారికి అంతిమ సౌఖ్యాన్ని అందించే ఆనందం {جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ ١٧} (వారు ఆచరిస్తూ ఉండిన దానికి ప్రతిఫలంగా). (వారు (రాత్రులలో) తమ ప్రక్కలను తమ పరుపుల నుండి దూరం చేసి, తమ ప్రభువును భయంతో మరియు ఆశతో వేడుకుంటారు మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చుచేస్తారు. కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచి పెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు). అప్పుడు ఆయన (స) ఇలా అన్నారు: నేను నీకు ధర్మం యొక్క (దీన్ యొక్క) పునాది ఏమిటో తెలుపనా? దాని ఆధారభూతమైన మూల స్తంభము గురించి తెలుపనా? మరియు దాని శిఖరం గురించి తెలుపనా? ము’ఆద్ (రదియల్లాహు అన్హు) “తప్పకుండా తెలుపండి ఓ రసూలల్లాహ్” అన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: ఈ మొత్తం విషయం యొక్క శిరస్సు అల్’ఇస్లాం. ఇస్లాం అంటే రెండు విషయాలపట్ల సాక్ష్యం ఇవ్వడం (షహాదతాన్ – రెండు సాక్ష్యాలు). విశ్వాసానికి సంబంధించిన ఈ రెండు సాక్ష్యాల ద్వారా ధర్మం యొక్క సారాంశాన్ని పొందుతారు. మరియు దాని స్తంభం సలాహ్, కనుక సలాహ్ లేకుండా ఇస్లాం లేదు, ఒక ఇల్లు స్తంభం లేకుండా లేనట్లే, ఎవరైనా సలాహ్ చేస్తే, అతని ఇస్లాం (ధర్మం) మరింత బలపడుతుంది మరియు ఉన్నతమవుతుంది; దాని శిఖరం మరియు ఔన్నత్యం జిహాద్లో ఉంది మరియు అల్లాహ్ వాక్కును అత్యున్నతం చేయుటకుగానూ ఇస్లాం యొక్క శత్రువులతో పోరాడడంలో, కృషి చేయడంలో ఉంది. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇలా అన్నారు: పైన పేర్కొన్న వాటిని ఏది నియంత్రిస్తుందో మరియు ఏది పరిపూర్ణం చేస్తుందో నేను నీకు చెప్పనా? ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన నాలుకను పట్టుకుని ఇలా అన్నారు: దీన్ని నియంత్రించుకో మరియు మీకు సంబంధం లేని వాటి గురించి మాట్లాడకు. అపుడు ముఆద్ ఇలా అన్నాడు: మనం మాట్లాడే దానికి మన ప్రభువు మనల్ని జవాబుదారీగా మరియు బాధ్యులుగా చేసి శిక్షిస్తాడా?! అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “నీ తల్లి నిన్ను పోగొట్టుకోను” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన మాటను మొదలుపెట్టారు. ఇలా అనడం వాస్తవానికి శాపనార్థం కాదు. ఇది అరబీ భాషలో ఒక విధమైన వాడుక – “ఇంత చిన్న విషయం కూడా నీకు తెలియదా, నీవు దీనిని గురించి ఎప్పుడో తెలుసుకుని ఉండవలసింది” అని ఆ విషయం పట్ల అతణ్ణి హెచ్చరించడం; ఉదాహరణకు తెలుగు భాషలో “నీ మొహం మండా” అనడం లాంటిది, ఇలా అనడం తెలుగు భాషలో అతని ముఖం నిజంగానే మండాలని పెట్టే శాపనార్థం కాదు అన్న విషయం మనందరికీ తెలుసు. తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “మనుషుల నాలుకలు పండించే పంటలు - అవిశ్వాసం, అపనిందలు, తిట్లు, దూషణలు, చాడీలు మాట్లాడుట - ఇవి తప్ప మనుషులను మంటల్లోకి నెట్టివేసి వారి ముఖాలపై పడేలా చేసేది మరేదైనా ఉందా?”.
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఓ ప్రజలారా! నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్ధుడు మరియు పరిశుద్ధమైన వాటిని తప్ప మరి దేనినీ అంగీకరించడు. ప్రవక్తలకు ఆదేశించిన దానినే అల్లాహ్ విశ్వాసులకూ ఆదేశించినాడు. దివ్య ఖుర్’ఆన్ లోని అల్లాహ్ ప్రకటన: “ఓ సందేశహరులారా! పరిశుద్ధమైన వాటినే తినండి మరియు సత్కార్యాలు చేయండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా నాకు బాగా తెలుసు” [సూరహ్ అల్ ము’మినూన్ 23:51]; మరియు అల్లాహ్ మరో ప్రకటన: “ఓ విశ్వాసులారా! మీరు నిజంగా కేవలం ఆయన (అల్లాహ్)నే ఆరాధించేవారు అయితే; మేము మీకు జీవనోపాధిగా ప్రసాదించిన పరిశుద్ధ (ధర్మసమ్మత)మైన వాటినే తినండి...” [సూరహ్ అల్ బఖరహ్ 2:172]. తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సుదూర ప్రయాణీకుడి గురించి ప్రస్తావించినారు, అతడి తలవెంట్రుకలు చిందరవందరగా ఉన్నాయి, అతడి శరీరమంతా మట్టికొట్టుకుని ఉంది, అతడు తన రెండు చేతులు ఆకాశం వైపునకు చాచి “ఓ నా ప్రభూ! ఓ నా ప్రభూ!” అంటూ వేడుకుంటున్నాడు. మరి చూడబోతే అతని ఆహారం హరాం (ధర్మసమ్మతమైనది కాదు); అతని పానీయం హరాం, అతని దుస్తులు హరాం, మరియు అతని పోషణ పూర్తిగా హరాం. మరి అది (అతని దుఆ, వేడుకోలు) ఎలా స్వీకరించబడుతుంది?”
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీథులో దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్ధుడు, మరియు పరమ పవిత్రుడు, కొరతలు, లోపాలు మరియు దోషాలు లేనివాడు మరియు పరిపూర్ణతలతో కూడిన సంపూర్ణ గుణగణాలు, లక్షణాలు కలిగిన వాడు. ఆయన మంచిని మరియు పరిశుద్ధమైన వాటిని, మరియు కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ఆచరించిన వాటిని మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గదర్శకానికి అనుగుణంగా ఉన్న వాటిని తప్ప మరి దేనినీ అంగీకరించడు – అవి ఆచరణలైనా, పలుకులైనా లేదా నమ్మకాలైనా. వీటి ద్వారా తప్ప ఎవరూ అల్లాహ్ సామీప్యానికి చేరుకోవాలని కోరుకోరాదు. విశ్వాసి తన ఆచరణలను ఉత్తమమైనవిగా మార్చుకోవడానికి ఉన్న మార్గాలలో ఉత్తమమైనది ఏమిటంటే అతడు తినే ఆహారం పరిశుద్ధమైనదై ఉండడం, అంటే హలాల్ సంపాదన ద్వారా సంపాదించినది మాత్రమే తినడం. అది అతడి ఆచరణలను పరిశుద్ధ పరుస్తుంది. ఆ విధంగా అతడి ఆచరణలు పరిశుద్ధమవుతాయి. కనుక, అల్లాహ్ తాను ప్రవక్తలకు, సందేశహరులకు ఏదైతే ఆదేశించినాడో, దానినే విశ్వాసుల కొరకు కూడా ఆదేశించినాడు: ధర్మసమ్మతమైన దానిని (హలాల్) మాత్రమే తినండి మరియు మంచి పనులు చేయండి’ అని. అల్లాహ్ ప్రకటన, { يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا ۖ إِنِّي بِمَا تَعْمَلُونَ عَلِيمٌ } [ఓ సందేశహరులారా! పరిశుద్ధమైన వాటినే తినండి మరియు సత్కార్యాలు చేయండి. 17 నిశ్చయంగా, మీరు చేసేదంతా నాకు బాగా తెలుసు. సూరహ్ అల్ ము’మినూన్ 23:51]; మరియు అల్లాహ్ ప్రకటన: { يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ} [ఓ విశ్వాసులారా! మీరు నిజంగానే కేవలం ఆయన (అల్లాహ్)నే ఆరాధించేవారు అయితే; మేము మీకు జీవనోపాధిగా ఇచ్చిన పరిశుద్ధ (ధర్మసమ్మత)మైన వాటినే తినండి, సూరహ్ అల్ బఖరహ్ 2:172] ఇంకా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హరాం (ధర్మ విరుద్ధమైనది) తినరాదని హెచ్చరించినారు. అది ఆచరణలను నాశనం చేస్తుంది. అది ఆచరణలు (అల్లాహ్ వద్ద) స్వీకరించబడడాన్ని నిరోధిస్తుంది; ఆ బాటసారి ఆమోదయోగ్యమైన స్పష్టమైన మార్గాలను ఉపయోగించినప్పటికీ అతని ఆచరణలు ఆమోదయోగ్యం కావు: ఉదాహరణకు: మొదటిది: (అల్లాహ్’కు) విధేయతను చూపే వాటిని ఆచరించుటకు అతడు ఎంత దూరం ప్రయాణించినా, అంటే హజ్ చేయడం, జిహాద్ లో పాల్గొనడం, అలాగే బంధుత్వాలను గౌరవించడం, వాటిని నిభాయించడం మొదలైనవి చేసినా, చేస్తూ ఉన్నా. రెండవది: తల వెంట్రుకలను దువ్వుకోకపోవడం వల్ల చిందరవందరగా ఉన్న వెంట్రుకలు, దుమ్ము కారణంగా రంగు మారిన చర్మం మరియు అతని ఒంటిపై బట్టలు కూడా రంగు మారి, అతను నిస్సహాయంగా దీనస్థితిలో ఉన్నాడు. మూడవది: అతడు తన రెండు చేతులను ఆకాశం వైపునకు ఎత్తి దుఆ చేయడం. నాల్గవది: అల్లాహ్’ను ఆయన పేర్ల ద్వారా పట్టుదలతో వేడుకొనడం: “ఓ నా ప్రభూ! ఓ నా ప్రభూ!” అంటూ. ఈ విధంగా ప్రార్థనలకు జవాబు లభించటానికి ఆవశ్యకమైన అన్ని మార్గాలు ఉన్నప్పటికీ, అతడికి ఏ సమాధానమూ లభించ లేదు; ఎందుకంటే అతని ఆహారం, పానీయం మరియు బట్టలు హరాం (అక్రమమైనవి), మరియు అతడు హరాం (ధర్మ విరుద్ధమైన, అక్రమమైన వాటి) ద్వారా పోషించబడ్డాడు. ఈ హదీథులో వర్ణించబడినటువంటి వ్యక్తి విన్నపానికి, అతని వేడుకోలుకు సమాధానం లభించడం దాదాపుగా అసంభవం; దానికి ఎలా సమాధానం లభిస్తుంది?
అల్ మిఖ్’దాద్ ఇబ్న్ ఆమిర్ అల్ కిందియ్య (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: అతను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా పలికినాడు: “ఒకవేళ ఎవరైనా ఒక అవిశ్వాసి (యుద్ధంలో తారసపడి) మేమిద్దరమూ తలపడినపుడు; అతడు తన కరవాలముతో నా చేతిపై దాడి చేసి, నా చేతిని ఖండించి వేసి, నా నుంచి పరుగెత్తుకుని వెళ్ళి ఒక చెట్టును రక్షణగా చేసుకుని “అల్లాహ్’కు నన్ను నేను సమర్పించుకున్నాను” అని షహాదా పఠించినట్లైతే, ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! అతడు ఆ విధంగా (షహాదా) పలికిన తరువాత నేను అతడిని చంపవచ్చునా?” దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం “లేదు, అతడిని చంపరాదు” అన్నారు. దానికి మిఖ్’దాద్ ఇబ్న్ ఆమిర్ “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! అతడు నా ఒక చేతిని ఖండించినాడు. దాని తరువాత కూడా అతడిని వధించకూడదా?” అన్నాడు. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అతడిని చంపరాదు; ఒకవేళ అతడిని చంపినట్లయితే (గమనించు) అతడిని చంపక ముందు నీవు ఏ స్థానంలో ఉన్నావో, (షహాదా పలికిన తరువాత) అతడు ఆ స్థానంలో ఉన్నాడు. మరియు షహదా పలుకక ముందు అతడు ఏ స్థానంలో ఉన్నాడో నీవు ఆ స్థానంలో ఉంటావు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఅల్ మిఖ్’దాద్ ఇబ్న్ అల్ అస్వద్ (రదియల్లాహు అన్హు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించినారు: యుద్ధంలో ఒకవేళ తనకు ఒక అవిశ్వాసి తారసపడి, తామరిద్దరూ ఖడ్గాలతో తలపడినపుడు, అతడు ఖడ్గంతో తన రెండు చేతులలో ఒకదానిపై దాడి చేసి దానిని ఖండించి వేసి, తరువాత తన నుండి పారిపోయి ఒక చెట్టును రక్షణగా చేసుకుని “అష్’హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహ్” అని షహాదా పలికినట్లయితే, నా చేతిని ఖండించిన వాడిని చంపడానికి అనుమతి ఉందా? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: “లేదు, అతడిని చంపరాదు.” అపుడు అతడు ఇలా అన్నాడు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! అతడు నా ఒక చేతిని ఖండించినాడు, అయినా అతడిని చంపరాదా?” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అవును, అతడిని చంపరాదు. ఎందుకంటే (అతడు ఇస్లాం స్వీకరించుట వలన) అతని రక్తం చిందించుట హరాం (నిషేధము). అతడు ఇస్లాం స్వీకరణ ప్రకటించిన తర్వాత నీవు అతనిని చంపినట్లయితే, అతడు ఇస్లాం ప్రకటించడం అతడి జీవితాన్ని నీ జీవితం లాగానే ఉల్లంఘించరానిదిగా చేసింది, అతడు నీతో సమాన స్థానం కలిగి ఉంటాడు. అతణ్ణి చంపినందుకు చట్ట ప్రకారం ప్రతీకారంగా నీకు మరణశిక్ష విధించబడుతుంది.”
అబూ బర్జహ్ అల్ అస్లమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పునరుత్థాన దినము నాడు, కొన్ని విషయాలను గురించి ప్రశ్నించనంత వరకు, మానవుడి కాళ్ళు అతడు నిలుచుని ఉన్నచోటు నుండి ఏమాత్రమూ కదలవు – అతడి జీవితాన్ని గురించి – అతడు దానిని ఎందులో గడిపినాడు అని; అతడి జ్ఞానాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా ఉపయోగించినాడు అని; అతడి సంపదను గురించి – ఎక్కడి నుండి సంపాదించినాడు అని, మరియు దానిని ఎక్కడ ఖర్చు చేసినాడు అని; మరియు అతడి శరీరాన్ని గురించి – అతడు దానిని ఏ విధంగా పరిసమాప్తి గావించినాడు (ఏ విధంగా ఉపయోగించినాడు) అని.
అత్తిర్మిదీ నమోదు చేసినారు:ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: పునరూత్థాన దినమున ప్రజలలో ఏ ఒక్కరు కూడా తమ తమ స్థానాల నుండి – వారిని కొన్ని విషయాల గురించి ప్రశ్నించబడే దాకా – స్వర్గం వైపునకు లేదా నరకం వైపునకు ఒక్క అడుగు కూడా కదపలేరు. మొదటిది: అతడి జీవితాన్ని గురించి – అతడు ఎలా గడిపాడు మరియు దేనిలో అంతం చేశాడు? రెండవది: అతడి జ్ఞానాన్ని గురించి – అతడు జ్ఞానాన్ని కేవలం అల్లాహ్ (యొక్క కరుణా కటాక్షాల) కొరకు మాత్రమే ఆర్జించినాడా? ఆర్జించిన జ్ఞానము ప్రకారం ఆచరించినాడా? మరియు ఆ జ్ఞానాన్ని అర్హులకు చేరవేసినాడా? మూడవది: అతడి సంపద గురించి: ఎక్కడినుండి సంపాదించినాడు? అది ధర్మబద్ధంగా ఆర్జించినదా లేక అధర్మంగా ఆర్జించినదా? ఆ సంపదను దేనిపై ఖర్చు చేసినాడు? అల్లాహ్ ఇష్టపడే వాటిపై ఖర్చు చేసినాడా లేక అల్లాహ్ కు అయిష్టమైన వాటిపై ఖర్చు చేసినాడా? నాలుగవది: అతడి శరీరము, శక్తి, ఆరోగ్యము మరియు యవ్వనం గురించి: అతడు వాటిని ఏవిధంగా వినియోగించినాడు మరియు వాటిని ఏవిధంగా ఉపయోగించినాడు?
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ఖైబర్ యుద్ధము జరిగిన దినమున రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా, అల్లాహ్ను మరియు అతని ప్రవక్తను ప్రేమించే వ్యక్తికి నేను ఈ జెండా ఇస్తాను మరియు అల్లాహ్ అతని చేతుల్లో విజయాన్ని ప్రసాదిస్తాడు”. ఉమర్ ఇబ్న్ అల్-ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “నాయకత్వం కోసం నేను ఎప్పుడూ ఆశపడలేదు, ఆ రోజు తప్ప”. ఆయన ఇంకా ఇలా అన్నారు: "(ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్నే పిలుస్తారు అనే ఆశతో) నేను దాని కోసం పిలువబడతాను అనే ఆశతో, వారి దృష్టిలో పడేలా నేను అటూ ఇటూ తిరుగసాగాను.” ఆయన ఇంకా ఇలా అన్నారు: “చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ను పిలిపించి, ఆ జెండాను ఆయన చేతికి ఇచ్చి, ఇలా అన్నారు: “(ఓ అలీ!) ముందుకు సాగు, అల్లాహ్ నీకు విజయాన్ని ప్రసాదించే వరకు వెనుకకు చూడకు”; ఆయన ఇంకా ఇలా అన్నారు: “అలీ ముందుకు కదిలాడు, కొద్ది దూరంలో ఆగి, వెనుకకు తిరగకుండా, గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు “ఓ రసూలుల్లాహ్! నేను ఏ విషయంపై ఆ ప్రజలతో పోరాడాలి?”; దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ తప్ప వెరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు” అని సాక్ష్యమిచ్చే వరకు వారితో పోరాడు. వారు ఒకవేళ అలా చేసినట్లయితే వారి రక్తము మరియు సంపదలు నీ కొరకు ఉల్లంఘించరానివి (హరాం) అవుతాయి - షరియత్ ప్రకారం అలా చేయవలసి వస్తే తప్ప; మరియు వారి లెక్క అల్లాహ్ వద్ద ఉంటుంది.”
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలకు ఇలా తెలియజేసారు: మరుసటి రోజు తాను జెండా ఎవరి చేతికైతే ఇస్తానో, ఆ వ్యక్తి చేతిలో, మదీనా సమీపంలోని ఖైబర్ అనే నగరపు యూదులపై ముస్లింలు విజయం సాధిస్తారు. ఇక్కడ జెండా అంటే, యుద్ధానికి బయలుదేరి వెళ్ళే సైన్యం, జెండాను తన నినాదంగా తీసుకుంటుంది. ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఏమిటంటే అతను అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తాడు మరియు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు అతడిని ప్రేమిస్తారు. ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) ఇలా పేర్కొన్నారు: తాను ఎప్పుడూ నాయకత్వం కావాలని ఇష్టపడలేదు - ఆ (ఖైబర్) దినమున తప్ప; అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని ప్రేమను పొందగలను అని ఆశపడ్డానని పేర్కొన్నారు. ఆ బృహత్కార్యం కొరకు తాను పిలువబడతాను అని, ఆ జెండాను తానే తీసుకోవాలి అనే ఆసక్తితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దృష్టిలో పడాలని తన ఛాతీని విశాలంగా చేసినాను అని పేర్కొన్నారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ను పిలిచి ఆ జెండాను ఆయన చేతికి అందించి ఇలా ఆదేశించినారు “సైన్యంతో ముందుకు కదులు, యుద్ధభూమిలో శత్రువును ఎదుర్కొన్నపుడు, అల్లాహ్ నీకు ఈ కోటలపై విజయం మరియు ఆధిపత్యాన్ని ఇచ్చే వరకు యుద్ధభూమిని విడువకు - విశ్రాంతి కొరకో, లేక కొద్దిపాటి విడుపు ప్రకటించినప్పుడో, లేక యుద్ధవిరామం ప్రకటించినప్పుడో తప్ప .” అలీ (రదియల్లాహు అన్హు) జెండా తీసుకుని ముందుకు కదిలారు. కొద్ది దూరం వెళ్ళి ఆగినారు, అయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలకు అవిధేయత చూపినట్లవుతుందని, ఆయన వెనుక వైపుకు తిరగలేదు. ఆ విధంగానే నిలబడి ఆయన తన స్వరాన్ని పెంచి బిగ్గరగా “ఓ ప్రవక్తా(సల్లల్లాహు అలైహి వసల్లం)! ఆ ప్రజలతో నేను ఏ విషయంపై పోరాడాలి?” అని ప్రశ్నించారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వారు ‘అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని సాక్ష్యము పలకనంతవరకు వారితో పోరాడు; వారు ఒకవేళ (నీ పిలుపుకు) ప్రతిస్పందించి ఇస్లాంలోనికి ప్రవేశించినట్లయితే వారి రక్తం మరియు సంపదలు మీ నుండి రక్షించబడతాయి మరియు అవి మీ కొరకు నిషేధించబడినవి అవుతాయి; అయితే ధర్మబద్ధంగా అలా చేయవలసిన అవసరం ఏర్పడితే తప్ప, అంటే వారు ఇస్లాం చట్టం తీర్పుల ప్రకారం (షరియత్ ప్రకారం) వారు చంపబడవలసిన నేరం లేదా అపరాధం చేస్తే తప్ప. వారి లెక్క అల్లాహ్ వద్ద ఉంటుంది.
ను’మాన్ ఇబ్న్ బషీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “విశ్వాసులు పరస్పరం ఒకరిపట్ల ఒకరు కరుణ కలిగి ఉండే విషయములోనూ, పరస్పరం మక్కువ, అభిమానం కలిగి ఉండే విషములోనూ, పరస్పర సానుభూతి చూపుకునే విషయములోనూ – వారంతా ఒకే శరీరం లాంటి వారు. శరీరంలో ఏదైనా అంగానికి బాధ కలిగితే మిగతా శరీరం మొత్తం నిద్రలేమితో, జ్వరంతో బాధపడుతుంది.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో విశ్వాసులలో ఒకరిపట్ల మరొకరి తీరు, వారి వైఖరి, దృక్పధం ఎలా ఉండాలి అనే దాని గురించి విశదీకరిస్తున్నారు. వారు పరస్పరం ఎదుటి వారికి మేలు జరగడాన్ని ఇష్టపడాలి, పరస్పరం సహాయం చేయడానికి, చేయూత నివ్వడానికి ఎప్పుడూ ముందుండాలి. వారిలో ఒకరికి ఏదైనా కష్టం, ఆపద, కీడు, బాధ కలిగితే ఎదుటి వారు ఆ బాధకు ప్రతిస్పందించాలి. మరో మాటలో వారు ఒకే శరీరం లాగా వ్యవహరించాలి - ఎలాగైతే శరీరంలో ఒక అంగము జబ్బు పడితే మొత్తం శరీరం నిద్రలేమితో, జ్వరంతో ప్రతిస్పందిస్తుందో అలాగ.
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(ఏదైనా కీడు, ఆపద, కష్టము కలిగినపుడు) ఎవరైతే తన చెంపలు కొట్టుకుంటూ, తన చొక్కాను చింపుకుంటూ, అఙ్ఞాన కాలములో చేసినట్లు బిగ్గరగా ఏడ్పులు పెడబొబ్బలు పెడతాడో, అతడు మాలోని వాడు కాడు (మాలో ఒకడిగా పరిగణించబడడు).
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అఙ్ఞానకాలపు కొన్ని ఆచారాలను నిషేధించినారు మరియు ఆ ఆచారాలను పాటించే వారి పట్ల, “అతడు మాలోని వాడు కాడు” అని హెచ్చరించినారు. అవి: మొదటిది: ఏదైనా కీడు, ఆపద, కష్టము కలిగినపుడు ఎవరైతే చెంపలు కొట్టుకుంటారో. ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెంపలను ప్రస్తావించినారు; ఎందుకంటే ఆ కాలములో స్వయంగా చెంపలు కొట్టుకొనుట బాగా వ్యాప్తిలో ఉన్న ఆచారం. నిజానికి ఏదైనా కీడు, ఆపద, కష్టము కలిగినపుడు చెంపలను మాత్రమే కాక తన ముఖంపై ఎక్కడ కొట్టుకున్నా అది నిషేధమే. రెండవది: విపరీతమైన కష్టము, బాధ కలిగినపుడు, శరీరంపై ధరించి ఉన్న వస్త్రపు (చొక్కా, కమీజు మొ.) కాలరు భాగం వద్ద బలంగా లాగి చింపుకోవడం. కాలరు భాగము అంటే – తలను దూర్చడానికి అనువుగా, వస్త్రపు పై భాగమున చీలిక ఉన్న భాగము. మూడవది: పెద్ద గొంతుతో ఏడ్పులు పెడబొబ్బలు పెట్టడం, అలా ఏడ్పులు పెడబొబ్బలు పెడుతూ, తనపై వచ్చి పడిన కష్టాన్ని, నాశనాన్ని, నష్టాన్ని తొలగించమని మొరపెట్టుకోవడం.
అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “పరమ పవిత్రుడు, సర్వోన్నతుడూ అయిన అల్లాహ్ ప్రకటన: “ఓ ఆదం కుమారుడా! నీవు నన్ను వేడుకుని, నన్ను అర్ధించినంత కాలం, నా నుండి నీవు ఆశించినంత కాలం, నీలో ఏదైతే ఉన్నదో దానిని నేను క్షమిస్తాను మరియు దానిని నేను పట్టించుకోను. ఓ ఆదం కుమారుడా! నీ పాపాలు ఆకాశపు మేఘాలను చేరేటంత ఎక్కువగా ఉన్నా, అపుడు నీవు నన్ను క్షమించమని వేడుకుంటే, నేను నిన్ను క్షమిస్తాను మరియు దానిని నేను పట్టించుకోను. ఓ ఆదం కుమారుడా! నీవు భూమి అంత పెద్ద పెద్ద పాపాలతో నావద్దకు వచ్చినా, నాకు సమానంగా ఎవరినీ భాగస్వామిగా చేయకుండా నన్ను కలుసుకుంటే నేను అంతకంటే గొప్ప క్షమాపణతో నీ వద్దకు వస్తాను.”
అత్తిర్మిదీ నమోదు చేసినారు:సకల శుభాల యజమాని, సర్వోన్నతుడు అయిన అల్లాహ్, హదీథ్ అల్ ఖుద్సీ లో ఇలా ప్రకటించాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు: ‘ఓ ఆదం కుమారుడా! నీవు నన్ను వేడుకుంటూ, నా దయ మరియు కరుణను ఆశిస్తూ, నిరాశ చెందకుండా ఉన్నంత కాలం, నేను నీ పాపాలను కప్పివేస్తాను, వాటిని తుడిచి వేస్తాను, మరియు దానిని పట్టించుకోను, ఈ పాపాలు మరియు అవిధేయత పెద్ద పాపాలలో (కబాఇర్ లలో) ఒకటి అయినప్పటికీ, "ఓ ఆదమ్ కుమారుడా! నీ పాపాలు ఆకాశాలకు భూమికి మధ్య ఉన్న అంతరాన్ని నింపేటంత ఎక్కువగా ఉన్నప్పటికీ; దాని చివరలను మరియు దాని వివిధ భాగాలను కప్పివేసేటంత ఎక్కువగా ఉన్నప్పటికీ; నీవు క్షమించమని నన్ను వేడుకుంటే, నేను వాటినన్నింటినీ చెరిపివేస్తాను మరియు నీ కొరకు వాటన్నింటినీ క్షమిస్తాను, అవి సంఖ్యలో ఎంత ఎక్కువగా ఉన్నా పట్టించుకోను.” ఓ ఆదము కుమారుడా! నీవు మరణానంతరం భూమి మొత్తం నిండి పోయేవన్ని పాపాలు మరియు అతిక్రమణలతో నా దగ్గరకు వచ్చినా; నీవు నాతో “షిర్క్” నకు పాల్బడకుండా (దేనినీ నాకు సమానంగా, నాకు సాటిగా, భాగస్వామిగా నిలబెట్టకుండా) “మువహ్హిద్”గా (ఏకదైవారాధనవాదిగా) మరణించినట్లయితే, నేను మొత్తం భూమిని నింపివేసేటంత క్షమాపణతో ఈ పాపాలు మరియు అతిక్రమణలను కలుసుకుంటాను; ఎందుకంటే నేను క్షమాపణలో అత్యంత విస్తృతమైన వాడిని మరియు “షిర్క్”ను తప్ప (బహుదైవారాధన తప్ప) అన్ని పాపాలను క్షమిస్తాను.