





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “విశ్వాసము డెభ్భై శాఖలు కలిగి ఉంటుంది లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహుశా 60 శాఖలు కలిగి ఉంటుంది (అన్నారు). వాటిలో అత్యుత్తమమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు); మరియు అన్నింటికన్నా చివరిది (తక్కువ స్థాయి శాఖ) ప్రజలు నడిచే దారి నుండి ప్రమాదకరమైన దానిని తొలగించుట. అలాగే అణకువ, నమ్రత, బిడియము – విశ్వాసపు శాఖలలో ఒకటి.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – విశ్వాసము అనేక శాఖలుగా, అనేక శ్రేణులుగా ఉంటుందని, అది విశ్వాసములు, ఆచరణలు మరియు వాక్కులతో కూడి ఉంటుందని తెలియజేస్తున్నారు. విశ్వాసములలో ఉత్తమ స్థాయి మరియు ఉత్తమ శ్రేణి విశ్వాసము: “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు) అని పలుకుట, దాని అర్థాన్ని, భావాన్ని గ్రహించుట, దానికి అనుగుణంగా ఆచరించుట – అంటే కేవలం అల్లాహ్ మాత్రమే ఏకైక నిజ ఆరాధ్యుడు అని, ఆయన మాత్రమే ఆరాధనలకు అర్హుడు అని, ఆయన తప్ప మరింకెవ్వరూ లేరు అని మనసా, వాచా, కర్మణా తెలుసుకొనుట, గ్రహించుట. మరియు విశ్వాసపు శాఖల ఆచరణలో అత్యంత అల్పమైన (తక్కువ స్థాయి కలిగిన) ఆచరణ ఏమిటంటే, ప్రజలు నడిచే దారిలో వారికి హాని కలిగించే దానిని దారి నుంచి తొలగించుట. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసారు: అణకువ, నమ్రత, బిడియము – విశ్వాసపు లక్షణాలలో ఒకటి అని. అణకువ, నమ్రత, బిడియము – విశ్వాసులలో ఉత్తమమైన ఆచరణలు ఆచరించే, మరియు చెడు ఆచరణలను వదిలి వేసే వైఖరిని, దృక్పథాన్ని ప్రొత్సహిస్తాయి.
అబూ బషీర్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : తాను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ప్రయాణాలలో ఒక ప్రయాణం లో ఆయన వెంట ఉన్నారు. అపుడు వారి వెంట ఉన్న జనులు తమ తమ విశ్రాంతి స్థలాలలో, గుడారాలలో ఉండగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందేశహరుణ్ణి వారి వద్దకు “ఒంటెల మెడలలో వేలాడదీసిన ఎటువంటి దారాన్ని గానీ, ఎటువంటి పట్టాను గానీ లేక ఎటువంటి గొలుసును గానీ త్రెంచి వేయకుండా వదలకండి” అనే ఆదేశముతో పంపినారు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ప్రయాణాలలో ఒక ప్రయాణంలో అతను ఆయన వెంట ఉన్నారు. అపుడు ఆయన వెంట ఉన్న జనులు తమ తమ విశ్రాంతి స్థలాలలో, గుడారాలలో చేరుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మనిషిని తన ఈ ఆదేశాలతో వారందరి వద్దకు పంపినారు - తమ తమ ఒంటెల మెడలలో వారు వేలాడదీసి ఉన్న పట్టీలు గానీ లేక దారాలు గానీ, లేక విలుత్రాడులు గానీ లేక ఇంకా అలాంటివి ఏవైనా వేలాడదీసి ఉంటే - ఉదాహరణకు గంటలు గానీ లేక చెప్పులు లేక బూట్లు లాంటివి - వాటిని త్రెంచి వేయాలని. (ఆ రోజులలో) ప్రజలు అటువంటి వాటిని తమతమ జంతువుల మెడలలో వాటికి దిష్టి తగలకుండా ఉండాలని, వాటికి కీడు కలగకుండా ఉండాలని వేలాడ దీసేవారు. కనుక ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అలా వేలాడదీసి ఉంచిన ప్రతి దానిని త్రెంచి వేయాలని వారిని ఆదేశించినారు. ఎందుకంటే అవి ఏ కీడునూ, లేక ఏ నష్టాన్నీ తొలగించలేవు. ఎందుకంటే మనిషికి కలిగే శుభము, లాభము, ప్రయోజనము లేక కీడు, హాని ఏదైనా – తనకెవరూ సాటిగానీ సమానులు గానీ లేని సర్వోన్నతుడైన అల్లాహ్ చేతిలో ఉంటాయి.
అబ్దుల్లా బిన్ ఉకైమ్’రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం ‘ఎవరైతే తావీజులా ఏదైనా వస్తువు ధరిస్తారో దానికే అప్పగించబడతారు’.
దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు - దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారుఎవరైతే తన హృదయంతో లేదా కర్మలతో లేదా రెండింటితో పాటు ఏదేని వస్తువు వైపుకు ఆకర్షితులై దానితో ప్రయోజనం ఆశించాలని లేక ఆపదల నుండి రక్షించమని మ్రోగ్గుచూపుతాడో అల్లాహ్ అతను ఆధారపడిన ఆ వస్తువుకు ఆదీన పరుస్తాడు,మరెవరైతే అల్లాహ్ ను అంటిపెట్టుకుని ఉంటారో అతని కార్యసిద్దికి అల్లాహ్ సరిపోతాడు మరియు అతని ప్రతీకష్టాన్ని సులభతరం చేస్తాడు,మరెవరైతే ఇతరత్రా విషయాలను అంటిపెట్టుకుని ఉంటాడో అల్లాహ్ దాని ఆధీనంలోకి చేరుస్తాడు మరియు అతన్ని పట్టించుకోకుండా వదిలేస్తాడు,
తారిఖ్ ఇబ్న్ అషీం అల్ అష్జఈ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను: “ఎవరైతే “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు) అని ఉచ్ఛరిస్తాడో, మరియు అల్లాహ్ తప్ప ఆరాధించబడే ప్రతిదానినీ నిరసిస్తాడో (అవిశ్వసిస్తాడో), అతని సంపద, మరియు అతని రక్తము (మిగతా విశ్వాసుల కొరకు) హరాం (నిషేధము) అవుతాయి. అతని లెక్క, పత్రము అల్లాహ్ వద్ద ఉంటుంది (అల్లాహ్ చూసుకుంటాడు అని అర్థము).
ముస్లిం నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేస్తున్నారు – ఎవరైతే “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని నాలుకతో ఉచ్ఛరిస్తూ, సాక్ష్యము పలుకుతాడో, అంటే - అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని సాక్ష్యము పలుకుతాడో, మరియు అల్లాహ్ తప్ప ఆరాధించబడే ప్రతిదానినీ నిరసిస్తాడో (తిరస్కరిస్తాడో), మరియు ఇస్లాం తప్ప మిగతా ఏ ధర్మముతోనూ నాకు సంబంధం లేదు అని నిరాకరిస్తాడో – అపుడు అతని సంపద, మరియు అతని రక్తము మిగతా విశ్వాసుల కొరకు నిషేధమై పోతుంది (హరాం అయిపోతుంది). అది మనది కాదు, మనకు కేవలం అతని బాహ్య ఆచరణలతో మాత్రమే సంబంధం ఉంటుంది. అతని సంపద తీసుకొనబడదు, మరియు అతని రక్తము చిందించబడదు – ఇస్లామీయ చట్ట ప్రకారము అతని సంపదను తీసివేసుకునే, లేక అతని రక్తాన్ని చిందించ వలసి వచ్చే నేరము అతడు చేస్తే తప్ప. తీర్పు దినమున అతని లెక్కా పత్రము అల్లాహ్ తీసుకుంటాడు. అతడు నిజాయితీ పరుడైతే (సద్వర్తనుడైతే) అల్లాహ్ అతనికి ప్రతిఫలాన్నిస్తాడు, ఒకవేళ అతడు కపటుడైతే అల్లాహ్ అతడిని శిక్షిస్తాడు.
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “కరుణ చూపే వారిపై, అనంత కరుణాప్రదాత (అర్రహ్మాన్) కరుణ చూపుతాడు; కనుక భూమిపై ఉన్నవారిపై కరుణ చూపండి, ఆకాశంలో ఉన్నవాడు మీపై కరుణ చూపుతాడు.”
అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు – ఎవరైతే ఇతరులపై కరుణ చూపుతారో, వారిని అనంత కరుణాప్రదాత, ప్రతిదాన్నిఆవరించి ఉన్న తన కరుణతో కరుణిస్తాడు – అది ఒక పరిపూర్ణ ప్రతిఫలం. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భూమిపై ఉన్న ప్రతి ఒక్కరిపై కరుణ చూపమని ఆదేశిస్తున్నారు – మనుషులు, పశువులు, పక్షులు మరియు సృష్ఠిలోని ప్రతి జాతి సృష్ఠితాలు అన్నింటిపైనా. దానికి ప్రతిఫలం – ఆకాశాలపై ఉన్న అల్లాహ్ మీపై కరుణ చూపుతాడు.
అనస్ ఇబ్న్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పునరుథ్థాన దినమున నరకాగ్నిలో అందరికంటే తక్కువ శిక్ష విధించబడిన వ్యక్తితో అల్లాహ్ ఇలా అంటాడు: “నీ వద్ద భూమిపై ఉన్న ప్రతి వస్తువూ ఉన్నట్లైతే, వాటన్నింటినీ ఈ శిక్ష నుండి విముక్తి పొందుట కొరకు చెల్లించుకుంటావా?” అని. దానికి అతడు “అవును, చెల్లించుకుంటాను” అంటాడు. అపుడు ఆయన ఇలా అంటాడు: “నీవు ఆదము యొక్క వెన్నులో ఉన్నపుడు ఇంత కంటే చాలా తేలికైన విషయాన్ని అడిగాను – నాకు ఎవ్వరినీ, దేనినీ సాటి కల్పించకు (నన్ను తప్ప ఇతరులను అరాధించకు) అని. కానీ నీవు ఇతరులను నాకు సాటి కల్పించడాన్ని నిరాకరించలేదు. అది తప్ప మరేమి చేయడానికి నిరాకరించావు.”
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: నరకం లోనికి ప్రవేశించిన తరువాత అక్కడ చాలా తక్కువ శిక్ష పడి, ఆ శిక్షను అనుభవిస్తున్న వానితో సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు: నీ దగ్గర ఈ ప్రపంచం మొత్తం మరియు అందులో ఉన్న ప్రతిదీ ఉన్నట్లైతే, ఈ శిక్ష నుండి విముక్తి పొందడానికి దానిని మొత్తం ఇచ్చివేస్తావా? దానికి అతడు: “అవును, ఇచ్చివేస్తాను” అంటాడు. అపుడు అల్లాహ్ ఇలా అంటాడు: ఆదం వెన్నెముకలో ఉన్నపుడు అంటే మీ నుండి ఒడంబడిక తీసుకున్నపుడు, దీనికంటే చాలా తేలికైనది – నాకు ఎవరినీ మరియు దేనినీ సాటి కల్పించకు (కేవలం నన్ను మాత్రమే ఆరాధించు) – అని ఆదేశించాను. కానీ నేను నిన్ను ఈ ప్రపంచం లోనికి తీసుకు వచ్చినప్పుడు నీవు బహుదైవారాధనను తప్ప ప్రతిదానినీ నిరాకరించావు.
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “కొంతమంది ప్రజలు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ‘భవిష్యత్తు గురించి చెప్పేవారికి’ (జ్యోతిష్యులకు) సంబంధించి ప్రశ్నించినారు. వారితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “వారిని గురించి (చెప్పడానికి) ఏమీ లేదు”. దానికి వారు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మరి వారు చెప్పే విషయాలు ఒక్కోసారి నిజమవుతాయి కదా!” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అది ఏదో ఒక నిజానికి సంబంధించిన మాట అయి ఉంటుంది. దానిని ఆ జిన్ను దొంగతనంగా (దైవదూతల నుండి) పొంది, తన మిత్రుడైన ఆ జ్యోతిష్యుని చెవిలో వేస్తాడు. అతడు దానికి (ఆ నిజమైన ఒక్క మాటకు) మరో వంద అబద్ధాలు కల్పించి చెపుతాడు.” (సహీ బుఖారీలో ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించిన మరొక హదీసులో తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా విన్నాను అని తెలిపారు “స్వర్గములో అల్లాహ్ నిర్ణయించిన విషయాలను గురించి ప్రస్తావించుకుంటూ దైవదూతలు క్రింది ఆకాశాలలోనికి వస్తారు. వారి మాటలను జిన్ను దొంగతనంగా, చాటుమాటుగా విని తమ మిత్రులైన జ్యోతిష్యులకు చేరవేస్తాడు. అలా ఆ జ్యోతిష్యులు దానికి వంద అబద్దాలు జోడించి చెబుతూ ఉంటారు.”)
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుభవిష్యత్తులో జరుగబోయే విషయాలు చెప్పే వారి గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించడం జరిగింది. దానికి వారు: వారిని గురించి ఎక్కువ ఆలోచించకండి, వారి మాటలను తీసుకోకండి (నమ్మకండి), మరియు వారు చేసే పనులపట్ల ఆసక్తి చూపకండి” అన్నారు. దానికి వారు (ప్రజలు) ఇలా అన్నారు: “కొన్ని సందర్భాలలో వారు చెప్పేది వాస్తవానికి అనుగుణంగానే ఉంటుంది. ఉదాహరణకు భవిష్యత్తులో జరుగబోయే ఏదైనా (మనకు తెలియని, అగోచర) విషయాన్ని గురించి ‘ఫలానా నెలలో, ఫలానా దినమున ఇలా జరుగుతుంది’ అని చెప్పినట్లయితే – వారు చెప్పినట్లుగానే జరుగుతుంది.” అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “జిన్నాతులు ఆకాశాలలో దొంగతనంగా విన్న విషయాన్ని తీసుకుని వారు జ్యోతిష్యులలో తమ మిత్రులైన జ్యోతిష్యుల దగ్గర దిగి తాము విన్నదానిని వారికి తెలుపుతారు. జ్యోతిష్యులు తాము విన్న ఆకాశపు విషయానికి వంద అబద్దాలు జతచేస్తారు.”
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : (ఒక ప్రయాణములో) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక వాహనముపై కూర్చుని ఉండగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “ఓ ముఆధ్ ఇబ్న్ జబల్”. దానికి ఆయన “మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి “ఓ ముఆధ్!” అన్నారు. ఆయన తిరిగి “మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి మూడవసారి కూడా అదే విధంగా జరిగింది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే “సత్యపూర్వకముగా తన సంపూర్ణ హృదయముతో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మద ర్రసూలుల్లాహ్’ (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు) సాక్ష్యమిస్తాడో, అల్లాహ్ నరకాగ్నిని అతనిపై నిషేధిస్తాడు.” అది విని ముఆధ్ “ఓ రసూలుల్లాహ్! ఈ వార్తను నేను మిగతా వారందరికీ వినిపించనా, వారు సంతోషిస్తారు” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “వద్దు, అలా చేస్తే వారు ఈ ఒక్క దానిపైనే ఆధారపడతారు (అంటే మిగతా సత్కార్యాలు చేయడం పట్ల ఆసక్తి చూపకుండా)” అన్నారు. ముఆధ్ రజియల్లాహు అన్హు తన మరణశయ్యపై ఉండి ఈ హదీసును ఉల్లేఖించినారు – జ్ఞానాన్ని ఇతరులకు చేరవేయకుండా దాచుకున్న పాపమునకు తాను లోను కారాదనే భయంతో.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుముఆధ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒంటె పై వారి వెనుక కూర్చుని ఉన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఓ ముఆధ్!” అని పిలిచారు. (ఆయన జవాబిచ్చినప్పటికీ) అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు మరల మరల ముఆధ్ రజియల్లాహు అన్హు ను పిలిచారు. ఆయన చెప్పబోయే విషయం ఎంత ముఖ్యమైనదో తెలియజేయడానికి. మూడు సార్లూ కూడా ముఆధ్ రజియల్లాహు అన్హు “మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్” అని సమాధానమిచ్చారు. అంటే దాని అర్థం “మీరు మరలమరల పిలిచినా నేను మరల మరల ఇదే సమాధానం ఇస్తాను, (ఎందుకంటే, ఓ రసూలుల్లాహ్) మీ సేవలో హాజరుగా ఉన్నాను అని సమాధనం ఇవ్వడమే నాకు సంతోషం”. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసారు “ఎవరైతే “లా ఇలాహ ఇల్లల్లాహ్” అంటే “అల్లాహ్ తప్ప, ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు” అని మరియు మ”ముహమ్మదుర్రసూలుల్లాహ్”, అంటే “ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు” అని సత్యపూర్వకంగా మరియు పూర్తి హృదయంతో, అందులో ఏ మాత్రమూ అసత్యము లేకుండా సాక్ష్యమిస్తాడొ, ఒకవేళ అతడు అదే అవస్థలో (తాను పలికిన సాక్ష్యాన్ని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్న స్థితిలో) చనిపోయినట్లయితే, అతనిపై (అటువంటి వానిపై) అల్లాహ్ నరకాగ్నిని నిషేధించినాడు. అదివిని ముఆధ్ రజియల్లాహు అన్హు తాను ఈ శుభవారను అందరికీ వినిపిస్తానని, అది విని అందరూ మిక్కిలిగా సంతోషపడతారని, అనుమతించమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ని అడుగుతారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా చేయవద్దని వారించినారు – ప్రజలు ఈ ఒక్క విషయం పైనే ఆధారపడి మిగతా ఆచరణలను తక్కువ చేస్తారనే భయంతో. ముఆధ్ రజియల్లాహు అన్హు ఈ విషయాన్ని తాను చనిపోవడానికి ముందు వరకూ ఎవరికీ తెలియజేయలేదు. ఙ్ఞానమును ఇతరులకు చేరవేయకుండా దాచిపెట్టిన వాడి పాపానికి లోనవుతానేమో అనే భయంతో చనిపోవడానికి ముందు ఆయన ఈ విషయాన్ని అందరికీ తెలియజేసారు.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మన ప్రభువు పరమ పవిత్రుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ప్రతి రాత్రి మూడవ భాగమున అన్నింటి కంటే క్రింది ఆకాశానికి దిగి వచ్చి ఇలా అంటాడు: “ఎవరైనా ఉన్నారా నాకు మొరపెట్టుకునేవాడు (నాకు దుఆ చేసేవాడు) నేను అతని దుఆ కు స్పందిస్తాను; ఎవరైనా ఉన్నారా నన్ను ఏదైనా కోరుకునేవాడు, నేను అతనికి ప్రసాదిస్తాను; ఎవరైనా ఉన్నారా నా క్షమాభిక్ష కొరకు ప్రార్థించే వాడు, నేను అతడిని క్షమిస్తాను”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: సర్వోన్నతుడు, సకల శక్తి సంపన్నుడు, పరమపవితృడైన అల్లాహ్ ప్రతి రాత్రి చివరి మూడవ భాగము మిగిలి ఉన్న సమయాన అన్నింటి కంటే క్రింది ఆకాశానికి దిగి వస్తాడు. ఆయన తన దాసులను కోరుతాడు ఆ ప్రత్యేక సమయాన తనకు దుఆ చేయమని, తాను వారి దుఆలకు స్పందిస్తాను అని, అలాగే (ఆ ప్రత్యేక సమయాన) ఆలస్యం చేయకుండా తనను అడుగమని, తాను వారు కోరిన దానిని ప్రసాదిస్తాను అని, ఇంకా తన పాపాలను క్షమించమని (ఆ ప్రత్యేక సమయాన) తనకు మొరపెట్టుకోమని, తాను విశ్వాసులైన తన దాసులను క్షమిస్తానని.