





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను “ఓ రసూలుల్లాహ్! ఇబ్నె జుదాన్ బంధాలను, బాంధవ్యాలను గౌరవించేవాడు, వాటిని నిలిపి ఉంచేవాడు, కొనసాగించేవాడు, మరియు (ఇస్లాం కు పూర్వపు) అఙ్ఞాన కాలములో పేదవారికి అన్నం తినిపించేవాడు. ఇది (ఈ మంచిపనులు) అతనికి ఏమైనా ప్రయోజనాన్ని కలుగజేస్తుందా?” దానికి ఆయన “ఇది అతనికి ఏమీ ప్రయోజనం కలుగజేయదు, ఎందుకంటే అతడు ఎన్నడూ “ఓ నా ప్రభూ! తీర్పు దినమున నా పాపములను మన్నించు” అని వేడుకోలేదు” అన్నారు.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబ్దుల్లాహ్ ఇబ్నె జుదాన్’ను గురించి తెలియ జేస్తున్నారు. ఇస్లాం కు పూర్వం అతడు ఖురైషీ తెగ యొక్క నాయకులలోని ఒక ప్రముఖ నాయకుడు. అతడు కష్టాలలో ఉన్న తన బంధువుల దగ్గరకు స్వయంగా వెళ్ళి వారికి సహాయం చేసేవాడు, పేదలకు అన్నం తినిపించేవాడు. ఇస్లాం ధర్మం తన అనుయాయులను ఆచరించమని ఆదేశించిన ఉత్తమ ఆచరణలను అన్నింటినీ అతడు (ఇస్లాం ధర్మానికి పూర్వం) ఆచరించేవాడు. అయినా అది అంతిమ దినమున అతనికి ఏమాత్రమూ ప్రయోజనం కలిగించదు. ఇది ఎందుకంటే అతడు అల్లాహ్ నందు విశ్వసించలేదు. ఎన్నడూ అతడు “ఓ నా ప్రభూ! తీర్పు దినమున నా తప్పులను, పాపాలను క్షమించు” అని వేడుకోలేదు.
జైద్ ఇబ్నె ఖాలిద్ అల్ జుహనీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒకసారి హుదైబియాలో (ఉన్నప్పుడు) రాత్రి వర్షం పడిన తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఫజ్ర్ నమాజు చదివించినారు. నమాజు ముగిసిన తరువాత ఆయన ప్రజల వైపునకు తిరిగి ఇలా అన్నారు “మీ ప్రభువు ఏమని అన్నాడో తెలుసా?” దానికి వారు “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునికే తెలుసును” అని జవాబిచ్చారు. దానికి ఆయన “అల్లాహ్ ఇలా అన్నాడు “నా దాసులలో కొంతమంది నన్ను విశ్వసిస్తూ (విశ్వాసులుగా) ఈనాటి ఉదయంలోనికి ప్రవేశించినారు, మరియు మరికొందరు అవిశ్వాసులుగా ప్రవేశించినారు. ఎవరైతే ‘అల్లాహ్ అనుగ్రహం మరియు కరుణ వలన మనపై వర్షం కురిసింది’ అని అన్నారో, వారు నన్ను విశ్వసించినారు మరియు నక్షత్రాలను విశ్వసించలేదు. మరియు ఎవరైతే ‘ఫలాన ఫలాన నక్షత్రాలు ఉదయించడం వలన మనపై వర్షం కురిసింది’ అన్నారో, వారు నన్ను విశ్వసించలేదు, మరియు నక్షత్రాలను విశ్వసించినారు”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నగరానికి సమీపంలో నున్న హుదైబియా అనే ప్రాంతంలో ఫజ్ర్ నమాజు ఆచరించినారు. అక్కడ క్రితం రాత్రి వర్షం కురిసింది. ఆయన ఫజ్ర్ సలాహ్ ముగించిన తరువాత ప్రజల వైపునకు తిరిగి కూర్చుని వారిని ఇలా ప్రశ్నించారు “సర్వ శక్తిమంతుడు, సర్వోన్నతుడూ అయిన మీ ప్రభువు ఏమని అన్నాడో మీకు తెలుసా?” దానికి వారు “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునికే బాగా తెలుసు” అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “వర్షం కురిసినపుడు ప్రజలు రెండు వర్గాలలో విడిపోయినారు అని అల్లాహ్ స్పష్టపరిచినాడు. ఒక వర్గం అల్లాహ్ నందు విశ్వసించి, విశ్వాసులుగా ఉంటే, మరొక వర్గం అల్లాహ్ ను విశ్వసించక అవిశ్వాసులు అయినారు”. “ఎవరైతే ‘అల్లాహ్ అనుగ్రహం మరియు కరుణ వలన మనపై వర్షం కురిసింది’ అని వర్షం కురియడాన్ని అల్లాహ్’కు ఆపాదించినాడో, అతడు సృష్టికర్త మరియు సృష్టి యొక్క అన్ని విషయాల విధాత అయిన అల్లాహ్ నందు విశ్వసించినాడు. అతడు నక్షత్రాలను నమ్మలేదు, వాటిని విశ్వసించలేదు”. “మరియు ఎవరైతే “ఫలాన, ఫలాన నక్షత్రాల కారణంగా వర్షం కురిసింది” అన్నాడో, అతడు అల్లాహ్ ను విశ్వసించకుండా నక్షత్రాలను, గ్రహాలను విశ్వసించినాడు. వర్షం కురియడాన్ని నక్షత్రాలకు ఆపాదించడం అనేది చిన్న స్థాయి అవిశ్వాసము. అల్లాహ్ కారణాన్ని షరియత్ గానూ లేక పూర్వనిర్దిష్టంగానూ (విధివ్రాతగానూ) చేయలేదు”. “మరియు ఎవరైతే వర్షం కురియడాన్ని, అలాగే భూమిపై జరిగే సంఘటనలకు, విషయాలకు సంబంధించి (సృష్టికర్త ప్రమేయం ఏమీ లేదని) అవి గ్రహాల చలనం కారణంగానో, అవి ఉదయించడం వల్లనో లేక రాలిపోవడం వల్లనో జరుగుతాయని విశ్వసిస్తాడో, వాటిని నక్షత్రాలకు లేక గ్రహాలకు ఆపాదిస్తాడో అతడు వాస్తవానికి ఘోరమైన పాపము చేసినవాడు. అతడు అవిశ్వాసి, అతడు ఘోరమైన అవిశ్వాసమునకు పాల్బడినవాడు”.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులలో కొందరు ఆయన వద్దకు వచ్చి ఇలా అన్నారు: “(ఓ ప్రవక్తా !) అప్పుడప్పుడు మా హృదయలలో ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే, వాటి గురించి మేము (బహిరంగంగా) మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేము”. దానికి ఆయన “నిజంగా మీకు అలా అనిపిస్తూ ఉంటుందా?” అని అడిగారు. దానికి వారు “అవును” అని సమాధానమిచ్చారు. అపుడు ఆయన “అది నిర్మలమైన విశ్వాసము (నిర్మలమైన విశ్వాసానికి నిదర్శనం)” అన్నారు.
ముస్లిం నమోదు చేసినారు:సహాబాలలో కొంతమంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి తమ హృదయాలలో తాము ఎదుర్కునే కొన్ని గంభీరమైన విషయాలను (ఆలోచనలను) గురించి ప్రస్తావించారు. వాటిలోని అసహ్యత, మరియు ఆ విషయాలపట్ల అయిష్టత, జుగుప్స వాటిని గురించి బహిరంగంగా మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేనటువంటివి అన్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఆ విషయాల పట్ల మీలో ఇటువంటి విఙ్ఞత కలగడం నిజానికి నిర్మలమైన విశ్వాసానికి నిదర్శనం. 'మీ హృదయాలలో షైతాను పడవేసే ఇటువంటి ఆలోచనల పట్ల మీలో జుగుప్స కలగడం, వాటిని మీరు పైకి చెప్పడానికి కూడా ఇష్టపడకపోవడం, వాటిని ఘోరమైన విషయాలుగా మీరు గుర్తించడం – షైతాను మీ హృదయాలపై ఎటువంటి నియంత్రణ పొందలేదు' అనడానికి నిదర్శనం. అలా కాకుండా ఆ విషయాలలో పడిపోయేవారు షైతానుకు వ్యతిరేకంగా ఎటువంటి రక్షణలేని వారు అని అర్థం.
"అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాలో ఒక్కొక్కసారి ఎటువంటి ఘోరమైన ఆలోచనలు వస్తాయంటే – అని అతడు వాటి గురించి అన్యోపదేశంగా చెబుతూ – వాటిని నోటితో పలకడం కన్నా తాను బొగ్గుగా మారడాన్ని ఇష్టపడతాను” అన్నాడు. దానికి ఆయన “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, (అల్లాహ్ అందరికన్నా పెద్దవాడు, అల్లాహ్ అందరికన్నా పెద్దవాడు), అల్’హందులిల్లాహ్ (స్తోత్రములన్నీ అల్లాహ్ కొరకే) ఆయన, వాడి (షైతాను యొక్క) కుతంత్రాన్ని (మనిషిలో) ఆలోచనలు రేకెత్తించడంగా (మాత్రమే) మార్చివేసాడు (పరిమితం చేసాడు)” అన్నారు.
అబూదావూద్ మరియు అన్నసాయీ కుబరాలో నమోదు చేసినారు:ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి: “ఓ ప్రవక్తా! మా మనసులలో (ఒక్కొక్కసారి) చాలా ఘోరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని గురించి మాట్లాడడం కన్నా బూడిదగా మారిపోవడం మంచిది అనేంత ఘోరమైన ఆలోచనలు” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండుసార్లు ‘తక్బీర్’ (అల్లాహు అక్బర్) పలికి, షైతాను యొక్క కుతంత్రాన్ని కేవలం ‘వసవసా’ (మనిషి హృదయంలో పరిపరి విధాల చెడు ఆలోచనలు రేకెత్తించడం) వరకే పరిమితం చేసినందుకు అల్లాహ్’కు కృతఙ్ఞతలు తెలిపారు.
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు : “మీలో ఎవరి దగ్గరికైనా షైతాను వచ్చి “ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు, ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు” అని ప్రశ్నిస్తాడు. చివరికి “మరి నీ ప్రభువును (అల్లాహ్’ను) ఎవరు సృష్టించినాడు” అంటాడు. మీలో ఎవరైనా ఈ పరిస్థితిని ఎదుర్కొంటే, అల్లాహ్ యొక్క రక్షణ అర్థించాలి మరియు దాని నుండి దూరం కావాలి”.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, విశ్వాసి హృదయం లో షైతాను రేకెత్తించే పలురకాల ప్రశ్నలకు ప్రభావ వంతమైన చిత్సను గురించి చెబుతున్నారు. షైతాను “ఫలానా, ఫలానా వాటిని ఎవరు సృష్టించినారు? దీనినెవరు సృష్టించినారు? దానినెవరు సృష్టించినారు? ఆకాశాన్ని ఎవరు సృష్టించినారు? భూమినెవరు సృష్టించినారు?” అని ప్రశ్నిస్తాడు. ఇటువంటి ప్రశ్నలు ఎదురైనపుడు విశ్వాసి, తనకు తన ధర్మం నేర్పిన ప్రకారం “అల్లాహ్ సృష్టించినాడు” అని సమాధానం ఇస్తాడు. కాని షైతాను అక్కడితో ఆగడు – పలురకాల ప్రశ్నలు సంధిస్తూ, చివరికి ‘నీ ప్రభువును ఎవరు సృష్టించినారు?” అని ప్రశ్నిస్తాడు. అటువంటి స్థితిలో విశ్వాసి దానిని మూడు విషయాల ద్వారా దూరం చేస్తాడు: అల్లాహ్ నందు సంపూర్ణ విశ్వాసము పునః ప్రకటించడం ద్వారా, షైతాను నుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరడం ద్వారా, మరియు అటువంటి చెడు ఆలోచనలలో పడి కొట్టుకు పోకుండా తనను తాను ఆపుకోవడం ద్వారా.
అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక మంచి పనికి (సత్కార్యమునకు) సంబంధించి విశ్వాసికి అల్లాహ్ ఎప్పుడూ అన్యాయం చేయడు. ఆ మంచి పని కొరకు ఆయన అతడికి (విశ్వాసికి) ఈ ప్రపంచములో ప్రసాదిస్తాడు, మరియు పరలోకములోనూ దాని ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. మరియు అవిశ్వాసి విషయంలో, అతడు అల్లాహ్ కొరకు మాత్రమే చేసిన మంచి పనులకు, అల్లాహ్ అతనికి ఈ ప్రాపంచిక జీవితములోనే ప్రసాదిస్తాడు. అతడు పరలోకము చేరుకున్నపుడు అతనికి ప్రతిఫలం ప్రసాదించడానికి ఒక్క సత్కార్యమూ ఉండదు".
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసుల పట్ల అల్లాహ్ యొక్క అపారమైన దయ, కరుణ, అనుగ్రహం, మరియు అవిశ్వాసుల పట్ల ఆయన యొక్క న్యాయము ను గురించి తెలియ జేస్తున్నారు. విశ్వాసికి సంబంధించి – అతడు చేసే మంచిపనుల ప్రతిఫలం ఎన్నడూ తరిగిపోదు. పైగా అల్లాహ్ పట్ల అతని విశ్వాసానికీ, విధేయతకు గానూ అతడు చేసిన మంచి పనికి ఈ లోకములో అతని కొరకు పుణ్యం వ్రాయబడుతుంది, పరలోకములో అతని కొరకు వేచి ఉండే ప్రతిఫలము కాక. అలాకాక ఆయన (అల్లాహ్) అతనికి ప్రసాదించే పూర్తి ప్రతిఫలాన్ని తన వద్ద పదిలపరిచి ఉంచ వచ్చు (పరలోకమున ప్రసాదించుటకు గాను). అవిశ్వాసికి సంబంధించి అతడు ఆచరించే మంచిపనులకు గానూ, ఈ ప్రాపంచిక జీవితపు మంచి విషయాలతో అతనికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు, అతడు తన పరలోక ప్రయాణాన్ని మొదలుపెట్టక ముందు వరకు. పరలోకములో ప్రసాదించుటకు అతని కొరకు ఏమీ మిగిలి ఉండదు. ఎందుకంటే, ఈ రెండు లోకములలోను (భూలోక జీవితము, పరలోక జీవితము) సత్కార్యములు ఒక విశ్వాసికి మాత్రమే ప్రతిఫలాన్ని ప్రాప్తము చేయగలవు (అల్లాహ్ నందు అతని విశ్వాసము కారణముగా).
హాకిం ఇబ్న్ హిజాం రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నేను అఙ్ఞానపు కాలములో (ఇస్లాం స్వీకరించక ముందు కాలములో) పేదవారికి దానము చేయుట, బానిసలకు విముక్తి కలిగించుట, బంధువులను ఆదరించుట, వారితో బంధుత్వాలను కొనసాగించుట మొదలైన మంచిపనులు చేస్తూ ఉండేవాడిని. మరి నాకు ఆ మంచిపనుల ప్రతిఫలం లభిస్తుందా?” దానికి ఆయన “నీవు నీ పూర్వపు మంచిపనులతో సహా ఇస్లాంను స్వీకరించినావు” అన్నారు.
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారుఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఒకవేళ ఎవరైనా అవిశ్వాసి ఇస్లాం స్వీకరించి విశ్వాసిగా మారితే, అతడు అవిశ్వాసిగా గడిపిన తన పూర్వపు జీవితములో చేసిన మంచిపనులకు కూడా అంటే దానము చేయుట, బానిసలకు విముక్తి కల్పించుట, బంధుత్వాలను గౌరవించుట, ఆదరించుట, కొనసాగించుట మొదలైన వాటికి కూడా ప్రతిఫలం పొందుతాడు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారని అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖిస్తున్నారు: “కపట విశ్వాసి ఉపమానము రెండు గుంపుల మధ్య తిరుగుతూ ఉండే ఆడ గొర్రె ఉపమానము వంటిది. అది ఒకసారి ఈ గుంపు లోనికి వెళితే, ఒకసారి ఆ గుంపు లోనికి వెళుతుంది”.
ముస్లిం నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక కపట విశ్వాసి స్థితిని గురించి వివరిస్తున్నారు. కపట విశ్వాసి స్థితి, తటపటాయింపుకు, సంశయానికీ లోనైన ఒక ఆడ గొర్రె వంటిది. గొర్రెల రెండు సమూహాలు ఉంటే, ఏ సమూహాన్ని అనుసరించాలో తెలియని స్థితిలో అది అటూఇటూ తచ్చాడుతూ ఉంటుంది. అటువంటి స్థితిలో ఉంటే నీవు ఒకసారి ఈ సమూహము లోనికి వెళతావు, మరోసారి ఆ సమూహము లోనికి వెళతావు. కనుక కపట విశ్వాసులు విశ్వాసానికీ అవిశ్వాసానికి మధ్య నిర్ణయించుకోలేని డోలాయమాన స్థితిలో పడి ఉంటారు. కనుక వారు బాహ్యంగానూ మరియు అంతరంగంగానూ (సంపూర్ణంగా) విశ్వాసులతోనూ ఉండరు, అలాగే వారు బాహ్యంగానూ మరియు అంతరంగంగానూ (సంపూర్ణంగా) అవిశ్వాసులతోనూ ఉండరు. నిజానికి వారు బాహ్యంగా (వేషభూషణాలు ధరించి) విశ్వాసులతోనూ, మరియు అంతరంగాలలో అనుమానాలు, సందేహాలతో, తటపటాయింపుల సంశయాలతో అవిశ్వాసులతో కలిసి ఉంటారు. కనుక కొన్ని సమయాలలో వారు విశ్వాసులతో ఉంటారు, మరి కొన్ని సమయాలలో వారు అవిశ్వాసులతో ఉంటారు.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ ఇబ్న్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా ధరిస్తూ ఉన్న అంగి (చొక్కా, పైవస్త్రం) కొంతకాలానికి క్షీణించినట్లు, మీలో ఎవరి హృదయాలలోనైనా విశ్వాసమూ క్షీణిస్తుంది. కనుక మీ హృదయాలలో విశ్వాసాన్ని నవీకరించమని అల్లాహ్ ను వేడుకొనండి”.
హాకిం మరియు అత్తబ్రానీ నమోదు చేసినారు:ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఏ విధంగానైతే ఒక కొత్త వస్త్రము దీర్ఘ కాలంగా వాడుకలో ఉన్న కొద్దీ క్షీణిస్తూ ఉంటుందో, అలాగే ఒక ముస్లిం హృదయములో విశ్వాసము కూడా క్షీణిస్తూ బలహీన పడుతుంది. ఇది అల్లాహ్ యొక్క ఆరాధనలో ఉపేక్ష, అనాసక్తి, ఉదాసీనత, పాపపు కార్యములకు పాల్బడుట మరియు వాంఛ, కామము, వ్యామోహము వంటి విషయాలకు పాల్బడుట మొదలైన వాటి వల్ల జరుగుతుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమోన్నతుడైన అల్లాహ్ ను మనలోని విశ్వాసాన్ని నవీకరించమని, పునరుద్ధరించమని, విధిగా ఆచరించవలసిన ఐదు నమాజులను ఆచరిస్తూ, తరుచూ అల్లాహ్ ను స్మరిస్తూ, పాపకార్యముల నుండి ఆయనను క్షమాపణ వేడుకుంటూ అర్థిస్తూ ఉండాలని బోధిస్తున్నారు.